కె. రాజశ్రీ
జూలై 21, 2008 ఆంధ్రభూమి దినపత్రికలో ఒక వార్తాప్రకటన చదివాను. లైంగిక బాధితుల పట్ల సుప్రీంకోర్టు వ్యాఖ్యసారాంశం ఏమంటే:
యిటీవల కాలంలో మహిళల పట్ల నేరాలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఓ వైపు మనం అన్ని రంగాల్లో మహిళల హక్కులు సాధించామని గొప్పలు చెప్పుకుంొటూ మరోవైపు ఆమె ొమానమర్యాదలను గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మహిళల పట్ల, వారి మానమర్యాదల పట్ల సమాజం అనుసరిస్తున్న చులకన భావాన్ని ఇది ప్రతిబింబిస్తుందని, న్యాయమూర్తులు పేర్కొంటూ – అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి ఆ మహిళ ొమానమర్యాదలను అపహరించడమే కాక, ఆమెకు మానసికంగా, శారీరకంగా తీవ్రమైన హాని కలుగజేస్తున్నారనే విషయాన్ని మనం మరువకూడదని, బాధితురాలి వాంగ్మలాన్ని ధృవపరిచే సాక్ష్యాలు అవసరం లేదని అయితే ఆ వాంగ్మలం పరిస్థితులకు అనుగుణంగా, సంతృప్తికరంగా వున్న పక్షంలో దాని ఆధారంగానే నిందితుడికి శిక్ష విధించాలని సదరు కోర్టు రూలింగు యిచ్చింది.
బాధితురాలి వాంగ్మలాన్ని బలపరిచే సాక్ష్యాలు లేనపుడు, వాంగ్మలం ఆధారంగానే తగు చర్యలు తీసుకోవాలనే నియమం ఉందని, అయితే ఆ పేరుతో బాధితురాల్ని తరచి తరచి ప్రశ్నించి, పుండు మీద కారం చల్లడమే అవుతుందని కోర్టు అభిప్రాయపడింది.
చదవడానికి, వినడానికి బావుంది. అయితే… ఆచరణాత్మకత లోపం నేతిబీరకాయలో నెయ్యిలా వుంటుంది.
గత సంవత్సరం ఆగష్టు 20వ తేది ఉదయం 7 గంటలకు వాకపల్లిలో 11 మంది గిరిజన మహిళలపై అతి కిరాతకంగా సామూహిక అత్యాచారం పోలీసులే చేశారు. పచ్చిబాలింత కాళ్ళావేళ్ళా పడ్డా కనికరం లేని పోలీసులు పశువుల్లా ప్రవర్తించారు. యీ ఘాతుకానికి నిదర్శనంగా పొలాల్లో పగిలిన గాజుముక్కలు, అత్యాచారానికి పాల్పడ్డప్పుడు బాధితురాలి పెనుగులాటగా మట్టిలో ఏర్పడిన గుంటలు, నలిగిపోయిన పసుపుచేలు, పారిపోతున్న మహిళలను వెంటపడి మరీ తరిమి పట్టుకున్న దానికి సాక్ష్యంగా పోలీసుల బూట్ల గుర్తులు మూగసాక్ష్యాలు కాగా – మరి బాధితుల వాంగ్మలం ఆధారంగా నిందితులపై నేటికీి తగు చర్యలు తీసుకోకపోవడం, శిక్షించకపోవడం కడు శోచనీయం. ప్రభుత్వ యంత్రాంగం దున్నపోతు మీద వర్షం పడ్డట్టు మిన్నకుండిపోయింది.
అనేక ప్రజాసంఘాలు, మహిళాసంఘాలు యీ సాక్ష్యాలను పరిశీలించాయి. అక్కడి గ్రామపెద్దలు, ప్రజలతోబాటు ముక్కుపచ్చలారని పసిపిల్లలు కూడా యీ ఘాతుకచర్యను వివరించడం జరిగింది. నేరానికి పాల్పడినవారు ఎవరో తెలిసి కూడా బాధితులు ముఖ్యమంత్రిని కలిసినా, గోడు వెళ్ళబోసుకున్నా నేటికీ బాధితులకు న్యాయం జరగకపోవడం మనందరం సిగ్గుపడాల్సిన విషయం.
మహిళల పట్ల అత్యాచారాలు, బాలికల పట్ల లైంగిక వేధింపులు మనం ప్రతి నిత్యం దినపత్రికలలో చదువుతూనే వున్నాం. టి.వి. ప్రసారాల ద్వారా చూస్తున్నాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 60 వసంతాలు నిండాయి అయినా మహిళల స్థితిగతులు మారలేదు.
మహిళలపై, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపుల పట్ల పోరాటదశలో మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు ఆందోళన చేస్తాయి గాని నిందితులకు శిక్షపడే విధంగా, బాధితులకు న్యాయం చేకూర్చడానికి కాలగమనంలో వారి ఆందోళనలు మరుగునపడిపోతున్నాయి. తిరిగి మరో సంఘటన … మరోటి … మరోటి నేటి ఆయేషా కేసు వరకు నిత్యం మనం చూస్తూనే వుంటాం … వింటనే వుంటాం. యిలాంటి కేసులు సంవత్సరాల తరబడి వాయిదాలు ఎందుకు వేస్తారో నిందితులకు బెయిలు ఎందుకు మంజూరు చేస్తారో… కాగా పోగా… నిలబడిన కేసులకు శిక్షలు విధించిన కోర్టు… నిందితుల అప్పీలుపై కేసులు కొట్టివేయడం చూస్తుంటే… డబ్బుకు, కుల రాజకీయలకు కోర్టులు, న్యాయధికారులు అమ్ముడుపోతున్నట్లు స్పష్టమౌతుంది.
ఏళ్ళ తరబడి కేసులు వాయిదాలు నిందితులకు వెసులుబాటు కల్పించడమే. యీలోపు సాక్షులను, సాక్ష్యాధారాలను తారుొమారు చేయొచ్చు. బెదిరింపులతో బాధితులను లోబర్చుకుని, కేసును తమకు అనుకూలంగా మలచుకోవడాలు… పైకోర్టుకు అప్పీలుకు… ఆ తర్వాత కేసు మాఫీ… బాధిత కుటుంబాల మానసిక, ఆర్థిక వేదనలు ఎవరికి కావాలి? అందుకే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, తీర్పు అమలు నేతిబీరకాయలో నెయ్యిలాంటిదిగా అన్పిస్తున్నది.
కనుక – మహిళాసంఘాలు, మహిళలపై అత్యాచారాలు, బాలికల పట్ల లైంగిక వేధింపుల కేసుల్లో సుప్రీంకోర్టు ఉద్ఘాటించిన వ్యాఖ్యలు, తీర్పు అమలుజరిగే దిశగా ఉద్యమించాలి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags