బరువైన వీధి మలుపు

భూమిక November 2008

డా. జరీనా బేగం
నేనా వీధి మలుపు దగ్గరకు
వెళ్ళగానే అనుకోకుండా
నా చేతులు బ్రేకులు మీద
పడి బండి కదలనంటుంది
బలవంతంగా బండిని కదిలించి
నా ఇంటి దారిన బయలుదేరినా
బరువైన నా మనసు బలవంతంగా
రాలిపోయిన నా స్నేహపు జ్ఞాపకాల
నుండి కదలనంటుంది
ఎంత ధైర్యం తన మాటల్లో
ఎంత ఓదార్పు తన స్నేహంలో
ఎంత పరిపక్వత తన ఆలోచనల్లో
ఎంతటి తపన మార్పు కోసం
ఎంతటి త్యాగం మాట కోసం
ఎంతటి ఎదురుచూపు కొత్తదనం కోసం
కొత్త పాత ఆలోచనా మార్పుల
ఒరవడిలో రగులుతూ
పోరాడుతూ రాలిపోయింది
నా స్నేహం
బతుకుబాటలో మిగిల్చి
ఓ ఆరని జ్యోతిగా
ఆలోచించే ప్రతి మనసులో
నిత్యం రగులుతున్న ఓ ప్రశ్నలా
మార్పు కోసం ముందు ముందుకొచ్చి
మెలికలు తిరుగుతూ మండుతుండే
ప్రమిదలోని పువ్వొత్తిలా.

Share/Save/Bookmark

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో