ఒంటరి పక్షి
ఎగురుతూ ఎగురుతూ అలసిపోయింది
ఆడుతూ ఆడుతూ అలసిపోయింది
ఆ పక్షి సముద్రపు అలలా ఎగురుతుంది
గుంపులో ఉన్న పక్షి ఒంటరిదైపోయింది
సముద్రతీరంపై వాలి చుట్టూ చూస్తుంది
చూస్తూ చూస్తూ
తన స్నేహితులను జ్ఞాపకం చేసుకుంటుంది
ఒంటరి పక్షి
సముద్రంలో గుంపులు గుంపులుగా
ఎగురుతున్న పక్షులను చూస్తుంది
పదే పదే జ్ఞాపకాలు ముసురుకుంటున్నాయి
కన్నీళ్ళను సముద్రంలోకి ఒంపింది
ఒంటరి పక్షి
సముద్రంలోకి చూస్తూ భవిష్యత్తును ఆలోచిస్తుంది
కన్నీళ్ళు ఆరిపోతాయి
సముద్రపు అలల్ని చూస్తూ ఆనందిస్తుంది
రాత్రి అయిపోయింది
వెన్నెల్లోకి చూస్తుంది
చూస్తూ చూస్తూ తన చరిత్రని ఊహిస్తుంది
తన స్నేహితుల కోసం
వెతుకుతూ వెతుకుతూ చనిపోయింది
తన అవశేషాలనూ
సముద్రంలోనే కలిపేసింది.