పానోపాఖ్యానము
భూమిక November 2008
తమ్మెర రాధిక
పండగ పూట భుక్తాయసం మూలంగా
పాన్ తెచ్చాడు మా ఆయన.
టీవీలో
కవితాగోష్ఠి చూస్త పాన్ నములుత
ఎర్రని ఉమ్మిని వికారంగా ఊస్తూ
పండగ మాధుర్యాన్ని కకావికలు చేస్తున్నారు
పాన్ ఫటు గొంతులోకి దిగుతున్నప్పుడు
చారులో మిరియాలు లేవని
నామీద నూరిన కారాలు గుర్తొచ్చాయి
తమలపాకుల మందం గురించి చెప్తూ
కర్వేపాకుల అందం ఆరోగ్యం ఎలా వుంటుందో
పప్పులో వెయ్యని నా వెనకబాటుతనాన్ని
వ్యంగ్యాస్త్ర భాణాలతో ఛేదిస్తున్నప్పుడు
పాన్ తినకూడదని శపథం పట్టాను.
వక్కపలుకులు చిన్న సన్న ములుకొలుకులట
అన్నంలో వచ్చే పలుకు రాయికి సమానమట.
చీకట్లో బియ్యం ఏరని ఖర్మకి, పానొక్కలు
ఆకులు రాసిన సున్నం - కాచులా వుండాలిట
ఆడవారి సరసం….
నిజమే!!
ఆడవారి మాటలకు అర్థాలు వెతుక్కునే
సుందోపసుందులకు
కాచు పంట ఏం తెలుస్తుంది కలహించుకోవడానికి
కాసులే కారణంగా ముందు సున్నం బొట్లు పెడుతుంటే !
సోపు కమ్మగా వేయించిన వైనం -
ఎప్పుడ మూకుడుకంటుకుపోయిన మాడుముక్కల్లా
గాదు, ‘మూలగ నిండిన బొక్కల్లా’ అంటూ చెప్తోంటో -
పంట కింది రాయిలా మాట మాటకీ
అడ్డొచ్చి - మూకుట్లో వెలిగారంలా మండి
పడ్తోంటే సోపేం ఖర్మ!!
స్టోమిదేవమైనా సరే చెయ్యదు వంట
ఎండు కొబ్బరి ముక్కలు, నెయ్యితో
పుటం వేసినప్పుడు ఆ రుచి అద్భుతంట
పాతిక ఎకరాల మడి చెక్కలు పాచికలాటలో
తగలేసిన పెద్దలు నేతి ధపృళాలు - చప్పరించిన ముచ్చట్లు
చవులరివకపోతే,
‘చదువుకోండర్రా సన్నాసుల’ అంట కేకలెయ్యక పిల్లల్ని !
పండగనాడెందుకు - పాన్ పరాకు మాటలు
నా మీద దండగ.