తల్లే ఓ జీవన సూత్రం – డాక్టర్‌ కత్తి పద్మారావు

మండుటెండల్లో

పిల్లోడి బొక్కుల కోసం మట్టి మోస్తుందామ్మ!

తారు రోడ్డులో

కాళ్ళు కాలుతున్నా రోడ్‌రోలర్‌ లాగింది ఆమె

పిల్లోడికి పాలివ్వడం కోసం

పొలాల గట్ల వెంబడి పరిగెత్తుకొచ్చింది ఆ అమ్మ

పురుడు పురుడికి నేల పగిలినట్లు నొప్పులు

ఇల్లు కాలుతున్నప్పుడే పిల్లోణ్ణి

తీసుకుని పరిగెత్తుకొచ్చిందామె!

ఒల్లు కాలినా తన బిడ్డకు

సెగ తగలనివ్వని త్యాగలామెవి

నెత్తి మీద వెంట్రుకలన్నీ రాలిపోయినా,

ఆ మట్టి బొచ్చె దించలేదామె!

ముళ్ళ కంచెల్లో కాలు ఇరుక్కొని

నెత్తుటి చుక్కలు రాలినప్పుడు కూడా

అమ్మమ్మగా తన పిల్లల పిల్లలకి

పాల డబ్బా కోసం పనికెళ్ళడం మానలేదా తల్లి!

అవును! తల్లి తాగ్యానికి తిరిగి ఏమిస్తున్నారు!

తనకు జన్మనిచ్చిన తనకు జీవితాన్నిచ్చిన

తల్లి పాచారతో వుంటే

పట్టుబట్టలు పెళ్ళాలకు తెచ్చే కొడుకులు

అమ్మకొక మంచి చీర కొనలేకపోతున్నారే!

ఇది భావదరిద్య్రం కాదా!

ప్రకృతంతా ఎంతో కొంత తిరిగిస్తూనే ఉంది!

కడలి అలలు మబ్బులను పుట్టిస్తే

ఎన్నో కొన్ని నీటి చుక్కల్ని

మబ్బులు కడలికిస్తున్నాయి

చంటి బిడ్డకు బుడి బుడి నడకలు

నేర్పుటప్పుడు ఆ తల్లి వెన్ను పూస వంగింది!

కళ్ళు గాజుతుంపులయ్యాయి!

కాళ్ళు తాటి మట్టలయ్యాయి!

కాని ఎవరూ కన్నెత్తి చూడటం లేదు.

కొందరు పిల్లలు పూలమీద నడుస్తున్నారు

అత్తరు వాసనల్లో మునుగుతున్నారు

పెద్ద పెద్ద తెరల్లో సినిమాలు చూస్తున్నారు

‘నానమ్మ వచ్చింది’ అంటే ఏమిపోయింది!

‘ముసల్ది వచ్చింది’ అన్నారు

గుండె గతుక్కుమంది!

వేరుకు చదలుబట్టింది. చెట్టేమవుతుంది?

అవును! ఆ వృద్ధాశ్రమంలోని నిరాశ్రయులైన

వృద్ధులకు నలుగురు కుమారులు

ఆస్థి అంతా రాయించుకుని తరిమేశారు

రిజిస్ట్రేషన్‌కు ముందు చేపల కూరలు

మాంసం వేపుళ్ళు వండి వార్చారు

ఆస్థి తమ పేర మారాక నిందలేసి గెంటేశారు

తల్లికి చెప్పడానికి మాట రాలేదు

ఆమె కొడుకు కలెక్టరైన మాట నిజమే

ఆ మండలానికి అధికారిగా వెళ్ళినోడు

మంచంలో వున్న తల్లిని చూడకుండా

బిజీ బిజీ అని వెనుదిరిగాడు

ఆ పిల్లోడు హాస్టల్లో ఉన్నప్పుడు

చెత్తలో ఆవిరేసిన కుడుములు

పచ్చికొబ్బరిముక్కలు తేలేటట్టుగా

పరమాన్నం తీసికెళితే

ఎగబడి తిని జోరు జుర్రినోడు

ఇప్పుడు సూటు బూటు వేసి

నక్షత్రాల హోటళ్ళలో దిగి

బంట్రోతులు వెంట నడుస్తుంటే

సుఖభోగాలు అనుభవిస్తూ

తల్లిని మరిచిపోయాడు సుమా!

మదర్స్‌డే రోజే సిబిఐకి దొరికి

సువ్వలు లెక్కెస్తున్నాడు

అవును! ‘తల్లిని మరిచినోడికి

పుట్టగతులుండవనే సామెత ఉండనే వుంది

నిజమే! చిన్నారులను కామ దృష్టితో చూసే సంస్కృతి

పురుషాహంకార, ఆధిపత్య పాలన

మద్యం ఏరులై పారాక

విచక్షణ కోల్పోయాక తల్లేమిటి? చెల్లేమిటి?

ఆక్రందనలు వినే చెవులు లేవు

పాలకుల గుండెల్లో తడి ఎండిపోతుంది

తల్లితనంపై గొడ్డలి వేటు పడుతోంది

పొదిగిట్లో పసికందుకు పాల కోసం ఆరాటం

మనస్సు లేని పాలనలో తల్లికి నెలవేది

అవును! మళ్ళీ తల్లే కళ్ళు తెరుస్తుంది!

అనంతమైన అక్రమాలకు అడుపుల్ల వేస్తుంది!

ఆత్మీయ సంద్రాలు పొంగిస్తుంది

తల్లీ ఓ సంస్కృతి! తల్లి ఓ సముత్తేజం!

తల్లే ఓ సామాజిక సందేశం

తల్లే ఓ జీవన సూత్రం

తల్లే ఓ సాంస్కృతిక పునరుత్తేజం

తల్లే పునర్నిర్మాణ కర్త

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.