స్త్రీలకు సంబంధించిన నేరాలు/శిక్షలు

ప్రస్తుత సమాజంలో స్త్రీలపై జరుగుతున్న నేరాలను గూర్చి మనం కొంత తెలుసుకోవాలి. ఆ నేరాలు 1) ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షనులు 304-బి, 306, 354, 376, 420, 494, 498-ఎ మరియు 590(2) క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌లు 125, 161 మొ||నవి.

ఏ నేరంలోనైనాగాని దోషులని శిక్షింప చేయడానికి చేయవలసిన నేరపరిశోధన, మరియు కోర్టులో వారి మీద కేసు నడిపించే బాధ్యత పోలీసు యంత్రాంగం వారిది. ఒక నేరం జరిగినపుడు దానిని వెంటనే దగ్గరలో గల పోలీస్‌స్టేషన్‌లో రిపోర్టు చేయాలి. ఆ తరువాత పోలీసులు, న్యాయ స్థానములు తీసుకునే చర్యలు ఈ క్రింది విధంగా వుంటాయి.

Section 304- B of IPC :

ఈ క్రింది తెలుపబడిన సందర్భాలలో ఒక వివాహిత స్త్రీ మరణాన్ని వరకట్నపు మరణం అంటారు.

(ఎ) వివాహం జరిగిన 7 సం.లోపు ఒక వివాహిత స్త్రీ చనిపోయి వున్నట్లయితే,

(బి) ఒంటిపైన కాలిన గాయాలుగాని లేక ఇతర గాయాలు లేక అసహజ మరణం అయి వుండాలి,

(సి) ఎక్కువ వరకట్నం తెమ్మని వివాహిత స్త్రీలను మరణానికి ముందు శారీరకంగా లేక మానసికంగా హింసకు గురిచేసి

ఉన్నట్లయితే ఈ పైన వివరించిన సందర్భాలలో ఒక వివాహిత స్త్రీ చనిపోతే, ఆ చావు వరకట్నపు చావుగా భావించబడును. Section 304-B IPC వర్తిస్తుంది.

ఈ నేరం సెషన్స్‌ కోర్టు పరిధిలో వస్తుంది.

ఈ నేరం చేసిన వారికి 7 సంవత్సరాలు జైలు శిక్ష నుంచి జీవితఖైదు వరకు విధించవచ్చును.

Section 306 IPC : ఇతరుల ప్రోద్బలంవల్ల ఒక స్త్రీ గాని మరెవరైనాగాని ఆత్మహత్య చేసుకుంటే, అట్టి ప్రోద్బలం చేసినవారు Section 306 IPC క్రింద నేరం చేసినవారు అవుతారు.

ఈ నేరానికి 10 సం.లు జైలుశిక్ష మరియు జరిమానా విధించబడును.

ఈ నేరం సెషన్స్‌ కోర్టు ద్వారా విచారించబడును.

Section 354  IPC : ఎవరైన దురుద్దేశ్యంతో స్త్రీల శరీరాన్ని సెక్స్‌పరంగా తాకిన, లేక వేధించి వారి స్త్రీత్వానికి భంగం కలుగచేసిన (స్త్రీల ఎడల లజ్జాకరంగా, అవమానకరంగా ప్రవర్తించిన), అట్టివారు Section 354 IPC క్రింద నేరం చేసినవారు అవుతారు. వారికి 7 సం.లు జైలుశిక్ష లేదా జరిమానా లేక రెండూ విధించవచ్చును.

ఈ నేరం బెయిలు మంజూరు కానటువంటిది.

సెషన్స్‌ కోర్టులో ఈ కేసును నడుపుటకు 1992లో సవరణ తేబడినది.

Section 376 IPC : స్త్రీలపై అత్యాచారం: స్త్రీకి ఇష్టం లేకుండా ఆమెను బలవంతంగా కాని లేక బెదిరించిగాని ఆమెపై అత్యాచారం చేసినా లేక ఆమెకు మతిస్థిమితం లేకపోయినా, లేక మత్తులో వున్నా, లేక అతను మత్తుమందు ఇచ్చి ఆమెపై అత్యాచారం చేసినా అతడు అత్యాచారనేరం (రేప్‌) చేసినవాడు అవుతాడు.

పైన చెప్పిన ప్రకారం అత్యాచారం చేసినవారికి జీవితఖైదు లేదా 10 సం.లు జైలుశిక్ష మరియు జరిమానా విధించబడును.

భార్య వయస్సు 12 సం.ల లోపు ఉన్నప్పుడు, ఆమె భర్త ఆమెతో రతి జరిపినచో, ఆ భర్త ఆమెపై అత్యాచార నేరం చేసినవాడు అవుతాడు. అతనికి రెండు సం.ల జైలుశిక్ష లేక జరిమానా లేక రెండునూ విధించవచ్చును.

Section 376-A IPC : భార్యాభర్తలు న్యాయపరమైన ఎడబాటులో అనగా జుడీషియల్‌ సెపరేషన్‌లో ఉన్నపుడు, భర్త భార్యపై అత్యాచారం చేసినచో, అతనికి 2 సం.లు జైలు శిక్ష మరియు జరిమానా విధించవచ్చును.

ూవష్‌ఱశీఅ 376-దీ I.P.C : ప్రభుత్వ ఉద్యోగి తన దగ్గర పనిచేస్తున్న స్త్రీలపైగాని లేక అతని అధీనంలో ఉన్న స్త్రీలపై గాని అత్యాచారం చేసినచో, అతనికి ఐదు సం.ల జైలుశిక్ష మరియు జరిమానా విధించబడును.

Section 376-B I.P.C : జైలు సిబ్బంది జైలులో ఉన్న స్త్రీ ఖైదీలపైగాని లేక వారి అధీనంలోవున్న స్త్రీలపై గాని అత్యాచారం చేసినచో, అట్టివారికి 5 సం.లు జైలుశిక్ష మరియు జరిమానా విధించవచ్చును.

Section 376-C I.P.C : హాస్పిటల్‌ సిబ్బంది హాస్పిటల్‌లో ఉన్న స్త్రీలపై అత్యాచారం చేసినచో, అట్టివారికి 5 సం.లు జైలుశిక్ష మరియు జరిమానా విధించవచ్చును.

Section 420 I.P.C : ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మోసం (చీటింగ్‌) చేసినట్లయితే అతను పై సెక్షను క్రింద నేరం చేసినవాడు అవుతాడు. అదేవిధంగా ఒక పురుషుడు ఒక స్త్రీని మోసం చేసినట్లయితే, అతను కూడ పైన చెప్పబడిన నేరం చేసినవాడు అవుతాడు.

ఈ నేరం చేసినవాళ్ళకు 7 సం||లు జైలుశిక్ష మరియు జరిమాన కోర్టు వారు విధించవచ్చును.

Section 494 I.P.C : ఒక స్త్రీ లేక పురుషుడు తన భర్త లేదా భార్య బ్రతికుండగానే వేరొకరిని వివాహం చేసుకున్నచో అది పై సెక్షన్‌ క్రింద నేరం. అట్టివారికి ఏడు సంవత్సరాల జైలుశిక్ష మరియు జరిమానా విధించబడును.

Section 498-A I.P.C : వివాహం అయిన స్త్రీని ఆమె భర్తగాని, అతని బంధువులుగాని ఆమెను శారీరకంగాగాని, మానసికంగాగాని, మరే ఇతర కారణం చేతనైనా హింసించినచో అట్టివారు పై సెక్షన్‌ క్రింద నేరం చేసినవారు అవుతారు. అట్టివారికి 3 సం.లు జైలుశిక్ష మరియు జరిమానా విధించవచ్చును.

Section 509 I.P.C : ఎవరైన ఒక స్త్రీ యొక్క స్త్రీత్వమునకు అవమానం కలుగునట్లుగా మాట్లాడిన, సైగలు చేసిన, ఏదైన వస్తువును ప్రదర్శించినా, అట్టివారు పై సెక్షన్‌ క్రింద నేరం చేసినవారు అవుతారు. అట్టి వారికి ఒక సం|| జైలు శిక్ష లేదా జరిమానా లేక రెండూ కూడ విధించవచ్చును.

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - స్త్ర్లీలు - చట్టాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.