వాకపల్లి అమానవీయ నెత్తుటి గాయానికి పదేళ్ళు మన ప్రజాస్వామ్యానికి సవాలు విసురుతున్న మహిళల న్యాయ పోరాటం -రామారావు దొర

మన దేశంలో మహిళలు తమ ప్రతిభతో రాణిస్తుంటే ప్రభుత్వాలు మాత్రం తమ ఉదారతవల్లే సాధించినట్లు చెప్పుకొంటాయి. అదే ఆదివాసీలో, దళితులో అయితే తామిచ్చిన రిజర్వేషన్లుగా గొప్పలు చెప్పుకుంటారు. కాని తమపై అత్యాచారం చేసి అపకీర్తి తలపెట్టిన పోలీసులను శిక్షించాలంటూ గత పదేళ్ళుగా న్యాయం కోసం పోరాడుతున్న వాకపల్లి మహిళలను మాత్రం విద్రోహ శక్తులుగా ముద్రవేసి దోషులుగా నిలబెట్టింది మన సర్వసత్తాక గణతంత్ర దేశం.

ఆగస్టు 20, 2007న విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలం సుర్మతి పంచాయితీ వాకపల్లి గ్రామానికి కూంబింగ్‌ పేరుతో చొరబడ్డ గ్రేహౌండ్స్‌ దళాలు 11 మంది ఆదివాసీ కోందు మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టిన అనైతిక సంఘటన గురించి అందరికీ తెలిసిందే. ఈ ఆగస్టు 20తో ఆ అమానవీయ గాయానికి దశాబ్ద కాలం పూర్తవుతుంది. రాజ్య హింసను ఎదుర్కొంటూ, పోలీసుల బెదిరింపులకు లొంగకుండా, ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పతకాలను, పోలీసులు ఇవ్వజూపిన డబ్బును నిర్దాక్షిణ్యంగా తిరస్కరించి, నిందితులైన పోలీసులను శిక్షించాలని దశాబ్దకాలంగా పోరాడుతూనే ఉన్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా న్యాయపోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు మహిళలు మరణించారు కూడా. అయినా నేటికీ మానని గాయంగా రగులుతూనే ఉంది. కాదు! కాదు! రగిలిస్తూనే ఉన్నారు. బాధిత కుటుంబాలే కాదు! ఆ గ్రామంలో నివసిస్తున్న అన్ని కోందు కుటుంబాలు నేడు పోలీసుల వేధింపులకు గురికాబడుతున్నామని వాపోతున్నారు.

వాకపల్లి ఘటనకు సంబంధించి నేర నిర్ధారణ జరగలేదని, సి.బి.ఐ.తో విచారణ జరిపించి నిజాలు రాబట్టాలని మొదటినుండి ఆదివాసీలు, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తూనే ఉన్నాయి. అయినా ఈ దుర్మార్గానికి ఒడిగట్టింది ప్రభుత్వ బలగాలే కనుక, పై రెండు డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకుండా తన పని తాను కానిచ్చుకుంటూ పోయింది. అది ప్రభుత్వాల సహజ వైఖరికి నిదర్శనం. హైకోర్టు 21 మంది నిందితుల్లో 13 మందిపై విచారణ కొనసాగిస్తూ, 8 మందికి మినహాయింపు ఇచ్చింది. ఆ 13 మంది నిందితులు (పోలీసులు) తమపై మోపిన కేసు ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం నిందితులపై సుప్రీంకోర్టు స్టే కొనసాగుతోంది. పోలీసు బలగాలు చేసిన దుర్మార్గానికి ఊరు దాటి బయటికి రాలేని స్థితి మహిళలదైతే, కాయ కష్టంతో పొట్ట పోసుకునే శ్రమ జీవులు తమ దైనందిన అవసరాల కోసం వారపు సంతలకనో, ఆఫీసు పనుల కోసమో, ఆస్పత్రులకనో ఊరు దాటి బయటకు వచ్చిన గ్రామస్థులు సైతం పోలీసుల వేధింపులకు గురవుతున్నామని ఆవేదన చెందుతున్నారు.

ఘటన జరిగిన నాటినుంచి ఆదివాసి ఐక్య పోరాట సమితి (ూIూూ), మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టగా, ఆ రోజు వాకపల్లికి గ్రేహౌండ్స్‌ దళాలు వెళ్ళినట్లు ఒప్పుకోవడమే కాకుండా, వారి వివరాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. కానీ తగిన సమయంలో తగిన విధంగా వైద్య పరీక్షలు నిర్వహించలేదని నిరసనలు వెల్లువెత్తుతున్నా, ఈ కేసును అణగదొక్కడానికి వైద్య నివేదికల చుట్టూ తిప్పడానికి చూశారు. ఆ నివేదికను అడ్డుపెట్టుకుని రాష్ట్ర హోం శాఖ అత్యాచారం జరగలేదని నమ్మబలికింది. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి నాగిరెడ్డి విచారణ జరిపి వాంగ్మూలాలను రికార్డు చేసి, ప్రజా సంఘాలు కోరినట్టు సి.బి.ఐ. లేదా ూ=చీ శంకరన్‌ వంటి వారితో స్వతంత్ర విచారణ జరిపితే మరికొన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందనే సూచనను పట్టించుకోవడంలేదు. 14-12-2007 జIణ ూూ శివానందరెడ్డి తన తుది నివేదికలో ”సంఘటనకు సంబంధించి పరిస్థితుల సాక్ష్యంపై ఆధారపడవచ్చు. సాక్ష్యం చెప్పేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు దొర్లవచ్చు. అందులో తప్పు లేదు. కానీ ఈ కేసులో వైద్య నివేదిక, పరిస్థితులన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే అత్యాచారం జరిగిందనేది నమ్మశక్యంగా లేదు” అని పేర్కొంటూ, ఆ స్త్రీలు ప్రతిఘటించకపోవడం అసహజంగా ఉందనే అంశాన్ని ప్రస్తావించారు. ఆ గ్రామానికి వెళ్ళింది సామాన్య ప్రజలు కాదు… దొంగలు కాదు… ప్రతిఘటించడానికి! సాయుధులైన గ్రేహౌండ్స్‌ పోలీసు బలగాలు. అయినా రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తూ, పోలీసు శాఖలో భాగమైన సిఐడి బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వానికి మచ్చతెచ్చే నివేదిక పారదర్శకంగా ఇస్తుందనే నమ్మకం లేకే కదా సి.బి.ఐ. లేదా ూ=చీ శంకరన్‌ (అప్పటికి బ్రతికే ఉన్నారు) గారిచే విచారణకు హక్కుల సంఘాలు డిమాండ్‌ చేశాయి.

సిబిసిఐడి ఇచ్చిన తుది నివేదికతో అసంతృప్తి చెందిన వాకపల్లి మహిళలు 16-04-2008న పాడేరు ప్రథమ శ్రేణి జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో నిరసన పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మేజిస్ట్రేట్‌ ఎ1 నుండి ఎ21 వరకు నిందితులపై 376 (ఱఱ)(స్త్ర) తీ/ష 149 Iూజ, ూజ, ూు అత్యాచారాల నిరోధక చట్టం 3(శ్రీ)(ఞ) కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అయితే పాడేరు మేజిస్ట్రేట్‌ ూ.=.జ. చీశీ.19 శీట 2008 లో చేపట్టిన ప్రొసీడింగ్స్‌ను కొట్టివేయాలని 02-09-2008న నిందితులు (పోలీసులు) హైకోర్టులో షతీశ్రీ.ూ.చీశీ.5598/2008 న దాఖలు చేశారు. 04-08-2008న హైకోర్టు పాడేరు మేజిస్ట్రేట్‌ కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్‌పై స్టే విధించింది. స్టే ఎత్తివేసి కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని బాధిత మహిళలు సుప్రీంకోర్టుకు అప్పీలు చేయడం జరిగింది. నిందితులపై కేసు నమోదు చేయడానికి పదేళ్ళుగా పోరాటం కొనసాగించవలసి వచ్చింది. బాధితుల వాంగ్మూలాలలో లోపాలు, తేడాలను హైకోర్టు నిర్ణయించడం సరైనది కాదనే సూత్రం చట్టపరమైన ఆనవాయితీగా కొనసాగుతోంది.

దాన్ని అనుసరించి రేపో మాపో భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు అవుననో… కాదనో… తీర్పు వెలువరించనుంది. అది సమ్మతమో, కాదో అన్న విషయం అలా ఉంచితే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా బాధిత కుటుంబాలతో సహా వాకపల్లి ఆదివాసీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాంగి ముసలయ్య ఆ గ్రామ పెద్ద. మహిళలకు ఆ సమయంలో పెద్ద దిక్కుగా నిలిచిన వ్యక్తి. ముసలయ్య కుమారుడు పాంగి వెంకటరావు గ్రామస్థులతో కలిసి 12-04-2012 న బ్యాంకు పని నిమిత్తం జి.మాడుగుల వచ్చాడు. వెంకటరావు యూనియన్‌ బ్యాంకు వద్ద ఉన్నట్టు తెలుసుకున్న అప్పటి జి.మాడుగుల సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు కానిస్టేబుల్‌తో వచ్చి పోలీస్‌స్టేషన్‌కు ఈడ్చుకెళ్ళి నిర్బంధించారు. సాయంత్రానికి పంచాయతీ సర్పంచ్‌, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు స్టేషన్‌కు వెళ్ళి వెంకటరావును విడిచిపెట్టమని ప్రాధేయపడగా, తమకు ఇన్‌ఫార్మర్‌గా పనిచేయాలని ఎస్‌ఐ శ్రీనివాసరావు ఒత్తిడి చేశాడు. చేసేది లేక వారు పోలీసుల ఆధీనంలో ఉన్న వెంకటరావును విడిచిపెట్టాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. హెచ్చార్సీ పోలీసులకు నోటీసులు జారీ చేయడంతో వెంకటరావును పది రోజుల తర్వాత విడిచిపెట్టారు. ఏ విచారణ లేకుండానే వాకపల్లిలో అత్యాచారమే జరగలేదని మొదటి నుంచి బుకాయిస్తున్న పోలీసులు ఘటన జరిగి పదేళ్ళైనా ఆ గ్రామంపై ఇంత నిర్బంధం దేనికి ప్రయోగిస్తున్నట్లు? కేసు మాత్రం నడుస్తూనే ఉంది. ఈ కేసును ఎక్కడో ఒకచోట తప్పుదారి పట్టించి నిందితులను కాపాడే ప్రయత్నంగా కనబడుతోంది.

(వాకపల్లి అత్యాచార ఘటనకు పదేళ్ళు పూర్తయిన సందర్భంగా)

రామారావు దొర

(ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి, ఆదివాసి రచయితల సంఘం (ఆరసం)

Share
This entry was posted in ఉద్యమాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.