జోగినీ వ్యవస్థకు ప్రాణం పోస్తున్న బోనాలు – జూపాక సుభద్ర

‘బోనాలు తెలంగాణ పండుగ, ప్రత్యేకమైన సంస్కృతి మా తెలంగాణ బోనాలు’ అని రాజకీయ నాయకులు, రకరకాల నాయకులు గ్లోరిఫై చేస్తూ బోనాల చుట్టూతా ఉన్న జోగినీ దురాచారాన్ని నిషేధించారని, జోగినీ దురాచార నిషేధ చట్టము ఒటుందనేది ఎవ్వరికి పడ్తలేదు. అప్పుడెప్పుడో 1947లోనే ప్రివెన్షన్‌ ఆఫ్‌ డెడికేషన్‌ చట్టం వచ్చిందంటే జోగినీ వ్యవస్థ మీద ఎంత ఉద్యమం జరిగిందో, ఈ వ్యవస్థ నిర్మూలనకు ఎంత కృషి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. బోనాలు తెలంగాణ సంస్కృతి కావచ్చేమో కానీ జోగినీ వ్యవస్థ, బసివి, మాతమ్మ, మాతంగి, దేవదాసీ వ్యవస్థ తెలంగాణకే ప్రత్యేకం కావు. ఇవి దేశమంతా ఉన్నయి, అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నయి. ఎస్సీ కులాల్లోని మహిళలు, ఒకట్రెండు బీసీ కులాల మహిళలపై దేవుడి పేరుతో సమాజంలోని ఆధిపత్య కులాల మగవాల్ల లైంగికావసరాలు తీర్చడానికి ఏర్పాటైన వ్యవస్థ జోగినీ వ్యవస్థ. ఇది కులమ్మోపుతున్న వ్యవస్థ.

1988లోనే ఎస్సార్‌ శంకరన్‌ కృషితో ‘జోగినీ నిషేధ చట్టం (1988)’ వచ్చింది. ఈ చట్టం ప్రకారం రంగమెక్కియ్యడం చట్ట వ్యతిరేకమైన నేరం. జోగినీ సంబంధ కార్యక్రమాలకు పాల్పడ్డా, ప్రోత్సహించినా, వినోదించినా, పాల్గొన్నా జైలుగోడలే. కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ప్రభుత్వాలే పండుగలుగా, ఉత్సవాలుగా చేస్తుంటే పౌర సమాజాలు, ఉద్యమ సమాజాలు మాట్లాడకపోవడం విషాదము. భక్తి పేరుతో, సంస్కృతి పేరుతో జరిగినా నేరం నేరమే కదా! దళిత మహిళల ఆత్మగౌరవ జీవన విధ్వంసాల మీద బోనాల జాతరలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడినాక తెలంగాణ మహిళా ఉద్యోగ సంగంగా తెలంగాణ ప్రభుత్వానికి జోగినీలు లేని బోనాల ఉత్సవాల్ని జరుపుకోండి, తెలంగాణలో జోగినీ నిషేధ చట్టంను అమలు చేయాలి అని మేము పెట్టిన విన్నపాలు బేఖాతరు అయినయి. సమాజంపట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన రాజకీయ నేతలు, ప్రభుత్వాలు, మీడియా, ప్రజల్ని చైతన్యం చేయాల్సిన బాధ్యత లేకుండా ‘తెలంగాణా సంస్కృతనీ, తెలంగాణ పండుగనీ’ చట్టవ్యతిరేకమైన జోగినీ వ్యవస్థను బహిరంగంగా ప్రభుత్వమే జరపడాన్ని

ఉద్యమ సంస్థలు కూడా వ్యతిరేకించ కపోవడం దారుణం. మూఢనమ్మకాలు, దురాచారాలు ఉత్సవాల పేరుతో, పండుగల పేరుతో, సంస్కృతి పేరుతో రంగమెక్కించే కార్యక్రమాన్ని మీడియా కూడా ప్రజల్ని చైతన్యం చేయకపోగా జోగినీ వ్యవస్థ అనేది దురాచారమనీ, దేవుడి పేరుతో జరిగే కులభూతమనీ, దళిత మహిళల జీవితాల విధ్వంసమనీ, యిది నిషేధితమనీ, నిషేధ చట్టాలున్నాయనే విషయాల్ని ప్రస్తావిం చడంలేదు.

ఇంకా జోగినీ దురాచారాన్ని ప్రోత్సహిస్తూ రాజకీయనాయకుల్ని, ప్రభుత్వాన్ని, పూజారుల్ని ఉన్నతీకరించి, పవిత్రీకరించి మూఢనమ్మకాల్ని జోగినీ దురాచారాల్ని స్థిరీకరించే ప్రయత్నమే ముమ్మరం చేస్తోంది. సవర్ణ మహిళల్లో జోగినీలుంటే నిషేధాలు పగడ్బందీగా జరిగేవి ”సతి”లాగ.

బోనాలన్ని బహుజనులుండే బస్తీల్లోనే జరుగుతుంటాయి. బోనాల్లో పోతరాజులు, జోగినీలు, దళిత బీసీ (కొందరు) మగవాల్లు, మహిళలే ఉంటరు. తెలంగాణొస్తే… అభివృద్ధయితదని ఉద్యమ వాగ్దానాలు, మూఢనమ్మకాల్ని పెంచడం అభివృద్ధా? ఆ పేరుతో బహుజన మహిళల్ని, వారి జీవనాల్ని జోగినీ పేరుతో సమాజ మగవాల్లకి లైంగికావసరాలు తీర్చే వేశ్యలుగా కొనసాగించడం తెలంగాణ కల్చరా! ఇలాంటి సంస్కృతిని ప్రభుత్వాలే పండుగ్గా చేయడం అభివృద్ధా! ప్రభుత్వమే పబ్లిగ్గా జోగినీ వ్యవస్థని ఎంటర్టయిన్‌ జేసే బోనాల్ని, రంగాల్ని, భవిష్యవాణీలను జాతరగా జరుపుతుంటే… నిషేధ చట్టాల్ని గూడా బేఖాతరు జేస్తుంటే… ఏంటి పరిస్థితి? అనేక పోరాటాల ఫలితంగా జోగినీ నిషేధ చట్టం వచ్చింది. 1947లో ప్రివెన్షన్‌ ఆఫ్‌ డెడికేషన్‌ చట్టం వచ్చింది, తర్వాత 1988లో కూడా వచ్చింది. జోగినీ, మాతంగి, బసివి, దేవదాసీ దురాచారాలు బహుజన కులాల మహిళల మీదున్న గుదిబండ.

జాతీయోద్యమం ”సతి”లాంటి అనేక దురాచారాల్ని నిర్మూలించడానికి అనేక చట్టాలు తీసుకొచ్చింది. కానీ అవి పై కులాల మహిళల దురాచారాల నిర్మూలనకాన్నే ఆగిపోయినయి. బహుజన మహిళలు ఎదుర్కొంటున్న దురాచారాల కాడికి రాలేదు అనేది వేరే సంగతి. అయితే యిక్కడ మాట్లాడుకోవాల్సింది ఉద్యమాలు సమాజంలో ఉన్న చెడును, దుర్మార్గాల్ని, దురాచారాల్ని, అభివృద్ధి నిరోధకాల్ని తొలగించుకుని, సమాజాన్ని అభివృద్ధి దిశగా పయనించే ప్రయత్నం చేయాలి. కాని తెలంగాణ ఉద్యమం విషయంలో అట్లా జరగలే. యింకా వందేండ్ల వెనుకకు బోయే సంస్కృతే ముందుకు దెస్తుంది. ‘సతి’ మా భారతీయ సంస్కృతి అని పండుగలు జరపలే జాతీయోద్యమం. నిజానికి జాతీయోద్యమం హిందూ అగ్రకులాధిపత్యంగా జరిగింది. ఆధిపత్య సవర్ణ సమాజం తమ మహిళలమీద వున్న దురాచారాల్ని తీసేయించాలి. యిది మంచి సంగతి, కాని తెలంగాణ ఉద్యమం అణగారిన కులాల మహిళల్ని వేశ్యలుగా మార్చే జోగినీ వ్యవస్థను పునరుద్ధరి స్తుందంటే… ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోని చట్టాల్ని అడాప్ట్‌ చేస్కున్నటు.్ల జోగినీ నిషేధ చట్టాన్ని అమలు చేస్తలేదంటే.. కారణం జోగినీలు సవర్ణ మహిళలు కానందువల్ల బహుజన మగవాల్లకు తమ సొంతమహిళల పట్ల సోయి లేనందువల్ల.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో