మానసిక అనుబంధాల ఛాయలో మసకేసిన ”పెళ్ళిబంధం” -పి. ప్రశాంతి

ఎటుచూసినా జనం… కోలాహలంగా ఉంది. రంగురంగుల గాజులు, రిబ్బన్లతో మెరుస్తున్న దుకాణాలు కొన్ని, చిత్ర విచిత్రమైన శబ్దాలు చేస్తున్న ప్లాస్టిక్‌ కార్లు, గన్నులు, రైళ్లు, జంతువులు, బ్యాట్లు… అబ్బో ఎన్నో రకాల బొమ్మలతో ఆకర్షణీయంగా ఉన్న దుకాణాలు కొన్నిబీ రకరకాల సైజులు, రంగులు, డిజైన్లతో నోరూరిస్తున్న స్వీట్‌ షాపులు… చిన్న పెద్ద ఇత్తడి, రాగి పూజ సామాన్ల దుకాణాలు, కొబ్బరి కాయలు, పసుపు కుంకాలు, అగరబత్తులు, పూలు, చేతికికట్టుకునే ఎర్ర దారాలు, ప్లాస్టిక్‌ పూలదండలతో…. ఏడుపాయల జాతరలో అన్ని దుకాణాల్ని చుట్టేసి, అందరితో మాట కలిపేసి, జింక పిల్లలా గెంతుకుంటూ తిరుగుతున్న ఆ ఎర్రలంగా, పచ్చ జాకెట్టు పిల్లని పట్టుకుని ‘మనం పెళ్లి చేసుకుందాం సారికా’ అన్న మేనబావతో ‘ఆర్నెల్లైతే అయ్య చేసిన అప్పు తీరిపోతది. అప్పుడు చేసేసుకుందాం’ అంది సారిక. అంతలోనే పిడుగులాంటి వార్త. తన ప్రియ స్నేహితురాలు పురుగుమందు తాగి చావు బతుకుల్లో ఆసుపత్రిలో ఉందని, ఆసుపత్రికి పరిగెత్తింది. ఊరి జనమంతా అక్కడే ఉన్నట్టుంది. బెడ్డు మీద ఉన్న స్నేహితురాలి చెయ్యి పట్టుకుని ‘ఏందే ఇది’ అని మాత్రమే అనగలిగింది. దుఃఖంతో మాట పెగలట్లేదు. మరి కొద్ది సేపట్టో ఆమె చనిపోవడం, పోలీసులు సారికను అరెస్టు చేయడం జరిగిపోయాయి. పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో సంబంధం పెట్టుకున్న స్నేహితురాల్ని బుజ్జగించి చెప్పినా వినకపోతే మందలించినందుకు కలత చెంది పురుగుమందు తాగేసిందని, ఈ విషయం డెత్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చిందని పోలీసులు చెబితే జీర్ణించుకోలేకపోయింది. జీవిత ఖైదు పడేసరికి కుప్పకూలిపోయింది. జైలుకెళ్ళి ఆరునెల్లన్నా కాలేదు బావ మరో అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడని తెలిసి గుండె పగిలిపోయింది. ములాఖత్‌కి వచ్చిన బావ ‘నీకు లైఫ్‌ పడింది, నేను ఎట్లుండాలి? అందుకే పెళ్ళి చేసుకున్నా. నీవు బయటికి వచ్చాక నిన్ను కూడ చూసుకుంటనే… అన్న బావ వైపు స్తబ్దంగా చూస్తుండిపోయింది.

వ్యవసాయ విశ్వవిద్యాలయం… హోంసైన్స్‌ కాలేజ్‌… ఎం.ఎస్‌.సి పూర్తి చేసుకున్న మహిళలంతా కాన్వకేషన్‌ అయిపోయి పట్టా చేతపట్టుకుని కళ్ళల్లో మెరుపుతో, గుండెల్లో ఆత్మ విశ్వాసంతో, త్వరలో ఎదో ఒక మంచి ఉద్యోగంలో చేరిపోతామన్న నమ్మకంతో ఒకరినొకరు అభినందించుకుంటూ ఇళ్ళకు బయలుదేరారు. కాలేజీలో బెస్ట్‌ అవుట్‌గోయింగ్‌ స్టూడెంట్‌గా అవార్డు తీసుకున్న హసీన ఏడాదిలోపే ఒక ఉద్యోగం నచ్చక మరో ఉద్యోగానికి మారింది. స్త్రీల సాధికారతా కార్యక్రమంలో చేరగానే పెద్దలు చూసిన పెళ్ళి చేసుకుంది. ఐదేళ్ళలో ఇద్దరు కొడుకులు పుట్టారు. సంతోషంగా గడిచిపోతోందనుకున్న జీవితంలో ఉప్పెనలా వచ్చి పడింది ఆ వార్త. రెండు రోజులపాటు ఫీల్డ్‌లోనే ఉండి 14ఏళ్ళ అమ్మాయికి ఇష్టంలేకుండా చెయ్యబోయిన పెళ్ళిని ఆపించి ఆమె తల్లితండ్రుల్ని ఒప్పించి హాస్టల్లో చేర్పించిన సంతృప్తితో ఇంటికొచ్చిన హసీనాకి భర్త ప్రవర్తన ఇబ్బంది పెట్టింది. ఆర్నెల్లు గడిచేసరికి స్పష్టమైంది… భర్త మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడని, చాలా రాత్రిళ్ళు ఇంటికి కూడా రాకపోవడానికి కారణం ఉద్యోగపు బాధ్యతలు కాదని… ఇంట్లో, ఆఫీసులో, ఫీల్డ్‌లో ఎక్కడా మనసు కుదరట్లేదు. కుప్పకూలిపోయింది. తన చదువు, తెలివి, చురుకుతనం, సంపాదన, ప్రపంచ జ్ఞానం… ఎన్నున్నా ఇలా ఏలా జరిగింది?

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం… పోలీసు గ్రౌండ్స్‌లో జరుగుతున్న కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌, ఎస్‌పి ముఖ్య అథితులుగా విచ్చేశారు. ఆ సంవత్సరపు ఉత్తమ సామాజిక కార్యకర్తగా అవని అవార్డు అందుకుంది. ఎంతో మంది గ్రామీణ, పేద, దళిత, నిరక్షరాస్య మహిళలకు వారు ఎదుర్కొంటున్న అణచివేత, హింస, వివక్షను సవాలు చేసి స్వతంత్య్రంగా నిలబడగలిగేలా సాధికారత సాధించేలా కృషిచేసింది. అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగాలలో, కాలేజీ చదువుల్లో

ఉన్న ఎందరో మహిళలక్కూడా సమస్యల నుండి బయటపడేందుకు సహకరించింది. వీరందరి కుటుంబాలు కూడా అవని కృషిని అభినందిస్తారు. అయితే, అనాటి సంఘటన ఆమెని ఇరుకున పడేసింది. తను ప్రాణంగా ప్రేమిస్తున్న మోహన్‌ భార్య కలెక్టర్‌కి, ఎస్‌పికి రాయడమే కాక, తన ఆఫీసు ముందు రోడ్డుమీదే అరవడం, బయటకి వచ్చి తనకు న్యాయం చేయమని డిమాండ్‌ చేయడంతో ఎటూ పాలుపోక కలవరపడింది. జిల్లాలో మంచి పేరున్న గ్రూప్‌ 1 ఆఫీసర్‌ మోహన్‌కి ఇబ్బంది కాకుండా ఇది ఎలా డీల్‌ చేయాలో అర్థం కాలేదు. వారు చేసే ఉద్యోగం, ఆమె మాట్లాడే మాటలు, తీరుస్తున్న కేసులు చదువు, హోదా, అందరూ మెచ్చుకునే పెర్‌ఫార్మెన్స్‌… అయినా అదే జరిగింది. ఎలా?

కౌన్సిలింగ్‌ సెంటర్లకి, పోలీస్‌ స్టేషన్లకి వస్తున్న ఇటువంటి కేసులు కోకొల్లలు. ఇక్కడివరకు రాకుండానే కుల పంచాయితిలలో కడ్తున్న కేసులైతే లెక్కకు మించి ఉన్నాయి. బైటికి రాని, బైటపడని… పడలేనివి ఇంకెన్ని ఉంటాయో! కేసులు పెరుగుతున్నాయే కానీ మనుషుల్ని, మనసుల్ని మార్చేసే విధానం, యంత్రాంగం… అసలు వీలౌతుందా? చదువు, తెలివి, కులం, మతం, వర్గం, హోదా… ఏవీ అతీతంకాని స్త్రీలని మరింత కుంగదీస్తున్న ఈ పరిస్థితుల్లో మార్పెలా వస్తుంది?

అంటే మానసిక సంబంధాలు వేటినీ పట్టించుకోవా? అసలివి మానసిక బంధాలేనా? పెళ్ళైన స్త్రీలైనా, పురుషులైనా వివాహేతర సంబంధాల్లోకి ఎందుకెళ్తున్నారు? పెళ్ళైతే అన్నీ చ్కబడతాయని పెద్దవారి మాటలు ఉత్తవేనా? అదంతా భ్రాంతేనా? చట్టాలు చేసేస్తే… వాటిని దురుపయోగపరుస్తున్నారంటూ మళ్లీ సవరణలు చేసేస్తే వీటిలో మార్పోస్తుందా?

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.