ట్యూన్‌ అంటే ట్యూనే మరి…

ఇంద్రగంటి జానకీబాల
అప్పుడే విన్న గరమ్‌గరమ్‌ ట్యూన్‌ కదా! నేను మొదలు పెట్టగానే ఆమె కూడా పాడటం మొదలుపెట్టారు. నా ఆనందానికి హద్దే లేదు. ఆమె, నేను ఒకేలాగ పాడుతున్నట్లు నాకు ఒకటే సంతోషం-
ఒక్కసారిగా ఆమె ఆగి ”ఏయ్‌ – అలా ట్యూన్‌ మార్చేస్తావే? అన్నారు. ”ఇలాగేనా” అంటూ నేను పాడాను -, ”కాదు. ఉండు నే చెప్తా – అని కళ్ళు మూసుకుని ట్యూన్‌ గుర్తు తెచ్చుకుని పాడబోయి నేను పాడిందే పాడి ”ఛీ-పాడుపిల్లా నేనే మర్చిపోయేలా చేశావ్‌” అన్నారు. నేను బిత్తరపోయ-, ఒకటి రెండు నిముషాల్లో ఆమె మ్యూజిక్‌ డైరక్టర్‌ చెప్పిన ట్యూన్‌ పాడారు. నాకూ అర్థమైంది. నేను అలాగే అన్నాను.-,
ఇంతకీ ‘ఆమె’ ఎవరు? అని మీరు తికమక పడిపోతు న్నారా-, వస్తున్నాను ఆ సంగతి చెప్పాలనే నా ప్రయత్నం-,
నేను 1959-61 మధ్యలో రెండేళ్ళు ప్రఖ్యాత నేపథ్య గాయని, ఆంధ్రుల అభివన గానకోకిల పి. సుశీలగారి దగ్గర చిన్న ఉద్యోగం చేశాను. నా ఉద్యోగధర్మం ఏమిటంటే ఆమెతో రోజూ తోడుగా పాటల రిహార్సల్స్‌కి వెళ్ళడం – రికార్డింగులకి వెళ్ళడం – నేను చిన్నపిల్లని -, సంగీతమంటే చాలా అభిమానం – ముఖ్యంగా సినిమా పాటలంటే ప్రాణం పెట్టేసే పిచ్చివ్యామొహం వున్నదాన్ని-,
అప్పట్లో (బహుశ ఇప్పటికీ) గాయనీమణులకి గానీ, నటీమణులకు గానీ ఎవరో ఒకరు పక్కన ఒక తోడుగా వుండటం ఒక పద్ధతిగా వుండేది- అందుకోసం మాకు తెలిసిన మిత్రుల ద్వారా నేను మద్రాసు సుశీల దగ్గరకి వెళ్లాను. ఆమె భర్త డాక్టరు తీరిక వున్నప్పుడు ఆయనే ఆమెతో వెళ్ళినా, నా ఉద్యోగం మాత్రం అది-,
అప్పటికే నాకు సుశీల పాడిన ఎన్నో పాటలు వచ్చు. మా చిన్న వూళ్లో అంతవరకు కొంత కీర్తిని కూడా పొంది వున్నాను -, నేనామెతో గడిపేటప్పుడు ఆమె ట్యూన్‌ గురించి చెప్పి, సంగీతదర్శకులు ఏ విధంగా చెప్తే, అదే విధంగా అచ్చుగుద్దినట్లు వుండాలి – మధ్య సొంతాలుండకూడదు’ అని వివరించేవారు. టేపురికార్డు-రికార్డు చేయడం లాంటివి అప్పట్లో ఎక్కువగా వుండేవి కాదు. ఆర్టిస్టు ఎదురుగా కూర్చుని సంగీత దర్శకుడు హార్మోనియమ్‌ వాయిస్తూట్యూన్‌ నేర్పించటమే పద్ధతి. ఈ విషయంలో సుశీల గారి గురించి చెప్పాలంటే ఆమె గ్రహణశక్తి ఒక అద్భుతమనే చెప్పాలి. ఒక్కసారి వినగానే ఆయన నోట్లోంచి ఊడిపడిన బాణీ ఆమె గళంలో మెరుగులు దిద్దుకునేది -, ఒక్క రిహార్సల్‌ అయితే రికార్డింగులో ఆర్కెస్ట్రాతో ఉన్నదున్నట్లు ‘రికార్డింగ్‌’ అయిపోవాల్సిందే-, సుశీల అగ్రస్థానంలో అన్నేళ్లు నెగ్గుకురావడానికి ఇదీ ఒక అర్హతనిపిస్తుంది. అయితే సినిమాల్లో ప్లేబ్యాక్‌ పాడటానికి అది ముఖ్యమైన అర్హత అని సంగీతప్రముఖులు అంటారు. సంగీత దర్శకులు చెప్పింది చెప్పినట్లు పాడుతూనే, ఆ పాటలోని భావానికి హృదయధర్మం చేకూర్చగలిగినప్పుడే వారు గొప్ప గాయనీ గాయకులవుతారు. అందుకే సిని్మాపాట గొప్పగా (అంతక్రితం మరొకళ్ళు పాడిన పాట) పాడగలిగినా, సొంతంగా కొత్తపాట బాగా పాడలేకపోవడం చూస్తంటాం-, అదే ఒరిజినాలిటీ అంటే-, కళకైనా అదే ప్రాణం-.
ఎన్నో పాటలు రేడియెలో సుశీలగారు పాడుతుంటే, తాము కలిపి పాడేసి, మనం కూడా గొప్పగా పాడేస్తున్నాం అనుకుంటాం. ఆమెలాగ పాడలేకపోయినా ఎంతో కొంత పాడుతున్నామని ఆనందించటమే మిగులుతుంది చివరికి. ఆ తృప్తి కూడా ఎంతో గొప్ప అనుభూతిని మిగులుస్తుంది.

Share
This entry was posted in పాటల మాటలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.