మల్లన్నసాగర్ వద్దు మా ఊరే ముద్దంటు
కంటికి, మంటికి ఏడుస్తూ వచ్చే కష్టాన్ని ఆపమంటు
వరదగూడు లెక్క వచ్చిపోతున్న వారందరు
భరోసా యిస్తున్నా, భయం పోత లేదాయె
కష్టాలను తీర్చే సర్కారే నష్టాలను భరించమంటు
అభివృద్ధి పేరుతో ప్రజలను ఆగం చేస్తున్నారు
నమ్ముకొన్న నేలతల్లిని నట్టేట ముంచడానికి
పునరావాసం కల్పిస్తామంటు నమ్మబలికినా
మాకంటె ముందు భూములిచ్చిన వారి
బతుకులన్ని కథలు, కథలుగా వింటున్నం
పుట్టిన గడ్డను వదలి పుట్టెడు దు:ఖంతో
చెట్టుకొక్కరం, పుట్టకొక్కరమైతే ఎలా అంటు
కకావికలమైన మనసులతో ‘కాలున్నే’ రమ్మని పిలుస్తూ
కాటికి వెళ్ళే వాళ్ళను చూస్తే
కరగని బండ రాళ్ళే కరిగిపోతున్నాయి
మాపై కన్నేసిన సర్కారు కరుణతో ఆలోచించి
జన జీవనోపాధినొదిలి
పక్కనుండి వెళ్ళమంటు
అభివృద్ధికి ఆటంకమే లేదంటు
ముంపు గ్రామాల ప్రజల
కన్నీటి వేడుకోలు