వర్తమాన లేఖ -శిలాలోలిత

ప్రియమైన జూపాక సుభద్రా!

ఎలాఉన్నావ్‌? తెలంగాణ విమోచనోద్యమ కవిత్వ సభలో కలిసామా రోజు. కొన్ని గంటలపాటు కలిసే వీలు కుదిరింది. ‘భూమిక’లో చాలా ఏళ్ళుగా ‘కాలమ్స్‌’ రాస్తూ కాలంతో పాటు ప్రయాణిస్తున్నామనుకో. కృపాకర్‌ మాదిగ ఎలా ఉన్నారు? మీ ఇద్దరి సహజీవన సౌందర్యం నాకిష్టం. మంచి ఉన్నత పదవుల్లో మిత్రులుంటే చాలా ఇష్టం నాకు. పంచాయితీ రాజ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఎడిషనల్‌ సెక్రటరీవి అని గుర్తు రాగానే తృప్తిగా అన్పిస్తుంది. ఈ పదవి వెనుక నిరంతర శ్రమ ఉంది. నీ కృషి ఉంది. కఠినమైన రహదారి వెంట పయనముంది. సింగరేణి కోల్‌ ఏరియా ‘బెల్లంపల్లి’లో పుట్టి పెరిగి చదువు మొదలుపెట్టిన నువ్వు… ఇప్పుడీ నగరం నడిబొడ్డుకు చేరుకున్నావ్‌. స్టూడెంట్స్‌ ఉద్యమాల్లో ఆదినుంచీ పాల్గొంటూ, సామాజిక చైతన్యాన్ని అలవర్చుకున్నావ్‌. అలాగే చిన్నప్పటినుంచీ మిత్రుడైన కృపాకర్‌తో సహజీవనాన్ని ఎందుకు ప్రారంభించకూడదను కున్నావ్‌. అప్పటికే అంటే 2007 నాటికే అమ్మానాన్నల్ని కోల్పోయిన నువ్వు, స్నేహితులతో కలిసి కృపాకర్‌ని స్టేజ్‌ మ్యారేజ్‌ చేసుకున్నావ్‌ కదూ! ‘ఆడోళ్ళలా ఆలోచించే, మొగాయన కావాలనుకున్నా, అట్లే ఉన్న అతడు దొరికిండు’ అనే నీ ముచ్చట హాయిగా అన్పించింది.

హైస్కూల్‌ స్టేజ్‌లోనే కవితలు, కతలు మొదలుపెట్టావ్‌. మొదట్లో ఇష్టమైన, ఇష్టంకాని టీచర్లమీద, స్నేహితుల మీద రాసి చదివి విన్పిస్తుండడంతో నీ రచన మొదలైంది. భాష యాస నీకిష్టం. అలానే సహజంగా మాట్లాడడం. స్వంతభాషలో ఉండే ప్రాణాన్ని గుర్తించడంతో మాండలికంలోనే రాయాలన్న కాంక్ష రోజురోజుకీ స్థిరపడింది. ఇంటి భాష మట్టిభాషలో ఉండే పరిమళం, పుస్తకాల భాషలో లేకపోవడం అప్పుడే గమనించావ్‌. స్త్రీల భాషలో ఉండే సామెతలు, పలుకుబడులు, జీవనానుభవాలు చాలా ఇష్టంగా ఉండేవన్నావ్‌.

డిగ్రీ రోజుల్నుంచే పుస్తకాలు చదవడం బాగా ఎక్కువైంది. రష్యన్‌, చైనా సాహిత్యాలు, ఇతర భాషా సాహిత్యాల పరిచయం పెరిగింది. చలం మీద ప్రేమ బాగా పెరిగింది. తన చుట్టూ ఉన్న జెండర్‌ అస్తిత్వాన్ని గొప్పగా చెప్పాడంటూనే విభేదిస్తావ్‌. చలం స్త్రీలందరూ ఒకటిగానే భావించడం సరైంది కాదన్నావ్‌. 1930లోనే జాషువా ‘సలసల కాగి చిందిన కన్నీటి మహిళ దళిత మహిళ’ – అన్నాడని గుర్తు చేసుకున్నావ్‌. నామిని, అల్లం రాజయ్యల ప్రభావం నీపై ఎక్కువన్నావ్‌. నాకు తెలిసి నువ్వు సీరియస్‌గా రాయడం మొదలుపెట్టింది 1999 నుంచి. ‘గోగు శ్యామల’ – నల్లపొద్దు చూసాక సీరియస్‌గా రాద్దామనిపించింది నీకు. వసంతలక్ష్మి, కొండవీటి సత్యవతి నిన్ను, నీ రచనల్ని బాగా ప్రోత్సహించారు. నాయకుల జీవిత చరిత్రలన్నీ ఇష్టంగా చదువుతున్న క్రమంలో స్త్రీల గురించి లేకపోవడం స్పష్టంగా కన్పించింది.

ఇక, నీ రచనల విషయానికొస్తే 2009లో ‘అయ్యయ్యో దమ్మక్కా’ – కవిత్వ సంకలనం, 2014లో ‘రాయక్క మాన్యం’ కథల సంపుటి వచ్చాయి. కవర్‌ పేజీ నీ గ్రామీణ ముఖంతో అద్భుతంగా ఉంటుంది. నాకిష్టం కూడా. ‘కైతునకల దండెం’ – కృపాకర్‌తో కలిసి వేసిన పుస్తకం. కథలు, కవితల సంపుటి రాబోతున్నాయన్నావ్‌? ఎప్పుడొస్తాయింకా తల్లీ! శ్యామలతో కలిసి ‘నల్లరేగడిచాళ్ళు’ – సంపాదకత్వ బాధ్యత వహించావు. మాదిగ కులాల, డక్కలి, చిందు, మాష్టి, మొండి మొదలైన స్త్రీల గురించి సేకరించినవి. చాలా తృప్తిని మిగిల్చిన రచన ఇది కదూ! బౌద్ధం, దళిత కాస్ట్‌, జెండర్‌ కాన్సెప్ట్‌ గురించి ‘దమ్మక్కా’లో ప్రస్తావించావు. బతుకు చీకటి నుంచి రచన వెలుగు మొదలైంది. నా బాధ్యతగా భావించి నేను కూడా ‘ఎల్లమ్మ కల్యాణం’ లాంటి రచనలు చేస్తా అనుకున్నానన్నావ్‌.

ఇక అవార్డుల విషయానికొస్తే నీకు చాలా వచ్చాయి. తమిళ రైటర్‌ బామ రాసిన సంగధి నవలను తెలుగులోకి అనుసృజన చేస్తే దానికి అవార్డునిచ్చారు. మైత్రేయి కళాసమితి కథా పురస్కారం (2006), నోముల కథా పురస్కారం (2013), తె.యూ. ఉత్తమ కవయిత్రి పురస్కారం (2011), ఏ.పి. అధికార భాషా సంగమ అవార్డు (2007), జి.వి.ఆర్‌. కల్చరల్‌ ఫౌండేషన్‌ అవార్డు (2007), దామోదరం సంజీవయ్య సాహితీ పురస్కారం (2013), సుశీలా నారాయణరెడ్డి అవార్డు (2009), సమాజ్‌ భూషణ్‌ అవార్డు (2013) (మహారాష్ట్రలో ఇచ్చారు దీన్ని), సామాజిక శోధ అవార్డు (2014), నందివాడ శ్యామల సహృదయ్‌ అవార్డు, సామాన్య కిరణ్‌ ట్రస్ట్‌ చేతనా పురస్కారం (2014), రంగినేని ఎల్లమ్మ అవార్డు (2015), అమృతలత అపురూప అవార్డు (2015), తెలంగాణా మహిళా శక్తి అవార్డు (2015), డా||కవితా స్మారక పురస్కారం (2015), లాడ్లీ మీడియా స్పెషల్‌ అవార్డు (2016), తె.యూ. ప్రతిభా పురస్కార అవార్డు (2016), తెలంగాణా రాష్ట్ర సాహిత్య పురస్కారం (2017)… ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది. ఒక మహిళకు దక్కిన గౌరవాలివి అని సంతోషంగానూ ఉందనుకో. భూమికలో ‘మాక్క ముక్కుపిల్ల గీన్నే పోయింది’ కాలమ్‌ తెలంగాణా మట్టి భాషతో, మట్టి పరిమళంతో నిత్య నూతనంగానూ ఉంటోంది.

సుభద్రా! బానిసకు బానిస దళిత స్త్రీ. అందుకే ఆమెకు మరిన్ని ఒత్తిడులు, మరింత క్షోభ, మరింత పెనుగులాట, మరింత ధిక్కారస్వరం. వారి భాషకు, యాసకు గొప్ప ఫిలాసఫీ ఉంటుందనిపిస్తుంది. కాయకష్టమే కాదు మానసిక కష్టమూ ఎక్కువే. వాళ్ళ జీవిత చరిత్రలు నిక్షిప్తం చేయాలన్న నీ ఆలోచన ఎంతో మెచ్చుకోదగింది.

సుభద్రా! ‘మనసు భద్రమయ్యె మన సుభద్రకు’ అన్నట్లుగా నీ పట్ల స్నేహవీచిక అలా వీస్తూనే ఉంటుంది. నీ మాటలోనే ఒక ఆత్మీయత, దగ్గరితనం, మట్టి పరిమళం కలగలిసి కనిపిస్తాయి. మనుషులుగా బ్రతకాలి. అందరికీ సమాన ప్రతిపత్తి కావాలి, వివక్ష పోవాలి అని శ్రామికుల గురించి రచనలు చేస్తూ శ్రమ జీవన సౌందర్యాన్ని కీర్తించే నీ రచనలు నాకిష్టం. ఐతే, చిన్న రిక్వెస్ట్‌ ఏమిటంటే, నీ రచనల కింద ప్రతి పేజీలో అచ్చ తెలుగు తెలంగాణా పదాలకు అర్థాలను ఇస్తూ పోతుంటే, చదివేవాళ్ళకు అర్థమవుతుంది. ఇంకొక విధంగా భాషా వ్యాప్తి కూడా జరుగుతుంది. ఏమంటావ్‌? ఇప్పటికి ఉండనా మరి.

నిన్నభిమానించే నీ శిలాలోలిత

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.