జాన్‌ హిగ్గిన్స్‌ భాగవతార్‌ -రొంపిచర్ల భార్గవి

నేను బహుశా మెడిసిన్‌ సెకండియర్లోనో, థర్డ్‌ ఇయర్లోనో ఉండి ఉంటాను. ఒక రోజు మా స్నేహితుల మధ్య చర్చ లోజాన్‌ హిగ్గిన్స్‌ పేరు వచ్చింది. నేనదే మొదటిసారి ఆ పేరు వినడం. ఒక అమెరికన్‌ అయ్యుండీ, కర్ణాటక సంగీతం మీద అభిమానం పెంచుకుని, భారత దేశం వచ్చి మన శాస్త్రీయ సంగీతం చక్కగా నేర్చుకోవడమే కాక, త్యాగరాజ ఆరాధనోత్సవాలలో పాల్గొనడమూ, సంగీతానికి పట్టుగొమ్మయిన తమిళదేశంలో ూడా అనేక కచేరీలు చేసీ, గ్రామ్‌ఫోన్‌ రికార్డులిచ్చీ, మన భారతీయ విద్వాంసులచేత శభాష్‌ అనిపించుకుని, జాన్‌ హిగ్గిన్స్‌ భాగవతార్‌ అని పిలిపించుకోవడమూ విశేషం. అలాంటి ఆయన గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా అనిపించడమే కాక ఆయనంటే గౌరవంగా ూడా అనిపించింది.

అంతర్జాలం పుణ్యమా అని ఆయన గురించి నేను తెలుసుకున్న సమాచారం మీముందుంచుతాను.

జాన్‌ బోర్త్‌ విక్‌ హిగ్గిన్స్‌ అమెరికాలో మసాచుసుట్స్‌ రాష్ట్రంలోని ఆండోవర్‌ అనే ఊళ్లో 1939, సెప్టెంబర్‌ 18వతేదీన జన్మించాడు.

అతని చదువంతా ఫిలిప్స్‌ అకాడమీ లో సాగింది, అక్కడే తండ్రి ఇంగ్లీష్‌ టీచర్‌ గానూ, తల్లి పియానో టీచర్‌ గానూ పనిచేస్తూ వుండేవారు.

ఆ తర్వాత అతను వెస్లియా యూనివర్సిటీలో చేరి మూడు డిగ్రీలు సంపాదించాడు, అవి వరసగా బి.ఏ మ్యూజిక్‌, ఎం.ఏ మ్యూజికాలజీ, ఇంకా ఎన్నో మ్యూజికాలజీలో పి.హెచ్‌.డి. ఇవన్నీ చేస్తుండగా ఆయనకి భారతీయ సంగీతం మీద ఇష్టం ఏర్పడింది. దాంతో ఆయన భారతీయ సంగీతాన్ని నేర్చుకోవడం ప్రారంభించాడు. మొదటి గురువులు రాబర్ట్‌ బ్రౌన్‌, టి.రంగనాథన్‌. తర్వాత టి.శంకరన్‌ వద్ద ూడా శిష్యరికం చేశాడు. వెస్లియన్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరి, అంచెలంచెలుగా ఎదిగి, ఆ యూనివర్సిటీలోని సెంటర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ కి డైరెక్టరయ్యాడు. అయినా ఆయనకి భారతీయ సంగీతం గురించిన తృష్ణ తీరలేదు, భారతదేశం వచ్చి ఇక్కడే ఉండి, గురు ముఖతా విద్య నేర్చుకోవాలనుకున్నాడు. అలా ఫుల్‌ బ్రయిట్‌స్కాలర్‌ షిప్‌ తో మనదేశం వచ్చి టి.రంగనాథన్‌ సోదరులు టి.విశ్వనాథన్‌ వద్ద శిష్యరికం చేశారు.చాలా కొద్ది కాలంలోనే త్యాగరాజ ఆరాధనోత్సవాలలో కచేరీ చేయగలిగే స్థాయికి చేరుకున్నారు.శాస్త్రీయ సంగీతానికి పట్టుకొమ్మలా భాసిల్లుతున్న తమిళ దేశంలో కచేరీ చేసి మెప్పించగలిగిన సామర్థ్యాన్ని సంపాదించారు. అతని ఉచ్చారణలోనూ, సంగతులలోనూ తప్పులు వెదుకుదామని ూర్చున్న వాయీడా, వంక పెట్టలేని అతని ప్రతిభ చూసి ఆశ్చర్య పోతూ ఉండేవారట. టి.విశ్వనాథన్‌ సోదరి, ప్రముఖ డాన్సర్‌ టి.బాలసరస్వతి దగ్గర ూడా కొంతకాలం శిష్యరికం చేసి, డాన్స్‌ గురించీ, మ్యూజిక్‌ గురించీ ఒక వ్యాసం రాశారు. ఆయనకి భాగవతార్‌ అనేది బిరుదుగా లభించింది. తర్వాత అమెరికా తిరిగి వెళ్లి అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్టడీస్‌లో సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోగా ఉన్నారు.

దేశవిదేశాలలో కర్ణాటక సంగీత కచేరీలు చేస్తుండేవారు. ఒక మంచి గురువుగా, మంచి విద్వాంసుడుగానే కాక ఒక మంచి మనిషిగా ూడా గుర్తింపబడ్డాడు. కుటుంబ బంధాలకు ఎక్కువ విలువిచ్చేవాడు.

ఆయన పాడిన కీర్తనలలో ఎందరో మహానుభావులు, శివశివ అనరాదా, కృష్ణా నీ బేగనే బారో, బ్రోచే వారెవరే (శ్రీరంజని రాగం-త్యాగరాజ స్వామి కీర్తన) ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

1984 సంవత్సరంలో జాత్యహంకారానికి నిరసనగా సౌత్‌ ఆఫ్రికాలో ఒక కచేరీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటూ, ఒక రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత, తన పెంపుడు కుక్కతో బయటకు షికారు వెళ్లిన ఆయన్ని ఒక తాగుబోతు తన మోటార్‌ సైకిల్‌తో గుద్ది వెళ్లిపోయాడు. అలా జాన్‌ హిగ్గిన్స్‌ భాగవతార్‌ జీవితం 1984, డిసెంబర్‌ 7వతేదీన అర్థాంతరంగా ముగిసిపోవడం విషాదకరం.

సంగీతానికి ఎల్లలు లేవని, జాతి, మత, కుల భేదాలు లేవనీ నిరూపించిన సాంస్కృతిక రాయబారి ఆయన. ఆయన పాడిన కీర్తనలు వింటూ, ఆయన భావాలు పలికిన తీరుకీీ, సంగతులు పలికిన విధానానికీ ఆశ్చర్యపోతుంటాను నేను. సంగీతం పట్ల ఎంతో తృష్ణ, శ్రధ్ధ, ఏకాగ్రత ఉంటే తప్ప ఇది సాధించలేరు.

మళ్లీ మరో జాన్‌ హిగ్గిన్స్‌ ని చూస్తామా! ఏమో!

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో