యుగాలు మారినా, తరాలు మారినా, అంతరాలలో మార్పేది
ఓ నిర్భయ, ఓ పసికందు, ఓ చిన్నారి, ఓ ఆడపదార్ధం చాలు
మత్తులో యువత సాగించే ఈ విశృంఖలకేది అంతం?
నవ్యత పేరుతో, తేడా లేని డ్రస్సులతో కల్చరనుకుంటే
ప్రశ్నించిన వారిని నిరసిస్తే అడిగే వారేరి?
మానవతా విలువలు మంట కలిపి
పైశాచికంగా మృగాలవలె ప్రవర్తిస్తుంటే
మృగనీతి కూడా తలదించుకుంటుంది
క్షణికావేశానికి జనించిన సంతానం
బంధాలు, అనుబంధాలు తెలియక
మృగాలయితే… బాధ్యతెవరిది?
సభ్య సమాజం చేరదీసి
నవజీవనాన్ని అందిస్తే…
వారిలోని కసిని, గసిని, పూడ్చినపుడే
వారిలోని జీవన విలువలు ఉద్దీపింప చేసినపుడు
అంతరాలలోనే
మృగాడు మనిషై
ఆదర్శ సమాజం అవతరిస్తుంది