‘భూమిక’ అనే పేరు వినగానే ఒక రకమైన energy వస్తుంది. ‘భూమిక’తో అనుబంధం తలచుకుంటే గర్వంగా ఉంటుంది. భూమిక పత్రికలో నాకు ఎక్కువగా నచ్చేది సంపాదకీయం. అవి చాలా ఆలోచింపచేస్తాయి. ఒక issueని వేరే కోణంలో చూడొచ్చు. లాయర్ని కాబట్టి నాకు అత్యంత ఎక్కువగా నచ్చింది మార్చి 2016 సంచిక. ఎందుకంటే, లాయర్లకి కూడా ఉపయోగపడేలా legal information ఉంది. ఆ issue 100 కాపీలు కొని అందరికీ పంచాను. అంత బాగుందన్నమాట. Good job.
‘భూమిక’కు అనుసంధానంగా వచ్చే informatory booklets చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అవి ఎప్పుడూ ఒక కాపీ carry చేస్తాను. చాలా handy & useful.
‘భూమిక’ మరిన్ని మంచి విషయాలు, పుస్తకాలు ప్రచురించాలని మనసారా కోరుకుంటున్నాను. భూమిక సంపాదకీయ వర్గానికి, టీంకు శుభాకాంక్షలు. Thank you Bhumika