”ప్రార్ధించే చేతులకన్నా, సేవచేసే చేతులు మిన్న”
సమాజంలో మార్పు రావాలి, మానవుల్లో ఉన్నత విలువలు పెరగాలి అంటూ రచయితలంతా రచనలు చేస్తాం. అలా మావి ప్రార్థించే చేతులైతే, మీవి సేవచేసే చేతులు.
ఒ ఉన్నత లక్ష్యంతో, నిజాయితీతో ముందుకు సాగుతున్న శక్తి మీరు. పాతికేళ్ళుగా స్త్రీ లోకానికి బహుముఖంగా మీ సేవలు అందిస్తున్నారు.
భూమిక మాసపత్రిక స్థాపించి రచనలద్వారా, సామాజికవేత్తగా ప్రత్యక్షంగా ఉత్తేజపరుస్తూ సేవా కార్యక్రమాలు చేసి మానవత్వానికి మరోపేరుగా నిలబడి స్త్రీలను నడిపిస్తున్నారు. ఈ రహదారిలో వచ్చిన అడ్డంకులను అధిగమించి ఇన్ని మైలురాళ్ళను దాటడమంటే చిన్న విషయం కాదు. అది చాలా గొప్ప విజయం.
మహిళల హక్కుల కోసం పోరాటం చేసే దారి చూపుతూ, వారి సమస్యల పరిష్కారం కోసం మీరనుసరిస్తున్న మార్గం అందరికీ ఆదర్శనీయం.
నేను రాసిన చాలా కవితల్ని ప్రచురించి నన్ను ప్రోత్సహించినందుకు నా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.
తోటి రచయితగా మీరు మా అందరికీ గర్వకారణం. స్త్రీ సమూహం అందరికీ మీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం.
సిల్వర్ జూబ్లీని జరుపుకోబోతున్న ఈ ప్రత్యేక సందర్భంలో మీకూ, మీ టీం సభ్యులందరికీ నా ప్రత్యేక అభినందనలు.
– అల్లూరి గౌరీలక్ష్మి, విజయవాడ