నా జ్ఞాపకాలు
ఈ రోజు మా టీచర్ నన్ను మెచ్చుకున్నారు. ఎందుకంటే ఒకసారి ఆమధ్య టి.వి.లో సీరియల్స్ చూడడం మంచి అలవాటు కాదని దానిని మానాలని చెప్పారు. అప్పటి నుంచి నేను టి.వి. సీరియల్స్ చూడడం మానేశానని చెప్పగా టీచర్ అభినందించారు. టీచర్ సూచనతో తరగతిలోని పిల్లలందరూ హర్షధ్వానాలు చేశారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది.
– కె. కుసుమ, 5వ తరగతి
రాత్రి నాకు ఒక అందమైన కల వచ్చింది. నేనొక గులాబీ తోటలో ఉన్నట్టు, ఆ తోట చిరు చిరు నవ్వులతో నన్ను పలకరించినట్టు, అందులో ఒక గులాబీ ముసి ముసి నవ్వులు నవ్వుతున్నట్లు, నేను సంతోషంగా ఆ గులాబీని కోయబోగా, తోటలోని గులాబీలన్ని వద్దు వద్దు, కోయొద్దు అన్నట్టు, నేను వెంటనే కోయడం ఆపేసినట్టు, కల వచ్చింది. తోటనిండా విరబూసిన గులాబీలు ఎంత ఆనందాన్ని కలిగించాయో! ఆ కల నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.
– టి. మురళీకృష్ణ, 5వ తరగతి