ఆర్భాటం లేని ఆదర్శ వివాహాలను ఆదరించి అభినందించాలి – పసుపులేటి రమాదేవి

భారతదేశంలో పెళ్ళంటే ఆకాశమంత పందిళ్ళు, హంగులు, ఆర్భాటాలు, పంచభక్ష పరమాన్నాలు… జీవితంలో ఒక్కసారే కదా చేసుకునేది అంటూ విపరీతమైన ఖర్చులు. ఇక సంప్రదాయాల పేరుతో ఇచ్చిపుచ్చుకునేవి ఎన్నో! కానీ పెళ్ళంటే రెండు మనసులు ఒక్కటవ్వడం… కొన్ని వందల మనసులకు సంతోషాన్ని పంచడం అని నిరూపించింది నాగపూర్‌కి చెందిన ఈ జంట.

అభయ్‌ దివారే… ఇటీవలే ఇండియన్‌ రెవిన్యూ సర్వీస్‌ (ఐ.ఆర్‌.ఎస్‌.)కు ఎంపికయ్యారు. నాగపూర్‌కు చెందిన నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (ఎన్‌.ఎ.డి.టి.)లో ట్రెయినింగ్‌కు వెళ్ళనున్నారు. ప్రీతి కుంబారే… ఐడీబీఐ ముంబై బ్రాంచిలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఇద్దరూ యూపీఎస్‌సీ, ఎంపీఎస్‌సీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నపుడు పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఫీల్డ్‌ విజిట్‌లో ఉన్నప్పుడు ఆయనను కలిశారు అభయ్‌. ‘సామాజిక, ఆర్థిక మార్పు కోసం ఏజెంట్లుగా పనిచేయండి’ అన్న ఆయన పిలుపునందుకున్నారు.

పెళ్ళి ఖర్చుపై పరిశోధన

ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. అసలు పెళ్ళిళ్ళకు అవుతున్న ఖర్చుమీద పరిశోధన చేయాలనిపించి గణాంకాలు తీయడం మొదలుపెట్టారు. తీరా పూర్తయ్యాక చూసి అవాక్కయ్యారు. భారతదేశంలో ప్రతి ఏటా పెళ్ళిళ్ళ కోసం లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నారు. మన దేశ బడ్జెటే 16 లక్షల కోట్లు. ప్రజల జీవన విధానంలో చాలా తేడా ఉంది. అయినా పెళ్ళికి మాత్రం ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థాయిని బట్టి మూడు లక్షల నుంచి ఐదు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. దీంతో పేదరిక కుటుంబాలు అప్పుల బారిన పడుతున్నాయి. కేవలం పెళ్ళిళ్ళకోసమే ఆస్తులను అమ్మేసుకుంటున్నారు. విదర్భలాంటి చోట్ల రైతులు ఆత్మహత్యలకు పెళ్ళిళ్ళు కూడా కారణమవుతున్నాయి. పిల్లలకు ఘనంగా పెళ్ళి చేయాలన్న తపన వారిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. దానిలోంచి బయటపడలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

అభయ్‌, ప్రీతిల గ్రామాల్లో సైతం ఇది పెద్ద సమస్యగా ఉంది. అందుకే పెళ్ళి విధానంలో మార్పులు తీసుకురావాలని అనుకుంది ఈ జంట. అందుకు ఇరు కుటుంబాల పెద్దలూ సహకరించారు. అంతేకాదు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను శోధించే పనీ వారే చేశారు.

ఆదివారం అనగా 10-07-2016న ఇద్దరూ అమరావతిలోని అభియంత భవన్‌లో పెళ్ళి చేసుకున్నారు. ఆ పెళ్ళిలో భాజా భజంత్రీలు లేవు. హంగులు, ఆర్భాటాలు అసలే లేవు. చాలా సాదాసీదాగా ‘పే బ్యాక్‌ టు సొసైటీ’ అనే క్యాప్షన్‌తో అంబేద్కర్‌ సాక్షిగా ఒక్కటయ్యారు.

అయితే పెళ్ళికయ్యే ఆ ఖర్చునే మరో విధంగా ఉపయోగించాలనుకుంది ఈ జంట. ఆత్మహత్యలు చేసుకున్న పదిమంది రైతుల కుటుంబాలను ఎంచుకుని, ఒక్కొక్క కుటుంబానికి రూ.20 వేల చొప్పున విరాళంగా అందచేశారు. అంతేకాక రూ.25 వేల విలువ చేసే వివిధ పోటీ పరీక్షల పుస్తకాలను అమరావతిలోని ఐదు లైబ్రరీలకు ఇచ్చారు. అయితే ఈ డబ్బంతా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకోలేదు. వాళ్ళిద్దరూ కష్టపడి సంపాదించిన సొమ్మునే ఇలా వివిధ పనులకు ఉపయోగించారు. విందులో కూడా చపాతీ, అన్నం, పప్పు, కూరగాయలు మాత్రమే వడ్డించారు. పెళ్ళిలో ఎలాంటి సంప్రదాయాలను అనుసరించలేదు. సింపుల్‌గా స్టేజిపై రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. అనేకమంది సామాజిక ఉద్యమకారులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించడం ఈ పెళ్ళి ప్రత్యేకత.

”చదువుకున్న మాలాంటి యువత కూడా ఇలాంటి పనులు చేయకపోతే మా చదువుకు అర్థమే లేదు. దీన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోగలగాలి. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి” అని చెబుతున్న ఈ జంట నేటి యువతకు మార్గదర్శకం.

ఆంధ్ర కేడర్‌కు చెందిన విజయవాడ సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ డాక్టర్‌ సలోని సిదనా, మధ్యప్రదేశ్‌ కేడర్‌కు చెందిన ఆశిష్‌ వశిష్టల పెళ్ళి నవంబర్‌ 29, 2016న కేవలం రూ.500 ఖర్చుతోనే జరిగింది. వాళ్ళు ఆదర్శ వివాహం చేసుకోవడమే కాక సహోద్యోగులకు మిఠాయిలు పంచి అదే రిసెప్షన్‌ అనుకోమన్నారు. అట్టహాసంగా జరిగే పెళ్ళిళ్ళకు, కోట్లాది రూపాయలు దుబారా చేయడానికి తాము వ్యతిరేకమని ఈ జంట నిరూపించింది. అంతేకాక డాక్టర్‌ సలోని సిదనా పెళ్ళి చేసుకున్న 48 గంటల్లోనే విధుల్లో చేరారని కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఎ.బాబు చెప్పారు.

సమాజంలో మార్పు కోరుకునే ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆర్భాటాలు లేని ఆదర్శ వివాహాలు చేసుకున్న జంటలను ఆదరించి అభినందించాలి.

అలాగే మన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి వివాహాలు చేసుకున్న జంటలను ప్రత్యేకంగా అభినందించి, ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాలి.

అలాగే మీడియా కూడా ఇటువంటి ఆదర్శ వివాహాలను పదేపదే చూపించి, అలాంటి వారితో ప్రత్యేక ఇంటర్వ్యూలు తీసుకుని యువతను ఆలోచింపచేయగలగాలి. తద్వారా సమాజ మార్పునకు తోడ్పడగలగాలి.

ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు తర్వాత అధికారంలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు వారి కుమార్తెలు, కుమారుల వివాహాల సందర్భంగా దాదాపు రూ. 50 కోట్లకు పైగా ఖర్చు చేశారు. కానీ సామాన్యులు కేవలం రెండు లక్షల రూపాయలు లేక వివాహాలను వాయిదా వేసుకున్నారు. దీని మూలాలను అందరూ అర్థం చేసుకోగలగాలి.

అసలు వరకట్న నిషేధ చట్టం 1961లో వచ్చింది. ఆ తర్వాత 1968లో ప్రభుత్వం కొన్ని నియమాలను రూపొందించింది. ఈ చట్టం నియమాల ప్రకారం:

శ్రీ వరకట్నమనేది ఒక సామాజిక దురాచారమే కాకుండా నేరం కూడా.

శ్రీ దీని ప్రకారం కట్నం తీసుకోవడం, ఇవ్వడం కూడా నేరమే. అలాగే తీసుకోవడానికి ప్రోత్సహించడం కూడా నేరమే.

శ్రీ కట్నం కాకుండా లాంఛనాల పేరుతో జీవితాలను నాశనం చేసుకోకుండా వివాహ తంతుని నిరాడంబరంగా చేయాలని సూచించాయి. దాని ప్రకారం పెళ్ళి ఖర్చు రూ.15 వేలకు మించకూడదు.

శ్రీ 25 మందికంటే (11 మంది బ్యాండ్‌ వాళ్ళు, పిల్లలు మినహాయించి) ఎక్కువమంది ఊరేగింపులో పాల్గొనకూడదు.

శ్రీ పెళ్ళి కూతురికి, పెళ్ళి కొడుకుకి ఒక్కొక్కరికి 75 కి మించి బహుతులు ఇవ్వకూడదు. (బహుమతులు ఒక్కొక్కటి రూ.200కు మించరాదు)

శ్రీ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తాను కట్నం తీసుకోలేదని ఒక అఫిడవిట్‌ను సమర్పించాలి.

శ్రీ బహుమతుల వివరాలను ఇరువర్గాల వాళ్ళు సంతకాలు చేసి ఆ వివరాలను వరకట్న నిరోధ అధికారికి సమర్పించాలి.

శ్రీ వరకట్న నిషేధ అధికారిగా ఆర్డీఓను ప్రభుత్వం నియమించింది.

మరి చట్టంలో వున్న ఈ నియమాలను తుంగలో తొక్కి కోట్ల ఖర్చుతో పెళ్ళిళ్ళు చేస్తున్న ఈ రాజకీయ నాయకులను, ప్రముఖులను ఏమనాలి? ఈ రకంగా చట్టాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తున్న వారికి శిక్షలు లేవా?

అలాగే మన సెలబ్రిటీలు… వారి పెళ్ళిళ్ళు, వారి పిల్లల పెళ్ళిళ్ళకు మెహందీ, సంగీత్‌… ఇలా అనేక రకాల పేర్లు పెట్టి ఆర్భాటంగా చేస్తుంటే వాటిని మన మీడియా వాళ్ళు లైవ్‌లో చూపించి యువత ఆలోచనలను కలుషితం చేస్తుంటే వీటిమీద నియంత్రణ అవసరం లేదా?

Share
This entry was posted in ఆదర్శం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.