తల్లి చెప్పిందే చట్టం (కాలా) -దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు

నేల నీకు అధికారం నేల మాకు జీవితం (కాలా)

మీరు నేల మీద బతకడానికి నూకలు ఉన్నాయి అనే సామెతలో ఎంత నిజముందో అంతే నిజం ఈ నేల మీద ఊపిరి తీసుకుని ప్రతి జీవికి బతకడానికి ఆశలు ఉంటాయి. అందుకేనేమో మనుషులు భూమిని ఆక్రమించుకున్న విధిగా దేనిని ఆక్రమించుకోలేకపోయారు. నేలపై అనేక రకాల పంటలు పండించుకోవడానికి నిలయం.

ఆనంత సంపదలు కలిగిన ఈ నేల సకల జీవరాశులకు అవసరమైనది.

నేల:

మానవ సమాజం యొక్క నాగరికత అభివృద్ధిలో నేల ఎంతో ముఖ్యమైన పాత్ర వహించింది నాగరికత పెరగ్గా పెరగ్గా తన ఆహారాన్ని తానే ఉత్పత్తి చేసుకునేందుకు అడవులుగా ఉన్న నేలను పంటచేలుగా మార్చి తనకు అనుగుణంగా మార్చుకున్నారు మానవులు. వారి కఠోర శ్రమతో నేలను దైవంగా భావించి మతాచారంగా జాతి సాంప్రదాయంగా మార్చారు. నేల అధికారంగా మారింది. ఇతిహాసాలు పురాణాలు మొదలై ఈనాటి వరకు ఎల్లలు విస్తరింప చేసుకుని అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జరిగే పోరులో ఓడినవారు బానిసలుగా మార్చబడుతున్నారు. స్వతంత్ర భారతంలో కూడా నేల ఉన్న వాడు ఎవరు నేల లేని వాడు ఎవరు వాళ్లకు సమాజంలో ఎవరికి విలువ ఉందనేది ఈనాటికీ రాయబడని చట్టంగానే ఉంది. పలు దశాబ్దాలు గడిచినా గ్రామాలలోను నగరాలలోని ఈ పరిస్థితి పెద్దగా మారలేదు. నగరాల్లో సైతం నివాసయోగ్యం కాని నేలను తమ సమూహ బలంతోనూ శారీరక శ్రమతోనూ కాపాడుకుంటున్నారు గుడిసెలలో బ్రతికే ప్రజలు. వీళ్ళను ఈ రోజు మనం నగర ప్రజలు అంటున్నాం. వీళ్ళ జీవితాలు ఈ దేశంలో మరింత అణచివేతకు గురవుతున్నాయి. కార్పొరేట్‌ సంస్థల కళ్ళు ప్రభుత్వ సహకారంలో నడిచే ల్యాండ్‌ మాఫియాలు ప్రభుత్వం గుర్తింపు ఉంచుకుని మురికివాడ ప్రజల స్థావరాలు నగర అందాలు చెక్కుతున్నాయని, అసభ్యంగా ఉన్నాయని, అశుభ్రంగా ఉన్నాయని, దోపిడి దొంగలకు నివాసాలయ్యాయని చెప్పి వారిని నగరంలో నుంచి వెలివేసే కుతంత్రాలు చేస్తున్నారు. ఇందువల్ల ప్రజలు తమ తమ స్థావరాలను నుండి గెంటబడి నగరానికి వెలుపల గాని లేక అగ్గిపెట్టె లాంటి హౌసింగ్‌ బోర్డులో కాలనీలో గాని కుక్కబడి చచ్చిన తర్వాత పూడ్చడానికి కూడా ఆరడుగులనేల లేక దిక్కు లేనివారిగా మార్చబడుతున్నారు. ఇండియాలోనే అన్ని నగరాలలోనూ ఈ అణచివేత అందరూ కళ్ళారా చూస్తుండగానే జరుగుతుంది. దీనికి దేశంలోనే అతి ముఖ్య వాణిజ్య నగరమైన ముంబై కూడా మినహాయింపు కాదు.

ధారావి (దోబిఘడ్‌) : ఇది మురికివాడ అని చెప్పేకంటే కుల మత జాతి అన్ని వర్గాలు కలిసి

ఉండే పవిత్రమైన (స్థలం) నేల అని చెప్పవచ్చు. ఈ నేలపై బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయతలు అపారమైన ఈ నేలపై పెంచుకున్న ప్రేమ ప్రజలలో ఉండే విశ్వాసమే ఈ నేలను కాపాడుకుంటూ వచ్చారు. ఈ ధారావిలో ఎక్కడకూడా మురికి గుంటలు చెత్తాచెదారం ఈ చిత్రంలో చూపించలేదు. కొన్ని కొన్ని సందులలో కొంతమంది అక్కడే బట్టలు ఉతకడం, స్నానాలు చేయడం, పిల్లల ఆడుకోవడం వంటివి ధారావిలో ఎక్కువగా కనిపిస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల గోడలపై ఉన్న తమ అభిమానంగా పూజించే బుద్ధుడు, మహాత్మ జ్యోతిరావు పూలే, అంబేద్కర్‌ పెరియార్‌ స్వామి చౌక్‌, భీమ్‌ వాడ, మసీదు, మరికొన్ని దుకాణాలు మొదలగునవి కనిపించే అద్భుత దృశ్యాలు. మతాలు వేరైనా ఇక్కడ నివసించే ప్రజలు మాత్రం అన్నదమ్ముల బంధుత్వాలు కలుపుకొని సుఖసంతోషాలు ఆనందాలు, కష్టాలను పంచుకుని తమ మనుగడకు జీవనం సాగిస్తుండేవారు. 40వేల కోట్ల విలువచేసే ఈ ధారవి నేల మీద మీ రాజకీయ నాయకులు వెలకట్టలేని మా జీవితాలు పణంగా పెట్టి తాతల కాలం నాటి నుంచి కాపాడుకుంటూ వచ్చారు. ఈ ధారావి నేలలో అన్ని సౌకర్యాలు ఉన్నా ఒక విజ్ఞాన భాండాగారం అని చెప్పవచ్చు. ఈ నేలపై అధికారం మరియు రాజకీయ నాయకులు ఎవరైనా సరే దీనిపై కన్ను పడితే సహించేది లేదని ఈ ధారావిలో ఉండే ప్రజలు ఐక్యత గురించి ముంబై ప్రజలందరికీ తెలిసిన సత్యమే.

శాసనసభ ఎన్నికలు జరగబోయే ఈ సమయంలో అధికార పార్టీ హరి దాదా అనుచరుడు విష్ణు గుడిసెలను తొలగించి అపార్ట్మెంట్లను కట్టే శంకుస్థాపన ప్రయత్నంలో హరిదాదా అనుచరుడైన విష్ణువును వ్యతిరేకిస్తూ ప్రజలు నినాదాలతో

”పాత గుడ్డలు ఉతుకుతాం – కష్టపడి బ్రతుకుదాం

మా గూడుమాదే – మా బ్రతుకులు మావే

మా చోటు మాదే – మా హక్కు మాదే

మా చోటులేదెవ్వరికి – మా చోటు మాదే

పాత బట్టలు ఉతుకుదాం – మా నేల మాదే”

ఇక్కడ ధారవి ప్రజలు తమ నేలపై ఎవరైనా ఆధిపత్యం రాజకీయం పరంగా, అధికార పరంగా వస్తే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తమ నేలను కాపాడుకుంటూనే ఉన్నారు.

కాలా కుటుంబం: ఈ కుటుంబం ఒడిదుడుకులు లేని కుటుంబం అని చెప్పవచ్చు ధారవి ప్రజలకు అండగా ఉండే కుటుంబం అని చెప్పవచ్చు. సరదాగా కష్టసుఖాలను అన్నింటిని అందరూ పంచుకున్న తీరు చాలా అద్భుతం. ధారవి ప్రజలకు ఏ సమస్య వచ్చినా కుటుంబం మొత్తం నిలబడుతుంది. ధారవి నేలపై పెద్ద కుటుంబము కాలా కుటుంబమని చెప్పవచ్చు. కాలా ఎప్పుడు కొడుకులు కోడళ్లతోనూ,

మనవళ్లు మనవరాళ్లతోను అన్నిటికంటే ముఖ్యంగా భార్య స్వర్ణతో ఆనందంగా సరదాగా వాళ్ళను నవ్విస్తూ నవ్వుతూ ఉంటాడు. ఈ కాలా సినిమాలో ఎక్కువగా కాలా భార్య స్వర్ణ తన కుటుంబ సభ్యులందరినీ నవ్వించిన తీరు, నటన తన జీవిత కాలంలో కుటుంబమంటే ఎలా ఉండాలనే తీరు చాలా అద్భుతమైనది. కుటుంబంలో ప్రతి ఒక్కరు బాధ్యత కలిగిన మార్గదర్శకులుగా ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు కాలా అయినప్పటికీ స్వతంత్ర విలువలతో కుటుంబ సభ్యులతో పాటు ధారావి ప్రజల చేత కూడా కాలా అని పిలిపించుకునే తృప్తి కాలాకి ఉందని మనం గ్రహించాలి. ధారావి ప్రజలకు కాలా కుటుంబం ఒక ఆదర్శం. కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయినా ధారవి ప్రజలు శోక సంద్రంలో ఉన్నప్పటికీ ధారవినేల కోసం పోరాటంలోకి దిగుతారు. ఈ కాల సినిమాలో అత్యధికంగా మనం ఆనందపడిన సన్నివేశాలు కాలా మరియు కాలా భార్య స్వర్ణ మాట్లాడుకునే మాటలు చాలా అద్భుతమైనవి. ఈ చిత్రంలో భార్యభర్తలు ఇద్దరూ ఇద్దరే ఒకరిని మించిన వారు మరొకరు మాటలలో ప్రేక్షకులను ఆనందింపచేసిన సంఘటనలు చాలా ఉన్నాయని చెప్పవచ్చు కుటుంబం అంటే ఇలానే ఉండాలి అనుకునే విధంగా దర్శకుడు తనదైన శైలిలో దేశంలో ఉన్న కుటుంబాలు అన్ని ఇలా ఉంటాయని చక్కగా చూపించాడు.

స్వర్ణ : ఈమె కాలా భార్య ఇంటి ఇల్లాలు అలుపెరుగని కుటుంబ యోధురాలు అందర్నీ

ఉత్సాహపరిచే మాటల మాంత్రిక. ఎవరికి ఏ సమస్యలు వచ్చినా తన మాటలతో వెంటనే నవ్వించగల సమర్థురాలు. అంతేకాదు ఆ కాసేపు మనసులోని బాధలను కూడా మర్చిపోయే మాటలతో వారిని వేరే మాటలతో కలుపుకుని మాట్లాడుతుంది. అందరినీ కలుపుకొని సరదాగా మాట్లాడే సన్నివేశం చాలా అద్భుతంగా ఈ చిత్రం ద్వారా మనం తెలసుకోవచ్చు. కాలా చెప్పే మాటలకు ఉబ్బి తబ్బిబ్బై ఆనందపడుతుంది. కాలా తాగుతున్నప్పుడు చాలా ఆందోళన పడుతుంది ఏమవుతుందో ఏమోనని, మందు పట్టే వాడిని కూడా తిడుతుంది. భర్తపై ఉన్న ప్రేమ అలాంటిది. కాలా పిల్లలను తిడుతుంటే ఎందుకండి అలా తిడతారు మన పిల్లలు ఎక్కడికిపోతారండి ఇక్కడే ఉండమని చెప్పండి అన్నప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి మీ నాన్న చెప్పిన మాట విను ఎక్కడికైనా వెళ్ళు అని మనసులో బాధ పెట్టుకుని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇది ఆమె గొప్పతనం. ఆమె చిన్న కొడుకు లెనిన్‌ బయటికి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆ బాధ మనసులో దాచుకుంటుంది పైకి భర్తతో నవ్వుతూ మాట్లాడుతుంది. కాలా కూడా ఈ విధంగానే ఉంటాడు. అహంకారం, కోపం పొగరు అలాంటివి స్వర్ణలో లేవని ఆమె పల్లెటూరి మాండలిక భాషతో మాట్లాడే తీరు గొప్పగా చూపించాడు దర్శకుడు. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో అందర్నీ గౌరవించే సంస్కారవంతమైన ఇంటి ఇల్లాలు కాలా భార్య స్వర్ణ. కాలా, శివన్న, లెనిన్‌ ఉద్యమంపై బయటకు వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్లు కాలాతో సహా అందరికి దిష్టి తీసేటప్పుడు కాలా చేసే పని గొప్పదని అందరి కళ్ళు నీ మీదనే… దిష్టి పాపిష్టిది అని దిష్టి తీస్తోంది. మా మావ నల్ల చిరుత పులి అని కాలా వీరత్వం గురించి చెప్పుతూ మురిసిపోతుంది.

కాలా స్వర్ణ సంభాషణలు:

స్వర్ణ : పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది.

కాలా : ఓయ్‌ ఇంకా పడుకోలా

స్వర్ణ : మెలుకువగానే పడుకున్నా తెలవట్లా

కాలా : ఏయ్‌ ఊరికే మాట్లాడ్డానికే వెళ్ళాను

స్వర్ణ : మాట్లాడావా

కాలా : నా కళ్ళలోనువ్వే పూర్తిగా నిండున్నావే నేను తనని అసలు చూడలేకపోయాను.

స్వర్ణ : దీనికేమి తక్కువ లేదు ఇట్టాసూడు నేను పుట్టింటికెళ్ళిపోతున్నా, నిన్ను మాత్రమే ప్రేమిత్తారా! గవర్మెంట్‌ స్కూల్లో ఎనిమిదో తరగతి చదివా, నడుసుకుంటూ పోయేదాన్ని డప్పు కొట్టే పెరిమాళ్ళేడు పిచ్చిపట్టినోడిలా ఎనకమాలే తిరుగుతా ఉండేవాడు. నా కిట్టమే నువ్వు నన్ను కట్టుకున్నా వుగా, సెప్పేది విని టికెట్‌ బుక్‌ సెయ్‌ నేను ఆడుపోయి ఆడు డెట్టున్నాడో సూసోత్తాను. నీకో నాయం నాకో నాయామా…

ఇలాంటి మాటలు కుటుంబంలో జరిగే ప్రతి సన్నివేశాలు ఆనందంగా ఇలానే ఉంటాయి.

శివన్న : కాలాకు నలుగురు కొడుకులులో ఇద్దరు కొడుకులు శివన్న పెద్దవాడు, అందరికంటే చిన్నవాడు లెనిన్‌. శివన్న తన తండ్రితోపాటు ఉద్యమంలో ముందుంటాడు, ఇతనికి తండ్రిపై అపారమైన నమ్మకం, గౌరవం, ఇష్టం, ప్రేమ అన్ని కలుపుకుని తండ్రికి తగ్గ తనయుడు లా తండ్రి చెప్పిన మాట రావణ హక్కుగా భావించి ధారావి ప్రజలకు అండగా నిలుస్తాడు. ధారవిలో ఇల్లు కట్టడానికి శంకుస్థాపన జరిగే సమయంలో నిన్ను మాత్రం అందర్నీ ఎదిరించి పోరాడుతాడు. తరువాత తన తండ్రికి ఏమైనా అవుతుందేమోనని తండ్రిని విడిచి

ఉండేవాడు కాదు అలానే కుటుంబం కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. శివన్న తన భార్యతో నా తండ్రి కోసం ప్రాణాలైనా ఇస్తాను. ఈ మాటలు చెప్పొచ్చు తండ్రిపై ఉన్న ఎంత అపారమైన ప్రేమ.

లెనిన్‌ : కాలా కొడుకులలో చివరి (నాలుగవ) వాడు లెనిన్‌. పోరాట విప్లవయోధుడు అని చెప్పవచ్చు. ధారవిలో ఉన్న ప్రజలు సమస్యలను ఇంటింటికి వెళ్లి సమస్యలను సేకరించి పోరాటం ద్వారా సాధించాలనుకున్న సమయంలో అన్నయ్య శివన్న దానిని ఆ సమస్యను పరిష్కరించేవాడు. లెనిన్‌, భారతి ఈ ఇద్దరు కూడా ప్రజల సమస్యల గురించి తెలుసుకొని అందరికి సాధ్యమైనంత వరకు పరిష్కారం చేసేవారు. కాని పక్షంలో కాలా రంగంలోకి దిగేవాడు. లెనిన్‌ పేరుకు తగ్గ వ్యక్తిగా నడుచుకున్నప్పుడటికీ చివరికి తండ్రి చెప్పిన మాటలో నడుచుకుంటూ తన ఉద్యమ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. లెనిన్‌ జరీనా మరియు కన్‌స్ట్రాక్షన్‌ ఆర్గనైజర్‌తో పాటు హరి దాదా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ హరిదాదా ముందు ఆర్గనైజర్‌ కింద కూర్చుని ఉంటాడు. జరీనా సోఫాలో కూర్చుంది. లెనిన్‌ మాత్రం నిలబడే

ఉంటాడు. జరిగిన విధాతకు కన్‌స్ట్రాక్షన్‌ గురించి పూర్తిగా చెప్పిన తర్వాత లెనిన్‌వైపు హరి రాదా తదేకంగా చూస్తూ ఉంటాడు. లెనిన్‌ కళ్ళల్లో భయం లేదని గుర్తిస్తాడు. ఇతను ఎవరు అని అడిగేలోపే నేను కాలా కొడుకుని అని గర్వంగా చెప్పాడు. సహజంగా భయంకరమైన ఇళ్లల్లోకి వెళ్లినప్పుడు తన గురించి తను వాళ్ళ గురించి చెప్పుకోవటానికి భయపడతారు కానీ కాలా కుటుంబమే కాదు ప్రతివాడ, వాడ కుటుంబంలోనే ఇలా చెప్తూ ఉంటారు. భయపడినా చస్తాం భయపడకపోయిన చస్తాం అనే నినాదంతోనే ఉండాలని లెనిన్‌ దైర్యం చూసే ప్రేక్షకులు ఈ సన్నివేశంలో నివ్వెరపోతారు. లెనిన్‌ చేసిన పనులలో యువతకు ఉద్యమ స్ఫూర్తిపై అవగాహన ఉండాలని దర్శకుడు వివరించిన తీరు చాలా అద్భుతం.

విజ్జి (భీమ్జీ): చాలా చురుకైన వ్యక్తి వయస్సులో చిన్నవాడు ధారావిలో ఉన్న కుర్రాళ్లలో భిన్నంగా కనిపిస్తాడు. సమస్య కాలా కొడుకుల వల్ల కాకపోతే వెంటనే కాలాకి తెలియజేస్తాడు. ధారావిలో పార్టీకి సంబంధించిన హరి దాదా మనుషులు ధారావిలో ఉన్న ప్రజలను కొట్టి తరిమే ప్రయత్నం చేస్తారు. అందుకు విజ్జి తల్లి ఎదురు తిరుగతుంది. ఆడ మనిషి అని చూడకుండా కాలితో తన్ను తాడు ఒకడు విజ్జి తట్టుకోలేక వెంటనే కాలాకు తెలియజేస్తాడు. కాలాను బైక్సై ఎక్కించుకుని ఇంటికి తీసుకు వస్తున్న సమయంలో రోడ్డుపై వెళ్లేవాళ్ళను గమనిస్తూ కాలాను ఆ సందు ఈ సందు అని రకరకాలుగా తిప్పుతుంటాడు. రేయ్‌ ఎందుకురా అటు ఇటు తిప్పుతున్నావ్‌ అని కాలా అడిగినప్పుడు, కాలా మనల్ని చుట్టుముట్టారు అని సమాధానమిస్తాడు విజ్జి. కాలాకు ఏమీ కాకూడదనే తపనతో తమ శక్తిసామర్థ్యాల ద్వారా తెలియజేస్తాడు. ముంబై మొత్తంలో హరిదాదా నవ్వుతున్న (పళ్ళికిలిస్తూ) దృశ్యం పెద్ద పెద్ద బ్యానర్లో కనిపిస్తాడు. హరి దాదాను బ్యానర్లు చూసినప్పుడల్లా విజ్జికి ఏదో తెలియని ఉక్రోషం వస్తుంది. రాయి తీసుకుని బ్యానర్‌లో ఉన్న హరిదాదా (నవ్వుతున్న ఫోటో)

పళ్ళు రాలగొడతాడు. ఈ కోపం అతనికి ఎందుకు వస్తుంది అని మనం అనుకుంటే హరి రాదా వీళ్ళను బాగా ఇబ్బంది పెట్టినట్లు మనకు కాలా సినిమా ద్వారా అర్థమవుతుంది.

జరీనా: ఈమె ధారవిలో పుట్టి పెరిగింది. ఉద్యోగరీత్యా ఆఫ్రికాదేశంలో స్థిరపడింది. అక్కడే వేలకు వేలు పెట్టి పెద్ద పెద్ద ఇల్లు కట్టడం ఈమె ఉద్యోగం. పుట్టిన ఊరిలో ఇల్లు కడదామనే ఉద్దేశంతో ఇండియాలోనే ముంబైలో ఉన్న ధారావికి వస్తుంది. ఈ ధారవిలో

ఉన్న పరిస్థితులన అర్థం చేసుకుని ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని కట్టడానికి సిద్ధపడింది కానీ ప్రభుత్వం ధారావికి వ్యతిరేకంగా

ఉందని తెలుసుకుంటుంది. జరీనాను హరిదాదా భయపెట్టిన తర్వాత సన్నివేశంలో హరిదాదాను షేక్‌ హ్యాండ్‌ ఇవ్వమని ఇది సమానత్వానికి నిదర్శనమని చెబుతోంది. మన ధారావిని బాగుచేయడానికి నా ఒక్కరి వల్ల కాదు కాలాతోపాటు అందరూ ఉండాలి. ఇక్కడ కులాలు మతాలు అన్నీ ఒక్కటవ్వాలని మన ధారావిని మనమే కాపాడుకోవాలి అని చెప్పి చిత్రంలో చివరి వరకు ఒక పోరాట యోధురాలిగా తన నైపుణ్యాన్ని చాటుకుంది.

రాజన్న: దారావిలో ఏ సన్నివేశాలు జరిగిన ఎలాంటి సమస్యలు ఇచ్చినా వాటిని ఫోటోలు, వీడియోలు తీసి ఫేస్బుక్‌, ట్విట్టర్‌ మొదలగునవి సోషల్‌ మీడియాలోపంపిస్తూ ఉంటాడు ఒకరకంగా ఇతని వల్ల ఒక ఉద్యమం జరిగిందని చెప్పవచ్చు కాలా ఈ సోషల్‌ మీడియాకి మీరే జర్నలిస్ట్‌ అని, మీ పని మీరు చేసేటప్పుడు మందు తాగి చేయకూడదని రాజన్నకు చెబుతాడు. రాజన్న కాలా కుటుంబంలో ఒకటిగా కలిసిపోతాడు. చిత్రం మొదలుకుని చివరి వరకు ఉద్యమం కోసం పోరాడుతూనే ఉంటాడు.

హరిదాదా (హరిదేవ్‌ అభయంకర్‌) : తెలుపు మెచ్చిన నలుపు నచ్చని వ్యక్తి. వేసుకునే దుస్తులు దగ్గర నుంచి ఇంటి బయట లోపల అన్నీ తెలుపే ఉండాలని ఈ వ్యక్తి ద్వారా మనం గమనించవచ్చు. వేసుకున్న బట్టలే కాదు ఇంట్లో కూర్చునే సోఫా సెట్లు, డోర్‌ కర్టెన్లు, ఇంటి లోపల గోడలపై కూడా తెలుపు రంగు ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే రాముని విగ్రహాలు కూడా పాలరాతి బొమ్మలు

ఉంటాయి. ఇతని అనుచరులు, తోటిపార్టీ నాయకులు కూడా తెలుపు దుస్తుల్లోనే ఉంటారు. గాజు టేబుల్‌ మీద పులిబొమ్మ కూడా తెల్లగానే ఉంటుంది. గమనించవలసిన విషయం ఏమిటంటే ఇతను వెళ్లే వాహనాలు కూడా తెలుపే కానీ బాడీగార్డులు, గన్మెన్లు నల్లటి దుస్తుల్లో కనిపిస్తారు. విషయానికొస్తే ప్రముఖ రాజకీయవేత్త ముంబై మొత్తం గుప్పెట్లో పెట్టుకున్న వ్యక్తి. అన్నీ ఉన్నా ఒక్క ధారావి అతనికి చిక్కలేదని అడ్డొచ్చిన వాళ్ళందర్నీ చంపుతూ ఉంటాడు. మను రియాల్టీ వుయ్‌ బిల్డ్‌ యువర్‌ డ్రీమ్స్‌ ముంబైలో ఎక్కడ ఏ కట్టడాలు కట్టాలన్నా ఈ హరిదాదా దగ్గర నుంచే వెళ్తాయి. ఇతని అనుచరుడు ద్వారా ధారావిలో విశాలమైన ఇల్లు అందరికి కాదు గవర్నమెంట్‌ కేటాయించిన వారికి మాత్రమే స్కూల్స్‌, హాస్పిటల్స్‌, గల్ఫ్‌ గ్రౌండ్‌, పబ్స్‌, స్కూల్లో మీ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్‌ హాస్పిటల్లో ఒకటే కాబట్టి అందులో సండే సండే మాత్రమే ఫ్రీ ట్రీట్మెంట్‌ అని ఇలా తక్కువ స్థలంలో అన్ని కట్టించి ఇస్తానని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మాయమాటలు చెప్పి ఇలా దోచుకుంటూ

ఉంటాడు హరిదాదా. ధారావిని సొంతం చేసుకోవాలని తపనతో అనుచరుడు విష్ణు మరణాంతరం తన పనులను ఎవరు అడ్డు పడుతున్నారని అతని సంగతి తెలుసుకుందామని ధారావిలో అడుగుపెడతాడు. ధారావిలో ఉన్న కాలాను చూసి కాలా సేట్‌ మీరేనా నాపనులను అడ్డుకునేది ఇలా ఇద్దరు సంభాషనల ద్వారా కాలా గురించి తెలుసుకుని తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అతను వెళ్లడానికి కూడా సందులేని పరిస్థితిలో కాలా మామూలు వ్యక్తి కాదని తెలుసుకుంటాడు. అక్కడ నుండి వెళ్లడానికి కాలా పర్మిషన్‌ తీసుకుంటాడు. అప్పటి నుండి కాలాను చంపైనా సరే ధారావిని సొంతం చేసుకోవాలనే ప్రయత్నం లోనే ఉంటాడు. హరిదాసు ఎప్పుడు తనను ఎదిరించిన వాళ్ళ కోసం ఎదురుచూస్తూ ధారావి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటాడు. హరిదాదా కింద స్థాయి వాళ్ళను ప్రతిసారి తొక్కాలనే భ్రమలో మనసంతా మనుపు ఆలోచనలతో ఉంటాడు. అహంకారం, పొగరు, రాజకీయ ధీమ ఇవన్నీ హరిదాదాలో ఉన్నప్పటికీ నవ్వుతూనే నటిస్తూ

ఉంటాడు. హరిదాదా గురించి స్వర్ణ తెల్లకోటు వేసుకుంటే సరిపోతుందా మన ఇంట నీరు కూడా ముట్టనంటేను. కాలా పోలీస్‌ స్టేషన్‌లో వున్నప్పుడు హరిదాదా స్టేషన్లోనే చీకటి గదిలో రహస్యాలను వింటూ ఉంటాడు. హరిదాదా కాలా గురించి ”కాలా ఏం పేరయ్య ఇది పిలవడానికి కూడా నోరావట్లేదు ఈ నలుపు కలర్‌ ఉందే చూడటానికి అసహ్యంగా ఉంది. మండుతున్నాయి నా కళ్ళు” అని కాలా గురించి మాట్లాడుతూ ఉంటాడు. అన్ని తెలిసిన బ్రాహ్మణుడికి మట్టి వాసన రుచించదని దాని విలువు తెలియదని ఈ చిత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు. హరిదాదా పోలీస్‌ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని ఉంటాడు. ఒక పోలీస్‌ అధికారి పంకజ్‌ పటేల్‌ కూడా ధారవిని అంతం చేయాలని ప్రయత్నంలోనే ఉంటాడు. ఈ పంకజ్‌ పటేల్‌ దారుణ కృత్యాలకు మూలధారం హరిదాదానే.

కాలా (కరికాలుడు): పోరాట యోధుడు, ధీరుడు, వీరయ్య కొడుకు వీరుడు. తండ్రి బాటలోనే నడుస్తూ

ఉంటాడు. కాలా (కరికాలుడు)గా పూర్తి వ్యవహార నామంతో ఈ చిత్రం కొనసాగుతూ ఉంటుంది. కాలా పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాడు పెట్టుకున్న కళ్ళజోడు, వేసుకున్న బట్టలు, కాళ్ళకు చెప్పులు నడిపే వాహనం పూర్తిగా నలుపు రంగులో ఉంటాయి. ధారావిని పూర్వం నుంచే కాపాడుకుంటూ వస్తున్నారు. కాలా భయం ఉంటే తెలియని వ్యక్తి చట్టాల గురించి పూర్తిగా తెలుసుకున్న వ్యక్తి అన్నిటికీ మించి అందరికీ సాయం చేసే ఆలోచనలు వీరితోపాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా సలహాలివ్వడం ఇలాంటివన్నీ మొదటి నుంచి వచ్చే మంచి గుణాలని అందులో దళితులకు ఎక్కువగా

ఉంటాయని ఈ సినిమా ద్వారా దర్శకుడు కాలా ద్వారా చూపించాడు. ఒక సందర్భంలో ధారవి స్త్రీ ఇడిసిన గుడ్డలు ఉతికి జీవించేటోళ్ళకి ఏంటి విలువుంటది. ఈణ్ణుంచి వెళ్లిపోమ్మంటే యాడికిపోతాం. దిక్కుమొక్కులేని దాన్నంటే అంటే ఏడిపిస్తున్నారు. అని పలికినప్పుడు కాలా స్పందించి రాజ్యంగంలోని చట్టాలు అందరికీ తెలిసి ఉండాలని ఈ విధంగా చెబుతాడు. కాలా హరిదాదా మనుషులతో రేయ్‌ చట్టం గురించి మా దగ్గరే మాట్లాడుతున్నావా? చట్టాన్ని గౌరవించడం తెలుసు అణగతొక్కాలని చూస్తే కొట్టడం తెలుసు. మీరందరూ మమ్మల్ని కొంచెమైన గౌరవిస్తున్నారంటే మాకు అండగా (అంబేద్కర్‌) కొన్ని చట్టాలు ఉండబట్టే! లేదంటే ఏడు సముద్రాల అవతల విసిరిపారేసే ఉండేవారు. ”ఇక్కడ తల్లి చెప్పిందే చట్టం” అని చాలా పెద్దగా చెబుతాడు. ఇక్కడ హరిదాదా అనుచరుడైన విష్ణుజాతి, భాష, మతం, బేధం తేడాలేని మొత్తం కలిసి ఉన్న చిట్టి ఇండియా ధారావికి రాజైనా ఈయనే మంత్రైనా ఈయనే. అని చెబుతూ వెళ్ళిపోతాడు. కాలా జరీనా పెట్టిన సభలో ఆమె చెప్పిన ఇల్లు కట్టడానికి అందరూ వ్యతిరేకిస్తే దానికి కాలా వాళ్ళ చెప్పిందే వాస్తవం కానీ వాళ్లకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలి. మీరు కట్టే ఇళ్లు మను రియాలిటీ ద్వారా వద్దు అని చెప్పాతడు. ఈ విషయాలన్నీ మాట్లాడిన తర్వాత ఇదిమా నేల మా తాత ముత్తాతలు సృష్టించుకున్న నేల దీనికి గవర్నమెంటు హెల్ప్‌ చేస్తే ఇళ్లన్నీ మా ఇష్టం వచ్చినట్లు మేమే కట్టుకుంటాం మేమే శుభ్రంగా

ఉంచుకుంటాం అని సమాధానం ఇచ్చే తీరు వేరుగా ఉంటుంది.

మరొక సందర్భంలో ప్రభుత్వం అన్ని దోపిడి చేసే అధికారులు, రాజకీయ నాయకులకు జల్సాలు చేస్తున్నారే వారికి ఎక్కడి నుంచి వస్తుంది సొమ్ము అన్ని ప్రశ్నించే సందర్భాలు మరికొన్ని చూడవచ్చు. సందర్భంలో కాలాను చిన్న కొడుకు లెనిన్‌ ఎదిరించినప్పుడు కాలా మట్టి గురించి మనిషి మనసులు గురించి తెలుసుకోకుండా రెండు పుస్తకాలు చదివి మార్పు విప్లవాలు తిరగడం కాదు పురాతనం గురించి తెలుసుకో అని చిన్న కొడుక్కి చక్కగా చెప్పాతడు. ”మా హక్కులే నా స్వార్థం” జనులందరూ గొర్రేలెం కాదు ఎవర్ని కావాలన్న బలి ఇవ్వడానకి మను బిల్డర్‌ పేరుతో ఒక్క ఇటుక కూడా ఇక్కడ పెట్టనివ్వను. ధారావిని కాపాడుకోవడానికి మీరు కూడా ఉండాలని కుటుంబ సభ్యులతో చెప్తాడు. కాలాని చుట్టుముట్టినప్పుడు హరిదాదా మనుషులకు వీరయ్య బిడ్డనిరా ఒక్కడినే ఉన్నా దిల్‌ ఉంటే గుంపుగా రండిరా ఆ సాహసానికి ప్రాణాలు సైతం లెక్క చేయకూడదని దైర్యంగా ఎదుర్కోవాలని కూడా కాలా చెప్తాడు. చావు సమస్యకు పరిష్కారం కాదు మనం బతికి సాధించకోవాలి. ఎవరు ఎవరికి బానిసలు కాదు ”ఈ తనువే మనకున్న ఏకైక ఆయుధం” ఇది ఈ లోకానికి చాటుదాం మనం అడుగుతున్నది హక్కు – బిక్షకాదు., ఒకే కోరిక అందరం పిడికిలి బిగిద్దాం నేల మాకు మాత్రమే అని గర్జిద్దాం ”నేల మన జన్మహక్కు” ఇది చాలా ముఖ్యమైన పోరాటం మందు కొట్టావా నరికేస్తా! ఇలా చాలా విషయాలతోపాటు మందు తాగ కూడదు అనే మంచి విషయాన్ని మనం గ్రహించవచ్చు. కాలా ధారవిలో సమయం ఉన్నప్పుడు బుద్దుడు, అంబేద్కర్‌, మహాత్మ జ్యోతిరావు పూలే, మరియు పెరియార్‌ స్వామి ఇలాంటి బొమ్మలు ఉన్నచోట ఉపన్యాసాలు మరియు సమస్యలు కూడా వీటి మధ్యనే చర్చించేవాడు అంతేగాకుండా కాలా ఇంట్లో అసురుడు అనే పుస్తకాన్ని కూడా చక్కగా చూపిస్తాడు దర్శకుడు. నేను ఒక్కడినే చస్తే ఏం మీరంతా ఉన్నారుగా ఇక్కడున్నా ప్రతి ఒక్కడు కాలానే. అంతేకాదు కాలా షష్టిపూర్తి నాడు వేసుకున్న డ్రస్సు నీలం రంగులో (రసవ పశ్రీబవ)

ఉంటుంది ఆ డ్రస్సు పూర్తిగా స్టేషన్లో కనిపిస్తుంది. చిత్రం చివరిలో లెనిన్‌, జరీనా కొంతమంది అనుచరులు సుమారుగా 15 మంది వరకు నీలం రంగు ధరించిన వస్త్రాలే కనిపిస్తాయి. ఆ చివరి సన్నివేశంలో ఎక్కువగా పొగ కమ్మినట్టు నీలం రంగునే చూపిస్తూ తరువాత నలుపు రంగు, ఎరుపు రంగు, నీలం రంగు చివరికి ఇంధ్రధనస్సు రంగులు కూడా కనిపిస్తుంది.

కాలా ఘాటయిన మాటలు: హరిదాదా నేను నిన్ను వెళ్ళమనలేదే! నువ్వు ధారావిలోకి వచ్చేటప్పుడు అడగకుండా రావచ్చు కానీ ఇక్కడ నుండి వెళ్లేటప్పుడు మా దగ్గరపర్మిషన్‌ తీసుకుని వెళ్లాలి.

ఇది కాలా ఖిల్లా నా వాళ్ళ కోట ఇక్కడ పిడికెడు మట్టి కూడా తీసుకు వెళ్లలేవు కాలా కుటుంబ సభ్యులతో ఇక్కడ నుండి వెళ్లిపోతే సమస్య తీరిపోతుందంటావా చోటు మారుస్తావ్‌, భాష మారుస్తావ్‌, నువ్వు తినే తిండి మారుస్తావ్‌ చుట్టాలు పక్కవాళ్ళు వదిలేసి యాడకో మారాలనుకోవడం ఒక బ్రతుకంటరా మార్చాలనుకుంటే ఇక్కడి నుంచే మార్చు.

ఈ కట్టె ఈ మట్టిలో పుట్టిన చెట్టురా కాల్చినా, పూడ్చినా ఇక్కడేరా!

కాలా – హరిదాదా సంభాషణలు:

హరిదాదా : చంపడం పెద్ద లెక్క కాదు

కాలా : నన్ను నువ్వు చంపలేవు ఎందుకంటే నేను కాలుణ్ణి, యముణ్ణి, యమరాజుని.

హరిదాదా : ఎవరు యమడూ… హూ… కాలా ఏం పేరయ్య ఇది, పిలవడానికి కూడా నోరావట్లేదు ఈ నలుపు కలర్‌ ఉందే చూడ్డానికి అసహ్యంగా ఉంది. మండుతున్నాయి నా కళ్ళు.

కాలా : తెలుపు శుభ్రం నలుపు మురికి కళ్ళు మండుతున్నాయా ఎంత నీచమైన ఆలోచన నీ చూపులోనే తేడా ఉంది. నలుపు శ్రమ జీవుల వర్ణం, మా వాడకొచ్చి చూడు మురికంతా ఇంధ్రధనస్సులా కనిపిస్తుంది. శుభ్రం, క్లీను, ప్యూరు ఇవన్నీ నీ ముసుగులో … ఏం కావాలి నీకు, నేల కావాలా, నిన్న ఒకరి పేరు

ఉన్నచోట రేపు ఇంకొకరు పేరున మారుతుంది. చస్తే ఆరడుగుల కూడా శాశ్వతం కాదు ఎందుకు ఇలా పిచ్చి పట్టిన వాడిలా అల్లాడుతున్నవ్‌.

హరిదాదా : కొత్తగా ఏమైనా చెప్పవయ్యా నాకు తెలుసు అన్నీ ఇక్కడే ఉంటాయి పైకి ఏమి తీసుకెళ్లలేవు. ఆరడుగుల నేలలోనే నన్ను కూడా పూడుస్తారు. ఏవి శాశ్వతం కావు. కృష్ణుడు చెవిలో ఇదివరకే ఊదారు. ఇది నాకు తెలియదనుకోకు అయినా ఆ నేల రెండు రోజులైనా కావచ్చు, నా పేరున ఉంటే నేను సంతోషంగా ఉంటాను నీకేమైనా ఇబ్బందా!

కాలా : ఇబ్బందే ”నేల నీకు అధికారం నేల మాకు జీవితం” అర్థమయిందా!

హరిదాదా : ఎవరైనా నన్ను ఎదిరించాలనుకుంటే మరణమే. కురుక్షేత్రంలో అర్జునుడు అయోమయంలో ఉన్నప్పుడు భగవంతుడు ఏమి చేశాడో, అదే ఈ రోజు హరి చేస్తున్నాడు.

కాలా : మా నేలను ఆక్రమించడమే నీ ధర్మం. మీ దేవుళ్లు ధర్మమే అయితే నేను నీ దేవుళ్ళను కూడా వదిలిపెట్టను. చేతనైతే వెన్నుపోటు పొడుచుకో…

దర్శకుడు పా రంజిత్‌ కాలా సినిమాను తనదైన శైలిలో తీశాడు. రజినీకాంత్‌ గొప్ప నటుడు. అతని నటనలో పెద్దగా ఉపయోగించలేదనే చెప్పాలి. ఎందుకంటే రంజిత్‌ గారు తనపై ఉన్న గౌరవం అలాంటిదే. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం కూడా చాలా అద్భుతం అని చెప్పవచ్చు జరీనా కాలా కనిపించినప్పుడు మరియు హరిదాదా కాలా ఎదురైనప్పుడు ధారావిలో ఉన్న సంఘటనలను ఆధారంగా తన ప్రతిభ ద్వారా సంగీతానికి మరింత వినసొంపుగా ప్రేక్షకులను కదిలింప చేసాడు. ఏదేమైనా కాలా సినిమా భారతీయ సినీ చరిత్రలో అరుదైన చిత్రం.

కానిస్టేబుల్‌: నా పేరు శివాజీరావు గైక్వాడ్‌ ఇలాంటి మురికివాడ నుండే నేను వచ్చాను. నేను పుట్టింది పెరిగింది భీమ్‌నగర్‌ ఇవాళ అది లేదు. అడిగితే దేశం అభివృద్ధి చెందాలి, త్యాగం చేయాలి అంటున్నారు. ఇదే త్యాగాన్ని ఏ ధనవంతుడో లేక రాజకీయవెత్తో చెయ్యొచ్చు కదా! హక్కుల కోసం జరిగే ఈ పోరాటంలో నేను పోరాడుతాను జై భీమ్‌.

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.