మీకు పోలీస్‌స్టేషన్లలోగాని, మరెక్కడైనా గానీ సరైన న్యాయం జరగలేదని భావిస్తే మీరు నేరుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉత్తరం ద్వారాగాని, టెలిగ్రామ్ ద్వారాగానీ మీ విజ్ఞాపనను పంపుకోవచ్చు.
అడ్రస్: హైకోర్టు ఆఫ్ జ్యుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ సిటీ కాలేజీ దగ్గర, మదీనా, చార్‌మినార్, హైదరాబాద్ – 500066
హైకోర్టులో వేసిన కేసులకు సంబంధించిన సమాచారం – అంటే కేసు ఏ స్థితిలో వుంది, ఎప్పుడు బెంచి మీదికి వస్తుంది, తదుపరి వాయిదా ఎప్పుడుంటుంది లాంటి విషయలు తెలుసుకోవడానికి ఈ దిగువ సమాచారం ఉపయోగపడుతుంది.
మీ కేసుల స్థితిగతుల గురించి 040-23446140 ఫోన్ చేయవచ్చు. అలాగే 52345 (బిఎస్‌ఎన్‌ఎల్ /సెల్ వన్) నంబర్‌కి ఎస్‌ఎంఎస్ చేసినా మీకు సమాచారం లభిస్తుంది. ఈ మెయిల్ :aphc@ap.nic.in వెబ్‌సైట్ :http://hc.ap.nic.in