ఓప్రా విన్‌ ఫ్రీ

పి. సత్యవతి
బాల్యంలో కట్టుకోవడానికి సరైన బట్టలు లేక బంగాళా దుంపలొచ్చిన గోతాలతో కుట్టిన గౌన్లేసుకున్న ఒక నల్ల పిల్ల, తొమ్మిదేళ్ల వయసులో బంధువుల చేతనే అత్యాచారానికి గురైన పిల్ల, ఇంట్లో ఉండలేక పారిపోయి, 14 ఏళ్లకి గర్భం తెచ్చుకున్న అమాయకప్పిల్ల, ఇవ్వాళ అమెరికాలోనే కాక ప్రపంచం అంతా గొప్పగా వెలిగిపోవడం. అంటే దాన్ని అదృష్టం అంటే వొప్పు కోకూడదు. ఆమె లోని ప్రజ్ఞ, మేధ, పట్టుదల, అంటే అవుననాలి మనం….చింకి పాతల్లోంచీ ఒక మీడియ మొగల్‌గా ఎదిగి, బిలియన్ల డాలర్ల సంపాదనలోకొచ్చిన ఈ నల్ల తేజాన్ని మనం ఆరాధించాల్సిందే. డబ్బు తెచ్చుకున్నందుకు కాదు, స్టాకుల్లో, రియల్‌ ఎస్టేట్‌లో, లాస్‌ వేగాస్‌ జూదాల్లో, లాటరీల్లో కూడా సంపాదించొచ్చు. వాళ్ళ ఊసుకూడా మనకొద్దు.
1986 నించీ నిరాటంకంగా సాగిపోతున్న సుదీర్ఘమైన టాక్‌ షో, స్త్రీలని అధికంగా ప్రభావితం చేసిన టాక్‌ షో, ఎంతోమంది తమ అనుభవాలని, ఆవేదనల్ని, ఆశల్ని, ఆశయలని పంచు కున్న టాక్‌ షో, నిర్మాత నిర్వాహకురాలు, ఓప్రా విన్‌ ఫ్రీ.. అసలు పేరు ఆర్పా అయితే తరువాత అది ఒప్రాగా మారిందట. 1954లో పుట్టింది ఓప్రా.
ఓప్రా తల్లి వెర్నిటాలీ ఇళ్ళళ్ళో పని చేసేది. తండ్రి బొగ్గుగని కార్మికుడు. అతి బాల్యం అమ్మమ్మ దగ్గర గడిచింది. చాలా బీదరికం. అమ్మమ్మ చదవడం నేర్పింది. మాట్లాడటం నేర్పింది. అప్పుడే ఓప్రా తన బొమ్మని ఇంటర్వ్య చేసేదట. తరవాత అమ్మ దగ్గరకు మిల్వాకే వెళ్ళింది. ఓప్రా తల్లి ఇళ్లల్లో పని చేస్త పిల్లమీద ఎక్కువ ధ్యాస పెట్టేది కాదు. అసలు ఒప్రా పుట్టాకే ఒక అనూహ్య సంఘటన. ఇంకా ఇరవై రాని వెర్నన్‌ లీ ఆమె ప్రియుడు విన్‌ ఫ్రీ ఒక్క సారి లైంగికంగా కలిసినందుకే ఆమె గర్భం ధరించింది. అప్పటికి వాళ్లు పెళ్ళి చేసుకోలేదు. ఓప్రా పుట్టగానే వాళ్ళు విడిపోయారు. హైస్కూల్లో చదువుకునేటప్పుడే ఆమె తల్లి దగ్గర ఉండలేక ఇల్లు విడిచి పారిపోయింది. 14 ఏళ్లకే గర్భం తెచ్చుకుంది. ఆ శిశువు పుట్టిన వెంటనే మరణించింది.
తరువాత ఆమెని తండ్రి దగ్గరికి టెన్నిసీ రాష్ట్రంలోని నాష్విల్‌ పంపారు. ఆయన ఓప్రా చదువుకు అత్యంత ప్రాధాన్యమిచ్చి ఆమెను క్రమశిక్షణలో ఉంచాడు. ఆమె అక్కడ చాలా మందికి ఇష్టమైన విద్యార్థిని. ఉత్తమ ఉపన్యాసకురాలి అవార్డును కూడా పొందింది. టెన్నిస్సి స్టేట్‌ యూనివర్సిటీలో స్కాలర్షిప్‌ సాధించింది. అక్కడ కమ్యూనికేషన్స్‌ అధ్యయనం చేసింది.
తన పదిహేడో ఏట బ్లాక్‌ టెన్నిసీ బ్యటీగా కూడా ఎన్నికైంది… వెంటనే స్థానికంగా ఉండే రేడియె, డబల్యవిఓఎల్‌ టీవీ లో పార్ట్‌ టైమ్‌ నూస్‌ యంకర్‌గా చేరింది. కళాశాల చదువుతోపాటు ఈ ఉద్యోగంకూడా చేసింది. అక్కడ ఆమె అందరికన్న చిన్న యా౦కర్‌, అంతేకాదు, మొదటి నల్ల స్త్రీ యా౦కర్‌ కూడా… అక్కడనించీ ఓప్రా 1976లో బాల్టివెర్‌లోని మరొక చానెల్లో సాయంత్రం ఆరుగంటల వార్తలకి సహయంకర్‌గా వెళ్ళింది అదేకాకుండా ”పీపుల్‌ ఆర్‌ టాకింగు” అనే టాక్‌ షోకి కోహోస్ట్‌ గాన, ”డయలింగు ఫర్‌ డాలర్స్‌” అనే షో కి హోస్ట్‌ గా పని చేసింది…
పందొమ్మిదివందల ఎనభై మూడులో ఓప్రా షికాగో నగరానికి మారింది. అక్కడ ఆమె అతి తక్కువ రేటింగులో వున్న ”ఎ.యం.షికాగో” అనే ఉదయపు కార్యక్రమాన్ని నిర్వహించింది, నెలల కాలంలోనే ఆ కార్యక్రమం అత్యున్నత రేటింగు సాధించి అప్పటికి ఉన్నత స్థానంలో ఉన్న కార్యక్రమాన్ని మించిపోయింది. అప్పుడా కార్యక్రమాన్ని గంటకి పెంచి ”ఓప్రా విన్‌ ఫ్రీ షో” అని పేరు పెట్టారు. అది మొదలు ఓప్రాకి నిచ్చెనలు ఎక్కడమే పని. అంతకు ముందు ప్రధమ స్థానంలో ఉన్న కార్యక్రమం, ఫిలిప్‌ డోనహూ నిర్వహించేవాడు.
”ఆయనకి ఏ విధంగాన సరిజోడి కాకపోయినా ఓప్రా తన సీదా సాదా తనంతోన హాస్యచతురతతోన, కార్య క్రమంలో పాల్గొనే వ్యక్తుల పట్ల సహానుభతి తోన వీక్షకుల హృదయలను కొల్ల గొట్టిందని” టైమ్‌ పత్రిక మెచ్చుకుంది. ఎవరిదైనా విషాద గాధ విన్నప్పుడు ఓప్రా కళ్లు చెమ్మగిల్లటమే కాదు స్రవిస్తాయి కూడా. అప్పుడు తామెన్నడు ఊహించని విధంగా తమ మనసుల్లోని ఆవేదనల్ని ఆమెతో చెప్తారు. కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు. అట్లా వాళ్ళకి సన్నిహితురాలైపోతుంది ఆమె… ఆమె షోకి అంత స్పందన రావడం అందుకే.. ఒక జర్నలిస్టులాగా తరచి తరచి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టడం కాదు, వాళ్ళతో మమేకం అవడమే ఆమె విజయ రహస్యం. బాలికలపై అత్యాచారం అనే అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఓప్రా చాలా ఉద్వేగంతో తన బాల్యంలో తనపై జరిగిన అమానుషాన్ని ప్రేక్షకులకు చెప్పి కంట తడిపెట్టింది. అందుకే ఆమె అందరిలో ఒకరై పోగలిగింది.
మైకేల్‌ జాక్సన్‌ వంటి ప్రముఖుల్నైనా, అసాధారణ విజయలు సాధించిన సీదాసాదా మనుషులనైనా ఆమె తనదైన శైలిలో ఇంటర్వ్య చెయ్యగలదు. నవ్వించగలదు. ఏడిపించగలదు. తను చేసే సేవా కార్యక్రమాలకి విరాళాలు రాబట్టగలదు.
రెండువేల రెండు శీతాకాలంలో ఆమె నిర్వహించిన ఒక షోలో పాల్గొన్న ప్రేక్షకులందరికీ (రెండువందల డెబ్బై ఆరు మంది)కి ఆమె జి6 సేడాన్‌ కార్లు బహు కరించింది. ఈ కార్యక్రమం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే పోన్టియక్‌ కంపెనీ ఈ కార్ల్లను బహూ కరించిందనుకోండి, పబ్లిసిటీ కోసం. ఈ కార్ల మీద టాక్సులు కట్టే విషయమై పెద్ద చర్చ జరిగిందికూడా.
ప్రారంభించినప్పటినుంచీ నిరా ఫటంగా సాగిపోతున్న ఓప్రా విన్‌ ఫ్రీ షో నే కాక ఓప్రా ఇంకా చాలా పనులు చేస్తుంది. మొదట ఎవరికో ఉద్యోగానికి చేసిన ఈ కార్యక్రమ నిర్మాత ఇప్పుడు ఆమే. అంతే కాదు స్త్రీల టీవీ చానెల్‌ ఆక్సిజన్‌లో భాగస్తురాలు. తన స్వంత కంపెనీ హోర్పోకి అధ్యక్షురాలు… రాగం భూపాలంలో మనం పరిచయం చేసుకున్న యలీస్‌ వాకర్‌ వ్రాసిన ”కలర్‌ పర్పుల్‌”ని స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ సినిమా తీశాడు. అందులో ఓప్రా సోఫియ పాత్ర పోషించింది. అంతేకాదు, టోనీ వరిసన్‌ నవల ‘బిలవెడ్‌’ని స్వయంగా సినిమా తీసి అందులో సెతె పాత్ర పోషించింది. ఆ సినిమాకి ఆమెకి దాదాపు 30 మిలియన్‌ డాలర్ల నష్టం వచ్చింది. ఓప్రా షోలో ప్రవేశపెట్టిన బుక్‌ రీడింగు క్లబ్‌ వలన ఎన్నో పుస్తకాలు విరివిగా అమ్ముడు పోయయి. ఓప్రా స్వయంగా రెండు పత్రికలు కూడా నడుపుతుంది… టాక్‌ షో సిండికేషన్‌ ద్వారా, ఇతరత్రా  దాదాపు 2.7 బిలియన్ల డాలర్ల సంపాదన ఆమెది.
ఈ డబ్బంతా ఏంచేస్తున్నావమ్మా ఓప్రా అని మనం అడగొచ్చు. 1998లో ఆమె ఏంజిల్స్‌ నెట్‌వర్క్‌ అనే వితరణ సంస్థ స్థాపించింది. దీని ద్వారా 51 మిలియన్‌ డాలర్లు వివిధ కార్యక్రమాల కోసం ఖర్చుచేస్తుంది. ఇందులో ఇతరులు ఇచ్చిన విరాళాలే కాక ఆమె స్వంత డబ్బుకూడా చాలా ఉంటుంది. అమెరికాలోని అత్యంత వితరణ శీలురైన యభై మందిలో ఓప్రా ఒకరు.
హరికేన్‌ కట్రీనా సమయంలో ఆమె విరాళాలు అర్థించినప్పుడు దాదాపు 11 మిలియన్‌ డాలర్లు పోగయ్యయి. దీనికి తన స్వంత డబ్బు 10 మిలియన్‌ డాలర్లు చేర్చి అక్కడి బాధితులకు ఇళ్ళు కట్టించి ఇచ్చింది., ఈ బాబ్‌ హోప్‌ హ్యూమని టేరియన్‌ అవార్డీ………… ఇప్పటికి 250 మంది ఆఫ్రికన్‌ అమెరికన్‌ పురుషులని కాలేజీల్లో చేర్పించింది. ఓప్రాకి పిల్లలు లేరు. ఆమాటంటే ఆమె ఒప్పుకోదు. ఎందుకంటే ఆమె దక్షిణాఫ్రికాలో స్థాపించిన ఓప్రా విన్‌ ఫ్రీ లీడర్‌ షిప్‌ అకాడమీ ఫర్‌ గర్ల్స్‌లో ఉన్న అమ్మాయిలంతా (152 మంది) తన కూతుళ్ళే కదా అంటుంది. బయటినించి వచ్చిన 7 మిలియన్‌ డాలర్ల విరాళమే కాక తన డబ్బు కూడా కలిపి మొత్తం 40 మిలియన్‌ డాలర్లు ఈ ప్రాజెక్టుకి ఖర్చు చేస్తోందామె. ఇక్కడ పిల్లలంతా సమాజపు అట్టడుగు పొరల్లోని వాళ్ళు. 42 ఎకరాల సువిశాల క్షేత్రంలో ఇల్లు కట్టుకుని అమెరికాలో ఇంకా ఎన్నో చోట్ల ఇళ్ళూ వాకిళ్ళూ కల ఓప్రా తన బాల్యం ఎప్పుడూ మర్చిపోదు. అందుకే ఆమె ఈ కడు బీద పిల్లల కోసం ఆవేదన పడుతోంది. గల గల నవ్వుతూ ఎదుటివాళ్ల కళ్లల్లోకి సూటిగా చూస్త వీళ్ల హృదయంతరాళాల్లోకి తొంగి చూసే ఓప్రా షో వీలుంటే ఒక సారి చూడండి.

Share
This entry was posted in రాగం భూపాలం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.