తారాబాయి భండారు అచ్చమాంబ – సరళీకరణ: పి.ప్రశాంతి

క. విదళింప కురుకు సింగపు

గొదమయు మదములినగండ కుంజరములపైన

నిది బలశాలికి నైజము

గద, తేజోనిధికి వయసు కారణమగుకే?

ఈమె క్షత్రియ వంశమునందు ఉద్భవించి, తనలోని అనేక సద్గుణాలకు తోడు శౌర్యాన్ని సైతం ధరించి గొప్ప పేరుగాంచింది. ఈమె కాలం కనుక్కోవడానికి ప్రస్తుతం ఏ సాధనాలూ కనబడనందున విధిలేక ఆ ప్రయత్నం మాని, ఆమె పవిత్ర చరిత్రను ఇక్కడ ఉదహరించెదను.

పూర్వం మ్లేచ్ఛ రాజుల కాలంలో మన దేశంలోని సంస్థానాధిపతులు, రాజులు అత్యంత కష్టదశలో ఉండేవారు. తురకలు చేసే అన్యాయాన్ని ఓర్వలేక ప్రజలు కూడా అత్యంత హీనస్థితిలో బాధపడుతుండేవారు. ఆ సమయంలో రాజపుతానాలో వేదనగరం అనే చిన్న సంస్థానం ఒకటి ఉండేది. సూరథాన్‌ రాయ్‌ అనే ఆయన అక్కడ ప్రభువుగా ఉన్నాడు. ఈయన పూర్వం మహా బలశౌర్యాలు కలిగి శత్రువులను ఓడించినవాడైనా తర్వాత బాగా వృద్ధుడవడం వలన శత్రువీరులను ఎదిరించడానికి అశక్తుడుగా ఉన్నాడు. ఇలా ఉండగా దిల్లా అనే తురుష్కుడొకడు ఆయనపైకి దండెత్తి వచ్చాడు. ఆ మ్లేచ్ఛునితో పోరాడడానికి శక్తిలేక ఆ రాజు రాజ్యాన్ని వానికి విడిచి తన ముద్దుల కూతురైన తారాబాయిని తీసుకుని తక్షశిల లేక తకవూరు అనే స్థలానికి వెళ్ళి అక్కడ నివసిస్తున్నాడు. ఆయనకి ఈ కుమార్తె తప్ప మరో సంతానం కానీ, దగ్గరి ఆప్తులు కాని లేరు. ఈ కన్యకకి బాల్యంలోనే మాతృ వియోగం సంభవించింది. కావున తండ్రి ఆమెని ప్రాణప్రదంగా పెంచుకుంటున్నాడు. అక్కడ సూరధాన్‌ రాయులు కన్యా సమేతంగా ఉండటం విని అతని పగవాడైన ఆ మ్లేచ్ఛుడు అతనిని అక్కడ్నుండి పారద్రోలాడు. దాన్తో అతి ప్రియమైన ఆథోదా పట్టణాన్ని విడిచి అతడు అబూ అనే పర్వతంపై నివసించాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రతి రాజుకి తన రాజ్యాన్ని రక్షించుకోవడం అత్యవసరమైనందున సూరథాన్‌ రాయులు అడిగినా రాజులెవ్వరూ అతనికి తోడ్పడలేకపోయారు.

సూరథాన్‌ రాయులకి ఈ కన్య తప్ప పుత్రులు లేనందున ఆ కన్యచేతనే తన పగ తీర్పించాలని యెంచి అతడు ఆ చిన్నదానికి కొడుకులాగే యుద్ధవిద్యలు నేర్పుతున్నాడు. ఆ కన్య కూడా ఆ పర్వత ప్రాంతంలో తండ్రితో పాటు ఉంటూ అతనికి సేవ చేస్తూ అతడు నేర్పించే యుద్ధవిద్యలు శ్రద్ధగా నేర్చుకుంటోంది. తారాబాయికి కొంచెం జ్ఞానం తెలిసినప్పట్నుండి తండ్రి తనకి శస్త్రవిద్యలు నేర్పడానికి కారణం తెల్సుకుని ఆమె అధికోత్సాహంతో శస్త్ర, అస్త్ర విద్యలన్నింటినీ నేర్చుకుని మంచి ప్రావీణ్యం సంపాదించుకుంది. బాల్యం నుండే యుద్ధవిద్యలను నేర్చుకోవడం వలన ఆమె శరీరం చాలా దృఢంగా

ఉండి పోరాటానికి అనుకూలంగా ఉంది. అరణ్యవాసముతోను, తండ్రి ఉపదేశాలు వినీ, దేహంలానే ఆమె మనసు కూడా అత్యంత కఠినమై వజ్ర సమానమై ఉండేది. ఆ బాలిక శుక్లపక్ష చంద్రునిలా అభివృద్ధి చెందుతున్నకొద్దీ తండ్రికి కలిగిన అవమానానికి ఎంతో గుంజుతూ, అతనికి అలాంటి అవమానం కలగచేసినవానిని చంపి పగతీర్చుకోవడానికి సమయం కోసం ఎదురు చూడసాగింది. ఆమె విద్యలోను, శౌర్యంలోను ఏ విధంగా అసమానురాలో, రూపంలో కూడా అలాగే అనుపానమై ఉండేది. తారాబాయి వివాహ వయసుకురాగా ఆమె సౌందర్య ఖ్యాతిని విని ఆమెను వరించడానికి రాజపుత్రులు అనేకులు వర్తమానాలు పంపసాగారు. మొట్టమొదటగా మేవాడ రాజపుత్రుడైన జయమల్లుడు ఆమెని తనకిమ్మని కోరాడు. కానీ తండ్రి శత్రువుని చంపకుండా పెళ్ళాడనని తారాబాయి నిశ్చయించుకున్నందున ఆ రాజుపుత్రునికి ”ఎవరు నా తండ్రి శత్రువుని చంపుతారో, వారే నా భర్త అవడానికి అర్హుడు” అని ఆమె వర్తమానం పంపింది.

సూరథాన్‌ రాయులు మేవాడ రాణాగారి మాండలికుడవడంతో అతడు (మేవాడ రాజు) తన కూతురిని అడగడం సూరథాన్‌కు సన్మానప్రదంగానే తోచింది. కాని కూతురి ప్రతిజ్ఞ నెరవేర్చినట్లయితే ఆమెని అతనికి ఇవ్వాలని ఉంది. జయమల్లుడు శౌర్యహీనుడు, గర్విష్టి అయినందున పంతం నెగ్గడానికి ముందే వివాహం జరగాలని కోరాడు. కాని అందుకు తండ్రీకూతుళ్ళిద్దరూ ఒప్పుకోలేదు. బలిష్టుడైన తురుష్కుని పొడిచి గెలిచిన తర్వాత కాని తనకు ఆ కన్యారత్నం దొరకదని తెలుసుకుని ఆ రాజపుత్రుడు నిరాశ చెంది ఆ వీరబాలని ఇలా నిందించసాగాడు. ”నీ తండ్రిలాగే నువ్వు కూడా దరిద్ర లక్షణురాలివి. ఈనాడు నాలాంటి గొప్ప రాజపుత్రుడ్ని తిరస్కరించావు. కాబట్టి నీ ఇంట్లో ఉండే ఒక నీచ సేవకునికన్నా ఇతరులెవ్వరూ నిన్ను పెళ్ళాడరు. ఇది నిజం.” సూరథాన్‌ రాయంతటి స్వాభిమానికి ఇటువంటి నీచవాక్యాలు విని ఊరుకోడానికి మనసెలా ఒప్పుతుంది? తక్షణమే అతడు చేతి ఖడ్గంతో రాజపుత్రుడ్ని చంపాడు. ఈ వర్తమానం అతని తండ్రియైన రాయమల్లుకు తెలియగా అతడెంత మాత్రం చింతించక ”మా నిర్మలమైన వంశాన్ని చెరపబోయిన ఆ దుష్టునికి తగిన శిక్ష పడింద”ని అన్నాడు. అలా దుష్టుడ్ని శిక్షించినందుకు సూరథాన్‌ రాయులని చాలా పొగిడాడు కూడా.

రాయమల్లుకు పృథ్వీరాజ్‌ అనే మరొక కొడుకున్నాడు. తండ్రి ఆ పుత్రుడ్ని ఎందుకో ద్వేషించి పూర్వం విడనాడాడు. కానీ పెద్ద కొడుకు ఇలా అడుగంటిన పిదప పృథ్వీరాజ్‌ను రప్పించి యువరాజును చేశాడు. పృథ్వీరాజ్‌ మిక్కిలి సద్గుణవంతుడు, న్యాయ ప్రియుడు అయినందువలన ప్రజలు అతని రాకకు ఎంతో సంతోషించారు. పృథ్వీరాజ్‌ రాజ్యపదవిని పొందిన తర్వాత తారాబాయి సద్గుణాలను, రూపలావణ్యాలను విని తన శౌర్యాన్ని చూపించి ఆమెను వివాహమాడాలని నిశ్చయించుకుని సూరథాన్‌ రాయుడి శత్రువుపైకి దండెత్తి పోవడానికి నిశ్చయించాడు. ఆ వార్త విని తారాబాయి ఎంతో సంతోషంతో తాను కూడా అతనితో యుద్ధయాత్రకు వెళ్ళింది. పృథ్వీరాజ్‌ ఏడెనిమిది వేల క్రొత్త సైన్యాన్ని సిద్ధం చేసి అఫగణ (ఆఫ్ఘాన్‌) దేశస్థులను గెలవడానికి ధోదానగరంపైకి దండెత్తి వెళ్ళాడు. ఆ సమయంలో తారాబాయి పురుష వేషం వేసుకుని గుర్రాన్నెక్కి ప్రత్యక్ష మహిషాసుర మర్దనిలా ఆ యువకుడ్ని అంతమొందించడానికి ప్రయాణమయింది.

వీరందరూ ధోదానగరాన్ని సమీపించిన రోజున తురకలకు అధికోత్సాహకరమైన మొహర్రం పండుగ యొక్క చివరిరోజు అయినందున ఆ నగరవాసులైన తురకలందరూ పీర్లను గుమ్మటాలలో ఉంచి ఊరేగిస్తూ ఆనంద మహోత్సవంలో నిమగ్నులై ఉన్నారు. ఆ మహోత్సవంలో పాల్గొనడానికి గాను అక్కడి ప్రభువైన దిల్లా తన మేడపైన దివ్యవస్త్రాలను, నగలను అలంకరించుకుంటున్నాడు. ఆ సమయంలో తన సైన్యాన్నంతటినీ నగర ద్వారంవద్దే ఉంచి పృథ్వీరాజ్‌, తారాబాయి మరొక ఆంతరంగికుడు ఉత్సవాన్ని చూడడానికి వచ్చినవారిలా ఆ మూకలో చేరిపోసాగారు. ఇలా వేళ్ళేటపుడు తారాబాయి తన తండ్రి యొక్క శత్రువుని గుర్తించి గురిపెట్టి ఒక బాణం అతనికి తగిలేలా వేసింది. మూకలోనుండి వచ్చిన ఆ శస్త్రం ఆ యువకుడి రొమ్ముకి తగిలి వానిని యమసదనానికి పంపింది. తక్షణమే యవనులు ఆ నగర ద్వారం వద్ద ఒక మత్తగజాన్ని కాపలా ఉంచి తమ ప్రభువు ప్రాణాలను తీసిన యోధుని కోసం వెతకసాగారు. కాని వారికెక్కడా అతడు పట్టుబడలేదు.

తారాబాయి పగవాడిని చంపిన తర్వాత ఆ ముగ్గురూ గ్రామం బయట ఉన్న తమ సైనికులను కలవడానికి పోతున్నారు. ఇలా వెళ్తున్నవారికి సింహద్వారం వద్ద మత్తగజము, కొంతమంది సైన్యం కనపడి వారిని అడ్డగించారు. అదిచూసి వారు ముందు కొంత జంకినా కానీ వీరులైన పృథ్వీరాజు, తారాబాయి మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నారు. ఆ సమయంలో ఆ మత్తగజం సమీపించగా తారాబాయి తన చేతనున్న ఖడ్గంతో ఆ ఏనుగు తొండాన్ని నరికింది. అంతట ఆ ఏనుగు ఘీంకరిస్తూ అవతలికెళ్ళగానే ఆ ముగ్గురు యోధులూ అక్కడి స్వల్ప సైన్యాన్ని లెక్కచేయక నగరం బయటికెళ్ళిపోయారు.

వారిలా తమ యోధులను కలుసుకున్న పిదప పృథ్వీరాజు ధోదానగర సైన్యాలకు ఎదురు పోరాడమని తన సైనికులను ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ అయిన తక్షణమే ఆ వీర భటులు ఆ పట్టణాన్ని ముట్టడించి అక్కడి సేనలను నాలుగు దిక్కులకు పారద్రోలారు. ఆ యుద్ధంలో అక్కడ ఉన్న తురకలలో మూడొంతుల వరకు చనిపోయారు. తర్వాత పృథ్వీరాజు, తారాబాయి మహోత్సాహంతో నగరంలోకి ప్రవేశించారు. తమకు గెలుపు దొరికిన పిదప తమ సైనికులు మ్లేచ్ఛులను పట్టుకుని బాధించడం చూసి తారాబాయి అలా చేయొద్దని తమ సైన్యాన్ని ఆజ్ఞాపించింది.

ఇలా సూరథాన్‌ రాయులకు రాజ్యం దొరికిన తర్వాత తారాబాయి పృథ్వీరాజును వివాహమాడింది. సూరథాన్‌ రాయులు కూతురి వివాహానంతరం తన రాజ్యాన్ని అల్లుడికిచ్చి తాను భగవత్‌న్మరణ చేసుకుంటూ నిశ్చింతగా ఉన్నాడు. తారాబాయి, ఆమె భర్త పరస్పర అనురాగం కలవారై ప్రజలను కన్నబిడ్డల్లా పాలించుచున్నారు. వారిలా రెండు సంవత్సరాలు సుఖంగా ఉండగా వారికొక కష్టం ఎదురైంది.

పృథ్వీరాజు బావ అయిన ప్రభురాయుడనే వాడు అత్యంత దుష్టుడై తన భార్యను చాలా బాధపెడుతున్నాడు. పృథ్వీరాజు తన సోదరికి కలుగుతున్న బాధలను చూసి ఊరుకోలేక మంచి మాటలతో బావకి బుద్ధి చెప్పాడు. ఆ దుష్టునికి ఆ వాక్యాలు పాముకి పాలు పోసినట్లై అతడు తన భార్యను ఇంకా ఎక్కువగా బాధించసాగాడు. అది చూసి పృథ్వీరాజు ప్రభురాయులకి కఠిన వాక్యాలతో ఒక జాబు వ్రాశాడు. అప్పట్నుండి ఆ దుష్టుడు పృథ్వీరాజుపైన బాగా కోపించి, తన కుత్సితాన్ని బయటపడనివ్వకుండా పైకి మాత్రం చాలా మితృత్వంతో కనబడేవాడు. ఇలా ఉండగా అతడు ఒక రోజున పృథ్వీరాజును తన ఇంటికి విందుకు పిలిచి అతనికి విషం కలిపిన అన్నం పెట్టించాడు. కపటం తెలియని పృథ్వీరాజు భోజనం చేసి తిరిగి తన నగరానికి వస్తున్నాడు. ఇంతలో అతనికి విషమెక్కినందున ఆ త్రోవలో ఆయన మూర్ఛబోయాడు. ఆ వర్తమానం తారాబాయికి తెలియగా ఆమె మరణావస్థలో ఉన్న భర్త దగ్గరికెళ్ళి అతనికి తగు చికిత్సలు చేయసాగింది. కానీ దానివలన ఎంత మాత్రం ప్రయోజనం లేక చివరికాయన స్వర్గస్థుడయ్యాడు. అంతటితో తారాబాయి జీవన చరిత్ర ముగిసింది. రాజపుత్రుల కులాచారమయిన సహగమనం చేసి తారాబాయి పరమపదించింది.

Share
This entry was posted in చరిత్ర చీకటిలో వెలుగురవ్వలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో