మనుషులిప్పుడు మానవబాంబులై పేలుతున్నారు
నరహంతకులు పాపపుణ్యాలు వల్లెవేస్తున్నారు బచ్చాగాళ్ళందరూ
లుచ్చాలుగా..మారి
వీధిన పడి వేధిస్తున్నారు
ఓ! నా దేశమా!!
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.. నీకు!
అభివృద్ధి పేర
ప్రయివేటీకరణ
ఉన్నతీకరణ పేర
కాషాయీకరణ
ప్రజల సొమ్ములు
పరాయీకరణ
ఓ!నా దేశమా!
కాస్త సిగ్గుపడవూ…
అభినందన లందిస్తున్నాం!
ప్రజలిప్పుడు
గాలిని పీల్చటం లేదు
నిదుర పోవటం లేదు
ఉన్మాద మూక దాడుల
మరణశయ్యలకు
ఉరికంబాలకు
వేళాడుతున్నారు
ఓ!నా దేశమా!!
కాస్త స్వాతంత్య్ర నినాదాలను… నువ్వు
ఎడిటింగ్ చేసుకోూడదూ..!
జీవించే హక్కులు
కలరాస్తున్న వేళ
మొలత్తెన ప్రశ్నలను
బృణ హత్యలు చేస్తూ
బిగించిన పిడికిళ్లకు
వెలివేతలు వేస్తూ
ఇంక్విలాబ్ నినాదాలను
ఎన్నని హతమార్చుతావ్?
వేడుకలెన్నని చేసుకుంటావ్?
జాతీయ జెండా సాక్షిగా
ఓ! నా దేశమా!!
కాస్త…సిగ్గుపడవూ….!
తరిమికొట్టాల్సిన చోట
ఎర్రని తివాచీలు పరుస్తూ
ఉన్మాద గుంపులను
చుట్టూ తిప్పుకుంటూ
రాజకీయ సమీకరణాలతో
ఎన్ని ఎన్నికల పత్రాలని
ప్రచురించుకుంటావ్?
ఎన్ని అరాచక
సరిహద్దులు పర్చుకుంటావ్?
ఓ! నా దేశమా!!
కాస్త కళ్ళు తెరచి చూడవూ!
నీకు వందనాలు తెలుపుకుంటాం!
రాలిపడుతున్న స్వేచ్ఛకు
ఎన్ని మాసికలని వేసుకోమంటావ్?
తెగిపడుతున్న తూటాలకు
ఎన్ని సెల్యూటులని
చేయించుకుంటావ్?
సార్వభౌమత్వానికై
మతాంధకారాన్ని జొప్పించి
ధర్మగంట లెన్నని
కట్టుకుంటూ వెలిగిపోతావ్?
మారణ¬మాలకు ఎన్ని
కీర్తనలని పాడుకుంటావ్?
ఓ! నా దేశమా!! కాస్త..
మానవత్వాన్ని నింపుకోవూ!
నిన్ను గుండెలో దాచుకుంటాం
జంఢా!ఊంఛా!రహే!హమారా!
సారే.. జహాసే…..అచ్చా….!