జ్వలిత
పొద్దునే హడావిడిగా బస్సెక్కాం. ”స్నేహానికన్న మిన్న లోకాన లేదురా” ఎఫ్.ఎమ్ రేడియె బస్‌లో కూడా వినిపిస్తోంది. ఈ మధ్య ఆర్.టి.సి వాళ్ళు ఇదొక మంచి పనిచేశారు. పాట అయి పోయింది ఉత్సాహంగా… ఉల్లాసంగా… అంటూ తుళ్ళిపడుతోంది. రేడియె జాకీ కంఠం తరువాత ”స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం” పాట మొదలయింది. ఈరోజు పాటలన్నీ స్నేహం మీద వేస్తున్నారు అనుకున్నాను.
నిజమే స్నేహం మధురమయినది, శాశ్వతమయినది, పవిత్రమయినది. కానీ ఈ మధ్య స్నేహానికి చెదలుపడుతున్నాయి. స్నేహమంటే భయపడే రోజులొచ్చాయి. ఈ ఆలోచనల్లో ఉండగా శాంతి గుర్తొచ్చింది.
శాంతి నా ఆఫీస్‌లోనే పనిచేస్తుంది. ఎంతో హుషారుగా వుంటుంది. తెలివైనది, అందమైనది కూడా. తను ఎక్కడ ఉన్నా నలుగురితో కలిసి నవ్వుతూ, నవ్విస్తె కళకళలాడూతూ ఉంటుంది. కానీ ఈ మధ్య శాంతి ముఖంలో అశాంతి కనపడుతుంది. నవ్వుతూనే వుంది, అందులో జీవముండటం లేదు. మాట్లాడుతోంది, అందరినీ పలకరి స్తోంది కాని అందులో అంత సహజత్వం ఉండటంలేదు. శాంతి నా స్నేహితురాలే కానీ అంతగా వ్యక్తిగత విషయలు మాట్లాడుకునే చనువు లేదు. శాంతికిద్దరు మగపిల్లలు. ఏవో ఉద్యోగాలు, వేరే నగరాలలో వుంటున్నారు. వాళ్లింట్లో ఆమె, ఆమె భర్త ఇద్దరే ఉంటారు. శాంతి ”ఏమ్టినెస్ట్ సిండ్రోమ్”తో బాధపడుతోందేమొ అనిపిస్తుంది. పిల్లలు పెద్దవాళ్ళయి ఎవరిదారిన వారు వెళ్ళిన తరువాత ఏర్పడే పరిస్థితి. గడు ఖాళీ అయిన తరువాత ఏర్పడే ఒంటరితనం.
శాంతిలో మార్పును గమనించి అడగాలా, వద్దా అని ఆలోచిస్తె వుండి పో్యాను. ఒకరోజు ఏవో అరుపులు వినిపిస్తే ఆఫీసులో నా గది నుండి బయటకు వచ్చా. శాంతి ఎవరిమీదో అరుస్తోంది గట్టిగా. ఏంటి విషయం అని అడిగితే సెక్షన్లో పనిచేసే మరో అమ్మాయి చెప్పింది. మనమంతా ఫ్రెండ్స్ కదా అన్నాడట పక్క సెక్షన్‌లో పనిచేసే మొహన్. శాంతి అంత గట్టిగా మాట్లాడటం ఇదే మొదటిసారి. కలిసి చేసినంత మాత్రాన స్నేహితులమవుతామా? స్నేహం అంటే ఏమిటి? ఉపన్యాసమిస్తోంది తను. నేను వెళ్ళి చెయ్యి పట్టుకున్నాను నెమ్మదిగా. ఆమె వాక్ప్రద౦ ఠక్కున ఆగిపోయింది. నీతో పని ఉంది, నాతో రా.., అని క్యాంటిన్ వైపు నడిచా, తనను తీసుకొని.
ఏంటీ? విషయం…. అంటే మొదలు పెట్టింది. తను ఆనంద్ అనే వ్యక్తితో నాలుగు సంవత్సరాలుగా స్నేహం చేస్తోందట. ఎప్పుడ ఒకరిని ఒకరు కష్టపెట్టుకోలేదు. రోజుకు ఒకసారయినా ఫోన్‌లో మాట్లాడుకుంటారు. కుదరకపోతే ఎస్.ఎమ్.ఎస్‌లు పంపుకుంటారు. తప్పని సరిగా ఒకరిని ఒకరు కలుసుకోవా లని ఏమీ లేదుకాని, ఒకరి క్షేమ సమాచారం ఒకరు, ఒకరి వేర్ ఎబౌట్స్ వేరొకరు తెలుసుకునేవారు. ఇద్దరి మధ్య ఆకర్షణ లేదు కానీ ఒకరికి ఒకరు అన్నట్టు నైతికబలాన్ని అందించుకునేవారు.
”వారం రోజుల నుండి ఫోన్ చేస్తే ఆనంద్ మాట్లాడటం లేదు. తను ఫోన్ చెయ్యడు. నేను చేస్తే ఫోన్ లిఫ్ట్ చెయ్యడు. ఎస్.ఎం.ఎస్‌కి కూడా జవాబివ్వడు. చాలా ఇబ్బందిగా ఉంది” అంట ఏడ్చినంత పనిచేసింది. ”ఛ..ఛ..! ఏడ్వద్దు, ఏం జరిగిందో కనుక్కుందాం” అన్నాను. ”అదీ అయ్యింది. కనుకున్నాను” అంది.
ఇక్కడ శాంతి అంటే, ఏ టీనేజ్ అమ్మాయె, ఏ పెళ్ళికాని యువతో అను కోవచ్చు. శాంతి వయస్సు 55 సంవత్సరాలు. ఇంకా మూడు సంవత్సరాల యితే రిటైర్ అవుతుంది. ఏదో షాపింగు సెంటర్‌లో సి.డి.లు కొంటుంటే ఆనంద రావుతో పరిచయం అయింది. ఇద్దరికీ సంగీతం అంటే ఇష్టం. శాంతి ‘ఆశాభోస్లే’ పాటలు పాడుతుంది కూడా. ఆనందరావుదీ అదే టేస్టు. ఇద్దరికీ స్నేహం కుదిరింది. ఇద్దరిదీ ఒకే వయస్సే, పరిణితి చెందినవారే.
ఇప్పుడు సమస్య ఏంటంటే వున్నట్టుండి ఆనందరావు మాట్లాడటం మానేసేసరికి నైరుప్యమే అయిన, ఒకరకమైన ఆధారితగా మారిన శాంతి ఏదో కోల్పోయినట్లు బాధపడింది. చివరికి తన వల్ల ఏ పొరపాటు జరిగింది, తన స్నేహంలో ఏం లోపం ఉంది, ఏ అర్హత కోల్పోయి స్నేహానికి దూరమయ్యాను అనే ప్రశ్న ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వలేదు.
చివరికి పట్టుదలతో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ఫోన్ చేస్తెనే ఉంది. వందకు పైగా ఎస్.ఎం.ఎస్‌లు పంపింది. చివరికి ఫోన్ లిఫ్ట్ చేసిన ఆనందరావు చాలా మామూలుగా మాట్లాడాడట. ”ఎందుకిలా చేశావ్?” అని అడిగితే ”నేనేం చేశాను? నేను మామూలు గానే ఉన్నాన” అన్నాడు. ”ఫోన్ ఎందుకు మాట్లాడలేదు. ఏంటి విషయం” అంటే?
”ఏం లేదు ఊరికే. నేను మాట్లాడక పోతే నీవు ఎలా ఫీల్ అవుతావో తెలుసు కుందామని హి…హి…” అన్నాడట. ఇదోరకం హింసాత్మక ధోరణి.
పెద్దవయసులోనే పరిస్థితి ఇలా వుంటే, టీనేజ్ పిల్లల పరిస్థితి తెలిసీ, తెలియని వయస్సు. అర్థం చేసుకోలేని మనసు. ఎంత మానసిక క్షోభకు గురవు తుంటారో అనిపించింది నాకు.
స్త్రీలు స్థిరమైన ప్రేమను, బంధాన్ని, భద్రతను కోరుకుంటారు. శాంతి స్నేహాన్ని ఒక బంధంగా, ఒక అవసరంగా భావించింది.
పురుషులు స్నేహాన్ని అప్పుడప్పుడు అవసరంగా, ఎక్కువసార్లు టైమ్‌పాస్‌గా తీసుకుంటారని, మానసికవేత్తలు, మానవీయ వాదులు అంటారు. అన్నీ తెలిసి కూడా సంవత్సరాల తరువాత ఆధారితగా (మానసికంగా) మారిన తరువాత పరీక్షలు పెట్టడం శాంతి తట్టుకోలేకపోయింది.
ఇక్కడ పురుషుడితోనే స్నేహాలెందుకు, స్త్రీలతో స్నేహం చేస్తే ఈ సమస్య వుండదు కదా అనిపించవచ్చు కానీ సమస్య అది కాదు. స్త్రీ అయినా, పురుషుడయినా, స్నేహమయినా, ప్రేమయినా, వివాహ బంధమయినా దానికి ప్రాధాన్యతనిచ్చిన వారు బాధపడవలసిందే. ఎదుటి వ్యక్తి కూడా అంతే ప్రాధాన్యతనివ్వకపోతే పరిచయ మయిన మొదట్లో కనబరచిన కన్సర్న్ లేదా మర్యాద తరువాత పాటించగలగాలి. అప్పుడే అది స్థిరమయింది.
ఖీ ఖీ ఖీ
పొద్దునే టీ తాగుత పేపర్ చదువుతున్నా. ప్రేమించలేదని ముఖం మీద యాసిడ్ పోసిన సంఘటన ఒక వార్త. ప్రేమను అంగీకరించలేదని పీక కోసిక సంఘటన మరొకటి. రెండుచోట్లా అమ్మాయిలే బాధితులు. కాలింగు బెల్ మొగింది. ఇంత పొద్దున్నే ఎవరా అని తలుపు తీసేసరికి ఎదురుగా మాధురి. ప్రక్క బజార్‌లోనే వుంటారు. నాతో కలిసి చదువుకుంది మాధురి. కూరగాయలకని బయలుదేరి దార్లోనే కదా ఒకసారి చూసి వెళ్దామని వచ్చానంది. తనకు కూడా టీ ఇచ్చి క్షేమసమాచారాలు అడిగా.
ఏదో సమస్య ఉన్నట్టుగా ముఖం పెట్టింది. చెప్పాలా, వద్దా అని సందేహిస్తు న్నట్లు అనిపించింది. అంతపొద్దునే వచ్చిందంటేనే విషయం అర్థమయింది. సరే తనే చెప్తుంది అని లోకాభిరామాయణం మొదలుపెట్టా. అవీ ఇవీ మాట్లాడి ఇక వెళ్తానని లేచింది. సరే అని నేను సోఫాలోంచి లేచి నిలబడ్డా.
”అదేంటి ఏం పనిమీద వచ్చావని అడగవా?” అని ఎదురు ప్రశ్నవేసింది. కదిలిస్తే ఏడ్చేలాగుంది.
”ఎందుకడగన..” అంటూ మా ఇంటి వెనుక పెరటి తోటలోకి తీసుకెళ్ళా. ”మా తోటలో ఎన్ని పూలున్నాయె చూడు” అంటే. ”ఇప్పుడు నాకు ఆ మూడ్ లేదు” అంది మాధురి. ”అదేంటి నేనేమైనా ఒక కిస్ ఇవ్వమన్నానా, ఒక హగు ఇవ్వమన్నానా? పూలు చూడటానికి మూడేంటి, నాలుగేంటి” అన్నాను, కాస్త వాతావరణం తేలిక చేద్దామని.
”అన్నయ్య రాత్రి ఇంటికి రాలేదట. వదిన పొద్దున్నే ఫోన్ చేసి మీ ఇంటికి వచ్చాడా” అని అడిగింది. విషయం చెప్పింది. మాధురి వాళ్ళన్నయ్య రాంప్రసాద్.
రాంప్రసాద్ ఓ ఇంజనీర్. చాలా మంచివాడు. తన పని తను చేసుకు పోయేతత్వం. పెయింటింగు అంటే ఇష్టం. ఆఫీస్ అయిన తరువాత కుటుంబంతో పార్కులకో, చిత్రలేఖనానికి సంబంధించిన ప్రదర్శనలకో వెళు తుంటాడు. ఎక్కువ ఆశలు లేవు అనుకుంటూ బ్రతికే మనిషి. తన చిన్న కుటుంబం, తన పెయింటిగు ఇవే తన ప్రపంచం అన్నట్టుగా వుంటాడు. ఈ మధ్యే తాగుడు మొదలు పెట్టాడు.
”ఎక్కడికెళ్ళాడంటావ్” అన్నాను ఏమనాలో తోచక. ఏదైనా ఊరెళ్ళాడేమొ తెలియదు. ”ఈ మధ్య ఇంట్లో గొడవలవు తున్నాయి. వదినకు చెప్పకుండా వెళు తున్నాడు” అంది మాధురి.
”గొడవలెందుకు బాగానే వుంటారుగా భార్యాభర్తలిద్దరూ” అన్నాను నేను. ఒకటి, రెండుసార్లు నేను కూడా మాధురితో కలిసి రాంప్రసాద్ ఇంటికెళ్ళా. మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా కాకపోయిన, మంచి దంపతులే. సర్దుకుపోయేతత్వం ఇద్దరిదీ. పోట్లాటకు కారణాలేవీ కనిపించవు. ”నీతో కొన్ని విషయలు మాట్లాడదామని వచ్చాను” అంది మాధురి. ”నాన్చడ మెందుకు, చెప్పవచ్చుకదా” అన్నాను.
”మా అన్నయ్య కాలేజి రోజుల్లో మన క్లాస్‌మేట్ హేమను అభిమానించే వాడట. కానీ ఎప్పుడ బయటకు చెప్పే సాహసం చేయలేదు. చదువులయిపోయి ఎవరిదారిన వారు విడిపోయా౦. ఎవరి జీవితాల్లో వారు ఎంతో బిజీ అయినాం. ఈ మధ్య అంటే దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఏదో ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో హేమను చూశాడు అన్నయ్య. ఆమె వీణ్ణి గుర్తుపట్టలేదు కానీ వాడు గుర్తుపట్టినా పలకరించలేదు. ఆమె మళ్ళీ షాపులో ఒకసారి, బస్టాప్‌లో ఒకసారి కలిసారట. పరిచయం చేసుకున్నాడు. గతాన్నేమీ గుర్తుచేయకుండా స్నేహం చేస్త వచ్చాడు”.
హేమంటే గుర్తుకొచ్చింది. మా క్లాసే. డిగ్రీలో ముందు బెంచీలో కూర్చునేది. ‘ఎర్రతేలు’ అని నిక్‌నేమ్‌తో పిలిచేవాళ్ళం. ఎర్రగా, సన్నగా, అందంగా ఉండేది, తెలివయినది.. గుర్తుచేసుకుంటున్నాను.
”ఏంటి ఆలోచిస్తున్నావ్! వింటు న్నావా?” అంది మాధురి.
”ఆఁ.. ఆఁ.. వింటున్నా, చెప్పు, హేమంటే ఎర్రతేలేనా?” అన్నాను. అవును! ‘ఎర్రతేలే అంది’ తను.
అన్నయ్యకు హేమకు స్నేహం పెరిగింది. రోజుకు ఒక్కసారన్నా ఫోన్‌లో మాట్లాడుకునేవారట. కుటుంబం విషయంలో, పిల్లల విషయంలో అన్నయ్యకు సలహాలిచ్చేదట. జెండర్ స్పృహలేనంతగా, ఒకరికొకరు అరే, ఒరే అంటూ సంభాషణ సాగేది. వీడు భావుకుడు కదా, పైగా ఇద్దరికీ నచ్చిన చిత్రకళ అంశం వుండనే వుంది. కలుసుకోకపోయినా దాన్ని గురించి చర్చించుకునే వాళ్ళట.
హేమ ఈ మధ్య వీడితో సరిగా మాట్లాడటం లేదట. ఎందుకు మాట్లాడటం లేదు అంటే, బాగానే మాట్లాడుతున్నా గదా అంటుందట, ఈ మధ్య వారానికొకసారి మాత్రమే ఫోన్ మాట్లాడతా అందట ఎందుకు? అంటే పనివత్తిడి అంటుందట. వీడు దాన్ని తట్టుకోలేక తాగుడు అలవాటు చేసుకున్నాడు. వదినతో గొడవకు దిగుతున్నాడు.
ఈ మధ్య ఒకసారి ”నీకు డబ్బు సంపాదించడం రాదు. కుటుంబాన్ని, జీవితాన్ని లీడ్ చెయ్యడం రాదు, చెప్తే వినవు..? నేర్చుకోవు. నీ లాంటివాళ్ళతో స్నేహం వద్దు” అని మాట్లాడ్డం మానేసిందట. అది తట్టుకోలేకపోతున్నాడు. చచ్చిపోతాను అంటాడు.
”ఈ విషయం నీకు ఎప్పుడు తెలుసు” అని అడిగాను మాధురిని.
”ఈ మధ్యే ఒక పదిహేను రోజుల క్రితం మాట్లాడా. అప్పుడు చెప్పాడు, నాతో మాట్లాడొద్దు. ఫోన్ చేస్తే నేను చచ్చినంత ఒట్టు అంది. నేను చచ్చిపోతానంట ఏడ్చినంత పనిచేశాడు.
ఇదేంటి, చిన్నపిల్లాడిలా, నీదేమన్నా టీనేజా? ఇంటర్ చదివే పిల్లల్ని పెట్టుకొని. మేమంతా లేమా. మా కంటే ఆమె ఎక్కువా, ఆమె మాట్లాడనంటే చావడమేంటి అని అరిచా.
లేదు, లేదు చెల్లిగా నువ్వు కావాలి. భార్యగా మీ వదిన కావాలి. స్నేహితురాలిగా హేమ కావాలి నాకు. నాకు అందరితోపాటు స్నేహం కావాలి. లేకపోతే చచ్చిపోతా. అసలు నాతో ఎందుకు మాట్లాడనంటుంది. నేను ఏ రకంగా ఇబ్బంది పెట్టాను. హేమతో ఒక పురుషుడిగా స్నేహం చేయలేదు. స్నేహం అంటే చూడాలి, ఆమెను తాకాలి, ఇవేమీ లేవు. కేవలం స్నేహంగా ొమాట్లాడుకోవడం. ఎందుకు వద్దంటుంది, కారణం ఏంటి, అర్థం కావట్లేదు అంటాడు”.
ఇంతలో మాధురి సెల్‌ఫోన్ వెగింది. ఫోన్ చూచి ”అమొ వదిన ఫోన్. ఏం వినాల్సివస్తుందో, భయం వేస్తుంది” అంది మాధురి.
”ఏం భయంలేదు. ముందు ఫోన్ మాట్లాడు, లేదా నేను మాట్లాడతా” ఇవ్వు అన్నాను.
లేదు బాగుండదు నేనే మాట్లాడతా అని తను ఫోన్ ఆన్ చేసింది. వాళ్ళ వదిన ”మీ అన్నయ్య ఇప్పుడే ఇంటికి వచ్చాడు, నువ్వు కంగారుపడ్తావేవె అని ఫోన్ చేశా” అందట.
హమ్మయ్య అనుకున్నాం ఇద్దరం. ”ఎక్కడికెళ్ళాడట, అడగకపోయవా” అన్నాను. ”ఎందుకులే వచ్చాడు కదా, తరువాత వివరాలడగవచ్చు” అంది.
”సాయంత్రవె, రేపో వీలు చూసుకొని ఒకసారి అన్నయ్య దగ్గరకి వెళ్దావ” అంది నాతో మాధురి.
”నేనే అందామనుకున్నా, నీమానేశావు. రేపు సాయంత్రం ఆరు తరువాత మా ఆఫీస్‌కురా, కలిసివెళ్దాం” అన్నాను. సరే అని తను వెళ్ళింది.
తరువాత ఆఫీసుకు వెళ్ళాను కాని నా ఆలోచనలన్నీ శాంతి, రాంప్రసాద్‌ల చుట్టే తిరుగుతున్నాయ్.
శాంతి భర్త మితభాషి, ఏ భావాల్నీ వ్యక్తపరచలేడు. వ్యాపారి కావడంతో ఎప్పుడ తీరిక లేకుండా వుంటాడు. ఆఫీస్, ఇంటిపని, పిల్లలు, షాపింగు, ఏదో వెలితి, శూన్యం. తనకు ఎటువంటి చెడు ఆలోచనలు లేవు. ఆ సమయంలో ఆనందరావు పరిచయం. మనసు స్నేహాన్ని కోరుతున్న విషయన్ని తెలుసుకుంది.
తెల్లారి సాయంత్రం మాధురి ఆఫీస్ కొచ్చింది. శాంతిని కూడా మాతో రమ్మని ముగ్గురం కలిసి రాంప్రసాద్ ఇంటికి వెళ్ళాం. మేం వెళ్ళేసరికి ఇంటిముందు ఖాళీ స్థలంలో పిల్లలతో షటిల్ ఆడుతున్నాడు. మమ్మల్ని చూసి ”రండి.. రండి.. మీకో గుడ్‌న్యస్, నేను డ్రింకు ొమానేసా”నన్నాడు.
”ఓ! కంగ్రాచ్యులేషన్స్” అన్నాం, నేను మాధురి ఒకేసారి.
అందరం లోపల కూచున్నాక, ”ఒక విషయం తెలుసా మాధురీ, నేను ఈ మధ్య ఒక కౌన్సిలింగు తీసుకున్నా. నిన్న కూడా అక్కడికే వెళ్ళా ఒక సైక్రాటిస్ట్ దగ్గరికి, ఆ విషయం తెలియక మీ వదిన కంగారుపడి నీకు ఫోన్ చేసిందట గదా” అన్నాడు.
”ఎందుకు? సైక్రాటిస్ట్‌తో నీకేం పని?” అంది మాధురి. ”కూల్.. విను చెప్తా. ఆఫీస్‌లో, ఇంట్లో గొడవలు జరుగు తున్నాయ్. కారణం ఏంటి? ఈ మధ్య పెయింటింగు కూడా వెయ్యట్లేదు ఎందుకు? అని ప్రశ్నించుకుంటే డ్రింక్ అనే కారణం కనపడింది. డ్రింక్ మానెయ్య డమెలా అని ఆలోచన వచ్చింది. దీన్ని మానెయ్యడమెలా అని స్నేహితుని సలహా అడిగితే డా|| విజయకిషోర్ నంబర్ ఇచ్చాడు. వాడే అపాయింట్‌మెంట్ తీసుకున్నాడు కూడా! ఆ డాక్టరే నేను చెప్పే సైక్రాటిస్ట్.
ఆయన నన్ను కలిసినపుడు నా సమస్య ఏంటి అని అడిగాడు. తాగడం అని చెప్పాను. అంటే ‘సెల్ఫ్ ఎసెస్‌మెంట్’ అయ్యిందన్న మాట అని. ఎన్నాళ్ళ నుంచి ఈ అలవాటు అన్నారు. మాధురి, మీకు తెలియదు కానీ, కాలేజి రోజుల నుండి రుచి చూస్త వస్తున్నా నేను. అదే డాక్టర్‌కు చెప్పా. 20 సం||ల నుండి పండుగలకు, పార్టీలకు తాగుతుంటాను అని. ఆయన నవ్వి, వెరీగుడ్. స్నేహితులు బలవంతం చేస్తే తీసుకుంటాను అని చెప్పలేదు అన్నారు. ఇప్పుడు సమస్యేంటి అని అడిగారు. ఆరు నెలల నుండి తాగకుండా వుండలేకపోతున్నా. కొత్త సమస్యలొస్తున్నాయి అన్నాను.
ఒక చిన్న నోట్స్, పెన్ను నా కిచ్చి – ఎందుకు అలా మారారు? ఎందుకు ఇప్పుడు మానెయ్యలనుకుంటున్నారు. కారణాలు, పరిస్థితులు వివరంగా పాయింట్ వైజ్ రాయండి అని ప్రక్క గదిలోకి పంపాడు.
ప్రక్క గదిలో రెండు కుర్చీలున్నాయి ఒక కుర్చీలో కూర్చుని తల ఎత్తి చూస్తే ఎదురుగా గోడమీద అందమైన ప్రకృతి దృశ్యాలు, జలపాతాలు, పూతోటలు, నదీనదాలు, కొండలోయలు, సర్యాస్తమ యల వర్ణ చిత్రాలు అందంగా వున్నాయి. మరో ప్రక్కకు తలతిప్పితే ఆ గోడనిండా అందరు దేవుళ్ళ పటాలు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి, వినాయకుడు, జీసస్, బుద్దుడు, మదర్‌థెరిస్సా, మసీదు మొదలయినవి, మరో ప్రక్కకు తల తిప్పితే పై వరసలో చిన్న పిల్లల బోసినవ్వుల చిత్రాలు, తరువాత వృద్ధుల రకరకాల హావభావాలతో ఒక వరస, చివర ఒకే ఒక్క ఫోటో అందమయిన ఒక యువతి, పూల దండతో అలంకరించబడిన ఫోటో. అంతా చూస్త వుండిపోయిన ఎంతసేపయ్యిందో తెలియదు.దాదాపు గంటన్నరయ్యిందను కుంటా నర్సు వచ్చి డాక్టరుగారు పిలుస్తున్నా రని పిలిచింది.
బయటకు వచ్చి నేనేం రాయలేక పోయను అని చెప్పాను తలవంచుకొని.
డాక్టర్‌గారు నవ్వుతు రాయద్దు. చెప్పండి అన్నారు. ఏం చెప్పను అన్నాను నేను. మీరు చూసిన ఆ చిత్రాల గురించి అన్నారు. ఎక్కడ మొదలుపెట్టను అన్నాను.
మీ యిష్టం అన్నారాయన.
ఆ స్త్రీ ఎవరు? ఆ ఫోటోకు దండ వేశారు ఎందుకు? ఆవిడ లేదా ఇప్పుడు? ఎలా పోయరు? అన్నాను. నా ప్రశ్నలు నాకే వింతగా అనిపించాయి.
ఆవిడ నా స్నేహితురాలు, గత ఏడాది చనిపోయింది.
మరి ఆ ఫోటో అక్కడ ఎందుకు పెట్టారు అన్నాను నేను అర్థం లేకుండా. ఆ గదిలో వున్నవన్నీ నా కిష్టమయినవి. అవన్నీ సత్యాలు. నేనంగీకరించిన జీవిత సత్యాలు, అవి నాకు గురువులు కూడా అన్నారాయన నవ్వుతు.
ఇంకా చెప్పండి వివరంగా అన్నాను. మాటలు తడబడ్డాయి నాకు. ఆయన తన ముందున్న మంచినీళ్ళ గ్లాసు అందించారు నాకు.
గబ గబా ఎన్నో ఏళ్ళ నుండి దాహం తో వున్నట్టు నీళ్ళన్నీ తాగేశాను. ఆయన మాట్లాడటం మొదలు పెట్టారు.
ఆ పువ్వులు, మొక్కలు, ఆ జల పాతాలు, ప్రకృతి దృశ్యాలు మన ప్రమేయం లేకుండా సృష్టించబడి మన ప్రమేయంతో కలుషితమవుతున్నాయి.
పిల్లలు ‘నా బాల్యం’. నాకు తెలియకుండా జన్మించిన నేను రోజు రోజు గడుపుతూ పెరిగినా తప్పనిసరిగా అంగీ కరించవలసిన జీవన సత్యం వృద్ధాప్యం, మరణం తప్పనిది, ఆపలేనిది. అందర పొందవలసినది. ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. చాలా చిన్నదైన ఈ జీవితం భ్రమలతో, భయలతో, ప్రలోభాలతో వ్యర్థపరచుకోవడం అర్థలేని పని. స్నేహం, ప్రేమ, బాధ, దుఃఖం ప్రతి ఒక్కటీ మనలోని జీవశక్తికి ప్రతీకలు. ముఖ్యంగా కోపం, బాధ వంటి ప్రతికూల విషయలు ఎవరికీ పంచకూడదు. చేత నయితే సాయం చెయ్యలి. నలుగురికీ ఉపయెగపడాలి, అవి ఒక్కరికి, ఇద్దరికి కాదు, ప్రపంచమంతా పంచగలగాలి. ఇది ఆ గది రహస్యం, అని ముగించారు.
నేను ఆయనకు నమస్కారం చేసి నిలబడ్డాను వెళ్తానన్నట్టుగా. మీరు పేపర్ మీద పెన్ను పెట్టలేదు, అంటే మీ మనసు సానుకూలతలో వుంది. కారణాలు వెతుకుతూ రాస్త కూచుంటే మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం జరిగేది.
ఇప్పుడు మీ మనస్సు ఏది చెప్తే అది చేయండి. అది మీకు, మీ చుట్ట వున్న వాళ్ళకు ఆనందం కలిగిస్తుంది. ఆల్ ది బెస్ట్! వెళ్ళిరండి అన్నారు.
ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది. మిమ్మల్నందరిని కొద్ది రోజులు బాధ పెట్టినందుకు సిగ్గుగా ఉంది. క్షమించమ్మా మాధురి” అన్నాడు రాంప్రసాద్.
”అయ్యయ్యె క్షమించడమేమిటి. అన్నయ్య నిన్ను చూస్తే ఆనందంగా వుంది నాకు” అంది మాధురి.
శాంతి తన కళ్ళ వెంట నీరు కారుతున్న విషయం కూడా గమనించకుండా ఆనందంగా చస్తుంది.
స్నేహం, ప్రేమ అన్ని వయసుల వారికి అవసరమే. అవి బలవంతంగా వచ్చేవి కావు. మనుషులు విచిత్రంగా ప్రవర్తించడానికి కారణాలు ఎవరి కోణాల్లో వారికి వుంటాయి. కాని ఈ మధ్య కొత్తగా ఓ పత్రిక ”ఆడవారిని ఆకర్షించడం ఎలా? మగవారిని తమచుట్ట తిప్పుకోవడం ఎలా?” అని ఒక శీర్షికనే నిర్వహిస్తోంది. దీని ప్రభావం యువతపై ఎటువంటి దుష్పరిణావన్ని కలిగిస్తుందో ఊహించ డానికి భయంగా ఉంది. ఎదుటివారిని బాధపెట్టి, భయపెట్టి, ప్రలోభపెట్టేవి స్నేహాలు కావు, ప్రేమలు కావు. ఒక విషపు వలయలు, జీవితాలనే అతలాకుతలం చేసే సునామీలు.
”అందరం ఆనందంగా వుంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావ్?” అనడంతో ఆలోచనలనుండి బయటపడి ఈ సంతోష సమయన్ని సెలబ్రేట్ చేద్దాం. రేపు ఆదివారం మీరందరు మా యింటికి భోజనానికి రండి అన్నాను నేను.
”ఈ రోజు రాత్రికి మా ఇంట్లో మీ అందరికీ విందు. చాలా రోజుల తరువాత మా ఇల్లు ఆనందంతో నిండిపోయింది. తప్పిపోయిన గొఱ్ఱెపిల్ల ఇల్లు చేరింది” అంది మాధురి వాళ్ళ వదిన.
భోజనాల తరువాత శాంతి, నేను బయలుదేరాం. మాధురి అన్నయ్యతో ఇంకా మాట్లాడాలి అని అక్కడే వుండిపోయింది.
శాంతి ఏదో మాట్లాడాలను కుంటందో తటపటాయిస్తోంది. ”శాంతీ, ఈ రాత్రి మా ఇంట్లో వుంటావా” అన్నాను.
”నేనే అందామనుకున్నాను, నువ్వే అడిగావు. థాంక్స్! మా వారు క్యాంప్‌కెళ్ళారు. నీతో మాట్లాడాలి” అంది.
”ఇదంతా చూసి కూడా ఇంకా మాట్లాడాల్సింది ఉందా” అన్నాను. ”అవును ఇప్పుడే చాలా మాట్లాడాలి” అంది.
సరే అని ఇంటికి వెళ్ళి స్నానాలు ముగించి నా బెడ్‌రమ్‌లో చేరాం. ”చెప్పు ఇప్పుడు” అన్నాను శాంతితో.
”ఇక్కడ కాదు బాల్కనీలో, వెన్నెల్లో కూచుందాం, చాలా ఆనందంగా వుంది నాకు” అంది. భావుకురాలు కదా సరే అని బాల్కనీలోకి చేరాం. శాంతి మొదలుపెట్టింది, వధురివాళ్ళ అన్నయ్య సమస్య పరిష్కారం నాకు కూడా పరిష్కారం చూపించింది అంది.
”ఏంటో అది నువ్వు డ్రింక్ మొదలెడతావా” అన్నాను జోగ్గా. తను నవ్వకుండా, ఏముంది స్నేహాలు, ప్రేమలు, భ్రమలు మధ్యలో ఆపి ”అవ్మె కవిత్వవ, వహ్వా.. వహ్వా..” అన్నాను. ”హాస్యం కాదు, నిజం. ఏదీ ఆశించవద్దు, పంచడమే ఆనందం ఇస్తుంది. పంచడం ద్వారా ఏది లభిస్తే దాన్ని అంగీకరించడమే. మంచి మనసుతో స్నేహించడం, చేతనయిన సహాయం నలుగురికి చేయడం ఇందులో ఉన్న ఆనందం నాకు తెలుసు. అప్పుడప్పుడు తీరిక దొరికిన సమయంలో వృద్ధాశ్రమాలకు వెళ్తాను. సాధ్యమయినంతవరకు వారి అనుభవాలు వింటాను. అప్పుడు వాళ్ళు పొందే ఆనందాన్ని చూస్తాను. నాకూ చాలా సంతోషమనిపిస్తుందపుడు”.
అయినా నాకంట నా మనసుకు దగ్గరైన స్నేహం కావాలనుకున్నాను. ఇది నా కోరిక. ఆ సమయంలో ఆనందరావు పరిచయం. మనిషి మంచివాడ.ే ఏదో తిక్క కోరిక నన్ను పరీక్షించాలనుకున్నాడు. అది నన్ను డిస్ట్రబ్ చేసింది. హేమతో పోలిస్తే ఆనందరావులో ఒక ప్రత్యేకత వుంది. ఎప్పుడ అడగనిదే సలహా ఇవ్వడు. వ్యక్తిగత విషయాలు మాట్లాడకున్నా కోపం, దుఃఖం ప్రదర్శించిన సందర్భాలతో విమర్శించడు. ఏడ్చిన తరువాత హాయిగా వుంది కద, స్నానం చేసి ఒక కప్పు టీ తాగుదాం అంటాడు ఎదురుగా ఉన్నట్టే. మళ్ళీ మాట్లాడతా అని ఫోన్ కట్ చేస్తాడు. ఒక గంటకో, ఎప్పుడో ఫోన్ చేసి టీ అయ్యిందా నేనింకా ఆఫీసులోనే ఉన్నా అంటాడు.
స్నానం చెయ్యమన్నది, టీ తాగ మన్నది, సేద తీరమన్నది నన్నే అయినా ఇలా చెయ్యి అనే నిబంధన ఉండదు, చేస్తే బాగుంటుంది అనే సలహా వుండదు.
కోపంగా ఉన్నపుడు కాసేపు నిద్రపో, నాకు కొంచెం పని వుంది అంటాడేకాని కోపం వద్దు అని కాని, కోపం ఎందుకు అని కాని అనడం వుండదు. హేమలాగ ఆనందరావుంటే నేను కూడా చావాలను కునేదాన్నేవె.
ఉన్నంత కాలమే ఉంటుంది ఏదైనా, అది స్నేహవె, మరోటో కావచ్చు. ఏవో కారణాలతో ఆగిపోతే ఆగిపోతుంది. ఆ స్మృతులు అనుభతులుంటాయి. ఎవరో మళ్ళీ పరిచయం అవుతారు, కాకపోవచ్చు కూడా. దేనికైనా స్వాగతించాలి. కుటుంబం సమిష్టి పార్శ్వం, స్నేహం వ్యక్తిగత పార్శ్వం, ఇది గుర్తించగలిగితే సమస్య ఉండదు. స్నేహంలో అధికారం, ఆశ, ఈర్ష్య ఉండ కూడదు. అసలు ఏ బంధంలో ఉండ కూడదు. మన బృందంలో మరికొందరిని కలుపుకుని ఏదైనా మంచిపని చేయలి. అది నలుగురికి ఉపయెగపడాలి”. ఏదో ట్రాన్స్‌లో వున్నట్లు వట్లాడుతుంది. అయినా నిజాలే అన్నీ.
”ఏం చేస్తే బాగుంటుంది? ఆలోచించు, నేను కూడా సహకరిస్తాను” అన్నాను. నా స్నేహాలను కూడా నీకు పరిచయం చేస్తాను అన్నాను.
శాంతి నా వైపు ఆశగా చూసి వీధిబాలలు, అనాధవృద్ధులు.. అని ఆగింది నా వైపు చూస్తూ.
నాకు అర్థమయ్యింది తనేం చెప్పా లనుకుంటుందో. ”సరే ఆలోచిద్దాం నేను కూడా నీ వెంట వుంటాను” అన్నాను.
ఆకాశంలోకి చూస్తుంది. చంద్రుడు అప్పుడే మబ్బుల్లో నుండి బయటకు వచ్చి ఆనందంగా నవ్వుతున్నట్లున్నాడు. వెన్నెల జల్లులు కురిపిస్త, హర్షాతిశయంతో.
శాంతి మెల్లగా పాట అందుకుంది – ”ఉందిలే మంచీకాలం.. ముందు ముందునా.. అందరు సుఖపడాలి నంద నందనా..”.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags