రాజసంతో వెలిగిపోతోంది…
ఎవరో ఎవరికో చెప్తున్నారు…
ఆమేరా స్త్రీత్వం అంటే…
ఒక్కొక్కరుగా వస్తున్నారు…
ఆమె మమతల మాధుర్యం, అమ్మ తనంగా చూశారు…
వెరొకరొచ్చారు…
ఆమెని భోగస్వరూపంలో మార్చారు…
తిరగబడింది…
ఆమెకి గతకాలాల మమతల రూపంతో పోల్చి…
ఆమెలో ఆమెకే తెలియని ఆత్మన్యూనత పెంచారు…
ఆమె నేడు అటు మమతల మాతృమూర్తి కాలేక…
ఇటు ఆధునికతకి రూపమని
వీళ్ళు రుద్దుతున్న భోగవిలాసాలని జయించలేక…
జీర్ణంకాని బలవంతపు ఆధునికతలో…
వెళ్ళలేక
ఉండలేక…
వేరొక గొర్రెపిల్లని తోడు వెతుక్కుని…
తాను
తోడేలో గొర్రెపిల్లో తెలియని మరో క్రొత్త మృగంలా…
ఆ పిల్లని బలికి ఉసిగొలుపుతూ…
తనని తాను హింసించుకుంటూ, వేరొకరికి హింసని ప్రోత్సహిస్తూ…
పైన వెలగపండులా…
లోన డొల్లలా…
ఒప్పలేని ఓటమి…
నప్పని మనస్సాక్షితో…
తనకి తాను మిగలలేక…
వేరొకరికి ఏమీ కాక…
తల్లి చెల్లి చెలి ఏదీ స్థిరమవని ఉనికిలో…
సుడిగుండంలో చిక్కిన మదిలో అల్లాడుతోంది…
ఆమే…
నేటి ఆధునిక స్త్రీ రూపం…
అనుక్షణం వెతుక్కుంటోంది
వెలుగు తెలియని లోకంలో…
మది అద్దంలో…
తప్పిపోయిన తన ప్రతిబింబాన్ని…