పియ్యెత్తిన చేతుల్తో ముద్దెత్తలేక -జూపాక సుభద్ర

మా దగ్గర మూసీ పక్కనే మున్సిపల్‌ కార్మికుల ఇండ్లున్నయి. అవన్ని మాదిగల ఇండ్లు. ఈ మాదిగ మహిళలు తాళ్ళగడ్డ కార్వాన్‌, పురాణాపూల్‌, జియాగూడ జర్రంత వూడుస్తరు. మా తాళ్ళగడ్డ బస్తిల ముగ్గురాడోల్లు జమున, రాణి, లక్ష్మి వూడుస్తుంటరు. నేనటిటు తిరిగెటపుడు వాల్లు కూసుంటే వాల్లతోని కూసుండి వాల్ల మంచి చెడ్డలు మాట్లాడ్తుంట. యీ మధ్య చానా రోజులైంది ఎప్పుడు జూసినా వూడ్సుకుంట సెత్తెత్తి పోస్కుంటనే కనబడ్తండ్రు. కూసొని పుర్సత్‌గా మాట్లాడుకుంటన్నట్లు కననే బడ్తలేరు. అదే అడిగిన ”ఏంది రాణి పల్కరిద్దామన్నా దొర్కుతలేరు, ఎట్టున్నర”ని అడిగిన. ‘ఏముండుడోమ్మ గీ సెత్తపాడు వడ, యెమ సెత్త బెరుగుతుందమ్మా రోజురోజుకు. రోజురోజుకు పెరుగుడేగాని తరుగుత లేదు. నేనిరువై యేండ్ల కాంచి వూడుస్తున్న గింత గనం సెత్తను జూల్లే.

గామొన్న బోనాల సెత్త యెత్తిపోసి వూడ్సి సేతులన్ని బొయినయి. కొబ్బరి కాయల సెత్త, కోల్ల సెత్త, పూల సెత్త, ఆకుల సెత్త, బోనం బువ్వ సెత్త, అది బొయిందంటె వినాయకుల సెత్తచ్చె. దానికి లారెడు లారెడు వూడ్చి యెత్తిపోస్తిమి. వినాయకుని తర్వాత మల్ల బత్కమ్మచ్చె, దీపొలొచ్చె. ఆ సెత్త తక్కువది గాదాయె! యెక్కడైన యెక్కువ పంజేత్తే ఎక్కువ పైసలిస్తరుగానీ మాకా రూలే లేదాయె అంత యెట్టిసేత, యేగిసేత. గీ పండుగలేమోగాని మా రెక్కలు బొక్కలు తెల్లగైతన్నయని చెప్పంగనే చాన బాదైంది.

గల్లీలల్ల సెత్తెక్కువైనా, సెత్త కుప్పలున్నా, డ్రైనేజి నిండిందనీ, కారుతుందనీ, పిల్లి సచ్చిందనీ, కుక్క సచ్చిందనీ మూసీ ఒడ్డునున్న బస్తీలకు బోతరు వెతుక్కుంట. ఆ మాదిగ బస్తీలనే యెతుక్కుంట ఎందుకు బోతరు? వేరే కాలనీలకు, బస్తీలకు ఎందుకు బోరు? చెత్తెత్తే పనుల్ల, వీదులూడిసే పనుల్ల, డ్రైనేజి కాలువలు, డ్రైనేజి పీతిబొందలు శుభ్రం జేసే పనుల్ల యీల్లే అనుభవజ్ఞులుగా ఎందుకు అయినారు అని చూస్తే… ఏవి అందనియ్యని కులపెత్తనమే వారిని అక్కడ అట్టడుగున వుంచింది. సెత్తలకాడ, డ్రైనేజి శుభ్రాల కాడ యీ కులమే ఎందుకుంది? వూడ్సి వూడ్సి ఈ మహిళలే సీపురు కట్టలయిండ్రు. ఈ మొగవాల్లు డ్రైనేజిలల్ల పియ్యెత్తి పోసి డ్రైనేజి బొందలయిండ్రు. ఈ వుద్యోగాలకు ప్రభుత్వాలు కూడా ప్రజాస్వామ్యమని చెబుతూ కులాన్ని అమలు చేస్తున్నయి. పట్టణాల్లో గ్లౌజులు, బూట్లు, జాకెట్లు, నూనెలు యివ్వరు. గ్రామాల్లోనైతే చీపురు, తట్టలు కూడా యివ్వరు. అయినా కూడా మాదిగ మహిళలు గ్రామాల్లో తమ సొంత చీపురు, తట్టలు కొనుక్కొచ్చుకొని యెట్టి జేస్తున్నరు.

అట్లా యెట్టి జేస్తూ సర్కారు కొలువు యీ రోజు కాకున్నా రేపన్నా పర్మనెంట యితదనే ఆశతోని, ఎదురుచూపుతో కూడిన నమ్మకాలు నలుబై యేండ్లయినా వారికి పర్మనెంటు కాదు. వాల్ల శ్రమతో గ్రామాలు, పట్టణాలు ఆరోగ్యంగా వుంటయి.

పట్నమంత ప్రాణాలు బొయేటట్లు వూడిసే ఈ మహిళల ఇండ్లు మురిక్కాలువలతో ముసిరే ఈగలుగా వుంటయి. పట్నాలని, పరిశుభ్రంగా వుంచే పనిలబడి వారి సొంత ఇండ్లు, వాకిల్లు శుభ్రానికి దూరమైన వాతావరణం కనిపిస్తది. వేరే సమాజం హాయిగా ఇండ్లల్ల కుటుంబాలతో నిద్రబోతుంటే ఈ పారిశుధ్య మహిళలు కుటుంబాలను, పసిపిల్లల్ని వదిలి రోడ్లమీద, గల్లీలల్ల చెత్తను వూడ్చే పనిల చెత్తలు యెత్తే పనిల వుంటరు. అనేక అభద్రతల్లో ఈ మహిళలు తమ రక్తాన్ని, చెమటను, జీవితాల్ని త్యాగం జేస్తే పట్నాలు ఆరోగ్యంగా, భద్రంగా వున్నయి. మన గ్రేటర్‌ హైద్రాబాద్‌ల 24 వేలమంది పారిశుధ్య మహిళలుంటే… దాంట్ల 19 వేలమంది మాదిగ మహిళలున్నరు. మిగతా 5 వేలు ఓబీసీ (చాకలి, మంగలి, ముదిరాజ్‌), మాలలు, లంబాడీలున్నారని ఒక లెక్క. యిక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్‌ పట్నాలు, పురపాలక సంగాలు, నగర పంచాయితీల్లో మొత్తం 37 వేలకు పైగా మున్సిపల్‌ వర్కర్లు పంజేస్తున్నరు.

స్వచ్ఛ భారతొచ్చి మహిళా సఫాయి వర్కర్ల మీద ఎక్కువ పని మోపింది. కాని వాల్ల శ్రమకు తగ్గ వేతనం గురించి ఏ ప్రభుత్వాలు మాట్లాడయి. ఆ మధ్య నెలంత సమ్మె జేస్తే 2 వేలు విదిల్చిండ్రు. వారు ఆరోగ్య దాతలనీ పొగిడి పారిశుధ్య పనికి గౌరవస్థానం, కనీస వసతులు, వేతనాలు కల్పించలేదు. చేతులకు గ్లవ్స్‌, బూట్లు యివ్వనందున వుచ్చలు, వుమ్మి చెత్త, కుక్కల, మనుషుల పెంట చేతుల్తోనే ఎత్తిపోసే దయనీయ పరిస్థితి ఈ కుల సమాజానికి అర్థంకాదు. ”ఇట్లా తీసేసిన చేతులతో అన్నం దినబోతే అవే యాదికొచ్చి అన్నం దినబుద్ధికాదంటరు” ఆ మహిళలు.

ఈ సందర్భంగా కార్తీక్‌ నవయాన్‌ తన పిహెచ్‌డీ (వీశీసవతీఅఱఝ్‌ఱశీఅ డ షaర్‌వ) కోసం మున్సిపల్‌ మహిళా వర్కర్స్‌ని కలిసినపుడు వాల్లు చెప్పిన చాలా అనుభవాలు నాతో పంచుకుండు. తార్నాక గల్లీల ఒక కుక్క చచ్చిపోయి కుళ్ళిపోయిందట. తీసి పారేద్దామని పట్టుకోబోతే భరించలేని వాసనతో కాలుక్కాలు, తల్కాయకు తల్కాయ వూడొస్తున్నయి, చేతులకు గ్లౌసుల్లేవు.. యిక అట్లనే ముక్కుకు కొంగు లగాయించి కట్టుకొని, కడుపుల పేగులు నోట్లొకొచ్చే బాధతోని, ఓకారంతోని చచ్చి కుల్లిన కుక్కను ఎత్తేసిండ్రట. అప్పట్నించి ఆ మహిళలు మాంసం దినడం మానేసిండ్రట. అట్లా కుక్కను ఎత్తేసినంక చాలారోజులు యిక మాంసం దినుడు పూర్తిగ మానేసిండ్రట. ఏ మాంసం చూసినా ఆ కుల్లిపోయిన కుక్క మాంసమే వెంటాడిందట. యిట్లాంటి క్రూరమైన హింసతో కూడిన క్రూర అనుభవాలతో యిష్టంగా తినే నీసును తినలేని పరిస్థితులకు నెట్టేస్తే వీల్లని ఎమ్‌.ఎన్‌. శ్రీనివాసన్‌ తన సంస్కృతీకరణ సిద్దాంతంలో దళితులు మాంసం మానేసి శాఖాహారులుగా మారుతూ బ్రాహ్మణులను అనుకరిస్తున్నారని చెప్పడం ఒక కులాధిపత్య వైపరీత్యము.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో