ఎన్‌ఆర్‌ఐ వివాహాలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

విదేశాల్లో ఉండే భారతీయులతో జరిగే పెళ్ళిళ్ళు అన్నీ చెడుగా ఉండవు. కానీ మీ కుమార్తె మరియు మీ కుటుంబం శ్రేయస్సు కోసం మీరు అటువంటి సంబంధాల్లోకి ప్రవేశించటానికి ముందు తీసుకొనవలసిన జాగ్రత్తలు.

ఎన్‌ ఆర్‌ ఐ లు/విదేశాల్లోని భారతీయుల వల్ల ఎన్నో మోసకారి వివాహాలు జరిగిన కేసులు ఉన్నాయి.

ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన కేసుల వివరాలు ఉన్నాయి :

1. విదేశాలకు తీసుకు వెళ్ళబడటానికి ముందే ఆమె వదిలి వేయబడుతుంది. స్వల్పకాల హానీమూన్‌ తర్వాత త్వరలోనే టిక్కెట్లను పంపిస్తానని ప్రమాణం చేస్తాడు కానీ అతడు తిరిగి ఎన్నటికీ ఆమెను సంప్రదించడు.

2. మహిళ పరాయిదేశానికి వెళ్ళి అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తన భర్త ఇంక తిరిగిరాడని అక్కడే ఆమె అర్థం చేసుకుంటుంది.

3. వివాహమైన మహిళ విదేశానికి వెళ్తుంది కానీ సంవత్సరంలోపే ఆమె బలవంతంగా వెనక్కి రావలసిన పరిస్థితి వస్తుంది. ఆమె తన బిడ్డను తన వెంట తీసుకు వెళ్ళటానికి అనుమతించబడదు.

4. వివాహిత విదేశానికి వెళ్ళి క్రూరంగా చావుదెబ్బలు తినడం, దాడులకు గురికావటం, మరియు శారీరకంగా, మానసికంగా తిట్లు తినడం, పౌష్టికాహారలోపం మరియు మరింకెన్నో విధాలుగా అవమానకరంగా చూడబడుతోంది.

5. తన భర్త తప్పుడు సమాచారమిచ్చినట్లు లేదా కింద పేర్నొన్నవన్నీ చెప్పినట్లు వివాహమైన తర్వాతే మహిళ తెల్సుకుంటుంది. అతడి ఉద్యోగం, ఇమ్మిగ్రేషన్‌ హోదా, ఆస్తి, వివాహ హోదా మరియు తక్కిన భౌతికమైన వివరాలు. ఇవి ఆమెను వివాహం చేసుకునేలా చేసి మోసానికి గురి చేస్తున్నాయి.

6. వివాహానికి ముందు, తర్వాత కూడా మహిళ, లేదా ఆమె తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో కట్నం ఇవ్వాల్సిన విషవలయంలో చిక్కుకుంటున్నారు. పరాయిదేశంలో ఆమె సంపాదన కోసం ఆమె చేత బలవంతంగా పని చేయించి ఆమె వద్దనుండి సంపాదనను భర్త గుంజుకుంటున్నాడు.

7. తాను వివాహం చేసుకున్న విదేశీ భారతీయుడికి అప్పటికే పెళ్ళయ్యిందని, అతడు వేరొక మహిళతో జీవిస్తున్నాడని ఆమె అక్కడికెళ్ళాక మాత్రమే తెలుస్తుంది.

8. మహిళ భర్త, ఆమెకు తెలియకుండానే విదేశాల్లో ఏకపక్ష ఎక్స్‌పార్టీ డిక్రీ ద్వారా విడాకులు తీసుకుంటున్నాడు.

9. ఎటువంటి మద్ధతు, లేదా జీవించటానికి ఆధారంగా ఉండేమార్గాలు, లేదా తప్పించుకోవటానికి మార్గాలు లేక ఆ దేశంలో

ఉండటానికి వీసా కూడా లేకుండా మహిళ విదేశంలో వదిలి వేయబడుతోంది.

10. భరణం లేదా విడాకుల కోసం మహిళ కోర్టుకు వెళ్తోంది. కానీ కోర్టుల అధికారాలు, నోటీసుల జారీ, లేదా ఆదేశాల జారీ లేదా ఆదేశాల అమలు వంటి చట్టబద్ధమైన అడ్డంకులను ఆమె తరచు ఎదుర్కొంటోంది.

11. పెళ్ళి కొడుకు ఉండే విదేశానికి మహిళ అనేక రకాల వంచించబడి వెళ్తోంది. అతడ్ని అక్కడ వివాహం చేసుకుంటోంది. భారతీయ కోర్టులకు అక్కడ పరిమితమైన అధికారం వుందని ఆమె తర్వాతనే తెలుసుకుంటుంది.

ఇటువంటి వివాహాలు మీ కుటుంబానికి ఆపదను కలిగిస్తాయి మరియు మీ కుమార్తె భవిష్యత్తుపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయి.

ఈ క్రింద పేర్కొన్న ముందు జాగ్రత్తలు తీసుకోండి :

1. విదేశాలకు చెందిన వివాహం చేయాలనే నిర్ణయం తొందరపడి తీసుకోకండి. అది మీ కుమార్తె జీవితానికి సంబంధించినది.

2. ప్రతిపాదిత ఎన్‌ఆర్‌ఐ/ విదేశంలో ఉన్న భారతీయునితో వివాహాన్ని ఖాయపర్చే ముందు అతడి పూర్వచరిత్రను తనిఖీ చేయండి.

3. విదేశీ పెళ్ళి కుమారుడితో వివాహ ప్రతిపాదనను పరిగణించే సమయంలో నిర్ణయాన్ని తీసుకోవటంలో ఒత్తిడికి గురికాకండి. ఎందుకంటే ఇదొక ముఖ్యమైన నిర్ణయం.

4. ఫోన్‌ మీద లేదా ఈ-మెయిళ్ళ ద్వారా వివాహ విషయాన్ని ఖాయపర్చకండి.

5. విదేశాలకు చెందిన వివాహాన్ని మీ కుమార్తెకు చేయడంలో ఏదైనా బ్యూరో, ఏజంట్‌, లేదా మధ్యవర్తిని గుడ్డిగా విశ్వసించకండి.

6. వివాహం ద్వారా వేరొక దేశానికి వలస వెళ్ళటానికి లేదా గ్రీన్‌ కార్డు పొందవచ్చనే వాగ్దానాల పథకాలకు బలికాకండి.

7. విషయాలను రహస్యంగా నిర్ణయించకండి. ప్రతిపాదనను స్నేహితులు మరియు దగ్గర బంధువుల దగ్గర ప్రచారం చేయండి. మీరు మరొక విధంగా సంపాదించలేని ముఖ్యమైన సమాచారాన్ని పొందటంలో వారు సహాయపడగలరు.

8. వివాహాన్ని ప్రచారం చేయటానికి అవసరమైన ఫోటోగ్రాఫ్‌ తదితరాల నిరూపణతో మత సంబంధమైన వివాహంతో పాటు రిజిస్టర్‌ వివాహం కూడా భారతదేశంలో జరగటానికి ఎల్లప్పుడూ నొక్కి చెప్పండి.

9. పెళ్ళి కొడుకుకి చెందిన వివాహ హోదా, ఉద్యోగం-స్థానం, జీతం, అతడి అధికారాలు, ఇమ్మిగ్రేషన్‌ హోదా, వీసా రకం, వేరొక దేశానికి భార్యను తీసుకువెళ్ళటానికి అతడికున్న అర్హత, కుటుంబ వివరాలు, కుటుంబ రకం, అతడికి చెందిన నేరచరిత్ర తదితర విషయాల గురించి పూర్తి సమాచారాన్ని సేకరించండి.

10. అత్యవసర పరిస్థితులు ఎదురైనట్లైతే ఆమె దగ్గర ఉండటానికి మీ కుమార్తెకు రాయబార కార్యాలయాలు, హెల్ప్‌లైన్స్‌, బంధువులు తదితరాల ముఖ్యమైన టెలీఫోన్‌ నెంబర్లు, చిరునామాలు ఇవ్వండి.

11. మీ పాస్‌పోర్టు/వీసాను మీ ఆధీనంలో ఉంచుకోండి మరియు పాస్‌పోర్టు/వీసా కాపీని కూడా ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోండి.

12. ఏ కారణం వల్లనైనాగాని నకిలీ కాగితాలు లేదా ఏవైనా నకిలీ లావాదేవీల మీద సంతకం పెట్టటానికి అంగీకరించకండి.

13. మీ తరఫున మరియు పెళ్ళి కొడుకు తరఫున కావల్సిన ఇతర లాంఛనాలు, మరియు వీసా జారీకి అవసరమైన కాగితపు  పనంతటినీ పూర్తి చేయండి. అసలు కాగితాలన్నింటిని మీతోటే ఉంచుకోండి. విదేశాలలో చాలా తక్కువ సాంఘిక ఒత్తిడి ఉంటుంది. భర్త భార్యను స్పాన్సర్‌ చేయనిదే వీసాలు అంత సులభంగా దొరకవు. పెళ్ళికొడుకు తన భార్యను ఏదో ఒక కారణం మీద ఆమె దేశంలో వదిలి వేయగలడు, మరియు తరచు ఆమె డబ్బుతో స్వేచ్ఛగా తిరుగుతాడు. ఇక మీద జాగ్రత్తగా ఉండండి.

విదేశాలలో వుండి సమస్యలను ఎదుర్కొంటున్న మహిళల కోసం

1.  (USA) Asha Helpline Ph. No: 202-2305186/18884172742

email : coordinator@ashaforwomen.org

(Australia) Women’s domestic violence crisis services of Victoria

Ph. No. 1800015188/84136800

3. Willington Domestic Violence Resource Centre

Ph. No. 03-94869844

4. Manavi End Violence in the lives

of South asian Women

P.O. Box. 3103, New Brunswick

Ph. No. (732) 435-1414747-4

email.minu@manavi.org/www.manavi.org

 

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - స్త్ర్లీలు - చట్టాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో