ప్రతిస్పందన

భూమిక పత్రికా సంపాదకులకు,

తెలుగువాళ్ళకి గర్వకారణమైన ‘స్త్రీవాద పత్రిక భూమిక’ ఒక నాటి మానుషి పత్రికను తలపింపచేస్తుంది. భావ ప్రచార, సేవా రంగంలో అంతకంటే ఎక్కువే. ఇన్నిన్ని మొగపోటు పత్రికల మధ్య ఒక ఆడవారి పత్రిక పాతికేళ్ళ సంచికని తీసుకొస్తూందంటే ఆశ్చర్యమే కాదు, ఇది స్త్రీల పోరాట పటిమ కూడా. అంతకుమించి బిడ్డను బ్రతికించుకోవాలన్న స్త్రీల ఐక్యత. ”స్త్రీలకు స్త్రీలే శతృవులు” అన్న మగ నానుడికి చెంపపెట్టు ఈ పత్రిక. స్త్రీలకు శతృవులుగా ఉండే మొగవాళ్ళకు కూడా.

ఈ నెలలో ముందు అట్ట చూస్తే బాధ్యత, వెనుక అట్ట చూస్తే భరోసా. ఎంతో శ్లాఘనీయమైన విషయం ఏమిటంటే గిరిజన సాంప్రదాయ మధ్యాలైన విప్పసార, గుడుంబా, జీలుగు ల్లు వంటి వాటిపైన, ప్రభుత్వాల దుండగీడు తనాన్ని, మద్యం షాపుల లాభాల కోసం వారిని అనేక విధాలుగా హింసిస్తున్న వైనాన్ని నిరసించడం. మూస్తే మద్యం షాపుల్నే మూయించండి అని ప్రశ్నించడం. కల్లుకి

ఉన్న అనుమతి గుడుంబాకి ఎందుకు లేదు? అందునా ఇది వారివారి కుటుంబాల కోసం. మద్యం షాపులు గిరిజన సంస్కృతి సాంప్రదాయ మద్యాలపైన సామ్రాజ్యవాదం లాంటివి. స్త్రీవాదులు చాలా జాగ్రర్తగా ఆలోచిస్తారు అన్న దానికి ఈ సంపాదకీయమే ఋజువు.

మమత కొడిదెల రాసిన రాళ్ళు మాట్లాడగలిగితే కథ. చెరోకి అనే ఉత్తర అమెరికా తెగవారి వ్యధాభరిత, అణిచివేతలకు, గెంటివేతలకు సంబంధించిన కథ. పరిచయం అయిన పాత్రలు గుండెని పిండేస్తాయి. అట్టడుగు వర్గాల వారిని జనజీవన స్రవంతిలో కలవనీయక, తాము నిర్మించిన అరాకొరా సదుపాయాలతోకూడిన, నివాసయోగ్యం కాని చోటులకి ఆయా ప్రభుత్వాలు గెంటివేసిన తీరుకి అద్దంపడుతుంది యీ కథ. ఏదో రూపేణా ఇండియాలో జరుగుతున్నది కూడా అదే. ఏ ప్రచార పటోటాలూ లేకుండానే విశాల విశ్వసాహిత్యాన్ని అందిస్తుంది భూమిక. చాల వంటింటి, పడకటింటి పత్రికలు సిగ్గుతెచ్చుకోవాల్సిన ప్రత్యేకతే ఇది.

‘రిజర్వేషన్లుండాలె’ అంటూ రాజమణి గారి జీవితానుభవాలు, 1990లో చేసిన అన్వేషి వాళ్ళ ఇంటర్వూ ఇప్పటికీ కొత్తగానే

ఉంటుంది, ఏదో రూపేణా అణచబడ్డకులాల వారిపట్ల హీన దృక్పధం ఇప్పటికీ ఇలాగే ఉండటం, తప్పక జ్ఞాపకం వస్తుంది. ప్రతీ మనిషీ తోటివాని యొక్క గుర్తింపు కోరుకుంటాడు. ఇప్పటికి ఈ 2017లో మీరు ఇతరులతో కొత్తవారితో కలిసినప్పుడు మేము రెల్లి, పాకి, మాల, మాదిగలము అని చెప్పండి, పైకి హాయ్‌ అన్నా లోపల తేడా చూపిస్తారు. గిజగిజలాడిపోతారు. తినేకాడ, కూర్చునేకాడ, మెసిలే చోట్ల ఈ అమానవీయ దృక్పధాన్ని మిగిలిన కులాలు పొగొట్టుకోవు. అందుకనే రిజర్వేషన్లుండాలి. కనీసం మా శక్తి యుక్తులైనా మీకు తెలిసి, మేము మీతోపాటి జీతాలనైనా తెచ్చుకోగలుగుతాం.

గురదత్‌ గురించి, భార్గవి రొంపిచెర్ల చక్కటి వ్యాసం రాసారు. ఆ రోజుల్లో నిజ జీవితాల్లో కూడా చిందులు, గెంతులు లేకుండా ప్రేమ కరుణార్ద్ర భావనలతో ఉంటుందో చక్కగా రాశారు. ఆమెకు అభినందలు తెలుపుకోకుండా ఉండలేం.

ఎర్రని ఆకాశం అంటూ డా||పి రమేష్‌ నారాయణ వివిధ వేవ్యావృత్తుల గురించి రాసిన పుస్తకానికి స్త్రీ కోడిహళ్ళి మురళీమోహన్‌ పుస్తక పరిచయం రాసారు. రమేష్‌ నారాయణ పుస్తకం చివర్లో సెక్స్‌ వర్కర్లకి గౌరవనీయ స్థానం లభించాలని, వేశ్యా సంస్కృతికి సభ్యసమాజంలో ఒక గౌరవనీయమైన స్థానాన్ని రూపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాసారు. భూమిక పత్రికకు సంబందించి ఇది చాలా కొత్త విషయం. మరియు వేశ్యా వృత్తి గౌరవప్రదంగా సాగాలని భూమిక కూడా అనుకుంటోందా? అన్న ఇబ్బందికర ప్రశ్న ఎదుర్కొనే విషయం కూడా. ఒకప్పటి వేశ్యలతో సాహిత్యం, చిత్రలేఖనం, సంగీతం, నాట్యం మొదలైన లలిత కళలు ఉండేవి. నాట్యం నేర్చుకోవడాన్ని సంఘం అసహ్యించుకునేది. కాని ఎన్ని లలిత కళలు చుట్టూ పేర్చుకున్నా వేశ్యల జీవితానికి సాంఘిక విలువ తీసుకరావడం చాలా కష్టం. ఎందుకంటే వేశ్యా వృత్తి మగాడి స్వార్దానికి సంబంధించినట్టిది. వారి బ్రతుకుకు ఎటువంటి భద్రత చేకూర్చనటువంటిది. తల్లి, చెల్లి, అక్క, భార్య… ఏ కుటుంబ స్త్రీ అయినా తాము నెలసరికో, కాన్పుకో, అనారోగ్యం వల్లనో ఎడంగా ఉన్న పరిస్థితుల్లో భర్తలను వేశ్యల దగ్గరకు వెళ్ళవచ్చని చెప్తుందా? ప్రశాంతి వ్యాసం (పేజి:44)లో ఈ మోహబంధాల వల్ల స్త్రీలే అటు ఇటు కూడా జీవితాలను నాశనం చేసుకునే స్థితి వస్తూంది. మగవాడు హాయిగా స్వేచ్ఛగానే ఉంటాడు. వేశ్యలైనా సరే, వివాహం చేసుకున్నంత ఉత్తమం లేదు. ప్రస్తుత కాలంలో దాంపత్యం అనేది రెండు జీవితాల ఉన్నత, భౌతిక, మానసిక, సాంఘిక గౌరవ కలయిక అనేది పోయి, రెండు శరీరాల ఏక భర్త చట్టబద్ద వేశ్యా వ్యవస్థగా మారిపోయిన డబ్బు సమాజాపు దుస్థితిలో, ఏకంగా ఇంతకంటే వేశ్యావృత్తే బెటరు అనిపించే రచనలు రావడం, తప్పనిసరేనేమో. ఈ పరిచయానికి భూమిక వారు, వ్యాసం చివర ఒక అభిప్రాయాన్ని రాసివుండాల్సింది.

స్త్రీ పురుషుల మెదళ్ళకు స్వేచ్ఛా మానవ విలువలు రుచి చూపే భూమిక పత్రికను రెండువేలు జీవిత చందా కట్టి మరీ చదవాలని ప్రతీ ఒక్కరినీ కోరుతున్నా. చివరగా భూమికకి జేజేలు.

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.