భూమిక ఎడిటర్‌కి,
ఈ నెల మ్యాగజైన్‌లోని సంపాదకీయం ”బహిష్టు అపవిత్రమైతే మరి నీ పుట్టుక…??, అందరినీ ఆలోచింపచేసేలా ఉంది. పత్రికలోని మిగతా అంశాలు కూడా బహుష్టు గురించి, ఆ సమయంలో పాటించవలసిన పరిశుభ్రత గురించి స్త్రీలందరికి అవగాహన కలిగించేలా ఉంది. మీకందరికి నా ధన్యవాదాలు.
– మాధవి వాల్మీకం, హైదరాబాద్.
……..ఙ……..
ప్రియమైన సంపాదకులకు సమస్కారం,
భూమిక పత్రిక ప్రతి సంచిక ఎంతో ఇన్ఫ్‌ర్‌మేటివ్‌గా ఉంటోంది. మార్చినెల చట్టాలపై తెచ్చిన ప్రత్యేక సంచిక, మే నెల బహిష్టు పరిశుభ్రతపై వచ్చిన సంచిక మరింత స్ఫూర్తివంతంగా ఉన్నాయి. ఈ సమాచారం స్త్రీలందరికి, బాలికలకు కూడ చాలా ఉపయోగకరంగా ఉంది. నా ఉద్దేశంలో బహిష్టు శుబ్రధతపై పూర్తి సమాచారంతో వచ్చిన గత నెల భూమికను ఆడపిల్లలు చదువుకునే ప్రతి హైస్కూల్‌కి, కస్తూర్బా పాఠశాలలకు, సొషల్ వెల్పేర్, ట్రైబర్ వెల్ఫేర్ హాస్టళ్ళకు పంచడం వలన వందల కొద్ది యుక్త వయస్సు బాలికలకు ఎంతోమేలు చేసినట్లు అవుతుంది. ఈ రకంగా చేస్తారని ఆశిస్తున్నాను. ఇటువంటి మరిన్ని సంచికల కోసం ఎదురుచూస్తూ….
– సురేఖ, హైద్రాబాద్
……..ఙ……..
డియర్ ఎడిటర్,
భూమిక, మే నెల సంచికలో మెన్ట్స్రువల్ హైజీన్‌పై విలువైన సమాచారాన్ని అందించారు. ఈ సమాచారమంతా స్కూళ్ళలో హాస్టళ్ళలో చదువుకుంటున్న ఆడాలసెంట్ బాలికలందరికి చేరవేయడానికి భూమిక ఈ నెల సంచిక సరిపోతుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వారి ద్వారా ఆడపిల్లలందరికి ఈ పుస్తకం అందేలా చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇటువంటి స్ఫూర్తిదాయకమైన సమాచారాన్ని అందిస్తున్న భూమికకు ధన్యవాదాలు
– సత్యవాణి, సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లా
……..ఙ……..
భూమిక సంపాదకులిద్దరికీ సమస్కారం,
భూమిక ప్రతి నెల కొత్త, కొత్త సమాచారంతో మా ముందుకు రావడం ఎంతో సంతోషంగా వుంది. ముఖ్యంగా మే నెల సంచికలో అందించిన సమాచారం ప్రతి ఆడపిల్లకి తెలియాల్సిన కనీస సమాచారం. ఇది చదువుతుంటే నా అనుభవాలెన్నో గుర్తొచ్చాయి. నాలా ఎంతో మందికి ఇలాగే గుర్తొచ్చుంటాయి. ఇలాంటి విలువైన సమాచారాన్ని, ‘షి కప్స్’ లాంటి కొత్త సమాచారాన్ని అందిస్తున్న భూమికకు కృతజ్ఞతలు.
– ప్రవీణ రావులపల్లి, న్యూఢిల్లి.
……..ఙ……..
”పాపిలాన్” – హెన్రీ చార్రియల్ – ఉమా నూతక్కిగారు మొత్తం కథనంతా ఇంత అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. ఈనాటికీ పెద్ద మార్పేమీ లేదు. మనిషిని మనిషిగా బ్రతకనివ్వని సమాజంలోనే బ్రతుకుతున్నాము.
– నిత్య.వి, ఇమెయిల్
……..ఙ……..