మై ఫ్యూడల్‌ లార్డ్‌ – పుస్తక పరిచయం

కె.హేమంత
మై ఫ్యూడల్‌ లార్డ్‌ పుస్తకం పాకిస్తాన్‌లో ఒక ధనిక, ఉన్నత కుటుంబంలో జన్మించిన నల్లపిల్ల అని తల్లి నిరాదరణకు గురై, ఒక భూస్వామిని ప్రేమించి రెండవ పెళ్ళి చేసుకుని ఎన్నో దారుణమైన అనుభవాలను చవిచూసిన ‘తెహమీనా దార్రాని’ ఆత్మకథ.
తెహమీనా బాల్యం అంతా తల్లి నిరంకుశ సంరక్షణలో గడిచింది. తల్లి సంకెళ్ళ నుండి విముక్తి పొందాలంటే వివాహమే మార్గమనుకుంది. తల్లికి ఇష్టం లేకున్నా ఒప్పించి తనంటే ఇష్టపడుతున్న అనీస్‌ను పెళ్ళాడింది. తరువాత ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. కానీ అనీస్‌తో వైవాహిక జీవితం నిరాసక్తంగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ప్రముఖ రాజకీయవేత్త, భుట్టో కుడిభుజం వంటి ముస్తఫాఖర్‌తో పరిచయం పెళ్ళికి దారితీస్తుంది. మొదటి భర్త కోరిక మేరకు కూతురు తాన్యాను అనీస్‌ వద్దే వదిలిపెడుతుంది.
ముస్తఫా నాలుగో భార్యగా జీవితం ప్రారంభమైన నాటి నుంచీ అతనిలోని మరో రూపం బయటపడుతుంది. తన భర్త గురించి ముస్తఫా మూడవ భార్య షెర్రీ, తెహమీనాకు చెప్పినప్పుడు పెళ్ళికి ముందు అవి నమ్మటానికి ఆమె మనసు తిరస్కరిస్తుంది. ఒక స్త్రీ ప్రేమలో పడినప్పుడు ప్రియుడి దోషాలను ఎన్ని విధాలుగా సమర్ధించగలదో తెహమీనా మాటల్లో తెలుసుకోవచ్చు. మొదటిసారి 5 నెలల గర్భవతిగా వున్నప్పుడు ఒకనాటి రాత్రి ముస్తఫా ఆమెను విచక్షణారహితంగా కొడతాడు. తరువాత ఆమె కాళ్ళపై పడి క్షమించమని ఏడుస్తాడు. అంత బాధలోన అతన్ని క్షమిస్తుంది. కొట్టిన ప్రతిసారీ ఇదే తంతు.
సంసార జీవితంలో పదే పదే మొదటి భర్తను గుర్తు చేస్త హింసించేవాడు. ఇక్కడ కూడా గమనిస్తే పురుషుని ద్వంద్వనీతి కనపడుతుంది. తనకు ఇంతకుముందు మూడుసార్లు వివాహమైనా, ఎన్ని వివాహేతర సంబంధాలున్నా తన భార్యకు మాత్రం ఆలోచనల్లో మరొకరి ప్రస్తావన రాకూడదు. రకరకాల శారీరక మానసిక హింసలకు గురైన ఆమె ఒక దశలో ”వేశ్యా వృత్తి చాలా కష్టతరమైనది అని నాకిప్పుడే తెలిసింది” అని రాసిందంటే ఆమె సంసార జీవితం ఎలా సాగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ముస్లింల ప్రకారం భర్తనుండి విడిపోతే పిల్లలపై సర్వహక్కులు తండ్రివే. తన నలుగురు పిల్లలకు దూరమవడం ఇష్టంలేక తండ్రి అనుచిత ఆగ్రహాలనుండి వారిని రక్షించటం కోసం ఎన్నో కష్టాలు, అవవనాలు భరించింది. ఒకసారి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. సహనం నశించిన ఒక రాత్రి భర్త మీద తిరగబడింది. అప్పుడే తన జీవితాన్ని మార్చుకునే ఆలోచనాక్రమంలో తొలి అడుగు వేసింది. మూడుసార్లు భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. పిల్లల్ని ఎరగా చేసి బెదిరించి, భయపెట్టి, ఆశ చూపి మళ్ళీ మళ్ళీ తన దగ్గరకు రప్పించుకుంటాడు.
రాజకీయల్లో తనకున్న ఆసక్తి, తెలివితేటలు భర్త కోసం ధారపోస్తుంది. తన అవసరానికి అనుగుణంగా వాడుకుని చివరకు ఆమె సొంత చెల్లెలితో వివాహేతర సంబంధం వెలగబెడతాడు. ఇది భరించలేక ఆఖరుసారి ఇల్లు విడిచివస్తుంది. కుటుంబ పరువు బజారు పాలౌతుందని, పరువుకే ప్రాముఖ్యతనిచ్చే తల్లి ఆమెకు ఎవరూ అండగా వుండరాదని శాసిస్తుంది. అయినా దృఢ సంకల్పంతో పోరాడి విడాకులే కాకుండా పిల్లలపై హక్కును కూడా పొందుతుంది. ఒక సందర్భంలో నా పేరు చెప్పుకు బ్రతకాల్సిందే తప్ప నీకేం మిగలదు అంటాడు ముస్తఫా, అప్పుడు ఆమె తన పేరు తిరిగి తెహమీనా దుర్రానిగా మార్చుకుంది.
తనలాంటి ఎంతోమంది స్త్రీలు ఇలాంటి కష్టాలను మౌనంగా భరిస్త పాకిస్తాన్‌లో వున్నారని గ్రహించి, వారి కోసం, తనలాగా మరొకరు వెసపోకుండా వుండటం కోసం ఈ పుస్తకరచనకు పూనుకుంది. ఈ పుస్తకం సృష్టించిన అలజడికి ఒకసారి ముస్తఫా ఫోన్‌ చేసినపుడు, ఇప్పుడు ప్రపంచం నిన్ను కేవలం తెహమీనా దుర్రానీ భర్తగా మాత్రమే గుర్తిస్తుంది” అని సమాధానమిస్తుంది.
నేటి సమాజంలో బలహీనతలుగా చెప్పబడే అంశాలు నాకు తెహమీనా బలాలుగా తోచాయి. మొదటి భర్త నుండి విడిపోయేటప్పుడు అతని కోసం తన తల్లి ప్రేమను చంపుకుని తన తొలిబిడ్డను త్యాగం చేస్తుంది. కాని సమాజం మాత్రం బిడ్డను కూడా వదిలి బరితెగించింది అంటుంది. అలాగే భర్త నుండి విడిపోయిన ప్రతిసారి ఏదో ఒక కారణంగా తిరిగి వెళ్తుంది. ఇది సమాజం ఆమెది నిలకడలేని మనస్తత్వంగా చస్తుంది. కాని ప్రతిసారి ఆమె తిరిగి వెళ్ళబోయేది పులి బోను అని తెలిసీ, భర్త ఎంత కిరాతకుడో, జీవితం ఎంత నరకప్రాయవె తెలిసి మరీ ప్రయత్నించటానికి వెనుకాడలేదు. అన్నిటి కంటే ముఖ్యంగా మతఛాందసవాదం, భూస్వాముల ఇష్టారాజ్యంగా, ప్రతి అడుగులోన మహిళలు అణచివేతకు గురయ్యే సమాజంలో తనను వెలివేస్తారని తెలిసి కూడా ఈ పుస్తక రచనకు పూనుకోవడం ఆమె మనోధైర్యానికి అద్దం పడుతుంది.
ముప్పై ఏళ్ళకే ఆత్మకథ రాయవలసి వచ్చిందంటే, దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆమె చిన్న జీవితంలో ఎన్ని బరువైన జ్ఞాపకాలను, చేదు అనుభవాలను మూటగట్టుకుందో. ఒక స్త్రీలో ఎంతటి సహనశక్తి, క్షమాగుణం ఉంటాయె తెలియజేయటానికి తెహమీనా జీవితం మంచి ఉదాహరణ. సమకాలీన రాజకీయ సంఘటనలతో ముడిపడిన తన జీవితానుభవాలను ఎంతో నిజాయితీగా రాసిన ఈ పుస్తకం ఎటువంటి హృదయన్నైనా కదిలించక మానదు.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.