అది ఒక శిలాఖండం

భూమిక November 2008

తమిళ మూలం : వైరముత్తు
అనువాదం : ఆర్‌ శాంతసుందరి
అమ్మా అహల్యా
ఎప్పుడే నువ్వు ఆడదానిగా మారేది?
 ఈ మగరాముళ్లు
 అందరు
 రాయిగా నువ్వు పడి ఉండకముందు చూసిందంతా   దాచిపెట్టి
 తమ పాదాలని దాచుకుని
  పల్లకీల్లోకి ఎక్కి
  ప్రయణం చేస్తుంటే….
అమ్మా అహల్యా
ఎప్పుడే నువ్వు ఆడదానిగా మారేది?
 అడవిలో
 ఆనాడు కథాశిలలా
 పడుండిన నువ్వు
 సంఘమనే సంతలో
 ఈనాడు
 శరీర శిలగా పడున్నావ్‌!
కలత చెందకమ్మా,
రాయిగా మారినది
నువ్వేనని అనుకుంటున్నావా?
ఆ కాషాయధారి గౌతమముని
మనసే రాయి కాదా!
 ఒకలా చూస్తే
  నీ కష్టాలు కష్టాలు కావనే అనాలి!
 శిలగా మారటం చేత
  నీకే బాధలు లేవు!
చడమ్మా అహల్యా
నా భారత పుత్రికలు
ఏదో ఒక దాని కోసం రాత్రి
స్త్రీగా మారటానికి
 పగటి జీవితమంతా
 పాడుబడ్డ రాయిగా పడుండమని
 శాపం పొందిన
 కథ తెలుసా నీకు?
  ఇక్కడ…
  వివెచనం కూడా
  ఆ రోజే
 శాపం పొందింది
 అమ్మా అహల్యా!
  శిలా గర్భంలో
  ఆడదానిగా నువ్వింకా
  ప్రసవించనే లేదే…
 ఈనాటికీ
 శాపం పొందిన నీ శిల
  ఇక్కడే వుంది
 ఇక్కడే…
  కర్మాగారాల్లో…కార్యాలయల్లో…
  పొలాల్లో…మంచాల్లో…
 వీధుల్లో…ఈనాటికీ
 సంఘం సంతల్లో
 ఇంకా
 శాపం పొందిన నీ శిల
  ఇక్కడే పడుంది
పురుష వర్గమా
నీ
అవినితి మురికిని
ఆ శిల మీద బాది
ఉతికి ఆరవేసుకుంటావా?

Share/Save/Bookmark

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో