టోల్ ఫ్రీ నెంబర్ : 1800-120-3244
తెలంగాణా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల వ్యవసాయదారుల కుటుంబాలలో తీవ్ర సంక్షోభం నెలకొని ఉన్న విషయం మనందరికీ తెలుసు. వ్యవసాయ రంగ సంక్షోభం కారణంగా మొత్తం తెలంగాణా రాష్ట్రంలో 2014, జూన్ 2 నుండీ 2017 మార్చి 23 వరకూ 2,740 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లాలో 118 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.
పంటల ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో పాటు, సంస్థాగత రుణాలు, పంటల బీమా, ఇతర సబ్సిడీలు వ్యవసాయదారు లందరికీ అందకపోవడం వల్ల వ్యవసాయ కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. వ్యవసాయ విస్తరణ సేవలు, వ్యవసాయ పరిశోధనా ఫలితాలు రైతులందరికీ చేరడం లేదు. గ్రామాలలో సంక్షోభంలో ఉన్న రైతు కుటుంబాలకు భరోసానిచ్చే వ్యవస్థలు కూడా తగ్గిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే నిస్సహాయ స్థితిలో రైతులు వ్యవసాయం వదిలిపెట్టి పోవడమో, బలవన్మరణాలకు పాల్పడడమో జరుగుతున్నది.
ఈ దుస్థితి పోవాలి. గ్రామీణ ప్రజలకు భరోసా కల్పించాలి. వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా అన్ని చర్యలూ చేపట్టాలి. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి.
ఈ లక్ష్యంతోనే వికారాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యగారు, జిల్లా వ్యవసాయ రంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని అన్ని మండలాల నుండి వచ్చిన వ్యవసాయదారులతో ఒక రోజంతా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రుణాలపై బ్యాంకు అధికారులతో చర్చించారు. రైతు బలవన్మరణాల బాధిత కుటుంబాల గురించి జిల్లాలోని అందరు ఎం.ఆర్.ఓ.లతో చర్చించి, నిర్దిష్ట ఆదేశాలు జారీ చేశారు.
జాతీయ ఉపాధి హామీ పథకం అమలు తీరు, కౌలు రైతులకు గుర్తింపు కార్డుల సమస్యలపై క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక శాఖ పథకాల వివరాలు రైతులకు అందుబాటులో ఉండేలా తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు.
్జ దీనికి కొనసాగింపుగా జిల్లా కలెక్టర్ మరియు సుస్థిర వ్యవసాయ కేంద్రం (సి.ఎస్.ఎ) ఆధ్వర్యంలో ‘రైతు మిత్ర’ పేరుతో ”ఫార్మర్స్
హెల్ప్‌లైన్” ఏప్రిల్ 2017 నుండీ ప్రారంభించాలని నిర్ణయించారు.
్జ ఈ హెల్ప్‌లైన్ కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. గ్రామస్తులు ఎవరైనా, ఏ నెట్‌వర్క్ ఫోన్ నుండైనా (ల్యాండ్ లైన్ మరియు
మొబైల్) ఉచితంగా ఫోన్ చేయవచ్చు. హెల్ప్‌లైన్ కార్యాలయంలో కూర్చునే వ్యక్తులు రైతులు చేసిన కాల్‌ను రిసీవ్ చేసుకుని,
వివరాలు తీసుకుంటారు. తిరిగి ఫోన్ చేసిన రైతులకు తెలుగులో మెసేజ్ వెళుతుంది. అంతే కాకుండా సంబంధిత సమస్యలపై
మండల స్థాయి అధికారికి కూడా ఈ మెసేజ్ వెళుతుంది. ఈ మెసేజ్ చూసిన అధికారులు, గ్రామం నుండి ఫోన్ చేసిన వ్యక్తితో
చర్చించి, సమస్యను పరిష్కరిస్తారు.
్జ ఇందుకోసం మండల స్థాయిలో, ఎం.ఆర్.ఓ., ఎం.పి.డి.ఓ, వ్యవసాయ అధికారి, ఎస్.ఐ., పౌర సమాజ ప్రతినిధి కమిటీగా
ఉంటారు. ఈ కమిటీ రెగ్యులర్‌గా సమావేశమై, తమ దృష్టికి వచ్చిన సమస్యలను చర్చిస్తుంది.
్జ ఈ మొత్తం పనిలో గ్రామీణ రైతులకు (వ్యవసాయ కూలీలు కూడా) సహకరించేందుకు వికారాబాద్ జిల్లాలోని 367 గ్రామాలలో,
గ్రామానికి ఇద్దరు చొప్పున మొత్తం 734 మంది కమ్యూనిటీ వర్కర్స్ (సామాజిక కార్యకర్తలు) ఉంటారు. ఈ కమ్యూనిటీ వర్కర్స్‌కు
కూడా, వ్యవసాయ రంగ సమస్యలపై, రైతులకు అండగా తాము చేయాల్సిన పని గురించి శిక్షణ ఇస్తారు.
్జ వ్యవసాయ, అనుబంధ రంగాలు, రెవెన్యూ శాఖలకు చెందిన సమస్యలపై ఈ హెల్ప్‌లైన్‌కు గ్రామస్తులెవరైనా ఫోన్ చేయవచ్చు.
్జ మొత్తం ఈ ప్రక్రియలో రైతు స్వరాజ్య వేదిక వాలంటీర్లు కూడా స్వచ్ఛందంగా పని చేస్తున్నారు.
(తొలకరి-సుస్థిర వ్యవసాయ మాసపత్రిక సౌజన్యంతో….)