ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణ సమస్యపై లయ సంస్థ నిర్వహించిన అవగాహనా తరగతుల సందర్భంగా డి.భీమవరం మరియు పనసలపాలెం విద్యార్థులు వ్రాసిన నినాదాలు మరియు గీసిన చిత్రాలువనం కోసం మనం
వన రక్షణ – మన రక్షణ
జల సంరక్షణ – జన సంరక్షణ
పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు
చెట్లుంటే క్షేమం, లేకుంటే క్షామం
చెట్లు పెంచండి, ఆరోగ్యంగా ఉండండి
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత
చెట్లు నాటుదాం, కాలుష్యాన్ని నివారిద్దాం
పచ్చదనం, పరిశుభ్రత ప్రగతికి సోపానాలు
మొక్కకు నీరు ప్రాణం, మనకు గాలి ప్రాణం
పొలం గట్ల మీద చెట్లు, రైతు ఆదాయానికి మెట్లు
చెట్లను పెంచుదాం, ప్రాణ వాయువును పొందుదాం
మొక్క ప్రాణం పోస్తుంది, కాలుష్యం ప్రాణం తీస్తుంది
కాలుష్యాన్ని నివారించు, పర్యావరణాన్ని ప్రేమించు
ఒక చెట్టును నరకాలంటే వంద మొక్కలను నాటాలి
ప్లాస్టిక్కును అరికడదాం, ప్రాణాలను కాపాడుకొందాం
పర్యావరణాన్ని రక్షించండి, భావితరాన్ని కాపాడండి
ఇంకుడు గుంతలు త్రవ్వండి, నీటి నిల్వలు పెంచండి
మనం మొక్కల్ని పెంచితే, అవి మనల్ని పెంచుతాయి
మనిషి ఆయువు పెరగాలంటే, పర్యావరణాన్ని కాపాడాలి
ప్రకృతిని ఆస్వాదించాలంటే, ప్రేమతో మొక్కలను పెంచాలి
సహజ వనరును రక్షిద్దాం! పుడమి తల్లిని కాపాడుదాం!!
పర్యావరణాన్ని మనం కాపాడితే, అది మనల్ని కాపాడుతుంది
చేయి చేయి కలిపితే శ్రమ శక్తి, చినుకు చినుకు కలిస్తే జల శక్తి
మనం మొక్కను పెంచితే, అది మన ఆయువును పెంచుతుంది
అంతరించిపోతున్న జంతువులను కాపాడుకొందాం, ప్రకృతిని రక్షిద్దాం
గ్రీన్ హౌస్ వాయువులకు ఉండాలి హద్దు, ఆక్సిజన్ మనకెంతో ముద్దు