మంగుళూరు దాడి మహిళల మానవ హక్కులపై దాడి

జనవరి 24న మంగుళూరులో ఒక పబ్‌ మీద జరిగిన దాడిలో అమ్మాయిల్ని, అబ్బాయిల్ని చితకబాదుతున్న దృశ్యాలు టీవిల్లో చూసి దిగ్భ్రమకు గురవ్వడం జరిగింది. అమ్మాయిల్ని తరిమి తరిమి కొట్టడం, కొందరు కిందపడి పోయి గాయపడటంలాంటి దృశ్యాలు మనోఫలకం మీంచి చెదిరిపోవడం లేదు. ఈ అమ్మాయిలు చేసిన నేరం ఏంటంటే ఆ పబ్‌లో లంచ్‌ చేయడం, మిట్ట మధ్యాహ్నం వేళ ఖులాసాగా స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న అమ్మాయిలపై హఠాత్తుగా శ్రీరామ సేన పేరుతో కొందరు గుండాలు దాడి చేసి ఇష్టం వచ్చినట్లు కొట్టడం జరిగింది. ఈ మొత్తం దృశ్యాలను మీడియ ఎంతో ఉత్సాహంగా దెబ్బలుతింట, కిందపడిపోతున్న అమ్మాయిల్ని క్లోజప్‌లో చూపిస్త తమ ” బాధ్యత”ని నిర్వర్తించారు.అంటే ఫలానా పబ్‌ మీద దాడి చేస్తున్నామని , ఎలక్ట్రానిక్‌ మీడియకి ఆహ్వానం పంపి మరీ గుండాలు చెలరేగారు. మీడియ వాళ్లు ఈ పోలీసులకి తెలియజేయలనే కనీస ఆలోచన లేకుండా, దాడి దృశ్యాలను ఒకరికంటే ఒకరు ముందు ప్రసారం చెయ్యలనే, సెన్సేషనల్‌ చూపుతో మాత్రమే పబ్‌ ముందు పొజిషన్స్‌ తీసుకుని చిత్రించడం దారుణం.
దాడి జరుగుతున్నప్పుడు జనరల్‌ పబ్లిక్‌ ఏ మాత్రం కల్పించుకోకుండా, ఆపడానికి ప్రయత్నించకుండా సినిమా చూసినట్లు ొచూడడం ఆశ్చర్యంతో పాటు, విషాదాన్ని కల్గించింది. పబ్‌లో పనిచేస్తున్న సిబ్బంది ొమాత్రం ఎంతో మానవత్వాన్ని ప్రదర్శించి గుండాలను ఎదుర్కొనే ప్రయత్నం చేసారు. కొంతమంది కుర్రాళ్ళు కూడా వీరిని ప్రతిఘటించారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల, రాజకీయ నాయకుల వ్యవహార శైలి, దీన్నొక చిన్న సంఘటనగా కొట్టి పారేయడం నిజంగా ‘షాక్‌’ కల్గించే అంశం. ప్రజల ప్రజాస్వామ్య స్వేచ్ఛ మీద, మానవ హక్కుల మీద జరిగిన ఈ భయనక దాడిని చిన్న సంఘటనగా కొట్టి పారేయడం అన్యాయం.అమానుషం.
తిరోగమన విధానాలను, స్త్రీలను అణిచివేసే పద్ధతులను తిరిగి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగానే ఇలాంటి సంఘటనలను అర్ధం చేసుకోవాలి. సంస్కృతి, మతం పేరుతో స్త్రీల అభివృధ్ధికి, ఎదుగుదలకి ఆటంకాలు కల్గించాలన్నదే వీళ్ళ ప్రధాన ఎజెండా. పితృస్వామ్య పద్ధతుల్లో స్త్రీలను అణిచివేయడానికి, వారి ప్రజాస్వామ్య స్వేచ్ఛ మీద, హక్కుల మీద ఈ రకంగా దాడి చేసి అభివృద్ధి పథాన దూసుకెళుతున్న స్త్రీలని తిరిగి ఇంటికి పరిమితం చెయ్యలన్న దారుణ, దాష్టీకపు ఆలోచనల పర్యవసానమే మంగుళూరు పబ్‌ మీద, నవ యువతులపై జరిగిన దాడి అసలు రహస్యం.
ఈ రోజు అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు. మంచి మంచి ఉద్యోగాల్లోకి వెళుతున్నారు. ఆకాశమే హద్దుగా అనేక రంగాల్లోకి దూసుకెళుతున్నారు. వారి ఆశలు, ఆకాంక్షలు ఆంబరాన్ని తాకుతున్నాయి. ఇటీవల అమ్మాయిల డ్రస్‌ విషయంలో కూడా కొన్ని కళాశాలల్లో అభ్యంతరాలు వ్యక్తం కావడం గమనిస్తున్నాం. డ్రస్‌ని ఎంపిక చేసుకుని తనకిష్టమైన డ్రస్‌ని ధరించడం అనేది వ్యక్తి స్వేచ్ఛకి, ఛాయిస్‌కు సంబంధించింది. ఈ స్వేచ్ఛ ఈ అత్మవిశ్వాసం,భయం లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించే ధైర్యం అనేవి కొన్ని శక్తులకి భయం గొల్పుతున్నాయి. అమ్మాయిలు బాగా చదువుకుని ఆత్మవిశ్వాసంతో మెలగడం వీళ్ళు సహించలేరు. తమ లాగా పబ్‌లకొచ్చి, సరదాగా ఎంజాయ్‌ చెయ్యడం వీళ్ళసలు భరించలేరు. అమ్మాయిల్లో ప్రదర్శిత మౌతున్నఆత్మవిశ్వాసాన్ని అణిచివెయ్యడానికే మతం పేరుతో, సంస్కృతి పేరుతో దాడులు చేస్తున్నారు. మంగుళూరులో జరిగింది కూడా ఇదే.
పట్టపగలు మంగుళూరులో మీడియ సాక్షిగా అమ్మాయిల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మతం, సంస్కృతి పేరుతో మహిళల్ని బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛగా,తమకిష్టమైనట్టు సంచరించకుండా భయభ్రాంతులను చెయ్యలనే ఈ ‘వెరల్‌ పోలీస్‌’ల దుర్మార్గాన్ని ఎండగడుతున్నాను. తమని తాము ‘మోరల్‌ పోలీస్‌’గా ప్రకటించుకుంట, శ్రీరామసేన అంటూ పలుచుకుంట స్త్రీలపై దౌర్జన్యాలకు, దాడులకు దిగిన గుండాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాల్సిందిగా పిలుపునిస్తున్నాను. స్త్రీల మీద, పిల్లల మీద అమలయ్యే అన్ని రకాల వివక్షలకూ వ్యతిరేకంగా గళం విప్పాల్సిన అవసరం ఈ రోజు మరింతగా వుంది. మనం తప్పనిసరిగా ఇలాంటి దాడుల్ని వ్యతిరేకించాలి.
తమకి ముందే సమాచారమున్నా, పోలీసులకి చెప్పకుండా, జరగబోయే దాడిని ఆపడానికి ప్రయత్నించకుండా, దాడిని పోటీలు పడి మరీ చిత్రీకరించిన మీడియ బండవైఖరి విస్మయనికి గురి చేస్తోంది. గుండాలతో పాటు మీడియ కూడా నేరస్తుల వేపు నిలవడం బాధాకరంగా, విషాదంగా వుంది. అలా కాకుండా మీడియ ఈ దుర్మార్గ దాడిని అడ్డుకోవడానికి తన కెమెరాలను, కలాలను ఉపయెగించి వుంటే..ప్చ్‌!

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

11 Responses to మంగుళూరు దాడి మహిళల మానవ హక్కులపై దాడి

  1. Sri says:

    ” ఈ అమ్మాయిలు చేసిన నేరం ఏంటంటే ఆ పబ్‌లో లంచ్‌ చేయడం, మిట్ట మధ్యాహ్నం వేళ ఖులాసాగా స్నేహితులతో కలిసి భోజనం చేయడం”

    భజనానికైతే పబ్కి వెళ్ళాలా హోటల్ లో దొరకదా? మీకు పబ్ లో ఎమీ ఆనందాలు దొరుకుతా యో తెలిసింట్లు లేదు.
    *దాడి జరుగుతున్నప్పుడు జనరల్‌ పబ్లిక్‌ ఏ మాత్రం కల్పించుకోకుండా, ఆపడానికి ప్రయత్నించకుండా సినిమా చూసినట్లు ొచూడడం ఆశ్చర్యంతో పాటు, విషాదాన్ని కల్గించింది.*
    కన్న తల్లిదండ్రులే రాలేదు ఇది అన్యాం అని చాటటానికి మిడియా ముందుకు రాలేదు వాళ్ళ పిల్లలని కొట్టినందుకు.
    మందు తాగడం, సిగెరెట్ తాగడం ఎదుగుదల ఐతె అరకు లోయ లో 70% అభివృద్ది చెందారని మిరు ఒప్పు కొవాలి.

    *పబ్‌లో పనిచేస్తున్న సిబ్బంది ొమాత్రం ఎంతో మానవత్వాన్ని ప్రదర్శించి గుండాలను ఎదుర్కొనే ప్రయత్నం చేసారు*

    అది మానవత్వాన్ని కాదు బిసినెస్ లో కష్టమర్ కి రక్షణ కలి పించ లేక పొతే ఎవ్వరు ఆ పబ్ కి రారు అందువల సిబ్బంది యాజమాన్య మెప్పు కొసం ముందుకురి కారు.

  2. Sri says:

    *తమ లాగా పబ్‌లకొచ్చి, సరదాగా ఎంజాయ్‌ చెయ్యడం వీళ్ళసలు భరించలేరు. అమ్మాయిల్లో ప్రదర్శిత మౌతున్నఆత్మవిశ్వాసాన్ని అణిచివెయ్యడానికే మతం పేరుతో, సంస్కృతి పేరుతో దాడులు చేస్తున్నారు. మంగుళూరులో జరిగింది కూడా ఇదే*

    Who stopped progress sarojini anaayudu, M.S. subbulakshmi,Bhaanumati,sudhaa ramachandran, sudhaa murti, Dr. Reedy’s daughters …, koneru hampi,Saniya mirza etc.,

  3. Sri says:

    *ఈ రోజు అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు. మంచి మంచి ఉద్యోగాల్లోకి వెళుతున్నారు. ఆకాశమే హద్దుగా అనేక రంగాల్లోకి దూసుకెళుతున్నారు. వారి ఆశలు, ఆకాంక్షలు ఆంబరాన్ని తాకుతున్నాయి. ఇటీవల అమ్మాయిల డ్రస్‌ విషయంలో కూడా కొన్ని కళాశాలల్లో అభ్యంతరాలు వ్యక్తం కావడం గమనిస్తున్నాం. డ్రస్‌ని ఎంపిక చేసుకుని తనకిష్టమైన డ్రస్‌ని ధరించడం అనేది వ్యక్తి స్వేచ్ఛకి, ఛాయిస్‌కు సంబంధించింది. *
    జయ జైట్లి,బృందా కారత్,సుధాముర్తి,సుష్మా స్వరాజ్,మల్లికా సారాభయి,మేధా పాట్కర్ మన తెలుగురచైత ఓల్గా, మలతి చందూర్ ఎప్పుడు చీరలో కనిపిస్తారు వీరు అభివృద్ది చెందలేదా?

    *మహిళల్ని బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛగా,తమకిష్టమైనట్టు సంచరించకుండా భయభ్రాంతులను…*
    స్వేచ్ఛగా,తమకిష్టమైనట్టు సినెమా లో హిరోయిన్ లు తిరుగుతారు ఆ విధంగానా? అలా ఐతె మీకు తెలిదేమొ కుక్కలు పందులు వెంట పడతాయి. డబ్బున్న వాలకి మంచి కార్లు ఉనంటాయి వాటిలో వెలతారు మిడిల్ క్లస్ వాల్లకి ఎమి ఉన్నాయి? డబ్బు ఉన్న వాల్లు జీవితాన్ని అభవిస్తారు ఇలా మిరు రాసిన వ్యాసాలు చదవరు. మి పాటకులు చాలామంది మిడిల్ క్లసు లెక పొతే అమెరికాలో ఎమి తోచక నెట్ మీద చదివేవారు మత్రమే. మీ రచనా శైలి మెరుగులు దిద్దుకఓవడానికి తప్ప ఈ వ్యాసము జీవితమ లో ఒక్కరికి కూడాఅ ఉపయగ పడదు,.

    ఇకనైనా మీరు అందరి కకుటుంబాల్లో కారు చిచ్చు పేట్టటము మాను తారని మరియు ఆపుతారని ఆశిస్తూ .. మీ శ్రెయోభిలాషి
    ఒక మధ్య తరగతి తండ్రి.

  4. మొన్ననే పబ్ లలో తాగి తందనాలాడుతూ అశ్లీల నృత్యాలు చేస్తున్న అమ్మాయిల పైన దాడి జరిగింది. ఇది అత్యంత హేయనీయం. భారతదేశ చరిత్రలో కాంస్యాక్షరాలతో లిఖించతగ్గ దారుణం.అయినప్పటికీ కొందరు ఆ దాడిని సమర్థిస్తున్నారు, మన బ్లాగుల్లో కూడా. అయ్యలారా/అమ్మలారా, దాడి ముమ్మాటికి తప్పు. దీనికి “మరో వైపు” లేదు. కేవలం ఒక్క వైపు మాత్రమే ఉంది. దాడిని సమర్థించే ముందు “ఆ స్థితిలో మన వాళ్ళు ఉంటే” అని ఆలోచించండి.

    మీ కూతురో లేదా చెల్లెలో క్లీవేజ్ కనిపించేలా టాప్ వేసుకొని, మోకాళ్ళ పైకి స్కర్టు వేసుకొని బయట వెళ్తుంటే తిడతారా, లేక కొడతారా? ” తప్పేముంది నా కూతురు అలా వెళ్తుంటే?? వెళ్ళిరామ్మా” అని చెప్తారు కదా. మరి దాడిని “మరో కోణంలో” ఎందుకు సమర్థిస్తున్నారు.

    మీ కూతురో లేదా చెల్లెలో తాగి అశ్లీలంగా నృత్యం చేస్తున్న దృశ్యం మీ కంటబడితే తిడతారా, లేక కొడతారా? “చాలా బాగా ఊపుతున్నావమ్మా” అని మెచ్చుకుంటారు కదా? మరి దాడిని “మరో కోణంలో” ఎందుకు సమర్థిస్తున్నారు?

    మీ కూతురో లేదా చెల్లెలో తాగిన మత్తులో బోయ్ ఫ్రెండ్ ఇచ్చిన డ్రగ్స్ మత్తులో కాలు జారి కడుపు చేయించుకుంటే , లేదా పిమ్మట అబార్షన్ చేయించుకుంటే తిడతారా, లేక కొడతారా? “నీకు పెళ్ళి కాకముందే నేను ఆడుకోవడానికి బిడ్డనిచ్చావు తల్లీ” అనో “ఏమీ కాదమ్మా అబార్షన్ చాలా సింపుల్” అని చెప్తారు కదా. మరి దాడిని “మరో కోణంలో” ఎందుకు సమర్థిస్తున్నారు?

    ఇప్పటికయినా కళ్ళు తెరవండి మహాశయులారా.

  5. మనది స్వతంత్ర్య దేశం. ఎవరయినా తనకు నచ్చినది చేసుకోవచ్చు, అది చట్టాన్ని ఉల్లఘించనంతవరకు. అలాంటప్పుడు ఈ అమ్మాయిలు చేసిన తప్పేమిటి? అమ్మాయిలు మందు తాగుతుంటే ఆ మందు అమ్ముతున్న బార్ పైన దాడి చేయాలి. అమ్మాయిలు తాగిన మైకంలో అశ్లీలంగా నృత్యాలు చేస్తుంటే ఆ నృత్యాలు చూస్తున్న వారిని కొట్టాలి. అంతేగానీ అన్నెం పున్నెం ఎరుగని అమ్మాయిల పైన దాడులు చేసిన వీళ్ళు మగాళ్ళా లేక …. ?

    పేరుకు స్వాతంత్ర్యం వచ్చిందే కానీ, ఆడదానికి వచ్చిందా? ఆడవాళ్ళు సిగరెట్లు తాగకూడదు, మందు కొట్టకూడదు, రెచ్చకొట్టే విధంగా బట్టలు వేసుకోకూడదు. వొళ్ళు కనిపించేలా ఒకమ్మాయి బట్టలు వేసుకొని వెళ్తుంటే వెంట పడి ఏడ్పించడం, పబ్లిక్ ప్లేసుల్లో అశ్లీలంగా ప్రవర్తిస్తుంటే వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చెయ్యడం. పబ్‌కు వెళ్ళి తాగిన ఎంత మంది అమ్మాయిలు ధైర్యంగా ఇంటికి రాగలరు? ఇది మన భారతం, మన స్వాతంత్ర్యం

    ఎక్కడ బ్రతుకుతున్నారు వీళ్ళు? రాతి యుగంలోనా?
    ఇప్పటికయినా ప్రభుత్వాలు కళ్ళు తెరచి చట్టలు తీసుకురావాలి. దోషుల పైన రేప్ కేస్ పెట్టి నాన్-బెయిలబుల్ అరెస్టు చేయాలి. లేకుంటే పబ్‌లకు వెళ్ళాలంటేనే అమ్మాయిలు భయపడతారు.

  6. Sri says:

    * అమ్మాయిలు చేసిన నేరం ఏంటంటే ఆ పబ్‌లో లంచ్‌ చేయడం, మిట్ట మధ్యాహ్నం వేళ ఖులాసాగా స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న అమ్మాయిలపై హఠాత్తుగా …*
    మిట్టమధ్యహ్నము పబ కి ఎవరైనా వెళతారా? దానిని బట్టెఅర్థమౌతున్నాది వాళ్ళు ఎంత ముదురులో జివితాన్ని ఎంత తెలికగా తిసుకన్నారో .. మందు పార్టిలు రాత్రి పూట పెట్టుకుంట్టారు, వ్యసనానికి బానిస ఐనవాడె పగటి పూట కూడా తగటమ మొదలు పేడతారు. ఇది కూడా అంతె.
    ఇటువంటి వారు పబ లో మొదలు పెట్టి *రెవ * పార్టి వరకు ఎదుగుతారు. ఒక సారి ఈ మధ్యనే వచ్చిన తమిళ సినెమా *అయ్యన* ( సుర్యా, తమ్మన్నా భటియ నటినచారు ఎ.వి.యమ వారిది ) చూడు డ్రగ్స ప్రస్తుత పరిస్థి నీకు తెలుస్తుంది. ఆ అమ్మాయిలు మిరు చెప్పిన ట్టు గా ఆత్మ విశ్వాము కలవారైతే న్యాయ పోరాటము చెయ వచ్చుకదా? అసలికి ఈ ఉపయొగము లేని వారిని గొప్ప వ్యక్తులుగా (*ఈ స్వేచ్ఛ ఈ అత్మవిశ్వాసం,భయం లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించే ధైర్యం అనేవి కొన్ని శక్తులకి భయం గొల్పుతున్నాయి.* ) చిత్రికరించె మీ బొటి వాళ్ళ వ్యాసాలను ఈ పత్రిక వారు ఎలా ప్రచ్చురిస్తున్నారో నాకు తెలియటము లేదు.

  7. Sri says:

    అమ్మా ,ఇలా రాసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు నా ఉదేశ్యము. మీ అంత ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వము ఉన్నవాళేవ్వరు అలా పబ్లకు వెళ్ళరు. వెళ్ళినా ఒకటి రెండు సార్లు సరదాకి మాత్రమే. ఇలా మధ్యానం నుంచే వెళ్ళటం మొదలు పెట్టారు. ఆ కొట్టె వాళ్ళు కూడా ఒక్క రోజులో వచ్చి కొట్టారు మొదట హెచ్చరికలు చెసి వినక పొయి ఉంటెనె ఆఖరికి ఆ పని చేసి ఉంటారు. నేను వారిని సమర్థిస్తున్నాని అను కోవద్దు, ఖచ్చితంగా వారు చెసిది తప్పె. కాని మన జాగ్రత లొ మనం ఉనండటం వలన చాల మంది కి మనం సమస్య కాకుండా ఉంటాము, అలా ఉండటమే మనము చేయగలిగిన దేశసేవ.

  8. srikanth says:

    ఇప్పుడు అందరిదీ ఒకే మాట. స్త్రీలను కొట్టడం తప్పు అని, వారికి తాగే హక్కులేదా అని, మగవారు తాగగా లేనిది.. ఆడవారు తాగితే తప్పేంటని, మగవారు తిరగగా లేనిది ఆడావారు తిరిగితే తప్పేంటని. నిజమే, మగవారికి ఒక న్యాయం ఆడవారికి ఒక న్యాయం సమ్మతం కాదు. ఈ విషయాన్ని, ఆదర్షవంతులైన మగవారు, అదర్షవంతుల్లాగా నటించే మగవారు, స్త్రీవాదులు, మహిళా సంఘాలు గొంతెత్తి చెబుతున్నారు. ఇది శుభపరినామమే.

    మొన్నామధ్య మెరుగైన సమాజం కోసం ఏర్పడిన TV9 చూస్తున్నప్పుడు, ఒక మహిళామండలి అధ్యక్షురాలు, పబ్బులకి వెల్లడం అశ్లీలంగా వుండే దుస్తులు వేసుకోవడం తప్పైతే, దాన్ని నిరసించే మార్గాలు వేరే వున్నాయని, సంస్కృతి పరిరక్షన పేరుతో స్త్రీలమీద చేయి చేసుకోవడం అనాగరిక చర్య అని అన్నారు. అక్షరలక్షలు విలువ చేసే మాటే అది. కాకపోతే….

    సారా కొట్లో తాగుతున్నారని, ఆడవాల్లందరు గుంపులుగా వెల్లి, మగాల్లను కర్రలతో చితక్కొట్టినప్పు, ఈ నీతులన్నీ ఏమయ్యాయబ్బా..? సారా తాగడం నేరం కాదు, నైతికంగా తప్పు అంతే? మరి వారినికొట్టే హక్కు మన నారీ శిరోమణులకు ఎవరిచ్చారబ్బా? వార్తా పత్రికల వారు, TV ఛానెల్ల వారు ఈ విషయాన్ని గొప్పగా చూపిస్తూ, వారిని నేటి స్త్రీలని, ఆదర్ష స్త్రీలని ఎందుకు పొగుడుతారో…? స్త్రీవాదులు, ముఖ్యంగా మగ స్త్రీవాదులు వారిని పొగిదేవిధానం, (వీరి మీద ఆడ స్త్రీవాదులు కొంచెం బెటర్లెండి) చేసె ఓవర్ యాక్షనుకి అంతుండందు. ఎందుకనో…?

    ఇంతేనా కొన్ని కొన్ని చోట్ల, బూతు చిత్రాలు ఆడించే సినెమా థియేటర్లకి వెల్లి, అక్కడున్న మగవారందరి మొహాలకి నల్లరంగు పులిమారన్న వార్తలు మనం అప్పుడప్పుడు వింటుంటాం. కొన్నిచోట్ల కొట్టారని కూడా విన్నాను, ఎందుకబ్బా? ఆడ మగలకి ఇస్టమైతే శృంగారము తప్పు కాదంటారు కొందరు స్త్రీవాదులు. కలిసి తిరగడం, పబ్బుల్లో తాగితందనాలాడడం తప్పుకానప్పుడు, పాపం ఈ అభాగ్యులు చేసినపని తప్పెలా అయ్యిందబ్బా?

    కాకపొతే ఈ పనిని అందరూ ఆమొదిస్తారు, పొగుడుతారు, కానీ ఇదే మగాల్లు ఆడవాల్లని కొడితే మహాపరాదం జరిగిందని చెబుతారు. ఇంకా పురుషాధిఖ్య భావజాలం నషించలేదని, మగవాల్లు పురుషాహంకార పందుల్లాగా వ్యవహరిస్తున్నారని దుమ్మెత్తిపోస్తారు.

    ఇంతేనా, ఈవ్ టీజింగులు చేసే మగవారిని కొన్నిచొట్ల, అండర్‌వేర్‌తో ఊరేగించిన సందర్బాలున్నాయి. వారుచేసేది( ఈవ్ టీజింగ్) తప్పుకాదని ఎవ్వరూ అనరు కానీ, ఈ బట్టలూడదీసి ఊరేగించే ఓవర్ యాక్షను గురించి మాత్రం ఎవ్వరూ ఎందుకు మాట్లాదరెందుకని? తప్పో ఒప్పో, ఈలాంటి ఓవర్ యాక్షను ఆడవాల్లొ, లేదా ఆడవాల్లని సమర్దిస్తూమగవాల్లొ చేసినప్పుడు మాత్రం ఈ అభ్యుధయవాదులు, మానవహక్కుల గురించి ప్రష్నించే వాల్లు ఎక్కడ దాక్కుంటారో ఎవ్వరికీ అర్థం కాదు.

    మరి మన నారీ శిరోమణులు చేసేవి తప్పుకానప్పుడు, శ్రీరాం సేన వారు చేసింది తప్పేలా అయ్యింది? అభ్యుదయవాదులకి, మగస్త్రీవాదులకి, అందరికీ నేనుచెప్పేది ఒక్కటే, దయచేసి ఇలాంటి ఓవర్ యాక్షను ఎవరు చేసినా ఖండించడి, ఆడవారైనా సరే, మగవారైనా సరే…

  9. hemantha says:

    మగవారు నిక్కర్లు వేసుకుని రోడ్ల వెంట తిరిగితే ఏ పందులు కుక్కలు వెంట పడవు కాని ఆడవారి నడుం కనపడిందనో లేక కాళ్ళు నచ్చాయనో ఇవేవీ కాక పోయినా కేవలం కంటికి నచ్చిందనో నిజంగానే ఎన్నెన్ని కుక్కలు పందులు మీదపడడానికి రెడీగా వుంటాయో. ఒక స్త్రీ తన పరిధిలో సమాజానికి హాని కలిగించనపుడు తను ఎటువంటి బట్టలు ధరించాలో ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకునే స్వేచ్చ కూడా లేని పరిస్థితిని ఏమనాలి? వళ్ళు కనిపించేలా వస్త్రధారణ వుంటే ఆమె శరీరం మీద ఆమెకు తప్ప అందరికీ హక్కు వచ్చేస్తుందా? కుటుంబ పరువు, తల్లిదండ్రుల పరువు, సమాజ పరువు, దేశ పరువు వీటన్నింటి బరువు స్త్రీలే ఎందుకు మొయ్యాలి? కాపురాలు నిలబడాలన్నా కూల్చుకోవాలన్నా భార్యాభర్తలకు సమాన భాధ్యత వుంటుందని తెలీదా లేక మగవారు వీటన్నిటికీ అతీతులా? రోజంతా కష్టపడి సంపాదించి తెచ్చిందంతా తాగి తగలేసి వచ్చి పెళ్ళాన్ని తంతే తప్పు కాదు అవన్నీ భరించినవాళ్ళు తిరగబడితే అది తప్పా?సారా వుద్యమాన్ని మంగుళూరు దాడితో పోల్చిన వంకర తెలివితేటలకు జోహార్లు. ఈవ్ టీజింగ్ అనేది ఎదుర్కొనకుండా ఎంతమంది ఆడవాళ్ళు వున్నారు? ఈవ్ టీజింగ్ ని కూడా గ్లోరిఫై చేస్తున్నారంటేనే తెలుస్తోంది ప్రస్తుత సమస్య పై ఎంత అవగాహనతో స్పందించారో. ఇలాంటి ఎందరో మహానుభావులు మహా దేశాభిమానులు కోకొల్లలుగా వున్నారని మమ్మల్ని మేల్కొలిపినందుకు మా స్త్రీలందరి తరఫునా శతకోటి ధన్యవాదాలు.

  10. మగవాళ్ళు కూడా నిక్కర్లు వేసుకోవడం తప్పే. లుంగీలు వేసుకుని మోకాలు కనిపించేలా మడత పెట్టుకోవడం కూడా తప్పే. నేను ఇంట్లో కూడా లుంగీలు వేసుకోను. ఫుల ప్యాంటుతో డీసెంటు గా ఉంటాను. గద్దర్ చొక్కాలు విప్పుకుని నాట్యం చెయ్యడం పై రంగనాయకమ్మ గారు చేసిన విమర్శలు చదవండి.

  11. rameshraju says:

    మగవాళ్ల సంగతి ఎలా ఉన్నా ఈ రోజుల్లో అమ్మాయిల డ్రస్సింగు సెన్సు మాత్రం ఏమాత్రం బాగోవడంలేదు. పురుషుల్ని లైంగికంగా రెచ్చ్గ్గగొట్టేలా ఉంటున్నాయి. షార్టు స్కర్టులు, టైటు జీన్సు, టైటు నిక్కర్లు వంటివి చాలా దారుణంగా ఉంటున్నాయి. అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లో ప్యాషను మరీ ఎక్కువైపోయింది. పూర్వం చూడటానికి దేవతలా ఉండే స్త్రీలు ఇప్పుడు తమ స్థాయినుండి దిగజారి ఇలా అయిపోరేమిటని అనిపిస్తోంది. ఇటువంటి దిక్కుమాలిన బట్టల వలన పురుషుల్లో స్త్రీల పై మంచి భావం, గౌరవ భావం పోయింది. ఏది ఏమైనా పూర్వం పురుషులు ఎన్ని కట్టుబాట్లు పెట్టినా అది స్త్రీల మంచి కోసమే అని గ్రహించాలి. అన్ని వేళలా హక్కుల గురించి చర్చించడం సరికాదు. హక్కుకంటే భాద్యత మిన్న అని అందరూ గ్రహించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.