కొండేపూడి నిర్మల
మూడేళ్ళ పాపే పాకిస్తాన్ ఏజెంటా..?
….
ఘనమైన పురపాలక సంస్థ అత్యంత ప్రేమగా తవ్విన గోతుల మీదుగా, గొప్పలమీదుగా ఒక కాలం చెల్లిన ఆర్టిసీ బస్సు వెడుతోంది. మలుపు తిరిగినప్పుడల్లా మరలో కలియదిరిగే కంకర మాదిరి జనం నలిగిపోతున్నారు. పాతికేళ్ల గిల్లేశ్వరావూ అదే బస్సులో వున్నాడు. పక్కనున్న భూదేవిని లైన్లో పెట్టడానికి అరగంటనుంచీ ఒకటే ప్రయత్నం. ఇకిలించాడు, సకిలించాడు. వీపు గోకాడు, మెడమీదుగా ముందుకు వొంగి,
”స్వప్నా, బావున్నావా..” అన్నాడు.
స్వప్నా ఎవరు- అని చూసె సరికి,
”సారీ, నువ్వు స్వప్ప కాదా, మరి వాళ్ళక్క సరితవ..ఏం అనుకోకేం, అచ్చం అలాగే వుంటేను,.. ” అన్నాడు
అమ్మాయికిదంతా దుర్భరంగా వుంది. కదిలేందేకు లేదు, మెదిలేందుకు లేదు. సీటు దొరికితే చాలు, వీడి పీడ వదులుతుంది అనుకుని ఎదురు చస్తోంది.
”జరుగుబే, వెనక్కి జరుగు, ఇది నా చోటు”- ఇంకో కుర్రాడు పోటీ పడ్డాడు.
”బాబూ మీరిద్దరు వెనక్కి జరగండి..రాడ్ పట్టుకుని నుంచుంటాను. నాకు కళ్ళు తిరిగుతున్నాయి” నడివయసు దాటిన మనిషి తోసుకొచ్చాడు. అమ్మాయి అటు చూసింది. ఆయన కళ్ళు నీరసంతోనో మరెందుకో తిరగడం లేదు. తన మీదే గిర గిర తిరుగుతున్నాయి. ఒకళ్లకి ముగ్గురు తయరయ్యారు అనుకుంది.
ఈ లోగా కండక్టరు మొచేతితో ఆమె చంకలో ఓ పోటు పొడిచి టిక్కెట్టు ఇచ్చి వెళ్ళాడు. భూదేవి నలుగురితోన గొడవ పెట్టుకుంది.
అంత మడి కట్టుకుని కూచోవాలంటే, ఆటోలో పొమ్మన్నారు కొందరు.
”మీరే పోండి.. ఈ బస్సు మీ బాబుదా.?” అంది అమ్మాయి.
”బస్సు కాదు, ఈ రోడ్డు మా బాబు వేసిందే.. ” గిల్లేశ్వరరావు. ” అందుకే అంత అధ్వాన్నంగా వుంది” తోటి ప్రయణీకురాలు.
” అందుకే మా మనవరాలికి ఇలా టెన్తు అవగానే అలా పెళ్ళి చేసి పంపించారు. లేడీస్ బైటికొస్తే ఇంతేనండీ” అంటున్నాడు ఇంకో అంకుల్.
ఎట్టకేలకి బస్సు ఆగింది. అమ్మాయిని కావిలించుకున్నంత పని చెస్తూ, పక్కనే ఒరుసుకుంటూ అబ్బాయి దిగాడు. కాలేజీ గేటు దగ్గర వారం పాటు కుక్క కాపలా కాసి కాసి, ఆ రోజు కూడా ఎప్పటిలాగా సతాయించడం మొదలు పెట్టాడు.
”ఐలవ్వూ, ఐలైక్యూ, ఐ వాంట్య”
పోరా క్రూరా – అన్నట్టు చూసింది అమ్మాయి. జేబూలోంచి ఏదో సీసా తీశాడు. జనంలో సగం మంది అరుచుకుంట కిందికి దిగిపోయరు.
అది హెయిర్ ఆయిల్ సీసాలా వుంది. అమ్మ భుజం మీంచి అటే చూస్తున్న మూడేళ్ళ పిల్ల ఆ సీసా చటుక్కున అందుకుని పక్కనున్న బామ్మగారి మీద సగానికి పైగా వొంపేసింది. గుడి నుండి తెచ్చుకున్న వీబది పండు నూనెకి తడిసిపోవడంతో ఆవిడ బూతులు తిట్టుకుంట కిటికీ లోంచి దాన్ని బయటకి విసిరేసింది.
అక్కడి వరకే కధ వాళ్ళ చేతిలో వుంది. మిగిలిదంతా మీడియ, రాజకీయం నడిపించింది.
”ప్రియురాలి మీద యాసిడ్ చల్లడానికి యత్నించిన ప్రియుడు” వివరాలు తర్వాత పేజీలో..
”యాసిడ్‌ని హెయిర్ ఆయిల్ అనుకోవడానికి కారణమేమిటి?” అమ్మాయితో ఇంటర్వ్య…
”యాసిడ్ పోసింది. ప్రియుడు కాదా? మూడేళ్ళ పాపా..?” ప్రత్యేక కథనం బ్రేక్ తర్వాత
”యాసిడ్ చల్లినది పాపేనట.. అయితే అందుకు సహకరించినది ఆ పిల్ల తల్లి”. పోలీసుల కథనం.
”బామ్మగారి వేషంలో వున్నది ఎవరు…? యాసిడ్ చర్యలో ఆమె పాత్ర వుందా..?
”బామ్మగారు కిటికీలోంచి విసిరిన బాంబుకోసం పోలీసుల వెదుకులాట..”
”కిటికీలోంచి విసిరిన తెల్ల బాంబును ఇడుపుగా దొరకబుచ్చుకుని వెసుకుపోయిన లారీ ఓనరు ఎవరు?”
”అమ్మాయే అతని వెంట పడి వేధిస్తోంటే, అబ్బాయి తట్టుకోలేక యాసిడ్ చల్లుకున్నాడట” కేసులో కొత్త మలుపు.
”యాసిడ్ చర్య ప్రేమ కోసం కాదు, అబ్బాయి తాతకి, అమ్మాయి తాతకి పొలం సరిహద్దులో వచ్చిన పేచీయే కారణమట” ఆసక్తికర కథనం.
”పాప తల్లి అమ్మాయి తండ్రికి పూర్వ ప్రేమికురాలట, ఆస్తి వారసత్వం కోసమే ఈ ఫతక యత్నం”
”పగ పట్టిన ప్రేయసి- సెగ కక్కిన ప్రియుడు”నేరాలు ఘోరాల్లో ఈ అర్ధరాత్రి ప్రత్యేక రిపోర్ట్…
”యాసిడ్ చల్లమని కండక్టరే , అమ్మాయిని చంకలో తట్టడంద్వారా చెప్పాడు…” గిల్లేశ్వరరావు మిత్రుల ఫిర్యాదు.
”తలెత్తితే నా ప్రకటనకు ఒక జెండాకున్నంత పొగరు వుంటుంది. ప్రతిభ అనే నేరం చేశాను. శత్రువులారా నన్ను ఉరితియ్యండి.
”నా చేతిలో దావానలమ్, నా చూపులో హి్మచలమ్…- ప్రఖ్యాత కవి రాసిన ఈ కవిత, యాసిడ్ చర్య జరిగిన రోజునే పత్రికలో రావడంవల్ల పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు.”
”నేర ప్రవృత్తి పెరగడానికి అమ్మాయిల వస్త్రధారణే కారణం.. నేరం జరిగిన రోజు అమ్మాయి లోనెక్ జాకెట్ వేసుకుని వుండకపోతే ఈ ఫతకం జరిగేది కాదు…కాబట్టి మిత్రులారా… లోనెక్ జాకెట్లు నశించాలి”- భారతీయ సంస్కృతి పరిరక్షణ సంఘం.
”సీసా వొంపేసిన పాప మన స్థితి సవ్యంగా లేదని…ఆ పిల్ల తన అవ్మనాన్నలతో కలిసి స్థానిక సినిమహాల్లో ఒక పిశాచి సినిమ చూసిందని” ఒక వార్త.
”లోనెక్ జాకెట్టు కుట్టిన టైలర్ ఆప్ఘనిస్తాన్ వాడని, లోగడ బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు కుట్టేవాడని భోగట్టా…” వెబెసైట్ పత్రిక సంక్రాంతి గొబ్బెమ్మ ”వివరణ.
”ఇంతకూ అబ్బాయి ఎక్కడున్నాడు…? అమ్మాయి ఎక్కడుంది? పాప వేషంలో వున్నది అమెరికన్ రోబోటా…? ఎవరికి తెలియని మిస్టరీ- నివ్వెర పరిచే వార్త గురించి రేపటి నుంచీ అన్వేషణ..”
నేరాన్ని వార్తగ చూసే సమాజంలో ఒక సంఘటన ఎన్ని రూపాలు, రంగులు అద్దుకుంటుందో చెప్పడం కోసం పది మంది రచయిత్రులం సరదాగా బస్సులో వేసుకున్న వీధి నాటకం ఇది. ఉత్తరాంధ్ర యత్ర పొడుగునా నాలుగైదు నాటకాలు ఆడాం. నవ్వలేక పొట్ట చెక్కలయిన కారణంగా కొన్ని డైలాగులు జారిపోయి వుండచ్చు. ప్రయణ భారాన్ని మరిపించడానికి కాదు, ఉమ్మడి వ్యక్తీకరణ ఎంత బలంగా వుంటుందో ఆ బలం అందరికీ వచ్చినట్టయింది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
చాలబాగుంది.