ఈ రాత్రి
చల్లని వెన్నెల ఉంది
ఈ రాత్రిని దుప్పటిలా చేసి
కప్పుకోవాలని ఉంది
ఈ రాత్రిలో ఉంటే
తల్లి ఒడిలో నిద్రపోయినట్టుంటుంది
ఈ రాత్రి
కళ్ళముందు నిలిచిపోతే బావుణ్ణు
చుక్కలన్నీ నవ్వుతున్నట్టు ఉన్నాయి
ఈ రాత్రి
నాకు కనువిందుగా ఉంది
ఈ రాత్రికి ఎంతో చరిత్ర
ఉన్నట్టు ఉంది
ఈ రాత్రిలో
నా భవిష్యత్తు కనిపిస్తుంది
ఆకాశం
ఎన్నో బొమ్మలుగా మారుతుంది
ఈ రాత్రిలో పడుకుంటే
అమ్మ జోలపాడినట్టు ఉంది
ఈ రాత్రిలో
ఎందరో మానవుల చరిత్ర ఉంది
ఈ రాత్రి నాకు ఎంతో నచ్చింది
ఈ రాత్రిని మీరు ఎప్పుడైనా గమనించండి
రాత్రి అందాలను చూడండి
ఈ రాత్రి
నాకు పాట పాడినట్టు ఉంది