భయం – డా. ఓరుగంటి సరస్వతి

 

కేరింతలతో గలగల సవ్వడులతో ఆడుకునే చిన్ని ఎందుకు ముభావంగా ఉందో తల్లి ఉమాకి అర్థం కావడంలేదు. చక్కని పల్లెటూరు. పచ్చని పైరులతో కళకళలాడుతున్న ఊరికి వేసవి సెలవులకని తన భర్త, ఐదేండ్ల కొడుకు, ఏడేండ్ల కూతురు చిన్నీతో తల్లిగారింటికి వచ్చింది. చిన్ని కూడా అమ్మమ్మగారింటికి వచ్చేటప్పుడు, వచ్చాక ఓ వారం రోజుల వరకూ కూడా ఎప్పటిలాగానే ఆనందంగా కన్పించింది ఉమకి.

ఉమ తండ్రికి ఇద్దరు తమ్ముళ్ళు అంటే ఉమకి ఇద్దరు చిన్నాన్నలు. అందరూ ఉమ్మడిగానే కలిసి ఉంటారు.

ఉమకి ఇద్దరు అక్కలు, అన్న, తమ్ముడు. అందరూ ప్రతి వేసవి సెలవులకి కలుసుకొని అనందంగా గడుపుతారు. ఉమ భర్త కూడా పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం. చిన్ని కూడా అమ్మమ్మ గారింట్లో చాలా బాగా ఆడుకుంటుంది. పిల్లల్ని అలా సెలవులకి తీసుకు వచ్చినందుకు అందరూ సంతోషపడ్తారు. ఎందుకంటే ఉమ కుటుంబమే అందరికంటే దూరం. అందరూ పక్కపక్కన ఊర్లే కావడంతో ప్రతి వేసవి సెలవులకి ఉమ కుటుంబం కోసం ఎదురు చూస్తుంటారు.

కొబ్బరి బోండాలు, తాటి ముంజలు, మామిడి కాయలు, నేరేడు కాయలు ఒక్కటేమిటి రకరకాల పండ్లతో అందరూ సంతోషంగా ఉంటారు. అందరికంటే చిన్న పిల్ల కావడంతో చిన్నిని తన అమ్మమ్మ, తాతయ్యతో పాటు అందరూ బాగా చూసుకుంటారు. చిన్న తాతయ్యలతో కూడా చిన్ని బాగా ఆడుకుంటుంది. ఒకరి దగ్గరనే కాదు కుటుంబంలో అందరి దగ్గరా చిన్ని ఆడుకుంటుంది.

చిన్ని ఆటలతోనే బాగా అలసిపోయేది. ఇలాంటి సంతోషం తాము ఉండే పట్నంలో మచ్చుకు కూడా కన్పడదని

ఉమ దంపతులు అనుకునేవారు. చిన్ని చిన్న తాతయ్యతో ఎక్కువగా ఆడుకునేది. చిన్న తాతయ్య కూడా చిన్నిని శ్రద్ధగా ఎక్కువసేపు ఆడించేవాడు. దూరంగా తీసుకెళ్ళి కూడా ఆడించేవాడు. ఒక్కోసారి ఆడుకుని తాతయ్య చేతుల్లోనే చిన్ని నిద్రపోయేది.

వచ్చి పదిరోజులైంది. ఉమకి మనసులో ఎందుకో ఆందోళనగా ఉంది. ”ఎప్పుడూ చలాకీగా ఉండే చిన్ని మునుపటిలా

ఉత్సాహంగా లేదు. ఏమై ఉంటుంది. నా చిట్టి తల్లికి ఏమైందిరా! చిన్ని” అని మనసులో అనుకుంది. ఆటలు కూడా తగ్గించింది. తల్లి దగ్గరే కూర్చుని ఉంటుంది. ఉమ మాత్రం చిన్ని సడన్‌గా ఇలా ఉత్సాహం లేకుండా ఎందుకు ఉందన్న అనుమానం? కానీ చిన్ని తండ్రి అంతగా పట్టించుకోలేదు.

”ఏం చేస్తున్నావ్‌ బాబాయ్‌” అని ఉమ అడగగానే చిన్ని పడుకున్న మంచం దగ్గరినుండి మెల్లగా లేచి ”ఏం లేదమ్మా! చిన్ని నిదురపోయింది కదా! ఊరికే కూర్చున్నాను” అని బాబాయ్‌ సమాధానం. ”అదికాదు నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు మనిషివేనా! పసిపిల్ల అన్న ఇంగితజ్ఞానం లేకుండా చిన్ని తొడలపైన నీ చేయి నేను చూశాను. అబద్ధమాడకు! నీకు సిగ్గు లేదా? నీ వయసుకు బుద్ధి ఏమైంది? నా బిడ్డని…” అని ఉమ కన్నీళ్ళ పర్యంతమయింది.

ఆ సమయం రాత్రి కావడంతో అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు కబుర్లాడుకోవడంతో ఇంకా ఈ అలికిడి ఎవరూ గమనించలేదు. ”ఏం మాట్లాడుతున్నావ్‌ ఉమా! చిన్ని సరిగ్గా పడుకోకుంటే పక్కకి సరిగా సర్దుతున్నాను. అంతమాత్రానికే అలా అపార్ధం చేసుకోవడం ఏం బాగాలేదు. పెద్దవాణ్ణని, అందునా తండ్రిలాంటి వాడ్నని మరచిపోయావా? నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నావ్‌” అని బుకాయిస్తాడు.

”చిన్నపిల్లలు దేవునితో సమానం అంటారు అందుకేనేమో. చిన్నికి చిన్న తాత కామంతో తాకరానిన చోట తాకినా, అది ఏ స్పర్శో కూడా గుర్తించలేని పసి వయసు కదా! ఓ దేవుడా! ఏమిటి ఈ దారుణం! ఇప్పుడు నేనేం చెయ్యాలి?” అని

ఉమ దుఃఖంతో చిన్ని దగ్గర కూర్చుంటుంది. ఉమ బాబాయ్‌ అక్కడ్నుంచి మెల్లగా జారుకుంటాడు.

అసలు తన ఒంటిపై చేయి వేశారు అన్న స్పర్శ లేకుండా నిద్రపోతున్న తన కూతుర్ని చూసి ఉమ ఏడుస్తుంది. తన తల్లిదండ్రులని, అందర్నీ పిలిచి చెప్పాలనుకుంటుంది. కానీ ఎందుకో ఉమకు మనసు అంగీకరించదు. అంతకుముందే గత మూడు రోజులుగా చిన్నిపై

ఉమ చెయ్యివేసి పడుకుంటే భయపడేది. అప్పుడు అర్థంకాని విషయం ఇప్పుడు అర్థమయింది. ఇక లాభం లేదనుకుని ఆ రాత్రి కంటిమీద నిదుర లేకుండా తెల్లారుతూనే భర్తతో ఊరెళ్దామని పట్టుబడ్తుంది. అంతవరకు సంతోషంగా ఉన్న ఉమ ఎందుకు హఠాత్తుగా ఊరెళ్ళాలంటోందో భర్తకి అర్థం కాదు. జరిగిన విషయం ఎవ్వరికీ చెప్పకుండా మామూలుగానే ఏదో అర్జంట్‌ పని ఉందని చెప్పి బయలుదేరుతారు.

ఉమ కుటుంబం ఊరుకి వచ్చి మూడు రోజులవుతోంది. అంతవరకు కూడా భర్తకి జరిగిన విషయం చెప్పుకోలేక పోతుంది. కానీ ప్రతిరోజు రాత్రి చిన్నిపై చేయి వేయగానే ”అమ్మా! నా మీద చేయి వేసిందెవరు? ఎవరో నా మీద చేయి వేస్తున్నారు. నీవేనా? వేరే ఎవరైనా వేశారా? అని కంగారుపడుతూ, ఏడుస్తూ అడుగుతుంది. ఉమ భయపడి జరిగిన విషయం భర్తకు చెప్తుంది. చిన్ని ప్రవర్తనకి భయపడి, జరిగిందానికి బాధపడ్తాడు. తెల్లారగానే చిన్నిని ఆస్పత్రికి తీసుకెళ్ళి సైకాలజిస్టుని కలుస్తారు ఉమ దంపతులు. జరిగిన విషయం తెలుసుకున్న డాక్టర్‌ చిన్నిని కౌన్సిలింగ్‌ చేస్తాడు. ఉమ దంపతులకి, భయపడాల్సిన పనిలేదని, జరిగిన విషయం చాలా దారుణమని, ఆడపిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలని, వారి ప్రవర్తనలో మార్పులని గమనించుకోవాలంటాడు. ఇకముందు ఎవరైనా అలా చేయి వేస్తే తల్లిదండ్రులకు చెప్పుకోవాలని, అలా చెప్పేలా అన్ని విషయాలు వారితో మాట్లాడాలని” డాక్టర్‌ చెప్తాడు. అలాగే జరిగిన విషయాన్ని పదేపదే గుర్తు చేయకుండా, మర్చిపోయేలా చేయాలని అంటాడు. కొద్ది రోజుల్లోనే మామూలుగా స్కూలుకి వెళ్ళేలా చేయొచ్చని, ప్రస్తుతానికి చిన్నిని కంగారు పెట్టొద్దని ఓ పదిహేనురోజుల తర్వాత మళ్ళీ రమ్మని చెప్తాడు.

జరిగిందానికి ఉమ ఎంతో బాధపడుతుంది. తన పసిబిడ్డను అలా నిమిరిన తన చిన్న బాబాయిపై పట్టరాని కోపం తెచ్చుకుంటుంది. కానీ ఇకముందు ఆ ఊరికి వెళ్ళకూడదని తన మనసులో నిర్ణయించుకుంటుంది. తన బిడ్డను మామూలు స్థితికి తెచ్చుకుని, భయంపోయేలా కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఇక ముందు ముందు తన బిడ్డకి అన్ని విషయాలు చెప్పి ధైర్యంగా ఉంచాలని అనుకుంటుంది.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.