భూమిక సంపాదకులకు,
గత సంచికలో ప్రచురించిన కదిలించి, ఆలోచింపజేసే కవితా సంపుటి ”నిర్భయాకాశం కింద” పుస్తక సమీక్ష గురించి..
ఆడపిల్ల ఆవేదన.. / నన్ను కడుపులో ఉంటే చంపేస్తారు కొందరు..
చదువుకుందామంటే ప్రేమించు అని వెంటపడుతారు, / ప్రేమించాను అంటే చంపేస్తారు..
ప్రేమిస్తే తెగిచింది అంటారు.. / నవ్వుతే లవ్వు అంటారు..
మౌనంగా ఉంటే కొవ్వు అంటారు.. / ప్రతి ఒక్కరికి భారం అవుతున్నాను..
అని బాధపడిన రోజు ఉన్నాయి.. / ఒక్కక్కసారి నా అందమే నాకు శత్రువు అవుతున్నది..
ఆడపిల్లగా పుట్టడమే నేను చేసినా పాపమా? శాపమా? / అనుక్షణము భయపడుతూ బ్రతకాలి..
భయటికి వెళ్ళాలి అంటే భయం వేస్తుంది.. / నా మీద ఎన్నికల్లో ???
నన్ను మీతో బ్రతకనివ్వండి.. / నేను మీలాంటి మనిషినే..
ఇప్పటికైనా మారుతారని ఆశిస్తున్నా..
– జె. సురేష్‌కుమార్, ఇ-మెయిల్