అవును…
ఆమెకు మిగిలిన ఒ ఒక అస్త్రమది..
అదే..పనిగ
గొంతు చించుకొని శపిస్తుందని
విసుక్కుంటావ్‌ు..కానీ
నిలబడలేని తన అవిటి తనాన్ని
నిందించు కుంటుందేమో…
దిక్కులు పిక్కటిల్లేలా
ఆక్రోశిస్తుందనుకుంటాం..కానీ..
కడుపారాకన్న కలలే
కఠిన శిలలుగా మారితే..
యే..తల్లి విలపించదని!!
చిక్కిశల్యమైన ఆ పండుదేహం లోంచి
ఉబికివస్తున్న దుఃఖాశ్రువులు..
జీవనదులై ప్రవహిస్తున్నయ్!
కలవరపడే ఆ పలుకులు..
కల్లోల సంద్రం లోంచి
ఎగిసిపడుతున్న రెటాలు
పక్కింటి గోడల మాటున
ప్రతిధ్వనిస్తున్న ఆమె అంతర్మధనం..
పట్టించుకునేదెవరనీ!?
కడదాకా తోడుంటాడన్న పెనిమిటి..
నడమంత్రా నాగం చేసిండట
మణులూ మాన్యాలు కోరుతుందా
ఈ కొడగట్టిన దీపం!!
పిడిడుె మెతుకుల కోసం
తలో నెలా తరలిస్తున్న దైన్యం
పింఛన్ పైకమన్నా..ఈమెకు చేరేదెట్లా!
శ్రావణుడి నీతులు పాతబడితే..
ఇంటింటికీ కంఠ శోషలే..
రాలిపోతున్న ఆకుల్లోంచి మొలిచిన చిగుళ్లు
పునాదులను విస్మరిస్తాయెందుకో!?
సుమోటో..గా రాని సుప్రీం కు
వృద్దాప్యం చిన్నచూపేనేమో!!
హలో!! బాబూ..
అమ్మ గొంతెండి సొమ్మసిల్లిందంటూ
బతిమాలి రప్పిస్తుంటాం..!
అదేపనిగా..
పచ్చోలే తల్లడిల్లే ఈమె అరిగోస
ఎప్పుడు తెల్లారనుందో..!?
రాలిపోయె.. ఈ ఆకులమీద
కాసింత కారుణ్యం అవసరమిప్పుడు..