”ధైర్యం వుంటే పట్టుదల దానంతట అదే వస్తుంది.”

ఆర్‌.శాంతసుందరి
(బేబీ హాల్‌దార్‌ రాసిన ‘ఆలో ఆంథారి’ అనే బెంగాలీ పుస్తకాన్ని పొఫ్రెసర్‌ పబ్రోధ్‌కువర్‌ (పేమ్రచంద్‌ కూతురి
కొడుకు) హిందీలోకి అనువదించాడు. తన ఇంట్లో పనిమనిషిగా చేరిన బేబీని ఆయన తన కూతురిగా భావించి,
రచయితిన్రి చేశాడు. బేబీ పబ్రోధ్‌కుమార్‌ని ‘తాతుష్‌’ (పోలిష్‌ భాషలో, నాన్న అని అర్థం) అని పిలుస్తుంది.
పబ్రోధ్‌కు్మార్‌ రాసిన హిందీ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన ఆర్‌. శాంతసుందరి ‘భూమిక’ కోసం
బేబీతో చేసిన ఇంటర్వ్య. -ఎడిటర్‌)
శాంత: హలో, బేబీ! వెల్‌కమ్‌ టు హైదరాబాద్‌!
బేబి: నమస్తే! హైదరాబాద్‌కి, అసలు ఆంధ్రప్రదేశ్‌కి, మొదటిసారి వస్తున్నాను.
శాంత: ఓహో… అయితే మీరు ఊరు ్చూద్దురుగాని.
బేబి: అవును, ముఖ్యంగా చార్మినార్‌ ని తప్పకుండా ్చూడాలి.
శాంత: సరే, ప్రస్తుతం ‘ొభూమిక’ స్త్రీవాద పత్రిక కోసం మీ ఇంటర్వ్య తీసుకోవాలి. మొదలుపెడదాొమ?
బేబి: ఊఁ… అడగండి…
శాంత: మీరు బెంగాలీలో రాసిన మీ జీవితంలోని అనుభవాలనీ, సంఘటన లనీ చదివి, అనువాదం చేస్తున్నప్పుడు నా మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. మీది చాలా అసాధారణమైన జీవితం … కష్టాల గురించి కాదు నేను చెప్పేది. అవి మనదేశంలో చాలామంది జీవితాల్లో కనిపించేవే. కాని, వాటిని మీరు ఎదుర్కున్న తీరు భిన్నమైనది. ముందుగా అటువంటి పరిస్థితుల్లో ముగ్గురు పిల్లల్ని వెంటపెట్టుకుని ఫరీదాబాద్‌ లాంటి కొత్తచోటికి వెళ్లే ధైర్యం మీకెలా వచ్చిందో కొంచెం చెపుతారా?
బేబి: నాలో అలాంటి ధైర్యం రావటానికి ఒకరకంగా మా అమ్మే కారణం.
శాంత: (ఆశ్చర్యంగా) మీ అమ్మ? మీకు ఏడేళ్ల వయసప్పుడే ఆవిడ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది కదా!
బేబి: అదే కారణం. ఆవిడ నన్ను అలా వదిలి వెళ్లిపోవటం వల్లే నా జీవితం కష్టాలపాలయింది. మా అమ్మకీ నాన్నకీ క్షణం పడేది కాదు, నాన్న అమ్మని చాలా కష్టాలపాలు చేశాడు. తలిదండ్రుల నీడలో పెరగవలసిన వయసులో జీవితం గాడి తప్పటంతో, నాకు ఏ కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం వచ్చిందని నేను అనుకుంటున్నాను. జీవితంలో ఎదురైన కష్టాలే నాకు ధైర్యాన్నిచ్చాయి.
శాంత: ఒక్క ధైర్యమే కాదు, మీ జీవితకథ చదివితే, మీలో పట్టు దలా, ఆలోచనల్లో స్పష్టతా కూడా ఉన్నాయనిపించింది. చదువు అంతంత మాత్రమే ఉన్నా కూడా మీలో ఈ గుణాలు ఎలా వచ్చాయంటారు?
బేబి: ధైర్యం ఉంటే పట్టుదల దానంతట అదే వస్తుందని నా ఉద్దేశం. చిన్నప్పట్నించే నా ఆలోచనల్లో స్పష్టత ఉండేదనుకుంటా, అది పుట్టుకతో వచ్చిన లక్షణం. తాతుష్‌ ఇంట్లో ఆశ్రయం దొరి కాక దానికి తగిన ఆధారం లభించింది. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
శాంత: ఈ పుస్తకం రాయటం వెనక ఉన్న నేపథ్యాన్ని కొద్దిగా వివరిస్తారా?
బేబి: ఈ పుస్తకాన్ని నేను రాశా నంటే, రాయగలిగానంటే, దానికి ముఖ్యకారణం తాతుష్‌. ఆయనే కనక, చదవటం, రాయటం కూడా నీ పనిలో భాగమే, అని నన్ను బలవంతపెట్టి ఉండకపోతే నేను ఎన్నటికీ రచయిత్రిని అయి ఉండేదాన్ని కాదు. నాలో చదువుకోవాలన్న ఆర్తి, దాహం చాలా ఉండేవి. దాన్ని ఆయన పసిగట్టారు. దాదాపు 20 ఏళ్లు అక్షరమ్ముక్క చదవని నేను ఆయన మాటవిని రాయటం ప్రారంభించేసరికి, మొదట్లో తప్పులు తడకలుగా, వంకరటింకర అక్షరాలు రూపుదిద్దుకునేవి. వాటిని కష్టపడి పరిష్కరించినవారు తాతుష్‌, ఆయన స్నేహితులు. నన్ను ఎప్పటికప్పుడు సరిదిద్ది, ప్రోత్సహించి నాచేత పుస్తకం రాయించారు. నా భాష క్రమక్రమంగా మెరుగు పడింది. అంతేకాదు, తాతుష్‌ నేను రాసిన బెంగాలీ రాతప్రతిని హిందీలోకి అనువదించారు. బెంగాలీ కన్నా ముందు హిందీ పుస్తకమే అచ్చయింది.
శాంత: మరి దాదాపు 20 ఏళ్ల తరవాత మీ ఏడో ఏట నుంచీ జరిగిన సంఘటనలన్నీ అంత స్పష్టంగా, వివరంగా రాశారు కదా? అంత వివరంగా మీకవన్నీ ఎలా గుర్తున్నాయి?
బేబి: నా జీవితంలో వెనక్కి చూసుకుంటే సుఖం, సంతోషం తక్కువా, బాధ ఎక్కువా అనిపించేది. అందుకేనేవె నేను ఎప్పుడ వాటిని నెమరువేసుకుంటనే ఉండేదాన్ని. ఆ సంఘటనలన్నీ నా మనసులో సుళ్లు తిరుగు్తూనే ఉండేవి, అందుకే ఏ చిన్న సంఘటననీ నేను మర్చిపోలేదు.
శాంత: మీ పుస్తకంలో విశేషం ఏమిటంటే మీ దుఃఖాన్నీ, వేదననీ మీరు మాటల్లో వర్ణించలేదు. ఊరికే సంఘటనని వర్ణించి ఊరుకున్నారు. అది మీకు జరగనట్ట, ఇంకెవరికో జరిగినట్ట అంత తటస్థంగా ఎలా చెప్పగలిగారు?
బేబి: మీరు నా పుస్తకం చదివేప్పుడు ఒక విషయన్ని గమనించే ఉంటారు. అక్కడక్కడ ‘నేను’కి బదులు ‘బేబీ’ అని రాశాను. మరీ మనసుకి కష్టం అని తోచిన విషయలని అలా ఎవరికో జరిగినట్టు రాయటంవల్లే బహుశా అలాంటి తటస్థభావం నా రచనల్లో వచ్చి ఉంటుంది.
అదీకాక నేను గమనించిన ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మనందరికీ జీవితంలో సుఖమే కావాలి, దాని కోసమే ఎదురుచూస్తాం, సుఖాన్ని కోరుకుంటాం. అందుకేనేవె, అది మననించి ్దూరంగా పారిపోత ఉంటుంది. దుఃఖం అలా కాదు, అది హఠాత్తుగా వచ్చి మీద పడుతుంది. మనం దానికి సిద్ధంగా ఉండం, దానిని మనం ఇష్టపడం, వద్దనుకుంటాం. ఒక దశలో నేను దుఃఖాన్ని ఇష్టపడటం, కోరుకోవటం మొదలు పెట్టాను. అప్పట్నించీ దుఃఖం వస్తే బాధపడటం పూర్తిగా ఆగిపోయింది. అది నేను కోరుకున్నదే కావటంతో, నాకది స్నేహితు రాలిలా కనిపించసాగింది.
శాంత: చాలా గొప్పగా చెప్పారు, బేబీ! ఎంత లోతైన ఆలోచన! పెద్దపెద్ద తత్వవేత్తలకి కూడా తట్టని గొప్ప సిద్ధాంతం ఇది. పెద్ద పెద్ద చదువులు, అంటే డిగ్రీల, పుస్తకజ్ఞానం, ఉన్నవాళ్లు కూడా చెప్పలేనంత స్పష్టంగా మీరు జీవిత సత్యాలని చెప్పగలుగుతున్నారు. దీనికి కారణం బహుశా జీవితాన్ని మీరు క్షుణ్ణంగా చదవటమే అనుకుంటా.
బేబి: అవును, జీవితం నేర్పే పాఠాలని ఏ పుస్తకమూ నేర్పలేదు.
శాంత: మీతో ప్రస్తుతం ఇద్దరు పిల్లలే ఉంటున్నారు. పెద్దబ్బాయి ఎక్కడున్నాడు? అతను మీతో ఎందుకు ఉండటం లేదు?
బేబి: పెద్దవాడిని మొదటినించీ నా భర్త తనవైపుకి తిప్పు కున్నాడు. అన్నీ పనికిమాలిన అలవాట్లు నేర్పాడు. వాడు చదువు కోకపోవటానికి కారణం నా భర్తే. నేను ముగ్గురు పిల్లల్తో ఫరీదాబాద్‌ వచ్చినప్పుడు కూడా నా అన్నదమ్ములు వాడిని పనిలోపెట్టి నాకు ద్దూరం చేశారు. నేనెంత ప్రయత్నించినా వాడు నా ొమాట వినిపించుకోలేదు. చివరికి తాతుష్‌ మాట కూడా వినలేదు. మళ్లీ వాళ్ల నాన్న దగ్గరకే వెళ్లిపోయడు. ఇప్పుడు వాడి వయసు 21. నా పధ్నాలుగో ఏట పుట్టాడు వాడు. ప్రస్తుతం వాడు వాళ్ల నాన్న దగ్గర కూడా లేడు. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలీదు. అయినా నేను వాడి గురించీ, నా భర్త గురించీ ఆలోచించటం పూర్తిగా మానేశాను. నా ధ్యాసంతా నా దగ్గరున్న ఇద్దరు పిల్లల గురించే.
శాంత: ప్రస్తుతం చిన్నపిల్లలిద్దరు ఏం చదువుతున్నారు? వాళ్ల అభిరుచులేమిటి? ఇద్దర్లో ఎవరైనా మీలాగ రచనలు చేస్తారా?
బేబి: అబ్బాయి తొమ్మిదోక్లాసు, అమ్మయి ఎనిమిదోక్లాసు చదువుతున్నారు. అబ్బాయికి స్పోర్ట్సు అంటే ఆసక్తి. అమ్మయి పెయింటింగ్‌ చేస్తుంది. ఎనిమిది తొమ్మిదేళ్ల వయసులో కవిత్వం రాసేది, ఇప్పుడు రాయటం లేదు. బొమ్మలు గీయటంలోనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తోంది. అబ్బాయి తాపస్‌ కరాటేలో బ్లాక్‌బెల్ట్‌-2 స్థాయికి వచ్చాడు.
శాంత: అబ్బాయికి కరాటే నేర్పిస్తున్నారు, మరి అమ్మయికో? ఆడపిల్లల మీద పెరిగిపోతున్న హింసని చూస్తే ఆ విద్య అమ్మయికే ఎక్కువ అవసరమని అనిపించటం లేదా?
బేబి: (నవ్వుత) అమ్మయి, ప్రియ, చాలా గట్టిది. దాని గురించి నాకు అసలు భయమే లేదు. నాకన్నా ధైర్యవంతురాలు. నాకే అప్పుడప్పుడ పాఠాలు చెపుతూ ఉంటుంది!
శాంత: మీ రెండో పుస్తకం కూడా అచ్చయిందని విన్నాను, దాన్ని గురించి కూడా మాకు చెపుతారా?
బేబి: అవును, రెండో పుస్తకం అచ్చయింది. దాన్ని కూడా తాతుష్‌ హిందీలోకి అనువదిస్తున్నారు.
రెండో పుస్తకం మొదటి పుస్తకానికి కొనసాగింపే కానీ, దానికీ దీనికీ తేడా ఉంది. మొదటి పుస్తకం రాసి నేను నా మనసులోని భారాన్ని దింపుకున్నాను, అనిపించింది. రెండో పుస్తకంలో, మొదటి పుస్తకంలో రాసిన నా కష్టాలకి కారణాలు ఏమై ఉంటాయెనని అర్థం చేసుకోటానికి ప్రయత్నించాను. నా భర్త, తండ్రి, అన్నదమ్ములు నా పట్ల అలా ఎందుకు ప్రవర్తించారని ఆలోచిస్తే నాకు సంతృప్తికరమైన జవాబులు దొరికాయి. వాళ్ల ప్రవర్తనకి వాళ్లు పుట్టి పెరిగిన వాతావరణమూ, వాళ్లు చూసిన జీవితమూ, సా్మాజిక పరిస్థితుల కారణమని అర్థమయక ఒక రకంగా చెప్పాలంటే వాళ్లని క్షమించగలిగాను.
శాంత: ప్రస్తుతం మీ నాన్నా, అన్నదమ్ముల మిమ్మల్ని అప్పుడప్పుడైనా కలూస్తూ ఉంటారా?
బేబి: ొమా నాన్నన్ని చూడటానికి ఎప్పుడైనా నేనే వెళ్తూ ఉంటాను. నేను పుస్తకం రాశానని తెలిసి ఆయన దాన్ని చదివాడు, చాలా బాగా రాశానని పొగిడాడు. ‘నీ గురించి అంతా చెడే రాశాను కదా, మరి అది నీకెలా నచ్చింది?’ అని నేనడిగితే, ‘నువ్వు ఉన్నొమాటేకదా రాశావు? నాకు నీ పుస్తకం ఎందుకు నచ్చిందో చెప్పనా? దీన్ని చదివితే మిగతా మగవాళ్లు, ముఖ్యంగా పిల్లల తండ్రులు నాలాగ ప్రవర్తించకుండా ఉంటారు, అందుకే నచ్చింది!’ అన్నాడు.
అన్నదమ్ములు దగ్గర్లోనే ఉన్నారు. నా అన్న మంచివాడు. కానీ తమ్ముడికి స్వార్థం ఎక్కువ. నేను బాగుపడ్డాక, తాతుష్‌ ఇంటికి ఒకటి రెండుసార్లు వచ్చి నాతో మంచిగా ఉండటానికి ప్రయత్నించాడు. కానీ అతన్ని మరీ దగ్గరకి చేర్చద్దని తాతుష్‌ నన్ను హెచ్చరించాడు.
శాంత: ఈ ‘తాతుష్‌’ అనే మాట మీరు చాలాసార్లు వాడారు, దానికి అర్థం ఏమిటి?
బేబి: (నవ్వి) పోలిష్‌ భాషలో ‘తాతుష్‌’ అంటే నాన్న! తాతుష్‌ భార్య పోలిష్‌ లేడీ. ఆయన ముగ్గురు కొడుకుల ఆయన్ని ‘తాతుష్‌’ అంటారు. కూతుళ్లు లేనందున ఆయన నన్ను కూతురిగా భావించి అలాగే పిలవమని అన్నారు.
శాంత: మరి మీపేరు బేబీయేనా, ఇంకా ఏమైనా ఉందా?
బేబి: లేదు ఉత్త బేబీయే, అమ్మ నాన్నా, అందర అలాగే పిలిచేవారు (హాయిగా నవ్వుతూ) నేను ఎప్పటికీ బేబీగానే ఉంటాను, అలా ఉండటమే నాకిష్టం. ఎంత పెద్దదాన్నయినా ఇంకా బేబీనే!
శాంత: మీరు అనుకోకుండా రాసిన ఈ పుస్తకానికి ఇంత ప్రాచుర్యం లభించింది. 24 భాషల్లోకి అనువాదం అయింది. అవి ఏమేం భాషలో చెప్పగలరా?
బేబి: భారతీయ భాషల్లో మలయళం, తమిళం, హిందీ, మరాఠీ, అస్సామీ మొదలైనవాటిల్లోకీ, ఇప్పుడు తెలుగులోకీ అనువదించబడింది. ఇక విదేశీభాషల్లో స్పానిష్‌, చైనీస్‌, ఇంగ్లీష్‌, కొరియన్‌, జర్మన్‌, ఫ్రెంచ్‌, మొదలైన భాషల్లోకి అనువదించబడింది.
శాంత: ఒక్క పుస్తకం ఇన్ని భాషల్లోకి వచ్చింది. ఈ పుస్తకం రాసి మీరు దేశంలోనే కాక ప్రపంచమంతటా పేరు సంపాదించుకున్నారు. విదేశాలు తిరిగి వచ్చారు. అయినా ఇప్పటికీ తాతుష్‌ ఇంట్లో పనిచేస్తూ ఔట్‌హౌస్‌లోనే ఉంటున్నారు. మీ కాళ్లింకా నేలమీదే ఉన్నాయి. గర్వం, అహంకారం, స్వార్థం మీలో ఏకోశానా లేవు, అదెలా సాధ్యమైంది?
బేబి: తాతుష్‌ నాకు ఆసరా ఇవ్వకపోతే నేనెక్కడ ఉండేదాన్ని? ఆ సంగతి నేను ఎలా మర్చిపోగలను? పైగా నన్నాయన జీతం తీసుకునే పనిమనిషిలా ఏనాదూ ొచూడలేదు, ఒక కూతురిలాగానే ొచూసుకుంటున్నాడు. ఎవర లేని నాకు ఆయనే తల్లీ, తండ్రీ, గురువూ, అన్నీ. అటువంటి మనిషి దగ్గర నేను అహంకారం ఎలా ొచూపించగలను?
శాంత: అసలు ఆయన దగ్గరే కాదు, ొమాతో మాట్లాడేప్పుడు కూడా మీరింత స్నేహంగా, ఆప్యాయంగా, నిగర్విలా ఎలా ఉండగలుగుతున్నారు?
బేబి: చెప్పా కదా? మొదటి పుస్తకం రాసినప్పుడు నాకేమీ తెలీదు. నా మనసులోని బరువు దింపుకోవటానికి మాత్రమే నేను దాన్ని రాశాను. రెండో పుస్తకం జీవితాన్ని అర్థం చేసుకోటానికి రాశాను. అసలు ఇకమీదట నేను నా గురించి కాక, నా చుట్ట ఉన్న నాలాంటివాళ్ల గురించి రాయలనుకుంటున్నాను. కొన్ని వ్యాసాలు కూడా రాశాను. నేను నేలమీదే ఉండటానికి ఇష్టపడతాను. ఎప్పటికీ మట్టితోనే నా అనుబంధం! పేరు సంపాదించుకోవటం నా ఉద్దేశం కానేకాదు.
శాంత: మీ రచనలు చదివి స్స్పూర్తి పొందిన వారినెవరినైనా మీరు ఎరుగుదురా?
బేబి: తెలుసు. నేను తస్లీొమా నస్రీన్‌, ఆశాపూర్ణాదేవి పుస్తకాలు చదివి ్స్పూర్తిని పొందినట్టే, నా పుస్తకాలు చదివి, స్త్రీలేకాదు, పురుషులు కూడా నాకు ఫోన్లు చేస్త, ఉత్తరాల రాస్తూ ఉంటారు. సాధారణంగా అందరం ముసుగుల్లోపల బతుకుత ఉంటాం. నేను ఏ ముసుగుల, అతిశయెక్తుల లేకుండా, ఉన్నదున్నట్టు నా జీవితం గురించి పుస్తకంలో రాశాను. అది చదివి కొంతమందికి తమ గురించి చెప్పుకునే ధైర్యం వచ్చింది. బీహారులో అక్షరమ్ముక్క కూడా రాని సుశీలారాయ్‌ అనే స్త్రీ 80 పేజీల పుస్తకం రాసింది. ఇంకొకరు చదవగా నా కథ విని, చదవటం, రాయటం నేర్చుకుని, పుస్తకం రాసింది. అలాగే ఇంకొకతను తన జీవితకథని రాయటం మొదలుపెట్టి, ఇప్పటికి 50 పేజీలు రాశాడు.
శాంత: మీతో మాట్లాడి మీ గురించే కాక, జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, ఏ దృక్కోణంతో చూడాలో కూడా తెలుసుకున్నాం. మీ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించటం ఒక గొప్ప అనుభవం, నాకు కలిగిన అదృష్టం. ఈ తెలుగు అనువాదం కూడా ఇంకొంతమందికి స్పూర్తిని ఇస్తుందనీ, ఇంకొందరి జీవితాలని చక్కబరుస్తుందనీ ఆశిస్తున్నాను. సమయం తీసుకుని ‘భూమిక’ కోసం ఇంటర్వ్య ఇచ్చినందుకు ధన్యవాదాలు.
బేబి: హైదరాబాద్‌లోని రచయిత్రులందరు నన్నెంతో ఆప్యాయంగా ఆదరించారు. మళ్లీ ఎప్పుడైనా మిమ్మల్ని కలుసుకునే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాను.
(బేబీ హాల్‌దార్‌ చీకటి వెలుగులు, అనువాదం. ఆర్‌.శాంతసుందరి
వెల: ర.50. ప్రతులకు: విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ,
దిశ పుస్తకకేంద్రాలలో దొరుకును.)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.