మేరి కుమారి మాదిగ
ఈ స్త్రీల బాధలు, ఈ నాటివే కాదు ఇప్పటి మన సామాన్య స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలే ఆనాటి రామాయణ, మహాభారతాల్లో. ఎల్లమ్మ కథలో, పరుశరాముడు తండ్రి దశరథ మహారాజు చెప్పిన మాటలను విని లందలో దాగి ఉన్న తన తల్లి అయిన రేణుకా ఎల్లమ్మను గండ్ర గొడ్డలితో తానే నరికి చంపిన చరిత్రను మనకు చిన్నప్పుడు మన పెద్దలు కథలలెక్క చెప్తే వినేవాళ్ళం. ఇలాంటి కథలు, పురాణాలు బాగోతాలు ఆడే కళాకారులు చెప్పే కళల ద్వారా వాల్లు విని తెల్సుకున్న ఆ కథల్నే మనకు చెప్పినారు. అప్పటి పురాణాల్లో, కథలల్లో కూడా స్త్రీలపై హింస ఉన్నది. ఆనాటి నుంచి ఈనాటిదాకా స్త్రీలు అన్యాయలకు అత్యాచారాలకు గురవుతనే ఉన్నారు. పురుషుడి కుట్రల్ని గమనించుకోలేక స్త్రీలు, వాళ్లను వాళ్లు వెసగించుకున్నోల్లు ఉన్నారు. వాళ్లకు తెలియకుండ మొసానికి గురయినోల్లు ఉన్నారు. అందులో అరుంధతికూడా ఒకటి, సీతా, సావిత్రీ, అనసూర్య, కుంతీల చరిత్రలు వెలుగులోకి వచ్చినంతగా అరుంధతీ చరిత్రను స్త్రీవాదులు బైటికి తేలేకపోయినారు.
అసలు ఈ అరుంధతి ఎవరు? ఆమె గురించి చరిత్ర ఎక్కడైనా రాయబడి ఉందా? అని వెతికితే ఆమె గురించి రాతపూర్వకంగా రాసిన పుస్తకాలే లేవు గ్రామదేవతల చరిత్ర అందుబాటులో ఉన్నంతగా ఆకాశధృవతార అయిన అరుంధతీ చరిత్ర ఎక్కడా రాయబడలేదు. ఆమె చరిత్ర తెలిసిన డక్కలి కళాకారులను సాహిత్యకారులు నేటికీ కళాకారులుగా గుర్తించలేదు. నేను అన్వేషి సంస్థ తరపున నా పరిశోధనలో భాగంగా జాంభవ పురాణాన్ని చెప్పే డక్కలి కళాకారుల ద్వారా అరుంధతి గురించి సేకరించిన సమాచారాన్ని ఈ సమాజానికి స్త్రీలోకానికి సాహిత్యకారులకు ప్రజాస్వామ్య పత్రికల ద్వారా తెలియజేస్తున్నాను.
గత జన్మలో అరుంధతి అసలు తండ్రీ సుష్ట బ్రహ్మ. మరోజన్మలో రుంధా మహాముని కుమార్తెగా జన్మిస్తుంది. ఆమె అసలు పేరు సుమావతి అయితే ఈమె భర్త వశిష్టుని శాపం వల్ల కడజాతి వాడలో కాంతయి ఈ సుమావతే అరుంధతిగా తిరిగి జన్మిస్తుంది. ఆమె జాంభవ పురాణంలో ఆది జాంభవంతుని ముని మనుమరాలు. ఈ జాంభవ పురాణాన్ని కథగా డక్కలి చిందు కళాకారులు చెప్తారు. అంతే కాకుండా ఆమె గత జన్మలో సప్తరుషుల భార్యలలో మొదటి భార్య అరుంధతే అని పురాణం చెప్తుంది.
అయితే ఈ సప్తరుషుల భార్యలకు ఎవ్వరికి లేని ఘనత, ఈ యొక్క అరుంధతికే ఎందుకు దక్కింది అని తెల్సుకోవాలి అంటే, తిరిగి ఆమె గత జన్మలోకి వెళ్లితేనే ఈ అరుంధతి చరిత్ర మనకు తెలుస్తూ౦ది. నేటి ఆధునిక యుగంలో కూడా స్త్రీని ఈనాటి పురుషుడు ఇంటా బయటా నిత్యం అనుమానిస్తూ హింసిస్తూనే ఉన్నడు. ఎన్ని చట్టాలు స్త్రీల రక్షణకై వచ్చిన, ఆ చట్టాల్ని కొందరు స్త్రీలు మాత్రమే ఉపయెగించుకుంటున్నారు. కానీ స్త్రీలపై హింస దిన దినం పెరుగుతూనే ఉంది.
ఈ బ్రాహ్మణ వశిష్టునికి కడజాతి కాంతనిచ్చి వివాహం చేసిన నేరానికి ఆ కడజాతి వాడలో ఉన్న జ్ఞాన విజ్ఞాన ధన ధాన్య సంపదంతా పోయింది. ఈ ఆకాశ ధృవతారను అరుంధతిని వశిష్టుడు లగ్గంజేసుకోని ఆమెను బ్రాహ్మణుల ఇంటికి తీస్కపోయిన్నాడే ఈ వాడ చీకటిగా మారింది. ఈ కడజాతి వాడూ ఆనాటి నుంచి కళదప్పింది.
అరుంధతి గత జన్మలో సుష్టబ్రహ్మ కుమార్తెగా జన్మించింది. మరుజన్మలో రుంధా మహాముని, షాపతి గర్భమందున, మాతంగి పురి పట్నంలో కడజాతి కాంతగా జన్మించింది. ఈ రెండు జన్మలకు కారణాలేంటివి? అని నేటి దళిత వాదంగానీ, మాదిగ వాదంగానీ, స్త్రీవాదంగానీ, చరిత్ర లోతుల్లోకి వెల్లలేక పోయారనే చెప్పాలి. మాదిగలేమొ ఇంత గొప్ప చరిత్రను చెప్పే డక్కలి కళను బైయిటికి తేలేదు. ఈ కళను నిర్లక్ష్యంగా చేసినారు.
ఈ కళగురించి డక్కలి కులం గురించి తెల్సిన మాదిగలు, ఈ కళను, ఈ కులాన్ని అంటరాని వారుగా, ముట్టరాని వారుగా పెంటమీద బతికే జాతిగానే చూసిండ్రు. డక్కలోల్లను మాదిగోల్లు దూరంగా ఉంచడం వల్లా, మాదిగోల్లే ఈ సమాజంలో ఊరికి దూరంగా ఉండాల్సి ఒచ్చింది. పార్వతి మైల గుడ్డలో బుట్టిన వల చెన్నెయ్య కులం సమాజంలో ఉన్న అగ్ర వర్ణాలకు దగ్గెరుండి ఊరి సుద్దులు ఆల్లకు తెలిపే కావలి వృత్తిలో వాల్లు ఉండి వందకు ఎనభై శాతంగా, ఈ వల చెన్నెయ్య కులం చదువుకోని, జ్ఞానం పెంచుకోని వల కులంకున్న అంటును పోగొట్టుకున్నరు. మాదిగ కులం నడి ఊల్లో జోరసంచి వల్సి చెప్పులు గుట్టె అడ్డకాన్నే గసోని పాతజోల్లు ముడిసే వాడ అయ్యింది. మాదిగ చెప్పు డప్పుకే అంకితమై సదువుకు దూరమైయిండు. అంటుకు దగ్గెరైయ్యిండు. మాల వాల్లు తెల్విగా ఆనాటి సంధీ ఈనాటి దాక హక్కులుబొందేకాడ అంటరానోల్లం అంటుండ్రు హక్కులన్ని అందినంక పై కులాలతో సోపతి జేస్తు అన్నిట్లల్లా పైకి ఒచ్చిండ్రు ఒస్తుండ్రు.
ఈ కడజాతి మాదిగోల్ల బత్కులు ఆనాటి సంధీ ఈనాటిదాక ఊరిచివరి వాడగానే ఉన్నాయి. ఆ వాడపక్కన్నే డక్కలోల్లు, సిందోల్లు, వష్టోల్లు పాకోల్లు పైగిడోల్లు, దేవదాసీలుగా ఈ దేశ దరిద్రాన్ని ఆకలిని హత్యాచారాల్ని, పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, ముఖ్యంగా అంటరానితనంలో ఉన్న అంటునంతా ఈ మాదిగ ఉపకులాలే వెస్తున్నాయి.
ఇగ వీల్లే అంటరానోల్లు అంటే ఇగ వీల్ల ఆడోల్లు ఈదేశంలో ఇంకెంత అంటరాని తనాన్ని వెస్తున్నారో దీన్ని బట్టీ మీకే అర్థం అయితది.
ఈ కడజాతి కాంతలు, మాదిగ ఆడోల్లు, డక్కలి, సిందూ, వష్టీ దేవదాసి ఆడోల్ల బత్కులు ఎంతటి అంధకారమయమై ఉంటాయె మానవతా వాదులు అంతా మనస్సు పెట్టి ఆలోచించాలి.
అందుకే ఈ మాదిగ అనుబంద కులాల ఆడోల్లు అంటున్నారు. ”మా అరుంధతీ ఆకాశంలో, మా బత్కులు అగాధంలో” ఉన్నాయి అని దీనికి పరిష్కారం కావాలి? ఆ పరిష్కారం, డక్కలి, చింద పాకి, జోగిని పైగిడి… ఆడోల్ల, పిల్లల బత్కులల్లో మార్పుకై ప్రభుత్వం, ఇతర మేధావి వర్గం, సావజిక సేవా పోరాటాలు చేసే వారు, వీరి అభివృద్ధికై కృషి జరిపిన్నాడే వీల్లు బాగుపడ్తరు.
అరుంధతి రెండు జన్మలెత్తినా కూడ ఈ వషిష్ట బ్రాహ్మణుడే ఆమెకు భర్త ఎందుకు అయ్యిండు. అందుకామె ఎంతో పెట్టి పుట్టాలి అని ఈనాటి పెద్దలు పిల్లలకు అరుంధతి గురించి కథలు కథలుగా చెప్తారు. ఆ కథలను రాతలల్లో మాత్రం సాహిత్య కారులు రాయలేక పోయినారు.
మనదేశంలో హిందు ధర్మ చట్ట ప్రకారంగా వివాహం జర్గిన ప్రతి నూతన జంటకి ఈ ఆకాశ దృవతార అయిన అరుంధతీ నక్షత్రాన్ని నీ భార్యకు చూపించమని పెండ్లి కుమారుడికి వాల్ల పెండ్లి చేసిన పురోహితుడు చెప్తాడు. పెండ్లి కూతురు ఆ ఆకాశ నక్షత్రాన్ని కండ్లారా ఆకాశంలో చూస్తేనే ఆమె ప్రతివ్రతా కన్య అన్నట్లు! లేకుంటే ఈ పెండ్లి కూతురు ప్రతివ్రత కానట్లే అని ఆ బ్రాహ్మణ పంతులే నేటికి ప్రచారం చేస్తుంటాడు. ఈ మనువాద బ్రాహ్మడు చేసే కుట్రల్ని అమ్మలక్కలు గ్రహించుకోలేక ఆ కొత్త పెండ్లి కూతుర్ని సూటిపోటు మాటల్తో నిందిస్తరు.
అదే బ్రాహ్మణ పురుషుడు ఈ దేశంలో స్త్రీకి అనేక ఆంక్షల్ని పెట్టాడు. ఆ ఆంక్షల్ని నడి బజార్లో, మనుస్మృతి పేరుతో దహనం చేసిన మహానీయుడు డా|| బి.ఆర్. అంబేడ్కర్‌గారు. ఆయన స్త్రీలకు అనేక చట్టాలను రాజ్యాంగంలో కల్పించినాడు.
దాన్ని అర్థం చేసుకొన్న మగవారు కొద్దిగా హింసిస్తున్నారు, అర్థం చేసుకోలేని మొగోల్లు ఇంకా ఎక్కువగా హింసిస్తున్నారు. ఇది నాటినుంచి నేటి వరకు స్త్రీలందరు అనుభవిస్తున్న బాధలే. కానీ దేవతలు గూడా దేవుండ్లతో, హింసకు గురిఅయినారు. అప్పటి హింస మహా దుర్మార్గంగా ఉన్నది.
అయితే ఇప్పటి వరకు స్త్రీ సాహిత్య రంగంలో బయటికొచ్చిన చరిత్రలన్ని, పై కులాల జాతుల వర్గాల వారు పూజించే స్త్రీల చరిత్రలే రాయబడ్డాయి. కానీ క్రింది కులాల వారు పూజించే స్త్రీ దేవతల చరిత్ర రాయబడలేదు. పై కులాల స్త్రీలు ముందుగా చదువుకున్నారు. కాబట్టే వాల్లపైన జరుగుతున్న హింసను గుర్తించగలిగినారు. ఇప్పుడు వాల్లంత ఒక్కటై హింసలేని, స్త్రీల ప్రపంచాన్ని చూడాలని పోరాడుతున్నారు.
ఉన్నత వర్గాల స్త్రీల తిరుగుబాటును చూసిన ఈ క్రింది కులాల పురుషులు, వీల్ల స్త్రీలపై, లోలోపట హింసను, అవమానాలను ఇంటా బయట, పెంచి పోసిస్తూనే పైగా మా కింది కులాల స్త్రీలు అన్ని రంగాల్లో స్వేచ్చగా జీవిస్తున్నారు అని మొసపూరితమైన సట్టిఫికెట్స్ ఇస్తున్నారు. స్త్రీల బాధలు స్త్రీలకే తెలుస్తయి మొగోల్లకెట్ల తెలుస్తయి. మాదిగ పాకీ చాకలి, మంగలి, పద్మశాలి, గౌడ అనేక వృత్తి కులాల స్త్రీలను, పై కులాల పురుషులు, స్త్రీలు వాడుకొని ఒదిలేసినట్లే, ఈ క్రింది కులాల పురుషులు కూడా అంతకంటే ఎక్కువనే వివక్షను చూపుతున్నారు. వీల్లని అన్ని రంగాల్లో అందరు వాడుకొని అన్యాయం చేసి ఒంటరిని చేస్తున్నారు.
దీన్ని ఈ క్రింది కులాల స్త్రీలు ఇప్పటికైన అర్దం చేసుకొని వాల్ల పురుషులు, ఇతరులు వీల్లపై చేస్తున్న కుట్రలను గమనించుకొని ముందుకు సాగాల్సిన అవసరమున్నది. అయితే ఈ క్రింది కులాల స్త్రీలు, ముందుగా చదవడం, రాయడం, వాల్లకై వాల్లు పోరాడటం, నేర్చిననాడే ఈ అణచబడ్డోల్లకింద అణచబడ్డ స్త్రీల కథలు, పుస్తకాలు సాహిత్యం బైటికి వస్తది.
ఎవరికి అన్యాయం జర్గితే వారే తిరగ బడాలని మొగవాల్ల చాటున ఉండి పోరాడిన మనకు పోరాటాల విలువ తెలుసు అందుకని ఇప్పుడు ఈ క్రింది కులాల దేవతల చరిత్రల్ని మనమే చదివి రాయలె.
రాయబడి లేకపోతే గూడెంబోయి గూడెంలో ఉన్న అవ్వల ద్వారా, చరిత్రలను చెప్పె కళాకారుల ద్వారా, తెల్సుకోని ఈ కథలను బయిటికి తీస్కరావాలే, మన దేవతలు ఈ అరుంధతి నుంచి మొదలు కుంటే ఎల్లమ్మ, కనక దుర్గమ్మ, కట్టమైసమ్మ, పోషమ్మ, ఉప్పలమ్మ జోగమ్మ, నకాలమ్మ సమ్మక్క సారక్క, కాషమ్మ, నీల గౌరమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ, మారెమ్మ, బత్కమ్మల బత్కుల్ని కథలుగా రాసి చరిత్రలోకి మనమే తేవాలి. వీల్లేగాదు సబ్బండ జాతుల దేవతలు ఉన్నారు.
స్త్రీని ఇంటా బయటా నేటి ఆధునిక పురుషుడు అనుమానించి హింసించినట్లే, ఆనాటి పురాతన చరిత్ర కల్గిన దేవుండ్లు కూడా ఆడ దేవతల్ని అనుమానించి, హింసించి నిందల పాలు చేసిండ్రు. దీనికి మన దగ్గర ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. రాముడు సీతను అనుమానించి అడవుల పాలు చేసినాడు. అదే రామున్ని ఈనాటి స్త్రీలు హిందూ మనుధర్మవాదులు దేవునిగా కొలుస్తారు.
ఏ దేవుడైన స్త్రీని అనుమానించడమేనాయే! ఆ దేవుండ్లనంత ఆడోల్లు ఎందుకు పూజించాలి? ఆడోల్లు ఆడ దేవతల్నే పూజించాలి. మొగ దేవుండ్లని ఎందుకు పూజించాలె? ఆడోల్లకు ఆడ దేవతలు మస్తుగున్నరు. ఆ దేవతలు గ్రామ పొలిమెర్లో నిలిసున్నరు. ఈ మొగోల్లు స్త్రీని ఇంటి బానిసను చేసినట్లే మొగ దేవుండ్లు గూడ ఆడ దేవతలను గ్రామ దేవతలుగ జేసిండ్రు. ఈ ఒక్క అరుంధతి మాత్రమే ఆకాశంల నక్షత్రంగ ఎందుకైందో అని ఆమె గత చరిత్రను తొవ్వితే తేలిన సత్యమేంటిదంటే ఈ అరుంధతి సప్తరుషులను సైతం ఆశ్చర్యపరిచింది. అందుకు ఆమెను ఆకాశ ధృవతారగా ఉండమని వాల్లే దీవించినారు. ఆ ఆకాశంలో గూడా భర్త వషిస్టుడు ఆమెవెంటే తోకచుక్కగా వెలిసినాడు వీరి జంటను ముల్లోకంలో ఉన్న దేవాన దేవుండ్లు ఆశీర్వదించినారు. అయితే ఈ అరుంధతి చరిత్ర ఇప్పుడు మనకు అందుబాటులో లేదు. ఈ చరిత్రను ఈ మాదిగ ఉపకులాల కళాకారులైన డక్కలివారు వషిష్ట బ్రాహ్మణ పురాణంలో, ఈమె కథను చెప్తారు. నా పరిశోధనలో భాగంగా ‘అన్వేషి’ రిసెర్చ్ సెంటర్ తరపున ఆదిజాంభవ పురాణాన్ని చెప్పే డక్కలి కళాకారుల కోసం నేను తెలంగాణ జిల్లాల్లో తిరుగుతూ, వాల్లని వెతికి పట్టుకొని వాల్లతోనే కొన్ని రోజులు ఉండి, ఈ పురాణంలో ఉండబడే మేటి కళాకారులను ఇంటర్వ్య చేస్తే, తేలిన నిజాల్లో ఈ అరుంధతి వషిస్టుని కళ్యాణం గురించి ఆ బ్రాహ్మణ పురుషుడు ఈ వదిగ అరుంధతిని ఎంత వెసపుచ్చి వివాహవడినాడు, ఆమె పతివ్రతనాకాదా అని ఆమెకు ఎన్ని పరీక్షలు పెట్టాడు ఆ పరిక్షలన్నింటిని అరుంధతి నెగ్గింది. స్త్రీజాతికి కడజాతికి ఎనలేని పేరు తెచ్చింది. ఒక పద్యం చరిత్ర ఇందుకే ఒచ్చిందేవె! ”తనదు తల్లి వేశ్యా తనయలి మాదిగ తాను బ్రాహ్మణుడయ్యే విశ్వదాభిరామ వినురవేమ!” వీరి గత చరిత్రను కూడా తెల్సుకుంటె నా కర్దమైన నిజాలను కొన్ని మీతో పంచుకుంటున్నాను. అరుంధతి సంతతి వారసులైన మాదిగ ఉపకులాల ఆడోల్ల బతుకులు అంధకారంలో ఉన్నాయి. అరుంధతి ఆకాశంలో ధృవతారగా ఉండటం మాదిగ జాతికే గర్వకారణంగా చెప్పుకుంటూనే ఆ కడజాతి కాంతల బతుకులు కన్నీల్లమయం కావడానికి మాదిగలతో సహా వీరి బ్రతుకుల మార్పు, అభివృద్ధి జరగడానికి పైస్థాయినుంచి క్రింది స్థాయి వరకు ఎదిగిన సమాజం, మరియూ సాటి సగభాగం స్త్రీ పోరాటాలు దళిత బహుజన పోరాటాలు ఆ సగం, మా సగంను మర్చిపోవద్దని ఆశిస్తూ……..
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
మేరీ కుమారి గారు,
చారిత్రిక అంశాల గురించి రాసేటప్పుడు తగు జాగ్రత్త అవసరమని గమనించగలరు. పరశు రాముని తండ్రి జమదగ్ని మహాముని. దశరధుడు కాదు. దశరధుడు
శ్రీ రాముని తండ్రి. పరశు రాముడు, శ్రీ రాముడు వేరు.
మేరీ కుమారి
అర్ధమయింది. మీ పెరు మేరీ కుమారి అనగానే అర్ధమయింది. హిందూ పురాణాలను విమర్షించెముందు అర్ధమ చేసుకుంటే బావుంటుంది.
అర్ధం చేసుకోకుండా, అపార్ధమ చేసుకొని విమర్శించే మీలాంటివాళ్ల వళ్ళ హిందు మతానికే కాదు, యావత్భారతావనికే ముప్పు.
ఇదీ ఒక రకమైన మత ప్రచారమేనా?
దయచేసి హిందూ పురాణాలను అర్ధం చేసుకునే ప్రయత్నం చేయండి.