వికృతం – డా|| పెళ్లకూరు జయప్రద సోమిరెడ

ఒకానొక కామ వికృతానికి

బలైన బాల్యం

తల్లిదండ్రుల సంఘభీతికి

పెళ్ళి పల్లకీ ఎక్కిన యవ్వనం

పెదాలమీద నక్షత్రాలు పూయిస్తూ

రోబోలాంటి భర్తతో కాపురం

ఎంత నైచ్యమైన బ్రతుకు నాది!

భయంకరమైన రహస్యాన్ని

కడుపులో దాచుకోలేక

దు:ఖాల అగ్ని

నన్ను కొలిమిలో కాల్చేస్తుంటే

పారిజాతాల్ని చూసి నన్ను నేను అసహ్యించుకుంటూ

ఈ వేదనల రహస్యపు బ్రతుకు తనకు అవసరమా?

ఈ దు:ఖపు పువ్వును అంతం చేస్తే…!

ఊహు..!

నేనెందుకు చావాలి? … పాపం ఎవరిది?

రేప్‌ చేసి తప్పు చేసిన వానిది కానీ నాది కాదు కదా!

ఎవరైనా ఏడవాల్సి వస్తే

అది నేను కాదు

నాలోని గిల్టీనెస్‌! అందుకే

దాన్ని

కిరసనాయిల్‌ పోసి కాల్చేసాను

ఆ అగ్నిలో నుండి

స్వచ్ఛమైన చిరునవ్వులా

మలినం అంటని జాజిమొగ్గలా

తిరిగి జన్మించాను

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.