ఒక రోజు మేము ఊరికి వెళ్ళడానికి రైలు ఎక్కాము. నాకు రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టం. దూరంగా కాలువలో చేపలు పట్టడానికి వల వేశారు. అందులో చాలా చేపపిల్లలు వచ్చాయి. నాకు చాలా ఆనందం కలిగింది. రైలు అంటే నాకు చాలా ప్రేమ. తర్వాత నదిలో నేను చిల్లర వేశాను. నేను డాక్టర్ అవ్వాలని ఆ నదికి నమస్కరించాను.
ఒక ఊరిలో రైలు ఆగిపోయింది. ప్లాట్ఫారం మీద ప్రక్కన పూల చెట్లు ఉన్నాయి. అక్కడ కోతులు చాలా ఉన్నాయి. వాటిని చూడగానే నాకు భయం వేసింది. రైలు కదులుతూండగా నేను కోతులకు బై చెప్పాను.