సమస్య – పరిష్కారం (కథల పోటీకి వచ్చిన వాటిల్లోంచి సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ) – గంటి సుజల

అనంతకు ఎందుకో గాభరాగా అనిపించింది. గబుక్కున మంచం మీంచి లేచి కూర్చుంది. కాసేపు అలా కూర్చుంటే తగ్గుతుందనిపించింది. పది నిముషాలు గడిచినా తగ్గలేదు. మంచం దిగి బైటకు వచ్చింది. స్రవంతి గదిలో లైట్‌ వెలుగుతోంది. ఎదురుగా హాల్లో ఉన్న గడియారం వైపు చూసింది. సమయం పన్నెండున్నర కావస్తోంది. ఇప్పటి దాకా మేల్కొని ఏం చేస్తున్నట్లు? మెల్లిగా స్రవంతి గది దగ్గరకు వచ్చి దగ్గరగా వేసిన తలుపును తోసింది.

సడన్‌గా తెరుచుకున్న తలుపు చప్పుడుకి అప్పటిదాకా మోకాళ్ళ మధ్య తలపెట్టుకుని ఏడుస్తున్న స్రవంతి ఎదురుగా ఉన్న తల్లిని చూసి కంగారు పడింది. కూతురు బుగ్గల మీద కన్నీటి చారికలు చూసి కడుపులో మెలిపెట్టిన అనుభూతి కలిగింది అనంతకు. అంత దుఃఖం కలిగించే విషయం ఏమై ఉంటుంది? అన్న అనుమానం మనసులో మెదిలింది. దగ్గరకు వచ్చి ”ఏంటిరా తల్లీ ఏడుస్తున్నావు? ఒంట్లో బాగులేదా?” అని అడిగింది.

తల్లి అలా అడిగేసరికి దుఃఖం వస్తున్నా తను చేసిన పని తల్లికెలా చెపుతుంది. అమ్మా నాన్నా తన మీద ఎంతో నమ్మకంతో తనకు స్వేచ్ఛ ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసింది. కళ్ళు తుడుచుకుంటూ ”ఏం లేదమ్మా ఎందుకో భయం వేసింది అంతే” అంది. ఆ మాట నమ్మబుద్ధికాకపోయినా దగ్గరకు వచ్చి మంచం మీద కూర్చుని తల మీద చెయ్యి వేసింది. చల్లనిగాలి తగిలిన మేఘంలా తల్లి ఆ స్పర్శకు మళ్ళీ కళ్ళు చెమ్మగిల్లాయి. స్రవంతి తలను ప్రేమగా తన గుండెలకు అదుముకుంది. అవసరం అయినప్పుడు తానే చెపుతుందన్న నమ్మకంతో వీపు నిమిరింది.

”పోనీ నేను కూడా ఇక్కడే పడుకోనా? ఎందుకో నాకూ ఇవ్వాళ నిద్ర పట్టటం లేదు” అంది అనంత.

”అలాగే అమ్మా పడుకో, దానికి అడగాలా!” అంది.

తల్లీ కూతురూ ఒకరి మీద ఒకరు చెయ్యివేసి పడుకున్నారు. స్రవంతి చంటి పిల్లలా అమ్మను కౌగలించుకుని పడుకుంది.

తెల్లవారాక పక్కన భార్య లేకపోవడం చూసి, ఇల్లంతా వెతికి స్రవంతి గదిలో ఇద్దర్నీ చూసి చిన్నగా నవ్వుకున్నాడు ప్రకాష్‌. ఏ అర్థరాత్రో నిద్ర పట్టక వాళ్ళమ్మను లేపి తన దగ్గర పడుకోమని చెప్పి ఉంటుంది. ఇంకా చిన్నపిల్ల చేష్టలు అనుకుని నవ్వుకున్నాడు. బ్రష్‌ చేసుకుని వంటింట్లోకి వెళ్ళి కాఫీ ఫిల్టర్‌లో కాఫీ పొడి వేసి, కింద గిన్నెలో నీళ్ళు పోసి స్టవ్‌ మీద పెట్టి, హాల్లో కొచ్చి పేపరు పట్టుకుని కూర్చున్నాడు.

వాళ్ళింట్లో ఎవరు ముందు లేస్తే వాళ్ళు కాఫీ డికాక్షన్‌ వేస్తారు. కాఫీ వాసనకు మెలుకువ వచ్చింది అనంతకు. ‘అరే అప్పుడే తెల్లారిపోయిందా!’ అనుకుంటూ మంచం దిగింది. ప్రకాష్‌ లేచినట్లుగా ఉంది అనుకుంటూ కూతురి బెడ్‌రూమ్‌లోంచి బైటికొచ్చి హాల్లో ఉన్న ప్రకాష్‌ను చూసి చిరునవ్వుతో ‘శుభోదయం’ అంది.

పేపర్‌ లోంచి తల బైటపెట్టి ‘శుభోదయం. ఏం రాత్రి కూతురికి నీ మీద బెంగా లేక నీకు దాని మీద బెంగా దాని పక్కన చేరావు?’ అన్నాడు.

”ఏం నీకు నేను పక్కన లేకపోతే నిద్రపట్టలేదా?”

”అదేం కాదనుకో పొద్దున్న లేచి నువ్వు కనబడకపోతే వెతికాను. అంతే. బ్రష్‌ చేసుకురా కాఫీ కలుపుతాను కలిసి తాగుదాం” అన్నాడు నవ్వుతూ.

”వద్దులే నేను కలుపుతాను. ఒక్క రెండు నిమిషాల్లో వచ్చేస్తాను” అంటూ బెడ్‌ రూమ్‌లో ఉన్న అటాచ్డ్‌ బాత్రూమ్‌లోకి దూరింది. బ్రష్‌ చేసుకుని వంటింట్లోకి వెళ్లి ఇద్దరికీ కాఫీ కలిపి తెచ్చింది.

కాఫీ రుచి చూస్తూ ‘ఏమైనా చెప్పు. నీ అంత బాగా కలపలేను నేను కాఫీ, నీ చేతిలో అమృతం ఉందోయ్‌’ అన్నాడు.

”నాకు తెలుసు ఇలా పొగిడేస్తే ఏ పెళ్ళాం ఐనా పొగడ్తకు పడిపోయి ఇంచక్కా చేసేస్తుంది. మీరు పని నుంచి తప్పించుకోవచ్చు. మీ వేషాలు నాకు తెలుసు” అంటూ నవ్వింది.

కాఫీ తాగి కప్పు పక్కన పెట్టి, ”రాత్రి ఎందుకో నిద్ర పట్టక బైటకు వచ్చాను. స్రవంతి గదిలో లైట్‌ వెలుగుతుంటే తలుపు తీసి చూసాను. మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని ఏడుస్తోంది. చాలా బాధేసింది. కారణం అడగలేదు అదే చెప్తుందని ఊరుకున్నాను. దానికి ఊరటగా ఉంటుందని దాని పక్కనే పడుకున్నాను” అంది.

”మంచి పని చేసావు. బహుశా భయపడి ఉంటుందిలే” అన్నాడు ప్రకాష్‌. కానీ అనంత మనసు దానికి అంగీకరించలేదు. ఏదో ఉంది. చిన్న విషయానికి అలా బెంబేలెత్తే పిల్ల కాదు. చూద్దాం రెండురోజుల లోపల చెప్పకపోతే అప్పుడు అడగవచ్చు అనుకుంటూ నిత్య కార్యక్రమాల్లో పడిపోయింది.

ప్రకాష్‌ పబ్లిక్‌ సెక్టర్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అనంత బాంక్‌లో ఆఫీసర్‌గా పనిచేస్తోంది. స్రవంతి ఇంటర్‌ చదువుతోంది. యవ్వనంలో పిల్లలు వ్యామోహాలకి లోనవుతారు. స్రవంతి అలాంటి వ్యామోహంలో ఇరుక్కుందా! అన్న భయం వెంటాడుతోంది. ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం చాలా కష్టంగా

ఉంది. వెయ్యికళ్ళతో కాపాడినా ఎక్కడో అక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి. వీళ్లను ఆకర్షించడానికన్నట్లు రోజురోజుకీ రకరకాల పరికరాలు, ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్‌లు. మితిమీరుతున్న పోకడలు.

మనసులో తిరుగుతున్న ఆలోచనలను పక్కకు పెట్టి ముగ్గురికీ లంచ్‌ బాక్స్‌లు సర్ది, బ్రేక్‌ఫాస్ట్‌ తయారుచేసి డైనింగ్‌ టైబుల్‌ మీద పెట్టేసరికి ప్రకాష్‌ ప్లేట్లు, గ్లాసులు, మంచి నీళ్ళు సర్దాడు. ఈ లోగా స్రవంతి కూడా తయారయి వచ్చింది.

ముగ్గురూ హడావుడిగా బ్రేక్‌ఫాస్ట్‌ కానిచ్చి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. బాంక్‌లో పనెక్కువగా ఉండడం వల్ల అనంత రెండు రోజులు స్రవంతిని పట్టించుకోలేదు. కాస్త వెసులుబాటు దొరికాక ధ్యాస కూతురి మీదికి మళ్ళింది. పేరుకు తగ్గట్టుగా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే స్రవంతి ఉదాశీనంగా ఉంది. సరిగ్గా గమనిస్తే కళ్ళ కింద నల్లచారలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంక జాప్యం చేయకుండా అసలు విషయం కనుక్కోవాలని నిర్ణయించుకుంది అనంత.

ఆ రోజు కావాలని బాంక్‌ నించి తొందరగా ఇంటికి వచ్చింది. తలుపు తాళం తీసి లోపలికి వచ్చింది. వాళ్ళ ముగ్గురి దగ్గరా ఇంటి తాళాలు ఉంటాయి. ఎవరి టైమ్‌ ప్రకారం వాళ్ళు ఇల్లు చేరుకుంటారు. దాహం వేస్తుంటే డైనింగ్‌ టేబుల్‌ మీది మంచినీళ్ళు గడగడా తాగింది. ఫాన్‌ స్విచ్‌ నొక్కబోయిన అనంతకు సన్నగా ఏడుస్తున్న శబ్దం వినబడింది. స్రవంతి వచ్చిందన్న మాట ఆ రోజు నించీ కాలేజ్‌కు వెళ్ళకుండా ఇంటికి వచ్చి ఏడుస్తోందన్న మాట. మెల్లిగా గది దగ్గరకు వచ్చి తలుపులు తోసింది. మంచం మీద కూర్చుని, ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ ఏడుస్తోంది. తల్లిని చూడగానే ఏడుపు ఆపి, ”నేను తరువాత మాట్లాడుతాను” అంటూ ఫోన్‌ పెట్టేసింది.

మెల్లిగా మంచం మీద కూర్చుని ”స్రవంతీ ఎందుకు ఏడుస్తున్నావు? ఏదో బలమైన కారణం ఉంది. అమ్మతో కాక ఎవరితో చెప్పుకుంటావు. ఒకవేళ నేను తిడతానేమో అన్న భయంతో దాచినా ఎప్పుడో అప్పుడు అది బైటపడక తప్పదు. నేను నీకు అన్ని విషయాలలో స్వేచ్ఛ ఇచ్చాను. ఇన్నాళ్ళూ నా పెంపకం మంచి దనుకున్నాను. ఇప్పుడు నీ వ్యవహారం చూస్తే ఏదో జరగరానిది జరిగిందని నాకనిపిస్తోంది. జరిగినదేదో నాకు చెపితే నాకు తోచిన సలహా కానీ పరిష్కారం కానీ చెపుతాను” అంది.

”అమ్మా నేను తప్పు చేసానమ్మా నీ నమ్మకాన్ని వమ్ము చేసాను” అంటూ ఏడుస్తున్న కూతుర్ని చూసి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఒక్కసారి గుండె ‘లబ్‌ డబ్‌’ అనడం మొదలుపెట్టింది. ‘ఏం జరిగి ఉంటుంది? సరే అసలేం జరిగిందో చెప్పు’ అంది.

ఆ తరువాత స్రవంతి చెప్పిన విషయం విన్న అనంతకు ఒక్కసారి పిడుగు పడినట్లుగా భావన కలిగింది. తన పెంపకంలో ఇలాంటి పొరపాటు ఎలా జరిగింది? అవసరానికి మించి స్వేచ్ఛ ఇచ్చానా? అన్న అనుమానం.

స్రవంతికి నిండా పదిహేడేళ్ళు లేవు. కాలేజ్‌లో క్లాస్‌మేట్‌ అన్నగారితో స్నేహం అయ్యిందిట. అతను ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. అందరికీ బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడంటే అది గొప్ప అనుకుని, ఆ అబ్బాయి తన బాయ్‌ఫ్రెండ్‌ అనుకుని అతనితో సినిమాలు, షికార్లకూ వెళ్ళేదట. కొత్తలో తన క్లాస్‌మేట్‌ కూడా సినిమాలకు వచ్చేది. కాలక్రమేణా ఆ అమ్మాయి రావడం మానేసింది. ఆ అబ్బాయి మాటల మత్తులో తనను తాను మర్చిపోయిన స్రవంతి ఆ అబ్బాయి తప్పులేదంటే ఆ అబ్బాయితో శారీరక సంబంధం పెట్టుకుంది. ఇక్కడి దాకా పాత కథే. అసలు కొత్త కథ ఆ అబ్బాయి తమ ఇద్దరి కలయికను వీడియో తీసి వెబ్‌సైట్‌లో పెట్టి డబ్బు సంపాదిస్తున్నాడట.

కొంతమంది స్నేహితులకు వీవీూ ద్వారా కూడా పంపుతున్నాడట. అలా ఒక స్నేహితురాలి ద్వారా తెలిసిన స్రవంతి ఆ సైట్‌ చూసి ఆశ్చర్యపోయింది. ఏమిటని అడిగితే నువ్వే కాదు నాకు చాలా అమ్మాయిలతో ఫ్రెండ్‌షిప్‌ ఉందన్నాడట. ”ఇప్పుడేం చెయ్యాలో తెలియటం లేదు” అంటూ ఏడ్చింది. ఇపుడేం చెయ్యాలన్నది అనంతకూ పెద్ద ప్రశ్నే. ప్రకాష్‌కు చెప్పాలా లేదా! చెపితే ప్రథమ కోపి అయిన అతని రియాక్షన్‌ ఎలా ఉంటుంది? అన్నీ ప్రశ్నలే.

ఈ సమస్యకు పరిష్కారం ఎలా అనుకుంటుంటే ఈ వలలో చిక్కుకున్న ఒక అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం అనంతను ఇంకా కలవరపరిచింది. అదృష్టవశాత్తు సకాలంలో తల్లి చూడబట్టి ఆ అమ్మాయి బతికింది. ఈ నాగరికత పేరుతో ఇలా ఎంత మంది ఆడపిల్లలు బలి అవుతున్నారో?

”స్రవంతి ఒకసారి ఆ అమ్మాయిని కలవాలి” అంది అనంత. ఎందుకమ్మా అని అడగబోయి మానుకుని తల్లిని తీసుకుని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళింది. వీళ్ళిద్దర్నీ చూసిన సుమ, ఆమె తల్లి ఆశ్చర్యపోయి వీళ్ళెందుకు వచ్చి ఉంటారన్న అనుమానంతో సతమతమవుతున్నారు. అనంత ఏదో నిశ్చయించుకున్న దానిలా ఉపోద్ఘాటం లేకుండా ”నేను స్రవంతి తల్లిని. మన దురదృష్టం కొలదీ ఇద్దరూ ఒకటే వలలో చిక్కుకున్నారు. సుమా! అసలు నువ్వు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డావు. చావు దేనికీ పరిష్కారం కాదమ్మా. సమస్యలో ఇరుక్కున్నప్పుడు ఆ సమస్యలోంచి బైట పడడానికి ప్రయత్నించాలి. సమస్యకు చావు పరిష్కారం అయితే సమస్యకొక చావు చొప్పున ప్రతీ క్షణం ఒక చావు సంభవించాలి. మనకు దేముడీ పుట్టుక ఇచ్చినందుకు దీన్ని సదుపయోగం చెయ్యాలి” అంది.

”వీళ్ళ నాన్నగారికి కోపమెక్కువండీ విషయం తెలిసి చంపేస్తానంటూ దాని మీద చెయ్యెత్తారు. నేను అడ్డుకున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ రోజే ఆయన చేతుల్లో చచ్చిపోయేదేమో! అందుకని అభిమానం వచ్చి ఆత్మహత్య చేసుకుందుకు ప్రయత్నించింది. నిజంగా ఆలోచిస్తే ఇప్పుడు మాకు అంతకన్నా గత్యంతరం లేదనిపిస్తోంది. ఈ విషయం అందరికీ త్వరలోనే తెలిసిపోతుంది. అపుడు మా గతేంటి? రేప్పొద్దున్న ఇలా జరిగిన పిల్లను ఎవడు పెళ్ళి చేసుకుంటాడు. మాకంతా అగమ్యగోచరంగా ఉంది. వీళ్ల నాన్నగారైతే జరిగిన దానికి ఏడవ లేక తనలో తను కుమిలిపోతున్నారు. పోనీ ఈ ఊర్నించి వెళ్ళిపోదామన్నా ఆయన ఉద్యోగంలో ట్రాన్స్‌ఫర్స్‌ లేవు. ఉద్యోగం వదులుకోలేరు. ఇది కాక మాకు ఇంకా ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళ భవిష్యత్తేమిటా అని బెంగగా ఉంది” అంది సుమ తల్లి.

”అవును నిజమే పరువు పోతుంది. కానీ పరువు కన్నా ప్రాణం ముఖ్యం కదా! టెక్నాలజీని కనిపెట్టడానికి ఉపయోగపడ్డ మేధస్సు దాని నుంచి వచ్చే నష్టాలను ఎదుర్కొని వాటికి పరిష్కా రాలు కూడా కనిపెట్టగలదు కదండీ. ఇంత కష్టపడీ కన్న పిల్లల్ని చంపుకోలేము కదా!

మన పిల్లలకి మనమే అండగా నిలబడాలి. తప్పు చెయ్యకుండా చూసుకోవాలి. ఒకవేళ తప్పుచేస్తే ఆ తప్పును సరిదిద్దుకోవడానికి సహాయం చెయ్యాలి. ఆడది శీలం కోల్పోయి నంత మాత్రాన బతకలేదనుకోవడం చాలా తప్పు. ఆ తప్పు చేసి ఆడపిల్లను హింసించిన మగవాడికి తలెత్తుకుని బతికే హక్కు ఉన్నప్పుడు ఆడదానికెందుకు లేదు? మన పిల్లల్ని మనం తిట్టి కొట్టినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. ఈ పని చేసిన ఆ త్రాష్టుడికి తగిన శిక్షపడేటట్లు చెయ్యాలి.

స్రవంతి, సుమా నా మాట వినండి. ఏ టెక్నాలజీని

ఉపయోగించి వాడు మిమ్మల్ని నాశనం చెయ్యాలనుకున్నాడో అదే టెక్నాలజీతో వాడ్ని మీరు చిత్తుగా ఓడించాలి. వాడు తీసే వీడియోలో వాడి మొహం కనబడకుండా చేస్తున్నాడని చెప్పింది స్రవంతి. ఇప్పుడు మీరిద్దరూ కలిసి వాడి ట్రిక్‌ వాడి మీద ప్లే చెయ్యండి. మెల్లిగా వాడి లాప్‌టాప్‌ దొంగిలించి నా దగ్గరకు తీసుకురండి. ఈ లోపల నేను సైబర్‌ క్రైమ్‌ వాళ్ళను కాంటాక్ట్‌ చేస్తాను. వీడి సంగతి వాళ్ళు చూసుకుంటారు.

మీ వీడియోలు చూసిన జనం కన్నా చూడని జనం ఎక్కువ. కోట్లజనాభాలో ఒక శాతం కూడా ఇవి చూసి ఉండరు. ఇక మీదట వొళ్ళు దగ్గర పెట్టుకుని మసలండి. నేను మీతో

ఉన్నాను. వాడికి గుణపాఠం చెప్పాలి. ప్రతీ తల్లీ ఆడపిల్లకు ఆంక్షలు పెట్టాలని చూస్తుంది కానీ మగపిల్లవాడి పెంపకంలో జాగరూకత ఎందుకు వహించదో నాకిప్పటికీ అర్థం కాదు. వాడేం మగపిల్లవాడు ఎలాగైనా బతికేస్తాడన్న భావం ప్రతీ తల్లిలో పోయి, సంఘానికి చెడు చెయ్యని పౌరుడిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించిన నాడు ఇలాంటి అరాచకాలకు తెరపడుతుందని నా నమ్మకం.

అనంత మాటలతో అందరి మొహాల్లో ఒక విధమైన నిశ్చింత తొంగి చూసింది. సుమ తల్లికి ఈ టెక్నాలజీ గురించి పెద్దగా తెలియదు. పిల్లలు సరిగా చెయ్యగలరా లేదా! అన్న అనుమానం. అయినా తన పిల్ల కూడా ఉంది కాబట్టి ఆవిడ సరైన చర్య తీసుకుంటుందన్న నమ్మకం కలిగింది. ఇవన్నీ తెలిస్తే భర్త ఏమంటాడో అన్న భయం. కానీ తనకు వేరే గత్యంతరం లేదు. కారణం ఆమె తల్లి మనసు కూతుర్ని పోగొట్టుకునేందుకు సిద్ధంగా లేదు.

”ఏమంటారు పిల్లలూ నేను చెప్పినది చెయ్యగలరా! మీరు హద్దులు దాటకుండా వాడ్ని వాడుకోండి. టిట్‌ ఫర్‌ టాట్‌ లా చెయ్యాలి. వాడి లాప్‌టాప్‌ తెచ్చి నాకియ్యండి. ఆ తరువాతి సంగతి నేను చూసుకుంటాను. ఇంక నేను వెళ్ళనా సుమా! ఈ జీవితాన్ని నువ్వు ప్రేమించమ్మా. ఇంక వెడదామా!” అంది కూతురితో.

”అలాగే అమ్మా” అంటూ లేచి తల్లిని అనుసరించింది. ఇంటికి చేరేదాకా ఆగి ఇంటికి వచ్చాక తల్లిని కౌగిలించుకుని ”అందరి కన్నా మా అమ్మ బెస్ట్‌ అమ్మ” అంది స్రవంతి.

”కాదమ్మా నేనెక్కడో తప్పు చేసాను. నేను సరిగా ఉంటే నువ్వు ఈ తప్పుచేసి ఉండేదానివి కావేమో!” అంది.

”లేదమ్మా నీ తప్పేం లేదు. మీరు ఇస్తున్న స్వేచ్ఛను మేమే దుర్వినియోగం చేస్తున్నాము. ఎంతసేపూ అమ్మలు ఆంక్షలు పెడుతున్నారనుకోకుండా ఎందుకు పెడుతున్నారన్నది ఆలోచిస్తే ఇలాంటి తప్పులు జరగవు” అంది స్రవంతి.

ముక్తాయింపు : స్రవంతి, సుమ కలిసి అనంత చెప్పినట్లుగా టెక్నాలజీని తమకు తగ్గట్లుగా వాడుకుని అతన్ని బెదిరించి ఆ పైన సైబర్‌ క్రైమ్‌ వాళ్ళకు అప్పగించారు. పోలీసులు అతను వాడిన వెబ్‌సైట్‌ వాళ్ళను పట్టుకుని ఇలాంటి ఫిల్మ్‌ తయారుచేస్తున్న ఇంకా కొంతమందిని పట్టుకోగలిగారు. ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావంటే ఈజీ మనీ అన్న సమాధానం. ఒక్కో వీడియోకి వచ్చే డబ్బు జల్సాకి పనికి వస్తోంది. ఈ జల్సాలు అవసరమా?

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

One Response to సమస్య – పరిష్కారం (కథల పోటీకి వచ్చిన వాటిల్లోంచి సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ) – గంటి సుజల

  1. ఆర్.దమయంతి. says:

    సమస్యని చాలా చక్కగా కాచ్ చేసారు అక్కా.
    నేటి తరం ఆడపిల్లలు ఎదుర్కొంటున్న పెద్ద విషమ సమస్యకి – అద్దం పట్టారు మీ కథ ద్వారా.
    ఈ విషమ పరిస్థితి నించి బయటపడాలంటే.. మీరు సూచించిన మార్గమొకటే శరణ్యం.
    ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో