‘క్షౌరికుడు తన పనిని ప్రారంభించాడు. ఒత్తుగా పెరిగిన జడ వెంట్రుకలను కత్తిరించి రాశి పోశాడు. ఒక క్షణంలో వయ్యారంతో నవ్వుతున్నాయేమోనన్న తల వెంట్రుకలు యిపుడుకొచ్చి మట్టి పాచి లాగ ఒక చోట రాశి పడినది. హిందూ ధర్మం నిలబడినది. పరలోకంలోని భర్తకు ఆహారానికి తోడుగా భూలోకంలోని భార్య తల వెంట్రుకలలోని నీరు కలిసి పోవడం తప్పినది. ఆడది మడి స్త్రీ అయినది. స్వర్గానికి దారి నిరంతరమైనది.’
1941 లో ప్రసిద్ధి చెందిన ‘జయంతి’ పత్రిక జరిపిన కథానికల పోటీలో మొదటి బహుమానం గెలిచిన ‘వేణీ సంహారం’ కథలోని కొన్ని వాక్యాలు పైన ఉదహరించబడినవి. లేఖకి – పదహారు సంవత్సరాల దేవాంగన! ఆడపిల్లలు చదవడం, వ్రాయడం నేర్చుకోవడమొక పెద్ద సాహస కార్యమైన కాలంలో సమాజంలోని కళంకపు విలువలను నిర్భయంగా విమర్శించినది దేవాంగనా శాస్త్రి స్వాతంత్య్రానికి ముందుండిన ప్రతిభావంతురాలైన, ప్రగతిపరమైన రచయిత్రులలో ఒకరు.
మిగిలిన క్షేత్రాల వలెనే పురుష ప్రధానమైన సాహిత్యలో కానికి మహిళలు ప్రవేశమైనది చాలా ఆలస్యంగానే! అలాంటి రచనలనూ ‘వంటింటి సాహిత్య’ మని, గంభీరంగా పరిగణించలేదు. జీవితంలోని అనుభవాలు, విశిష్టమైన సంవేదనలను అక్షరం ద్వారా అభివ్యక్తం చేసే ప్రయత్నానికి క్రొత్త జన్మ లభించినది 20వ శతాబ్దపు ప్రారంభంలో. స్త్రీల విద్య, స్వావలంబన లాంటి విషయాలను ప్రతిపాదిస్తూ సమాజంలోని ద్వంద్వ నీతిని విరోధిస్తూ గట్టిదైన ధ్వనిని ఎత్తిన వారు కొంతమంది. మునుపటి మైసూరు సంస్థానంలోనూ తరువాత మైసూరు/కర్ణాటక రాష్ట్రంలో, 30వ దశకంలో కొడగు గౌరమ్మ, తిరుమలాంబ, ఆర్. కల్యాణమ్మ, సరస్వతీబాయి రాజవాడె, రాజలక్ష్మి ఎన్. రావ్, మొదలైనవారు అత్యంత సమర్థవంతంగా సామాజిక బద్ధత, మరియు మహిళా విమోచన యొక్క మహత్వాన్ని తెలుపడానికి కథానికలను మాధ్యమంగా ఉపయోగించుకొన్నారు. వీరి సాలుకు చేరినవారు శ్రీమతి దేవాంగనా శాస్త్రి.
1925 లో గోకర్ణంలోని సుశిక్షితులైన సాహిత్యాసక్తుల కుటుంబంలో జన్మించిన దేవాంగనా ఆ కాలానికి ఆధునికమూ, ప్రగతిపరమైన మనోభావం కలిగి, సంస్కరింపబడిన స్త్రీ అనే, జన ప్రియురాలయ్యారు. పాఠశాల చదువు దగ్గరి ముల్కితో ముగిసినది. కాని ఆమెకు పాత కన్నడం, కన్నడం, హింది, ఇంగ్లీషు, బంగాలి సాహిత్యాల పరిచయముండినది. చదవాలన్న ఆసక్తి, విమర్శా ప్రజ్ఞ వల్ల ఆమె కలం చిగురుతుండేది. వీటన్నిటి పరిణామంవల్ల ఊహించలేని వాతావరణంలో ప్రఖరమైన ఆలోచనలతో వున్న గంభీరమైన రచనలు వచ్చినవి.
‘వేణీ సంహారం’ అన్న కథ, తీవ్రంగా విషాదభరితమైన మరియు వ్యంగ్యంతో మిళితమైన కేశముండనంలాంటి సమాజపరమైన క్రౌర్యాన్ని చిత్రిస్తుంది. ఆ కథా సారాంశమిలా వుంటుంది.
బాల వితంతువు శాంత తండ్రి శంభు మరియు ధర్మశ్రద్ధ వున్న పురోహితుల సంభాషణతో ప్రారంభమవుతుంది యీ కథ. దీని రచనా కాలం గమనించినపుడు దాని మహత్యం అర్థమవుతుంది. ఏడేళ్ళ ముద్దుల బాలిక శాంత వివాహం నలభైయేళ్ళ నలుగురు బిడ్డలున్న విదురుడితో జరుగుతుంది. ఇంటిలో ఒకే సమంగా మండుతున్న యజ్ఞేశ్వరుడి రక్షణకు వ్యత్యాసం రాకూడదన్న ధర్మబుద్ధి కారణంతో యీ వివాహం జరుగుతుంది. అయితే కష్టకార్పణ్యాలన్న అగ్నికి ఆహుతియైనది యీ చిన్నారి జీవితం! వివాహమైన సంవత్సరంలోనే శాంత భర్త మరణిస్తాడు. అప్పటి పద్ధతి ప్రకారం అపుడే కేశముండన జరగాల్సినది. కాని, కూతురిపై వున్న ప్రేమా, వాత్సల్యాల కారణంతో తండ్రి ఉదాసీనం చేశాడు. కాలం గడచినది. శాంత పెరిగి పెద్దదైనది. ఆమె వెంట్రుకలు పొడవుగా, ఆకర్షణీయంగా పెరిగినవి. పదినెనిమిదేళ్ల సుందరియైన యీ అమ్మాయి ప్రత్యేక ఆకర్షణంటె ఆమెకున్న ఈ ఆకర్షణీయమైన కేశరాశి. తన తలవెంట్రుకలను ఉపచారం చేయడమామెకు ఒక ఆటలాంటిది. ఆమె కేశరాశంటె ఆమెకు సంతోషం, గర్వం. కాని ఆ గర్వం దిగిపోయే సమయం మరియు అనివార్యత ఆసన్నమైనది.
ఆ తల వెంట్రుకలను అలానే విడిచిపెడితే పౌరోహిత్యాన్నే నమ్మి జీవితం గడుపుతున్న తన తండ్రి బ్రతుకెలా గడుపుతాడు? అపర కర్మలను చేయించడానికి వచ్చే గృహస్థులు దీనిని సహించగలరా? వేరే విధి లేక కూతురి కేశముండనానికి నిర్ణయం తీసుకొంటాడు దేవాంగనా తండ్రి!
చిన్నప్రాయంలో వున్న తమ్ముడు, శాంత అన్నగారు విరోధించినప్పటికీ అర్థ అపస్మారక స్థితిలో వున్నప్పుడే క్షౌరికుడి చేత శాంత యొక్క తలనీలాలు గొరిగిచ్చేస్తారు. నాకెవరూ లేరు, నేను చనిపోయానని హృదయ వికారకంగా అరుస్తూ శాంత చతికిల పడిపోతుంది.
కథను చదువుతుంటె అప్పటి బాల వితంతువుల కష్ట కార్పణ్యాలు కన్నులకు కట్టినట్టవుతుంది పాఠకుడికి.
చుట్టు ప్రక్కల జరుగుతున్న పరిస్థితులను సూక్ష్మంగా గ్రహించే సామర్థ్యమున్న దేవాంగనా శాస్త్రి సాహిత్యానికి స్ఫూర్తి స్త్రీల బాధలు, వారు పడుతున్న వ్యధలు, ఆమె యీ కథకూ ప్రేరణైనది. బాల వితంతువైన అక్క వెంకటలక్ష్మి, ప్రియమైన తన అక్కలాంటి ఎంతోమంది ముగ్ద బాలికల, యువతుల నిజ జీవితంలోని బాధలు సశక్తంగా ‘వేణీ సంహారం’ కథలో చిత్రింపబడి వున్నది.
ఇలాంటి ధైర్యంతో అభివ్యక్తీకరిస్తూ మనసులు దోచిన దేవాంగనా శాస్త్రి తన నిజ జీవితంలోనూ అలాగే ప్రవర్తించారు. ఋతుమతి కావడానికి ముందే ఆడపిల్లలకు వివాహం చేసే పద్ధతిని నిరాకరించి, ఇరవై ఒకటవ సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. ఆ దంపతుల అపురూప దాంపత్యపు ఫలమే కుమార్తె ‘ఉషా’ జననం, మూడు సంవత్సరాల తరువాత మరలా గర్భం దాల్చినపుడు యింత శీఘ్రంగా మరొక బిడ్డ వద్దని తలచి మందులు తీసుకొన్నారు. మితిమీరి సేవించిన మందుల ప్రభావంతో అతిరక్త స్రావం కలిగినది. ఈ కారణంతో దేవాంగనా శాస్త్రి తన 26 ఏళ్ళ వయసులోనే అకాల మరణానికి గురి అయ్యారు.
దేవాంగనా కొన్ని కథలు, కవితలు, వ్యాసాలు వ్రాసి ప్రచురింపబడినా వారి మొత్తం రచనల సంగ్రహం లభ్యం లేదు. వారి కొన్ని రచనలను 2005లో ధారవాడలోని అవని రసికుల రంగ ప్రకాశన ‘వేణీ సంహార’ మన్న శీర్షికతో ప్రకటించినది. దానితో వారి బ్రతుకు – రచనల గురించి అంతర్దర్శనం లభిస్తుంది. ఇప్పటికీ గోకర్ణంలో ఆమె భర్త యిల్లు, పుట్టినిల్లు అలాగే వున్నవి. అక్కడి ఒక వీధికి దేవాంగనా శాస్త్రి పేరు పెట్టి ఆమెను గౌరవించారు. బ్రతికినది చాలా కొద్దికాలమైనా జీవన విరోధి పరమైన ఆచరణలను తిరస్కరించి తీక్షణకరమైన స్త్రీ సంవేదనతో కూడిన సాహిత్యాన్ని రచించిన దేవాంగనా శాస్త్రి కటిక చీకటిలో ఒక వెలుగు రేఖ!