ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా సంస్థలలో ర్యాగింగ్‌ని నిషేధిస్తూ ప్రభుత్వం 1997 లో ర్యాగింగ్ నిరోధక చట్టం నెం. 26 ను తీసుకొచ్చింది. ర్యాగింగ్ అంటే విద్యార్థినీ విద్యార్థులను పీడించడం, కలవరపెట్టడం, చిన్న బుచ్చడం, వారిపై దౌర్జన్యం చేయడం, బెదిరించడం, ఘోరమైన హాని తలపెట్టడం, అపహరణ, బలాత్కరించడం, ఆత్మహత్యకు ప్రేరేపించడం.
ర్యాగింగ్ నిరోధానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టింది?
జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టరు ఆధ్వర్యాన జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఉపాధ్యక్షుడిగా, రెవెన్యూ డివిజనల్ అధికారి, డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్, విద్యా సంస్థల అధిపతులు (ప్రిన్సిపాల్) సభ్యులుగా ఒక సమీక్షా సంఘాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సంఘం కళాశాలల విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు రెండు సార్లు కలిసి, ర్యాగింగ్ నిరోధక చర్యలను రూపొందించి అమలు పరుస్తారు.
ప్రతి కళాశాలలోను ర్యాగింగ్ నిరోధక సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఇందులో ఉపన్యాసకులు, విద్యార్థినీ విద్యార్థుల ప్రతినిధులు ఉంటారు. కళాశాలలందు ర్యాగింగ్ చేసినట్లయితే ఎదుర్కోవలసిన పరిణామాలను తెలియజేసే ప్రకటనలను రాతపూర్వకంగా ప్రదర్శిస్తారు. విద్యార్థినీ, విద్యార్థులు ర్యాగింగ్ చేయం అనీ, చేసినట్లయితే తగిన శిక్షకు తమదే బాధ్యత అనీ రాత పూర్వక హామీపత్రాలను కళాశాల అధికారులకు అందజేయవలసి వుంటుంది.
ర్యాగింగ్ నివారణకు సూచనలు
– జాతీయ స్థాయిలో హెల్ప్‌లైన్ 1800 180 2255 నెంబర్లకు విద్యార్థులు ఫోన్ చేసి సమస్యను తెలిపి పరిష్కారాన్ని పొందవచ్చు. ఇ-మెయిల్ : ష్ట్రవశ్రీజూశ్రీఱఅవఏaఅ్‌ఱతీaస్త్రస్త్రఱఅస్త్ర.ఱఅ
– ర్యాగింగ్ వ్యవస్థ నిర్మూలనకు కళాశాలల్లో కమిటీని ఏర్పాటు చేసుకోవాలి.
– కమిటీలో అనుభవం ఉన్న ప్రొఫెసరు, స్థానిక పోలీస్ స్టేషన్ అధికారిని భాగస్వామిని చేయాలి.
– సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య సత్సంబంధాలు నెరపేలా హాస్టల్ వార్డెన్‌లు కృషి చేయాలి.
– నూతనంగా కళాశాలల్లో చేరిన విద్యార్థులకు ప్రత్యేకమైన బ్లాక్‌ను ఏర్పాటు చేయాలి.
– 1997 ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని అతిక్రమించిన వారిపై పెట్టే కేసులను వివరించే బ్యానర్లను కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు కనపడేలా ఉంచాలి.
– విద్యార్థి సంఘాలను భాగస్వామ్యం చేసి అవగాహన కల్పించాలి.
– ర్యాగింగ్ జరిగిన విషయాన్ని విద్యార్థులు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినప్పటికి ఎలాంటి చర్యలు చేపట్టకపోతే యాజమాన్యం పై చర్యలు తప్పవు.
– విద్యార్థులు హెల్ప్‌లైన్‌ను ఉపయోగించుకోవడంతో పాటు నేరుగా ఫోన్ 9490616301 లో సంప్రదించవచ్చు.
– మీ కళాశాలలో ర్యాగింగ్ నిరోధక సంఘానికి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. భయపడొద్దు. స్థానిక రెవెన్యూ అధికారికి, పోలీసులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు.
ర్యాగింగ్ చేసిన వారికి విధించబడే శిక్షలు:
పీడించుట, కలవరపెట్టుట, చిన్నబుచ్చుట: ఆరు నెలల పాటు జైలు శిక్ష లేదా రూ. 1000 వరకు జరిమానా లేదా రెండునూ దౌర్జన్యం, నేర ప్రవృత్తి, బెదిరించడం: సంవత్సరకాలం జైలు శిక్ష లేదా రూ. 2000 వరకు జరిమానా లేదా రెండునూ తప్పుడు పద్ధతిలో నియంత్రించడం, అవరోధించడం, అపకారం చేయడం: రెండేళ్ళ పాటు జైలు శిక్ష లేదా రూ. 5000 వరకు జరిమానా లేదా రెండునూ ఘోరమైన హాని తలపెట్టడం, అపహరించడం,
అసహజమైన అపరాధం: 5 సం||ల పాటు జైలు శిక్ష లేదా రూ. 10000 వరకు జరిమానా లేదా రెండునూ మరణకారణమగుట, ఆత్మహత్యకు ప్రేరేపించడం: 10 సం||ల పాటు జైలు శిక్ష లేదా రూ. 50000 వరకు జరిమానా లేదా రెండునూ .