రైతుకు పక్కలో బల్లాలు…!
కరవులు, వరదలు, ప్రభుత్వాలు…!!
కర్షకుడు… కర్ణుడే… !
అన్నదాతగా… శాపగ్రస్థుడిగా…!!
బాలారిష్టాలెన్నో రైతన్నకు…!
మెతుకు బతుకు బాగుపర్చేలోగా…!!
గాలివాటపు సేద్యం…!
ప్రకృతికో… దళారికో నైవేద్యం…!!
”కృషి” పరిశ్రమే…!
శ్రమలో స్వేదం చిందే సేద్యం…
కాదంటేనే చోద్యం…!!