ప్రస్తుత కాలంలో కాలుష్యం చాలా ఎక్కువ అయిపోతోంది. దాని ద్వారా ప్రజల్లో ఆయుష్షు తగ్గిపోతోంది. ప్రకృతి అంటే చెట్లు, కొండలు, పూలు, ఫలాలు, భూమిలో ఉండే చాలా విలువైన సంపద తగ్గిపోతోంది. ఉదాహరణకి నూనె, బొగ్గు, బంగారం, పెట్రోల్ ఇంకా ఎన్నో… వీటిని అతిగా వాడడం వలన అవి తరిగిపోతున్నాయి. కాలుష్యం పెరిగిపోతోంది. కాలుష్యం పెరగడం వలన మనుషులు ఆరోగ్యంగా ఉండట్లేదు. పూర్వకాలంలో ”ధర్మో రక్షతి రక్షితః” అన్నారు. కానీ ఇప్పటి పరిస్థితిలో ”వృక్షో రక్షతి రక్షితః” అనాలి. మనం ప్రకృతిని నాశనం చేయడం వలన మనమే కాక ఇతర జీవులు కూడా బాధపడుతున్నాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లను నాటాలి, కాలుష్యాన్ని తగ్గించాలి. సూర్యుడినుండి వచ్చే హానికరమైన కిరణాలు నుండి ఓజోన్ పొర మనల్ని రక్షిస్తుంది. ఓజోన్ అంటే ూ3 లేదా ట్రై అటామిక్ ఆక్సిజన్. మనం వదిలే కాలుష్యం వల్ల అది తరిగిపోతుంది. చెట్లు ఆక్సిజన్ వదులుతాయి. ఓజోన్ పొర తరిగిపోవడం వల్ల చర్మ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు సోకే అవకాశం ఉంది. చెట్లు నరకడం వల్ల అది తరిగిపోతుంది. కర్మాగారాల్లో వాడే కెమికల్స్‌ను న్యూట్రల్ చేయకుండానే వదలడం వలన ఆసిడ్ రైన్ వస్తుంది. దీనిద్వారా చాలా చారిత్రాత్మక ప్రదేశాలు నాశనమవుతున్నాయి. కావున మనం ”వృక్షో రక్షతి రక్షితః” అనే నినాదాన్ని నిజం చేయాలి. మనం చెట్లని నాటి వృద్ధి చేస్తూ మన చుట్టుపక్కల కూడా చేయించాలి.