”యెట్‌ అనదర్‌………….”

పి.సత్యవతి
ఎప్పుడో చాలా ఇష్టంగా ఎంతో ఆర్తి నింపిన ఫిల్‌ కాలిన్స్‌ పాట ఒకటి గుర్తొ స్తోంది… మేజోళ్ళు చెప్పులు లేని ఒక పేద పిల్ల అక్కడ కూచుని ఉంది… భద్రజనాలకి మళ్ళీ మళ్ళీ తెల్లవారుతుంది.. యెట్‌ అనదర్‌ డే ఇన్‌ పారడైజ్‌….
రక్తపు మరకలతో, యాసిడ్‌ దాడు లతో ముగుస్తున్న సంవత్సరంలో, అంతా చింతే కాదు అక్కడక్కడా వెండి అంచు లుండవచ్చు అని, ఆశగా క్యాలెండర్‌ పేజీలు వెనక్కి తిప్పితే, దుర్మార్గాలు ఎన్ని జరుగు తున్నాయె వాటికి విరుద్ధంగా అంత తీవ్రమైన పోరాటాల, నిరసనల కనపడు తున్నాయి. అయితే ఈ పోరాటాల, నిరసనల వెనక ఏ మేరకు నిజాయితీ వుందీ, ఎంత వరకూ అవి విజయవంతం అవు తున్నాయీ, ఎంతవరకూ న్యాయం జరుగుతోంది అనే దగ్గర వెండి అంచులు కనపడలేదు. అన్ని చోట్లా అధికారానిదే పైచెయ్యి అవుతూనే వుంది. అయినా అంతకు ముందుకన్నా ఎక్కువగా అన్యాయన్ని గుర్తించి మాట్లాడ్డం ఎక్కువైందేవె నన్నదే వెండి అంచు..
నిన్న స్నేహితురాలు సుధ మానవహక్కుల బులిటన్‌ ఇచ్చింది. అందులో ఆమె ప్రేవెన్మాద హత్యల్ని గురించి విశ్లేషిస్త ఆలోచనల్ని పాదుచేసే, మంచి వ్యాసం వ్రాసింది. అందులో ఆమె మన రాష్ట్రంలో జరిగిన ప్రేమొన్మాద దాడుల, హత్యల వివరాల జాబితా కూడా ఇచ్చింది. ఆ జాబితా చూస్తే కలిగే భావాలు అక్షరాలకి అందవు.
అక్షర జ్ఞానం కోసం అలమటించాం. ఆర్థిక స్వాతంత్య్రం కోసం అలమటించాం, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం ఇంకా అలమటిస్తూనే వున్నాం, ఎన్నిటికోసవె అలమటించి, పోరాడి కొన్ని సాధించాం. ఇప్పుడు మళ్ళీమా ప్రాణాలు మాక్కావాలి కాపాడండీ కాపాడండీ అని కేకలు పెట్టాల్సొ స్తోంది. సుధ వ్యాసాన్ని ముఖ్యంగా ఇక్కడ ఎందుకు ప్రస్తావించానంటే ఆమె వ్యాసం ముగింపు వాక్యాల కాలానుగుణ్యత తెలియ జేయలని.
”కత్తులతో అమ్మాయిల వెంట పడకండిరా. మీ అవసరం సమాజానికి వుంది. మీరు లేక అన్ని ఉద్యమాలు వయెభారంతో కుంగిపోతున్నాయి అని వారికి ఎలా నచ్చచెప్పాలో చూద్దాం”.
యువతకి నచ్చ జెప్పేదెవరు? తల్లి తండ్రులా? విద్యాగురువులా? పాఠాలా? మీడియనా? ఇంటర్నెట్టా?
పిల్లల్ని కత్తుల దగ్గరకు పోనీయ కుండా కాపాడే ఓర్పునేర్పులు సాధించడానికి కృషి చేస్తున్న తల్లిదండ్రులెందరు? వారి జ్ఞాన చైతన్యాలు మెరుగుపరుచుకోడానికి వాళ్ళేం చేస్తున్నారు? పిల్లల్ని ఇంజనీర్లుగా డాక్టర్లుగానే కాక స్నేహశీలురుగా అవగాహనా పరులుగా బాధ్యతగల పౌరులుగా చెయ్యడానికి మీవంతు కృషి ఏమిటి? మిమ్మల్ని మెరుగు పరుచుకోడానికి మీ బాధ్యతల్ని మీరు ఎరుకలో వుంచుకోడా నికి మీరు చేస్తున్న కృషి ఏమిటి? సమాజా నికి వుపయెగపడవలసిన యువకుడు కత్తి పుచ్చుకోడానికి తల్లిదండ్రుల అలసత ఎంతవుందో, సమాజానికి వుపయెగపడ వలసిన యువతులు భర్త ఇంట్లో ఆత్మహత్య లకీ హత్యలకీి గురవడానికి కూడా బాధ్యత అంతే వుంది. అమ్మాయిల్ని వేధించే కుర్రవాళ్ళమీద ఫిర్యాదు చేసినప్పుడు సకాలంలో స్పందించి చర్య తీసుకోని పోలీసుల బాధ్యతా రాహిత్యానికీ, తనకి భర్త, అతని తల్లిదండ్రుల వల్ల హింస వుందని అమ్మాయి చెప్పినప్పుడు, వెంటనే ఆమెను కాపాడని తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యానికీ తేడాలేదు. సకాలంలో కూతుళ్ళని కాపాడు కోలేని తల్లిదండ్రులు, చివరికి అల్లుడిమీద కేసుపెట్టి న్యాయం జరగాలని నాలుగు రోజులు, మీడియముందు కన్నీళ్ళు కార్చి ఊర్కోడం, పిల్లేపోయక ఇంకా కేసులెందుకు అని నీళ్లుకారిపోవడం జరుగుతూనే వుంది. ఆడపిల్లల పట్ల ఇంకా తల్లిదండ్రులకు వుండే ఈ అలసత్వం, గృహహింసని పెంచి పోషిస్తోంది. రాజ్యం, సమాజం, మీడియ ఎట్ల అవసరమైన విజ్ఞతని అందించలేవు కనుక పిల్లల్ని కాపాడుకోడం ముందు ఇంట్లోనే ప్రారంభంకావాలి.
గతకాలమే మేలని చెప్పే మూర్ఖురాల్ని కానుకానీ గతంలో వుండిన కొంతమంచిని, కొంత సీదాసాదాతనాన్ని, కొంత నిజమైన ప్రేమల్ని, ఆపేక్షల్ని తవ్వి తీసుకోవల్సిన అవసరం వుందని నమ్మాలి మనం.
ఇళ్ళల్లో అదివరకు కొన్ని మొక్కలు వుండేవి. పుస్తకాలుండేవి. మనుష్యులుండే వాళ్ళు. వాళ్ళమధ్య మాటలుండేవి. వేసవి సెలవులకి బావలు వదినెలు, పినతండ్రి, పెదతండ్రి, పినతల్లి, పెత్తల్లి, పిల్లలు వచ్చేవాళ్ళు. అందర చాపలమీదో ఎక్కడో సర్దుకుని పడుకుని కబుర్లే కబుర్లు… ఊపిరాడేది. కళ్లనిండా కాంతినిండేది. చిన్న చిన్న చేతులతో మొక్కలకి నీళ్ళుపొయ్యడం, కొనవేలిన కుదురుకున్న నీటిబొట్టులో అస్తమయ సూర్యకిరణాల ప్రతిఫలనం ొచూసి కేరింతలు కొట్టడం ఎంత అద్భుతం?
ఇప్పుడు వేసవిలో పిల్లలు వేసవి క్యాంపుల్లో చేరి సకలకళా విశారదులవ్వాలి. చివరికి ఏదీరాదు. అంతా ఫార్మాలిటి.. బ్రతుకే పెద్ద ఫార్మాలిటి అయిపోయింది, డిజైన్‌ చేసిన బ్రతుకు. పిల్లల బ్రతుకుల్ని మనం డిజైన్‌ చేస్తాం, మన బ్రతుకుల్ని ”ట్రెండ్స్‌” డిజైన్‌ చేస్తాయి. ఆ డిజైన్‌లో ఇమడలేని మనుషుల్లో కసి.. మూస బ్రతుకులమీద కసి…. మనకి అభ్యంతరాలు చెప్పేవాళ్లమీద కసి. మొత్తం సమాజాన్ని కసి మేఫలు ముసురుతున్నాయి, వాటిని చెదరగొట్టే పెనుగాలులు వీచాలి. అవే బాధ్యతా గుర్తింపుగాలులు… సర్యరశ్మి తొంగిచసే ఇళ్ళుకావాలిప్పుడు మనకి. మనం మనం మాట్లాడుకునే సమయం ఏర్పాటుచేసుకునే ఉద్దేశం కావాలిప్పుడు మనకి. మన అలవరలు షోకేసులుగా కాక పుస్తకాలతో పరవశించేలా చూసుకోవాలి మనం.
ఈ మధ్యన జాన్సన్‌ గారు వ్రాసిన కథలో ఒకమ్మాయి తను పెళ్ళిచేసుకోబోయే అబ్బాయికి పుస్తకాలు చదివే అలవాటు వుందో లేదో కనుక్కోమంటుంది. ఆ పిల్లని ముద్దు పెట్టుకోవాలనిపించింది… అమ్మాయి లకి ఇలా అడిగే సంస్కారం ఆ కుటుంబం ఇచ్చిందే కదా!!!!
అమ్మాయిలకి చెప్పాలి మనం. ధైర్యంతో, చొరవతో, జ్ఞానంతో, పట్టుదలతో, బాధ్యతతో తమని తాము అలంకరించు కోమని… మనని తప్పుదారి మళ్ళిస్తున్న వినోద వధ్యవలతో ”ఢీ” కొట్టాలి మనం.. పోలీసులకి చెప్పాలి సత్వర న్యాయం అంటే అనువనితుల్ని మీకు మీరే నిందితులుగా నిర్ధారించేసి చంపితే మీకు ఇప్పుడిస్తున్న గౌరవం కూడా ఇకమీద ఉండదని..
యెట్‌ అనదర్‌.. కొత్త సంవత్సరం… మన కొత్తపుస్తకాల సినిమాల, యత్రల అన్నీ సరే ఈ సంవత్సరాన్ని మనం ఇంకాస్త బాధ్యతాయుతంగా స్పందించే సంవత్సరంగా ఆశపడదాం..
ఈ సంవత్సరం ఇద్దరు యువ రచయితల కథల పుస్తకాలతో నాకు ఆత్మీయత లభించింది. అవి అనిసెట్టి శ్రీధర్‌ ”కొత్త బంగారు లోకం”, సుభాషిణి ”మర్మమెల్ల గ్రహించితి తల్లీ”.
రెండూ చదవాలి మన భూమిక మిత్రులు. మళ్ళీ మనందరం స్త్రీ రచయితలం కొత్తసంవత్సరంలో కలుసుకుని మాట్లాడు కుని మాటల్ని క్రియబద్ధమ్‌ చేసే తరుణం కోసం కనిపెట్టుకుని….

Share
This entry was posted in రాగం భూపాలం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో