స్వతంత్ర భారతదేశం స్త్రీలకు గుప్పెడు ధూళినే మిగిల్చిందా!! – డా. బి.విజయభారతి, డా. బి.మహిత

”బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర సంగ్రామంలో భారత మహిళలు పురుషులతో సమానంగా పాల్గొన్నారు. ఇంటినుండి బయటికి రానివారంతా వీథులలోకి వచ్చి ఉద్యమాలు నడిపారు. పోరాటాలు చేశారు. లాఠీ దెబ్బలు తిన్నారు. జైళ్ళకు వెళ్ళారు. అనేక అవమానాలు, అకృత్యాలు సహించారు. ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో తమ సోదరులు తమకు సమాన హక్కులు నిరాకరించటం చూస్తే ఇంత ప్రయత్నంతో సాధించుకున్న స్వాతంత్య్రం మహిళలకు గుప్పెడు ధూళినే మిగిల్చిందా” అనిపిస్తోంది. ఈ మాటలు అన్నవారు నేటి స్త్రీ వాదులు కాదు, కుమారి పద్మజా నాయుడు. సందర్భం 1951సెప్టెంబర్‌ 20వ తేదీన హిందూకోడ్‌ బిల్లుపై రాజ్యాంగ పరిషత్తులో జరిగిన చర్చ.

కుమారి పద్మజా నాయుడు సరోజినీ నాయుడు కూతురుగానే మనకు తెలుసు. ఆమె స్త్రీల గురించి ఎంత ఆలోచించే వారో, ఎంత ఆవేశపడేవారో ఆనాడు ఆ సభలో ఆమె మాటలన బట్టి తెలుసుకోవచ్చు. ఆమె మాటల్లో – ”….Iట ్‌శీసaవ ్‌ష్ట్రవరవ ్‌ష్ట్రశీబఝఅసర శీట నఱఅసబ షశీఎవఅ షష్ట్రశీ టశీబస్త్రష్ట్ర్‌ టశీతీ ్‌ష్ట్రవ ఱఅసవజూవసవఅషవ శీట Iఅసఱa aతీవ ్‌శీ పవ సవఅఱవస ్‌ష్ట్రవఱతీ యబర్‌ తీఱస్త్రష్ట్ర్‌ర ్‌ష్ట్రవఱతీ శీషఅ ష్ట్రaతీస వaఅవస టతీవవసశీఅ ఱర అశీ ఎశీతీవ ్‌ష్ట్రaఅ a ష్ట్రaఅసటబశ్రీ శీట సబర్‌కు.

1949లో రాజ్యాంగ పరిషత్తులో హిందూకోడ్‌ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దేశంలో తీవ్రమైన సంచలనం వచ్చింది. ఆ బిల్లు కాంగెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశంలో అప్పుడు కాంగ్రెస్‌ బలమైన పార్టీగా ఉంది. పరిషత్తులో కాంగ్రెస్‌కు మెజారిటీ ఉంది. అయినా ఆ బిల్లు ఆమోదం పొందలేదు. ఆ బిల్లు హిందువులకు మరీ వ్యతిరేకంగా లేదు. తండ్రి ఆస్తిలో కుమార్తెకు హక్కు, దత్తత విషయంలో స్త్రీలకు కొన్ని హక్కులు లాంటి చిన్న చిన్న అంశాల్లో కొన్ని సవరణలు చేసి అప్పటి న్యాయ శాఖా మాత్యులు డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ ఈ బిల్లును సభ ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. ఆ బిల్లు సాంప్రదాయాలు తెలిసిన న్యాయ నిపుణులు రూపొందించినదే. రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక హక్కులు అమలులోకి రావడానికి అవసరమైన మార్పులే దీనిలో ఉన్నాయి. ప్రధాన మంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రు దీన్ని ఎలాగైనా ఆమోదింపచేయాలనుకున్నారు. అయినా ఆ బిల్లుకు తీవ్ర ప్రతిఘటన వచ్చింది. ఆ సభలో శ్రీమతి దుర్గాబాయ్‌, శ్రీమతి రేణుకా రే, సుచేతా కృపలానీ, భారతీదేవి రంగా వంటి విదుషీమణులెందరో ఉన్నారు. వారంతా తమ హక్కుల కోసం బిల్లుకు మద్దతును కూడగట్టారు. బిల్లును అడ్డుకున్న వారందరికీ తగిన సమాధానాలు చెబుతూనే వాచ్చారు. అప్పటికి సభలో ఉన్న సభ్యులంతా ఆదర్శాలు వల్లించేవారే కానీ స్త్రీలకు పురుషులతో సమాన హోదా ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికీ అదే పరిస్థితి. 65 సంవత్సరాలుగా ఇది కొనసాగుతూనే ఉంది. స్త్రీలపై వివక్ష, అత్యాచారాలు అప్పటికంటే ఎక్కువయ్యాయి. అప్పటి అసమానతకూ, హింసకూ – ఇప్పటి అసమానతకూ, హింసకూ రూపభేదం ఉంది. అవి ఎంత చెప్పుకున్నా తరగనివి.

హిందూకోడ్‌ బిల్లును ప్రవేశపెట్టినందుకు రాజ్యాంగ పరిషత్తులోని మహిళా సభ్యులందరూ డా.అంబేద్కర్‌ని అభినందిస్తూ మాట్లాడారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందినా పొందకపోయినా దేశంలో అన్ని వర్గాల ప్రజలకూ సుఖ సంతోషాలను, సమ న్యాయాన్ని అందించాలనే ప్రయత్నం చేసిన సామాజిక సంస్కర్తలను ప్రశంసించారు. ఆ నాటి అసెంబ్లీలో బిల్లును వ్యతిరేకించిన వారిలో కాంగ్రెస్‌ నాయకులు చాలామంది ఉన్నారు. కానీ వారు బాహాటంగా ఆ విషయాన్ని చెప్పలేదు. కానీ బిల్లును పరోక్షంగా వ్యతిరేకించారు. ప్రసంగాలూ ఎక్కువగా చేయలేదు. ప్రసంగాలు చేస్తూ మాటిమాటికీ బిల్లును అడ్డుకున్న వారిలో శ్రీ నజీరుద్దీన్‌ అహ్మద్‌, శ్రీ శ్యామనందన్‌ సహాయ, శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ, పండిత లక్ష్మీకాంత మైత్రా తదితరులు ముఖ్యులు. వీరు స్మృతుల నుండి సంస్కృత శ్లోకాలు ఉదహరిస్తూ ప్రాచీన సంస్కృతిని కాపాడే బాధ్యత తమమీదే ఉన్నట్లు సుదీర్ఘంగా మాట్లాడుతూ బిల్లుపై చర్చ కొనసాగకుండా కాలయాపన చేస్తుండేవారు. వారి ప్రసంగాలను తిప్పికొడుతూ పద్మజా నాయుడు చేసిన ప్రసంగ పాఠంలోని కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

”…ఈ రోజు ఒక మహిళగా గానీ, ఒక హిందువుగా గానీ నేను ఈ బిల్లును సమర్థించడంలేదు. ఒక భారతీయురాలిగా నేను మాట్లాడుతున్నాను. శతాబ్దాలుగా నిరాదరణకు గురైన వర్గాలకు కుల, మత, లింగ వివక్షలకు అతీతంగా చట్టబద్ధంగా హక్కులు కలిగించే ఈ చర్య భారత రాజ్యాంగానికి అనువుగా ఉంది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ను నేను అభినంది స్తున్నాను” అన్నారు. ఆమె ఇంకా ఇలా అన్నారు.

”డా.శ్యాంప్రసాద్‌ ముఖర్జీ మూడు రోజుల క్రిందట ఈ సభలో మాట్లాడుతూ హిందూ మత బోధనలలోని చిరంతనమైన విజ్ఞతనూ, సౌందర్యాన్నీ హృదయాలకు హత్తుకునేటట్లుగా చెప్పారు. దానిలోని సారళ్యాన్ని చెబుతూ హిందూ తాత్వితక; శతాబ్దాలుగా అలలు అలలుగా వచ్చి పడుతున్న విదేశీ దండయాత్రలకు లోనవుతూ అత్యంత జఠిలమైన ఆర్థిక, రాజకీయ, మత సంబంధమైన ఒత్తిడులను తట్టుకుంటూ నిలిచి ఉన్నదంటే దాని స్వభావాన్ని వర్ణించటానికి ఆయన ‘అనుకూలానుసరణం’ అనే మాట వాడారను కుంటాను.” అన్నారు.

సమాజంలోని దిగువ వర్గాలకు న్యాయం చేకూర్చాలనే ఆలోచనతో తెచ్చే సామాజిక శాసనాలు అవిభాజ్యమైన, మహోన్నతమైన భావనలపై ఆధారపడి ఉన్న సనాతన కులాన్ని ఎంత మాత్రం దెబ్బతీయలేవు. అయినా ఆ బిల్లు వల్ల హిందూ మతానికి గొప్ప విపత్తు

వాటిల్లుతుందనడం ఆశ్చర్యకరం… సభలోని ఒక గౌరవ సభ్యుడు ఈ బిల్లును హిందూ మతంపై జరుగుతున్న దాడిగా పేర్కొన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ”పోరాడాలి… పోరాడాలి… పోరాడాలి…” అంటూ నినాదం ఇచ్చారు. తనను హిందువుగా చెప్పుకోవడానికి గర్వపడే ఒక వ్యక్తి ఆ మతాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని అగౌరవపరుస్తూ ఇలా మాట్లాడడం సమర్ధనీయం కాదు. ఈ మతం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది… నేటికీ మహోన్నతంగా నిలిచి ఉంది” అన్నారు ఆమె.

ఇంకా, ”ఈ బిల్లుకు వ్యతిరేకంగా వస్తున్న మరో తీవ్రమైన ఆరోపణ ఏమిటంటే విడాకుల నిబంధనలను శాసనబద్ధం చేయటం ద్వారా అనైతికతకు విస్తృతంగా వరదగేటు తెరిచినట్లవుతుందని, అయితే పురాతన కాలంలో కూడా విడాకుల కోసం నిబంధనలున్నాయని, సభలో మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఒకరి తర్వాత ఒకరు నిష్కర్షగా చెబుతూ వచ్చారు. ఈ దేశంలోని హిందువులకు ఎప్పుడూ 75 శాతం కంటే ఎక్కువమందికి విడాకులు సులభమైనవిగా, ప్రయోజనకరంగా మామూలుగా లభించేవి. విడుకుల వ్యవస్థ సమర్ధంగా పనిచేసేదని చాలా మందికి తెలుసు. ఈ వాదనలో నిజమైన ప్రామాణికత లోపిం చిందనే తెలుస్తోంది. ఇది కేవల పాశ్చాత్య పద్ధతులకు లోనవుతున్న పడమటి దేశాల అనుకరణగా వస్తున్న భావ సంచలనం మాత్రమే” అన్నారు.

”ఇతర దేశాల్లో నైతికత, ఇతర జాతుల ప్రవర్తనల గురించి విమర్శలు చేయడం ఈ దేశంలో జరుగుతున్న మానసిక కుంగుబాటు (ూూణ – ూశీర్‌ ర్‌తీశీసవ సవజూతీవరరఱశీఅ) ధోరణి అని చెప్పడానికి విచారిస్తున్నాను. ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ కనిపించే మనో దౌర్భల్యాల మీద తగినంత పరిజ్ఞానం లేకుండానే ఇటువంటి వ్యాఖ్యానాలు వెలువడుతూ ఉంటాయి. ఇవి సంచలనం కోసమే. ఎవరో కొంతమంది మానసిక వికలాంగుల, ఉన్మాదుల ఇటువంటి చర్యలు విలువలు క్షీణించిన దశలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి పెద్ద నగరంలోను కనిపిస్తాయి.”

”ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా పశ్చిమ దేశాల్లోని మనస్తత్వ నిపుణులను కలవరపెడుతున్న ఈ తీవ్రమైన సమస్య గురించి డా.ముఖర్జీ సరిగ్గానే మనల్ని హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న మానసిక అశాంతి విడాకులకు దారితీస్తుందనడంలో సందేహం లేదు. నేను గౌరవపూర్వకంగా ముఖర్జీ గారి దృష్టికి తెచ్చేదేమిటంటే ఆయన ఈ సమస్యను జాగ్రత్తగా పరిశీలించి విశ్లేషిస్తే మనోవైకల్యం అనేది ఫలితం కాదనీ అది మూలకారణం అనీ తెలుస్తోంది. గత రెండు ప్రపంచ యుద్ధాల తాకిడితో సమతౌల్యం కోల్పోయిన ప్రజా జీవితం తీవ్రమైన సంక్షోభానికి గురయింది. ఆ ఉద్రిక్తతలు – ఆర్థిక మాంద్యం – అభద్రతా భావం.. ఇవన్నీ మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తూ శారీరక, మానసిక వైకల్యాలకు కారణభూతమవుతున్నాయి. ఈ కారణంగా సమాజమూ, కుటుంబమూ ఒక భావోద్వేగ అస్థిరతతో అనివార్యంగా వ్యాథిగ్రస్తమవుతున్నాయి.”

”కొన్ని దేశాలలో ఎటువంటి అసాధారణ పరిస్థితులున్న ప్పటికీ భిన్న జాతుల తీరుతెన్నులలో నైతికత బాహ్యంగా ఎలా ఉన్నప్పటికీ మౌలికంగా మానవజాతి ఎక్కడైనా ఒకటే. ఈనాటికీ ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ కుటుంబం అనేది ఒక యూనిట్‌గా ఉంది. ఇదే సమాజానికి మూలస్తంభంగా ఉంది. సాధారణంగా సమతౌల్యంగల స్త్రీ, పురుషులు మానవ సంబంధాలలో ఒక స్థాయి గంభీరతకూ విలువనిస్తూ ఉంటారు. విడిపోవడాన్ని, వివాహ విచ్ఛిన్నతనూ అంత తేలికగా తీసుకోరు. అనివార్య పరిస్థితులలో సహనం హద్దులు దాటినప్పుడు అంతిమ పరిష్కారంగా మాత్రమే విడాకులను ఆశ్రయిస్తారు. పురుషుల విషయంలో ఇది నిజమైనప్పుడు స్త్రీల విషయంలో ఇది వందరెట్లు వాస్తవం అవుతుంది. ఎందుకంటే అస్థిరంగా మారిపోతూ ఉన్న ఈ యుద్ధాలతోనూ, విప్లవాలతోనూ, కరువు కాటకాలతోనూ మానవుల జీవన యానంలో నైతిక విలువలు రెపరెపలాడుతూ అంతర్ధానమవుతున్న ఈ దశలో జాతీయ, అంతర్జాతీయ నైతికతా ప్రమాణాలు ఊగిసలాడుతున్న దశలో ఇంకా ఒకే ఒకటి మార్పు లేకుండా ఈనాటికీ మారకుండా ఉంది. అదే సృష్టి అవతరణం, కాల పరిణామం, దాని అంతర్థానమూను. ఇది స్త్రీల పరంగా జాగృతమ వుతూ కొనసాగుతూ ఉంది. నిరంతరా యంగా సృష్టిని కొనసాగించే మహత్తరమైన అప్రతిమానమైన, పవిత్రమైన బాధ్యతను స్త్రీలు నిర్వర్తిస్తూ సంరక్షిస్తూ కాపాడుకుంటూ వస్తున్నారు. పరమ పవిత్రమైన జీవమనే వెలుగు ఇంత సమర్థంగా, ఆనంద స్వరూపంగా, పరిమళ శోభితంగా ఉన్నతమైన ఆదర్శాలతో కొనసాగుతూ ఉండటం మరే దేశంలోనూ కనిపించదు. పురాతన సంస్కృతీ సాహిత్యమూ తీర్చిదిద్దిన ప్రతీకలుగా మన స్త్రీలున్నారు. సంపదవంతమైన సంస్కృతీ వైభవాన్ని అందిస్తున్న స్త్రీలపై మనం అనాదరణ చూపటం సముచితం కాదనే నేను భావిస్తున్నాను. వారి స్వాతంత్య్ర కాంక్షను మనం గౌరవంతో చూడాలి. వారి గురించి తేలికగా మాట్లాడటం తగదు. అది మన జాతి మతాలను అర్థం చేసుకోకపోవటమే అవుతుంది.”

”విదేశాల చూపులన్నీ మనమీదే ఉన్నాయి కనుక ఈ బిల్లును ఆమోదించాలనటం సరికాదని, ఆ ప్రాతిపదికన దీనిని చూడకూడదనీ కొందరు గౌరవ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. నేను వారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇతర దేశాల పేరు ప్రతిష్ఠలను మనం ఎంత గౌరవించినా వారి ప్రమాణాలకు అనుగుణంగా మన జీవితాలనూ, మన శాసనాలనూ మార్చుకోరాదు. వీటన్నింటినీ మించి ఈ బిల్లు ఆమోదించాలనడానికి మరో కారణం ఉంది. అది దేశ సమైక్యత, ఆత్మగౌరవం. రాజ్యాంగం రూపొందించిన నిపుణులైన సభ్యులు ఈ సభలో ఉన్నారు. తాము ప్రతిజ్ఞ తీసుకున్న రాజ్యాంగంలో పొందుపరచిన ఆశయాలను కొనసాగించే పథకాలతో ముందుకు వెళ్ళవలసిన బాధ్యత వారిపై ఉంది. రాజ్యాంగం ఆధారంగా ఉన్న ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉండడమా లేదా అనే ప్రశ్నమీదనే ఈ బిల్లును ఆమోదించటమా లేదా అనేది ఆధారపడి ఉంది” అంటూ పద్మజానాయుడు తార్కికమైన ప్రసంగం చేశారు.

సమాజం ఈనాడు కూడా ఏ తర్కానికీ కట్టుబడటం లేదు. మానవతా ధర్మాలు అప్పటికంటే నశించి పోయాయనే చెప్పాలి.

ఉన్న ధూళినంతా సమాజం స్త్రీల కళ్ళల్లోనే కొడుతూ ఉంది.

కుమారి పద్మజా నాయుడు 1900 మే రెండవ తేదీన జన్మించారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్రోద్య మంలో తల్లిగారి బాటలో నడిచారు. ఆలిండియా రెడ్‌క్రాస్‌ బోర్డు, ఆలిండియా హ్యాండీ క్రాఫ్ట్స్‌ బోర్డులలో కీలక పాత్ర వహించారు. 1946లో ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్నారు. సామాజిక కార్యకలాపా లలో తీరిక లేకుండా ఉండేవారు. నెహ్రు కుటుంబంతో సన్నిహితంగా ఉండే అతి కొద్దిమందిలో వీరొకరు. ఆమె 1975లో కాలధర్మం చెందారు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో